తెల్ల మద్ది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెల్ల మద్ది
Fruit I IMG 9577.jpg
Fruit at Kolkata, India
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
టె. అర్జున
Binomial name
టెర్మినేలియా అర్జున
Flowers with Sykes's warbler at Kolkata, West Bengal, India

తెల్ల మద్ది (లాటిన్ Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 19వ వది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.

లక్షణాలు[మార్చు]

 • అర్జున 60 నుండి 80 అడుగుల ఎత్తుగా పెరిగే వృక్షం. దీని బెరడు తెల్లగా ఉంటుంది. కావున దీనిని తెల్లమద్ది అంటారు.
 • బెరడును కోస్తే తెల్లని స్రావం వస్తుంది.
 • ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడును గుండె జబ్బుల్లో వాడతారు.
 • నునుపైన బూడిద రంగు బెరడుగల పెద్ద ఆకురాలు వృక్షం.
 • దీర్ఘచతురస్రాకారంగా గాని, విపరీత అండాకారం నుండి, భల్లాకారంలో గాని గురుఅగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
 • శాఖాయుతమైన కంకులలో అమరిక లేత పసుపురంగు పుష్పాలు.
 • పంచకోణయుతమైన దృఢమైన టెంక గల ఫలాలు.
 • అర్జున భారత దేశంలో చాలా చోట్ల పెరుగుతుంది. హిమాలయా ప్రాంతాలు, దక్కను పీఠభూమిలో దీనిని విరివిగా చూడొచ్చు.
 • ఈ ఆకు తెలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు గుబురుచెట్టుగా పెరుగుతుంది.

దీనిలో ఉండే పదార్థాలు[మార్చు]

అర్జున బెరడులో కాల్షియం, అధికంగా ఉంటుంది. అల్యూమినియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.

దీనిలో గల ఎక్టివ్స్[మార్చు]

అర్జునిన్, లాక్టోజ్, అర్జునెంటిన్

వైద్యంలో ఉపయోగాలు[మార్చు]

దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.[1]. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.[2].

వైద్య విధానాలు[మార్చు]

 • దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుంది.
 • అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి ఉపశమనంగా ఉంటుంది.
 • అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
 • అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
 • నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జున లో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
 • ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
 • అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
 • అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.
 • వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి.
 • దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్"గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.
 • అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
 • అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
 • నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జునలో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
 • ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
 • అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.

సువాసన గుణం[మార్చు]

ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఇతర ఉపయోగాలు[మార్చు]

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు : ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి. అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.

ఆయుర్వేద ఔషధాలు[మార్చు]

అర్జునావిష్ట, అర్జునఘృతం. ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది కాలినగాయాలు, పుళ్లు, ఆస్టియో ప్లోరోసిస్ రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.
 2. Lua error in మాడ్యూల్:Citation/CS1/Identifiers at line 1055: attempt to compare nil with number.

వనరులు[మార్చు]