తెల్ల తుమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెల్ల తుమ్మ
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. leucophloea
Binomial name
Acacia leucophloea

తెల్ల తుమ్మ ఫాబేసి లేదా Mimosaceae కుటుంబానికి చెందిన మధ్య పరిమాణపు చెట్టు. దీని వృక్ష శాస్త్రీయ నామం Acacia leucophloea. తెల్ల తుమ్మ చాలా ఎక్కువ ముండ్లు కలిగిన చెట్టు. ఇది 35 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని మాను (ఛాతి ఎత్తు వద్ద) 100 సెంటీమీటర్ల అడ్డుకొలత వరకు పెరుగుతుంది. ధృడమైన దీని మాను నుంచి చీలికలుగా అనేక వెడల్పైన శాఖలను కలిగి ఉంటుంది. కొంత దూరం నుంచి ఈ చెట్టును చూసినప్పుడు తెరచిన గొడుగు ఆకారాన్ని పోలి పైన కిరీటం మాదిరి ఆకారంలో ఉంటుంది. లేత, వయసుకు వచ్చిన తెల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు తెలుపు రంగు నుంచి పాలిపోయిన పసుపు రంగును కలిగి నున్నగా ఉంటుంది. ముదురిపోయిన తెల్లతుమ్మ చెట్టు యొక్క బెరడు నలుపు రంగులోకి మారుతూ గరుకుగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఒక దాని పక్కన ఒకటిగా జంటలుగా ఉంటాయి. రెమ్మకు 4 నుంచి 13 ఆకుల జతలు ఉంటాయి. ప్రతి రెమ్మకొమ్మకు 5 నుంచి 30 రెమ్మ జంటలు ఉంటాయి.

in Hyderabad, India.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]