Jump to content

తేజస్వి మదివాడ

వికీపీడియా నుండి
తేజస్వి మదివాడ
జననం (1991-07-03) 1991 జూలై 3 (వయసు 33)
జాతీయతభారతీయురాలు
విద్యబి.ఎ (మాస్ కమ్యూనికేషన్)
వృత్తిసినిమా నటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2013–ప్రస్తుతం
ఎత్తు5 అడుగుల 4 అంగుళాలు

తేజస్వి మదివాడ తెలుగు సినిమా నటి, ప్రచారకర్త. తమిళ చిత్రంలో కూడా నటించింది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్చింది.[1] ఆమె 2024లో రియాలిటీ రాణీస్ ఆఫ్ ది జంగిల్ షోలో పాల్గొన్నది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

తేజస్వి 1991, జూలై 3న హైదరాబాద్ లో జన్మించింది. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది.[2]

తొలి జీవితం

[మార్చు]

చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్న తేజస్వి క్రమంగా పాశ్చాత్య నృత్యరీతులపైనా దృష్టిపెట్టింది. హెచ్‌.ఎస్‌.బీ.సీ., మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థల్లో డాన్స్‌ తరగతులు నిర్వహించింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చేసింది. మొదటగా అల్లు అర్జున్ తో కలిసి 7అప్‌ ప్రకటనకు పనిచేసింది. తరవాత డాబర్‌ గులాబరీ నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మిస్‌ హైదరాబాద్‌ గా ఎంపికయింది.

సినీరంగ ప్రవేశం

[మార్చు]

డ్యాన్స్ తరగతులు తీసుకుంటూనే మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసిన తేజస్వి హైదరాబాద్ విశ్వవిద్యాలయం లోని ఎం.ఎ. లో చేరింది. అదే సమయంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదలయ్యాక వరుసగా అవకాశాలు వచ్చాయి.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అతిధి పాత్ర తెలుగు
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గీత చెల్లి తెలుగు
2014 మనం దివ్య తెలుగు
2014 హార్ట్ అటాక్ శ్రీయ తెలుగు
2014 ఐస్ క్రీం రేణు తెలుగు
2014 లవర్స్ గీతా తెలుగు
2014 అనుక్షణం సత్య తెలుగు
2015 మళ్ళీ మళ్ళీ రాని రోజు మోహెక్ తెలుగు
2015 పండగ చేస్కో స్వాతి తెలుగు
2015 కేరింత[3] ప్రియా తెలుగు
2015 సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సీత చెల్లెలు తెలుగు
2015 శ్రీమంతుడు వెంకటరత్నం కూతురు తెలుగు
2015 జతకలిసే తెలుగు
2016 నట్పదిగారం 79 పూజ తమిళం
2016 సూపర్ స్టార్ కిడ్నాప్ అతిథి పాత్ర తెలుగు
2016 ఊర్వశివో రాక్షసివో తెలుగు
2016 విష్ యూ హ్యాపీ బ్రేకప్ నిక్కి తెలుగు
2016 రోజులు మారాయి రంభా తెలుగు
2016 నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ పద్దు స్నేహితురాలు తెలుగు
2017 మిస్టర్ తెలుగు
2017 బాబు బాగా బిజి పారు మినన్ తెలుగు
2017 మన ముగ్గురి లవ్‌స్టోరి స్వాతి తెలుగు వెబ్ సిరీస్
2021 కమిట్‌మెంట్ తెలుగు
2024 హైడ్ న్ సిక్ తెలుగు

వెబ్‌సిరీస్

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "మంచి ఐడియాతో తీస్తే... 'ఐస్‌క్రీమ్'లా ఆర్థిక లాభాలు!". Sakshi. Retrieved 1 May 2017.
  2. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి. "కథాపరంగానే అలా నటించా.. దానిలో తప్పేముంది : తేజస్వి". Archived from the original on 29 ఏప్రిల్ 2017. Retrieved 1 May 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Kerintha: Coming-of-age stories".