తేజస్ (యుద్ధ విమానం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tejas
HAL Tejas.jpg
పాత్ర బహుళోపయోగ ఫైటరు విమానం
రూపుదిద్దుకున్న దేశం భారత్
తయారీదారు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)
డిజైను బృందం Aeronautical Development Agency
మొదటి విహారం 2001 జనవరి 4
చేర్చుకున్న తేదీ 2015 జనవరి 17[1]
స్థితి In service[2]
ప్రధాన వాడుకరి భారతీయ వాయు సేన
ఉత్పత్తి జరిగిన కాలం 2001–ఇప్పటి వరకూ
మొత్తం సంఖ్య 16 (2014 నవంబరు నాటికి. ప్రోటైపులతో కలిపి )[3]
కార్యక్రమం ఖర్చు INR7399.69 కోట్లు (U) (LCA total in 2015)[4]
ఒక్కొక్కదాని ఖర్చు
INR160 crore (US) for Mark I[5][6]
INR275 కోట్లు (US) - INR300 కోట్లు (US) for Mark IA[5][7]

తేజస్ (సంస్కృతం: तेजस् "ప్రకాశవంతమైన") భారతదేశం అభివృద్ధి చేస్తున్న ఒక బహుళ ప్రయోజనకర తేలికపాటి యుద్ధ విమానం. దీనికి విమానపు తోక భాగం ఉండదు,[8] మిశ్రమ డెల్టా వింగ్ (సమద్విబాహు త్రిభుజం ఆకారంలో ఉండే రెక్కలు) నమూనాతో ఒక ఇంజిన్ ఆధారంగా నడుస్తుంది. మొదట దీనిని తేలికపాటి యుద్ధ విమానం (LCA) గా పిలిచేవారు-ఇప్పటికీ ఎక్కువగా ఇదే పేరుతో పిలవడం కొనసాగుతోంది-2003 మే 4 న అప్పటి ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి ఈ యుద్ధ విమానానికి అధికారికంగా "తేజస్ "[9] అని నామకరణం చేశారు.[10]

పరిమిత సంఖ్యలో తేజస్ విమానాల ఉత్పత్తి 2007లో ప్రారంభమైంది. రెండు సీట్లు కలిగివుండే ఒక శిక్షణ శ్రేణి విమానం కూడా అభివృద్ధిలో ఉంది (నవంబరు 2008 నుంచి ఉత్పత్తి చేయబడుతోంది), ఇదిలా ఉంటే నౌకాదళం ఉపయోగించేందుకు ఉద్దేశించిన తేజస్ యుద్ధ విమానాలు భారత నౌకా దళం యొక్క విమానవాహక నౌకలపై కూడా నిర్వహించగల సామర్థ్యం కలిగివుంటాయి. IAF తమకు 200 ఒక సీటు కలిగిన విమానాలు మరియు 20 రెండు సీట్ల బహుళ వినియోగ శిక్షణ విమానాల అవసరం ఉన్నట్లు ప్రకటించింది, ఇదిలా ఉంటే భారత నౌకా దళం సీ హారియర్ FRS.51 మరియు హారియర్ T.60 స్థానాల్లో చేర్చేందుకు 40 ఒకే సీటు ఉండే యుద్ధవిమానాలకు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది.[11] LCA నౌకా దళ శ్రేణి విమానం 2009నాటికి గగనతలంలోకి అడుగుపెడుతుందని అంచనా వేస్తున్నారు.[12] 2010 చివరినాటికి లేదా 2011 ప్రారంభ సమయానికి తేజస్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళంలోకి కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి.[13] . డిసెంబరు 2009లో గోవాలో సముద్రంపై జరిగిన విమాన విన్యాసాల సందర్భంగా తేజస్ గంటకు 1,350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది, ఈ ప్రదర్శనతో తేజస్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి సూపర్‌సోనిక్ విమానంగా గుర్తింపు పొందింది.[14]

విషయ సూచిక

అభివృద్ధి[మార్చు]

LCA కార్యక్రమం[మార్చు]

ఏరో ఇండియా 2009లో HAL తేజస్.

LCA కార్యక్రమం రెండు ప్రధాన ఉద్దేశాలతో 1983లో ప్రారంభించబడింది. దీని వెనుకవున్న ఒక విస్పష్టమైన లక్ష్యం, భారతదేశం వద్ద ఉన్న మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో కొత్త విమానాలను చేర్చడం. 1970 వ దశకం నుంచి భారత వైమానిక దళం మిగ్-21 యుద్ధ విమానాలపై ఆధారపడివుంది. మిగ్-21 యుద్ధ విమానాల జీవితకాలం 1990వ దశకం మధ్యకాలానికి చివరి దశకు చేరుకుంటుందని, దీని వలన 1995 నాటికి IAF వద్ద యుద్ధ విమానాలు, అవసరం కంటే 40% తక్కువగా ఉంటాయని, ప్రణాళికబద్ధమైన దళ నిర్మాణ అవసరాలను తీర్చేందుకు ఈ కొరతను పూరించాల్సిన అవసరం ఉంటుందనీ "దీర్ఘకాలిక ఆయుధ సేకరణ ప్రణాళిక 1981" సూచించింది.[15]

భారత దేశీయ ఏరోస్పేస్ పరిశ్రమకు అత్యాధునిక సాంకేతికత కలిగివున్న వాహనాన్ని అందజేయడం LCA కార్యక్రమం యొక్క మరో ప్రధాన ఉద్దేశం.[16] 1947లో స్వాతంత్ర్యం పొందిన తరువాత, భారత నేతలు విమానయాన రంగం మరియు ఇతర వ్యూహాత్మక పరిశ్రమల్లో స్వావలంబన సాధించాలనే ఒక ప్రతిష్ఠాత్మక జాతీయ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అంతరిక్ష "స్వావలంబన" కార్యక్రమం అంటే కేవలం ఒక విమానం ఉత్పత్తి చేయడానికి సంబంధించినది మాత్రమే కాదు, వాణిజ్య ప్రాతిపదికన అధునాతన ఉత్పత్తులు తయారు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు పంపగల సామర్థ్యం గల స్థానిక పరిశ్రమను నిర్మించడం కూడా ఈ కార్యక్రమ లక్ష్యం. ఆధునిక విమానయాన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృత పరిధివ్యాప్తంగా భారత స్వదేశీ అంతరిక్ష సామర్థ్యాలను పురోగమింప జేయడం మరియు మరింత విస్తరించే చర్యల్లో భాగంగా ఉండేందుకు LCA కార్యక్రమం ఉద్దేశించబడింది.[17]

ఈ లక్ష్యాల సాధనకు, ప్రభుత్వం ఒక భిన్నమైన నిర్వహణా పద్ధతిని ఎంచుకుంది, 1984లో ప్రభుత్వం LCA కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)ని ఏర్పాటు చేసింది. చాలా తరచుగా తేజస్‌ను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఉత్పత్తి చేసినట్లు చెప్పబడుతున్నప్పటికీ, వాస్తవానికి తేజస్‌ను అభివృద్ధి చేసిన ఘనత ADA కు దక్కుతుంది, HAL తో సహా, 100 కు పైగా రక్షణ ప్రయోగశాలలు, పారిశ్రామిక సంస్థలు మరియు విద్యా సంస్థలు కలసి ఏర్పడిన కన్సార్టియమ్‌ను ADA అని పిలుస్తారు. దీనికి HAL ప్రధాన గుత్తేదారు. ఉన్న ఒక జాతీయ సహాయతా సంఘాన్ని (కన్సార్టియం). ADA అధికారికంగా భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

పూర్తిగా స్వదేశీపరిజ్ఞానంతో మూడు అత్యంత అధునాతన - మరియు సవాలుతో కూడిన- వ్యవస్థలను అభివృద్ధి చేయాలని LCA కు భారత ప్రభుత్వం "స్వావలంబన" లక్ష్యాలుగా నిర్దేశించింది: అవి ఫ్లై-బై-వైర్ (FBW) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ (FCS), మల్టీ-మోడ్ పల్స్-డాప్లర్ రాడార్, మరియు ఆఫ్టర్‌బర్నింగ్ టర్బోఫాన్ ఇంజిన్.[18] LCA కార్యక్రమంలో విదేశీ భాగస్వామ్యాన్ని నిరోధించే ఒక కఠిన విధానాన్ని భారతదేశం కలిగివున్నప్పటికీ, విదేశీ సాంకేతిక సహాయం మరియు సహకారం అవసరమైన ప్రధాన LCA వ్యవస్థలు ఇవే కావడం గమనార్హం. అంతేకాకుండా, విదేశీ పరికరాలు అమర్చేందుకు ADA పరిగణలోకి తీసుకున్న వ్యవస్థలు ఇంజిన్ మరియు రాడార్‌లను చెప్పవచ్చు, పూర్తిస్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని అభివృద్ధి చేసేందుకు ఎక్కువ సమయం అవసరమవుతుండటంతో ప్రారంభ LCA విమానంలో విదేశీ పరికరాలు ఉపయోగించాలని నిర్ణయించారు - LCA యొక్క కావేరీ పవర్‌ప్లాంట్‌ను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

విమానయాన సాంకేతిక పరిజ్ఞానాల్లో స్వావలంబనను సాధించేందుకు ఉద్దేశించిన LCA కార్యక్రమం యొక్క ప్రతిష్ఠాత్మకతను దృష్టిలో ఉంచుకొని చూస్తే, మొత్తం 35 ప్రధాన ఏవియానిక్స్ భాగాలు మరియు లైన్-రీప్లేసబుల్ యూనిట్‌లలో (LRUలు), కేవలం మూడు భాగాలు మాత్రమే విదేశీ వ్యవస్థలు కలిగివున్నాయనే వాస్తవం స్పష్టమవుతుంది. అవి మల్టీ-ఫంక్షన్ డిస్‌ప్లేలు (MFDలు), వీటిని సెక్స్‌టాంట్ (ఫ్రాన్స్), ఎల్బిట్ (ఇజ్రాయెల్) సరఫరా చేయగా, హెల్మెట్-మౌంటెడ్ డిస్‌ప్లే అండ్ సైట్ (HMDS) క్యూయింగ్ సిస్టమ్, వీటిని కూడా ఎల్బిట్ సరఫరా చేసింది. లేజర్ పాడ్‌ను రాఫెల్ (ఇజ్రాయెల్) అందజేసింది. అయితే, ఈ మూడు వ్యవస్థల్లోనూ, LCA ఉత్పాదన దశకు చేరుకునే సమయానికి, MFDలను భారతీయ కంపెనీలు సరఫరా చేస్తాయని అంచనా వేశారు. మరికొన్ని ఇతర ముఖ్యమైన పరికరాలను (మార్టిన్-బేకర్ ఎజెక్షన్ సీట్లు వంటివి) దిగుమతి చేసుకున్నారు. మే 1998లో అణ్వాయుధ పరీక్షలు తరువాత భారతదేశంపై విధించబడిన ఆంక్షల ఫలితంగా, మొదట దిగుమతి చేసుకోవాలనుకున్న లాండింగ్ గేర్ వంటి అనేక వస్తువులు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడ్డాయి.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానానికి రూపకల్పన చేసి, దానిని తయారు చేయడం ద్వారా భారత్ స్వావలంబన సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇందుకోసం LCA కార్యక్రమం ప్రారంభంలో ADA గుర్తించిన ఐదు సాంకేతిక పరిజ్ఞానాల్లో రెండింటిని భారత్ విజయవంతంగా అభివృద్ధి చేయగలిగింది: అధునాతన కార్బన్-ఫైబర్ కాంపోజిట్ (CFC) స్ట్రక్చర్స్ మరియు స్కిన్స్ (ముఖ్యంగా రెక్క పరిమాణ క్రమంపై), ఆధునిక "గ్లాస్ కాక్‌పిట్"లను భారత్ విజయవంతంగా అభివృద్ధి చేయడంతోపాటు, వాటిని తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించింది. వాస్తవానికి, తన ఆటోలే ఇంటిగ్రేటెడ్ ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్ రూపకల్పన మరియు 3-D లామినేటెడ్ కాంపోజిట్ ఎలిమెంట్స్ అభివృద్ధి విషయంలో ADA లాభదాయక వ్యాపార ప్రతిపాదనలను కూడా పొందింది, (ఎయిర్‌బస్ మరియు ఇన్ఫోసిస్ రెండు కంపెనీలు ADA నుంచి వీటికి సంబంధించిన లైసెన్స్‌లను పొందాయి).[18] మిగిలిన మూడు ప్రధాన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో ఎదురైన సమస్యల నీడలో ఈ విజయాలు మరుగునపడిపోయాయి. ఏదేమైనప్పటికీ, భారత దేశీయ పరిశ్రమల సాధనల ఫలితంగా, ప్రస్తుతం LCAలోని 70% భాగాలు భారతదేశంలోనే తయారవుతున్నాయి, రాబోయే సంవత్సరాల్లో దిగుమతి చేసుకున్న వస్తువులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుంది.[19]

కార్యక్రమ మూలాలు[మార్చు]

1955లో, HT-2 కార్యక్రమం నుంచి పొందిన అనుభవం[20] మరియు డి హావిలాండ్ వాంపైర్ FB.52 మరియు T.55 తయారీ కోసం పొందిన అనుమతుల ద్వారా సాధించిన ఉత్పాదక సామర్థ్యాలు ఆధారంగా, HAL ఒక ఎయిర్ స్టాఫ్ రిక్వైర్‌మెంట్ (ASR) సవాలును స్వీకరించింది, బాగా ఎత్తైన ప్రదేశాల్లో సంచరించగల మరియు తక్కువ ఎత్తులో దాడులు చేయగల రెండు సామర్థ్యాలు కలిగివున్న బహుళప్రయోజన యుద్ధ విమానం తయారు చేయడం దీని లక్ష్యం. ఒక అధునాతన శిక్షణ విమానం మాదిరిగా మరియు నౌకలపై ఉపయోగించేందుకు వీలుండే ప్రత్యామ్నాయాలకు అనుగుణంగా ASR ప్రాథమిక నమూనాను తయారు చేయాలని భావించారు, అయితే ఈ ప్రతిపాదనలను తరువాత విరమించుకున్నారు. దీని ఫలితంగా భారతదేశపు తొలి స్వదేశీ యుద్ధ విమానం సబ్‌సోనిక్ HF-24 మారుత్ అభివృద్ధి చేయబడింది, ఇది జూన్ 1961లో తొలిసారి ఆకాశంలోకి అడుగుపెట్టింది. సరిపోయిన టర్బోజెట్ ఇంజిన్‌ను సంపాదించేందుకు లేదా అభివృద్ధి చేసేందుకు సంబంధించిన సమస్యల కారణంగా IAFకు మారుత్ 1967 వరకు సేవలు అందించలేకపోయింది. ఇదే సమయంలో, HAL ఫోలాండ్ నేట్ F.1 అభివృద్ధి మరియు పరీక్షలు పూర్తి చేయడం ద్వారా అదనపు అనుభవాన్ని గడించింది, 1962 నుంచి 1974 వరకు ఉన్న లైసెన్స్ పరిధిలో దీనిని ఉత్పత్తి చేసింది, దీని నుంచి తరువాత బాగా ఆధునిక హంగులు జోడించిన నేట్ Mk తయారు చేయబడింది.II అజీత్, HJT-16 కిరణ్ టర్బోజెట్ శిక్షణ విమానం, 1968 నుంచి సేవలు అందించడం ప్రారంభించాయి.

1969లో, నిరూపితమైన ఇంజిన్‌తో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ విమానాన్ని HAL తయారు చేయాలని ఏరోనాటిక్స్ కమిటీ చేసిన సిఫార్సుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 'టాక్టికల్ ఎయిర్ సపోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్' ఆధారంగా ASR దాదాపుగా మారుత్‌ను పోలివుంటుంది,[21] 1975లో HAL నమూనా రూపకల్పనను పూర్తి చేసింది, అయితే ఒక విదేశీ ఉత్పత్తిదారు నుంచి ఎంచుకున్న "ఇంజిన్"ను పొందలేకపోవడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. అజీత్ అనే యుద్ధ విమానం తయారీలో ఉండటంతో, HAL యొక్క ఇంజనీర్లు దీనికి సంబంధించి కొంత నమూనా రూపకల్పన పని మాత్రమే మిగిలింది, ద్వితీయ వైమానిక మద్దతు మరియు దాడులు అడ్డుకునే సామర్థ్యం కలిగిన యుద్ధ విమానం అవసరం మాత్రం IAFలో తీరలేదు.

1983లో, DRDO తేలికపాటి యుద్ధ విమానం రూపకల్పన మరియు అభివృద్ధి కార్యక్రమానికి అనుమతి పొందింది, ఈ సమయానికి మాత్రమే, ఒక భిన్నమైన నిర్వహణ విధానం స్వీకరించబడింది. 1984లో, LCA కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయబడింది. ADA సమర్థవంతమైన ఒక జాతీయ సహాయతా సంఘంగా ఏర్పడింది, ఉందులో HAL ప్రధాన భాగస్వామిగా ఉంది. HAL ప్రధాన గుత్తేదారుగా వ్యవహరించడంతోపాటు, LCA డిజైన్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, ఎయిర్‌ఫ్రేమ్ తయారీ, విమాన తుది నిర్మాణం, విమాన పరీక్షలు మరియు సేవల మద్దతు కార్యక్రమాల బాధ్యతలకు నేతృత్వం వహించింది.[22] LCA యొక్క ఏవియానిక్స్ సూట్ నమూనా తయారీ మరియు అభివృద్ధి బాధ్యత మరియు ఫ్లైట్ కంట్రోల్స్, ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ యుటిలిటీలు, సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, స్టోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, తదితర వ్యవస్థలతో దీనిని అనుసంధానం చేసే ప్రధాన బాధ్యతలు ADA కలిగివుంది.

LCAకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విమాన నియంత్రణ వ్యవస్థ, రాడార్ మరియు ఇంజిన్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రధాన ప్రాధాన్యత కలిగివున్నాయి. నేషనల్ ఏరోనాటిక్స్ లాబోరేటరీ (NAL)-ఇప్పుడు దీనిని నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ అని పిలుస్తున్నారు-విమానయాన నియంత్రణ సూత్రాలు తయారు చేయడానికి నేతృత్వం వహించేందుకు ఎంపికయింది, దీనికి ఏరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) మద్దతు ఇస్తుంది, ADEకి ఇంటిగ్రేటెడ్ ఫ్లై-బై-వైర్ FCSని అభివృద్ధి బాధ్యతను అప్పగించబడింది. HAL మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE) సంయుక్తంగా తేజస్ బహుళ-ప్రయోజన రాడార్ (MMR)' ను అభివృద్ధి చేస్తున్నాయి.''తేజస్ కోసం GTX-35VS కావేరీ ఆఫ్టర్‌బర్నింగ్ టర్బోఫాన్ ఇంజిన్‌ను తయారు చేసే బాధ్యత ది గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (GTRE)కు అప్పగించారు- తేజస్‌కు కావేరీ అందుబాటులోకి వచ్చే వరకు మధ్యంతర పవర్‌ప్లాంట్‌గా జనరల్ ఎలక్ట్రిక్ F404 టర్బోఫాన్‌ను ఉపయోగించారు.

అక్టోబరు 1985 వరకు IAFకు LCA అవసరాన్ని, అంటే ఎయిర్ స్టాఫ్ రిక్వైర్‌మెంట్‌ను ఖరారు చేయలేదు. ఈ జాప్యం కారణంగా అసలు షెడ్యూల్‌ను తిరిగి పరిశీలించాలని అవసరం ఏర్పడింది, ప్రాథమిక ప్రణాళిక ప్రకారం మొదటి విమానాన్ని ఏప్రిల్ 1990నాటికి తయారు చేయాలని, 1995లో దళాల చేతికి అప్పగించాలని భావించారు; అయితే, దీనివలన సిద్ధించిన ఒక వరం కూడా ఉంది, అది ఏమిటంటే మార్షల్ నేషనల్ R&D మరియు పారిశ్రామిక వనరులను మెరుగుపరుచుకునేందుకు, సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల సృష్టి మరియు స్వదేశ పరిజ్ఞానంతో ఎటువంటి అధునాతన సాంకేతిక పరికరాలు తయారు చేయాలో మరియు వేటిని దిగుమతి చేసుకోవాలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు ఈ జాప్యం వలన కావాల్సిన సమయం దొరికింది.

ప్రాజెక్టు నిర్వచనం (PD) (ప్రాజెక్టు సంబంధించిన స్పష్టమైన, కచ్చితమైన నిర్వచనం) అక్టోబరు 1987లో ప్రారంభమై, సెప్టెంబరు 1988లో ముగిసింది. విస్తృతమైన విమానయాన నైపుణ్యం కలిగిన ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌ను PDని సమీక్షించేందుకు మరియు సూచనల కోసం సలహాదారుగా నియమించుకున్నారు. PD దశను విమానం రూపకల్పన మరియు అభివృద్ధి ప్రక్రియలో కీలకమైన ప్రారంభ అంశంగా పరిగణిస్తారు, ఎందుకంటే సమగ్రమైన నమూనా, ఉత్పాదక పద్ధతి మరియు నిర్వహణ అవసరాలకు సంబంధించిన కీలకమైన అంశాలు ఈ దశలో స్పష్టంగా నిర్వచించబడతాయి. అంతేకాకుండా, మొత్తం కార్యక్రమ వ్యయాలను అత్యంత సమర్థవంతంగా ఈ దశలో ఉండగా నియంత్రించవచ్చు. నమూనా అవసరాలు, సామర్థ్యాలు మరియు లక్షణాలకు తరువాతి మార్పులు అమలు చేసేందుకు వ్యయాలు బాగా పెరిగిపోవడంతో, ఈ యుద్ధ విమానం అభివృద్ధి మార్గంలో అడ్డంకులు ఏర్పడ్డాయి, దీని ఫలితంగా ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పట్టడం మరియు భారీస్థాయిలో అదనపు వ్యయాలు వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అభివృద్ధి చరిత్ర[మార్చు]

యుక్తులు ప్రదర్శించగల సామర్థ్యాన్ని విస్తరించేందుకు "రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ"తో చిన్న డెల్టా-రెక్కలు కలిగిన యంత్రంగా LCA నమూనాను 1990లో ఖరారు చేశారు. దీని యొక్క అధునాతన ఏవియానిక్స్ మరియు ఆధునిక సంక్లిష్ట నిర్మాణంపై వెంటనే కొంత ఆందోళన వ్యక్తమైంది మరియు ఇటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు తగిన సాంకేతిక మౌలిక సదుపాయాలు కలిగివుందా అంటూ IAF అనుమానం వ్యక్తం చేసింది. మే 1989లో ఒక ప్రభుత్వ సమీక్షా కమిటీ ఏర్పాటయింది, ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అనేక విభాగాల్లో భారతీయ మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం తగిన పురోగతి సాధించాయని ఒక సాధారణ అభిప్రాయాన్ని ఈ కమిటీ నివేదించింది. అయితే జాగ్రత్త చర్యగా, ఈ కార్యక్రమం యొక్క పూర్తిస్థాయి సాంకేతిక అభివృద్ధి (FSED) దశను రెండు దశలుగా విభజించాలని నిర్ణయించింది.

మొదటి దశలో "సాధ్యాసాధ్యాల నిరూపణ"పై దృష్టి సారించారు, ఇందులో భాగంగా రెండు సాంకేతిక ప్రదర్శన విమానాల (TD-1 మరియు TD-2) యొక్క నమూనా తయారీ, అభివృద్ధి మరియు పరీక్ష (DDT)పై మరియు ఒక స్ట్రక్చరల్ టెస్ట్ స్పెసిమెన్ (STS) ఎయిర్‌ఫ్రేమ్ తయారీపై దృష్టి పెట్టారు; TD విమానం విజయవంతంగా పరీక్షించబడిన తరువాత మాత్రమే భారత ప్రభుత్వం LCA నమూకు పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. దీని తరువాత రెండు నమూనాత్మక వాహనాలు (PV-1 మరియు PV-2) తయారీ మరియు అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రారంభమవతాయి. రెండో దశలో మరో మూడు నమూనాత్మక వాహనాలు (అవి PV-3, ఇది ఉత్పాదక శ్రేణికి సంబంధించిన నమూనా, PV-4 నౌకాదళ ఉపయోగానికి ఉద్దేశించిన నమూనా, PV-5, ఇది శిక్షణ కోసం ఉద్దేశించిన విమానం) మరియు ఒక నిస్త్రాణ పరీక్షా నమూనాను తయారు చేయడంతోపాటు, వివిధ పని ప్రదేశాల్లో తదుపరి అభివృద్ధి మరియు పరీక్షా సౌకర్యాల నిర్మాణాన్ని చేపడతారు.

మొదటి దశ 1990లో ప్రారంభమైంది, HAL 1991 మధ్యకాలంలో సాంకేతిక ప్రదర్శనలపై పని ప్రారంభించింది; అయితే, పూర్తిస్థాయి నిధుల మంజూరుకు ఏప్రిల్ 1993 వరకు అధికారిక ఆమోదం లభించకపోవడంతో ఆర్థిక వనరుల కొరత ఏర్పడింది, దీంతో FSED దశ 1లో ముఖ్యమైన పనులు జూన్‌లో ప్రారంభమయ్యాయి. మొదటి సాంకేతిక ప్రదర్శన విమానం, TD-1, 1995 నవంబరు 17లో తయారు చేయబడింది, తరువాత TD-2 తయారీ 1998లో పూర్తి చేశారు, నిర్మాణపరమైన ఆందోళనలు మరియు విమాన నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో సమస్యల కారణంగా కొన్ని సంవత్సరాలపాటు వాటిని అలాగే ఉంచారు.[23]

ఫ్లై-బై-వైర్ నియంత్రణ సూత్రాలు[మార్చు]

ఫ్లై-బై-వైర్ కంట్రోల్‌కు ఉదాహరణగా ఇక్కడ తలక్రిందులుగా ప్రయాణిస్తున్న HAL తేజస్.

విమానం తన యొక్క వాటాన్ని మరియు వాలు కోణాన్ని తనంతటతానుగా మార్చుకునే లక్షణాన్ని (RSS) (రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ) కలిగివుండటం LCA యొక్క అత్యంత ప్రతిష్ఠాత్మక అవసరాల్లో ఒకటి. 1988లో డసాల్ట్ ఒక అనలాగ్ FCS వ్యవస్థను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ, త్వరలో డిజిటల్ విమాన నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం దాని స్థానంలో ప్రవేశిస్తుందని ADA గుర్తించింది.[18] RSS సాంకేతిక పరిజ్ఞానం 1974లో జనరల్ డైనమిక్స్ (ఇప్పుడు లాక్‌హీడ్ మార్టిన్) YF-16తో పరిచయం చేయబడింది, ప్రపంచంలో నమూనా కారణంగా వాయుగతి శాస్త్ర నియమాల ప్రకారం కొద్దిస్థాయిలో అస్థిరత కలిగిన తొలి విమానం ఇది కావడం గమనార్హం. అనేక విమానాలు "ధనాత్మక" నిశ్చల స్థిరత్వంతో రూపొందించబడ్డాయి, అంటే ఈ విమానాలు నియంత్రణ నిర్గమాంశాలు అందుబాటులో లేనప్పుడు పూర్వ స్థితికి మరియు నియంత్రిత విమానయానానికి వీలు కల్పించే ఒక సహజ ప్రవృత్తిని కలిగివుంటాయి; అయితే ఈ లక్షణం పైలెట్ యుక్తులు ప్రదర్శించేందుకు అవరోధకంగా మారింది. మరోవైపు "రుణాత్మక" నిశ్చల స్థిరత్వం (అంటే, RSS) కలిగిన విమానం, పైలెట్ ఎప్పుటికప్పుడు తగ్గిస్తూ ఉండకపోతే, ఎత్తు మరియు నియంత్రిత విమానయానం నుంచి విమానం చాలా తర్వగా నియంత్రణ తప్పుతుంది; ఇది యుక్తులు ప్రదర్శించే సౌకర్యాన్ని బాగా విస్తరిస్తుంది, అయితే ఒక యాంత్రిక విమాన నియంత్రణ వ్యవస్థపై ఆధారపడే పైలెట్‌పై ఇది బాగా ఎక్కువ భారం మోపుతుంది.

FBW విమాన నియంత్రణ వ్యవస్థ అభివృద్ధికి విస్తృతస్థాయిలో విమానయాన నియంత్రణ సూత్రాల పరిజ్ఞానం మరియు విమాన నియంత్రణ కంప్యూటర్ల కోసం వ్యయభరితమైన భారీస్థాయి సాఫ్ట్‌వేర్ సంకేతాలు రాయాల్సిన అవసరం ఉంటుంది, అంతేకాకుండా వీటిని ఏవియానిక్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో అనుసంధానం చేయాలి. LCA కార్యక్రమం ప్రారంభించినప్పుడు, FBW అధునాతన సాంకేతిక పరిజ్ఞానంగా ఉండేది, సున్నితమైన సాంకేతిక పరిజ్ఞానం కావడంతో మరే ఇతర దేశం భారత్‌కు దీనిని ఎగుమతి చేసేందుకు ముందుకురాలేదు. అందువలన, దీనిని భారతదేశపు సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు 1992లో నేషనల్ ఏరోనాటిక్స్ లాబోరేటరీ LCA జాతీయ నియంత్రణ చట్ట (CLAW) బృందాన్ని ఏర్పాటు చేసింది. CLAW బృందంలోని శాస్త్రవేత్తలు మరియు గణిత శాస్త్రజ్ఞులు సొంత నియంత్రణ సూత్రాలు అభివృద్ధి చేయడంలో విజయవంతమయ్యారు, అయితే ఆ సమయంలో భారతదేశం అసలైన అధునాతన గ్రౌండ్ సిమ్యులేటర్లు కలిగిలేని కారణంగా ఈ సూత్రాలను పరీక్షించలేకపోయారు. ఈ కారణంగా, 1993లో బ్రిటీష్ ఏరోస్పేస్ (BAe) మరియు లాక్‌హీడ్ మార్టిన్ సాయం కోరడం జరిగింది, అయితే ఏరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు నియంత్రణ సూత్రాలను FCS సాఫ్ట్‌వేర్‌గా సంకేతీకరించడం ముందుగా ఊహించినదాని కంటే పెద్ద సవాలుగా మారింది.

BAE యొక్క సిమ్యులేటర్లు (మరియు అందుబాటులో వచ్చిన తరువాత HAL యొక్క సిమ్యులేటర్లపై) నిర్దిష్ట నియంత్రణ సూత్ర సమస్యలు పరీక్షించబడ్డాయి. అభివృద్ధి చేస్తున్న సమయంలోనే, సంకేతీకరణకు సంబంధించిన పురోగామి అంశాలు వరుసగా ADE మరియు HAL వద్ద ఉన్న "మినీబర్డ్" మరియు "ఐరన్‌బర్డ్"లపై పరీక్షించబడ్డాయి. సమగ్ర విమాన నియంత్రణ సాఫ్ట్‌వేర్ యొక్క రెండో వరుస విమానయాన అనుకరణ పరీక్షలను జూలై 1996లో U.S.లో F-16 VISTA (వేరియబుల్ ఇన్-ఫ్లైట్ స్టెబిలిటీ టెస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్) అనుకరణ యంత్రంపై నిర్వహించారు, ఈ సందర్భంగా 22 ప్రయోగాత్మక విమానయానాలు నిర్వహించారు. అయితే, అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఈ కార్యక్రమంలో లాక్‌హీడ్ మార్టిన్ యొక్క ప్రమేయం 1998లో రద్దు చేయబడింది, ఇదే ఏడాది మేలో భారతదేశం రెండోసారి అణు పరీక్షలు నిర్వహించిన కారణంగా ఈ ఆంక్షలు విధించబడ్డాయి.

NAL యొక్క CLAW బృందం చివరకు స్వదేశీపరిజ్ఞానంతోనే విమానయాన నియంత్రణ సూత్రాల ఏకీకరణను విజయవంతంగా పూర్తి చేసింది, ఈ బృందం అభివృద్ధి చేసిన FCS సాఫ్ట్‌వేర్ TD-1పై జరిపిన పైలెట్ పరీక్షలో 50 గంటలకుపైగా ఎటువంటి దోషాలు లేకుండా పనిచేసింది, దీంతో 2001 ప్రారంభంలో ఈ విమానం ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధమయింది. TD-1 రూపంలో LCA యొక్క మొదటి విమానం బెంగళూరు సమీపంలోని నేషనల్ టెస్ట్ సెంటర్‌లో 2001 జనవరి 4న తయారు చేయబడింది, దీని యొక్క తొలి విజయవంతమైన సూపర్‌సోనిక్ విమానం 2003 ఆగస్టు 1న తయారు చేయబడింది. సెప్టెంబరు 2001నాటికే TD-2 తొలి విమానయానానికి సిద్ధమయ్యేలా ప్రణాళికా రచన చేశారు, అయితే ఇది 2006 జూన్ 6 వరకు సాధ్యపడలేదు. తేజస్ ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ (AFCS)ను ప్రయోగాత్మకంగా ఉపయోగించిన పైలెట్‌లు అందరూ దానిని విశేషంగా కొనియాడారు, మిరేజ్ 2000 యుద్ధ విమానం కంటే LCAను టేకాఫ్ చేయడం తనకు చాలా సులభంగా ఉందని ఒక టెస్ట్ పైలెట్ వ్యాఖ్యానించాడు.[24]

మల్టీ-మోడ్ రాడార్ (MMR)[మార్చు]

ADA బృందం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయదలిచిన మరో కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటంటే తేజస్ మల్టీ-మోడ్ రాడార్ (MMR) (బహుళ-ప్రయోజన రాడార్). LCA కోసం మొదట ఎరిక్‌సన్ మైక్రోవేవ్ సిస్టమ్స్ PS-05/A I/J-బ్యాండ్ మల్టీ-ఫంక్షన్ రాడార్,[25]ను ఉపయోగించాలని ప్రణాళిక రచన చేశారు, ఈ రాడార్‌ను ఎరికసన్ మరియు ఫెరాంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌లు శాబ్ JAS-39 గ్రిపెన్ కోసం అభివృద్ధి చేశాయి.[26] అయితే, 1990వ దశకం ప్రారంభంలో ఇతర రాడార్‌లను పరిశీలించిన తరువాత,[27] DRDO దీనికి సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయగలమని నమ్మకం వ్యక్తం చేసింది. MMR కార్యక్రమానికి నేతృత్వం వహించేందుకు HAL యొక్క హైదరాబాద్ శాఖ మరియు LRDE ఎంపిక చేయబడ్డాయి; దీనికి సంబంధించిన నమూనా రూపకల్పన పని ఎప్పుడు ప్రారంభించారనే విషయం అస్పష్టంగా ఉంది, అయితే ఈ రాడార్ అభివృద్ధి చర్యలు 1997లోనే ప్రారంభమయ్యాయి.[28]

MMR కోసం ప్రయోగ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను DRDO యొక్క సెంటర్ ఫర్ ఎయిర్‌బర్న్ స్టడీస్ (CABS) స్వీకరించింది. 1996 మరియు 1997 మధ్యకాలంలో, CABS వినియోగంలో ఉన్న HAL/HS-748M ఎయిర్‌బర్న్ సర్వైలాన్స్ పోస్ట్ (ASP) టెస్ట్‌బాడ్‌ను LCA ఏవియానిక్స్ మరియు రాడార్ కోసం టెస్ట్‌బెడ్ (ప్రయోగవేదిక)గా మార్చింది. దీనిని 'హాక్'గా పిలుస్తారు, ఈ మార్పు కోసం రోటోడోమ్ అసెంబ్లీని తొలగించడంపాటు, MMRను ఏర్పాటు చేసేందుకు LCA యొక్క శంఖాకార ముక్కును జోడించారు, దీని కోసం చేసిన ఒకేఒక్క ప్రధాన నిర్మాణ రూపాంతరణం ఇదొక్కటే.

2002 మధ్యకాలానికి, MMR అభివృద్ధి పనులు తీవ్ర జాప్యాలు మరియు వ్యయాలు పెరగడం వంటి సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. 2005 ప్రారంభ సమయానికి ఎయిర్-టు-ఎయిర్ లుక్-అప్ మరియు లుక్-డౌన్ ప్రక్రియలు - ఈ రెండూ బాగా సాధారణ ప్రక్రియలు - పరీక్షల్లో విజయవంతం అయినట్లు ప్రకటించారు. మే 2006లో పరీక్షలు జరుపుతున్న అనేక ప్రక్రియల ప్రదర్శన అంచనాలను అందుకోలేదని వెల్లడైంది."[29] దీని ఫలితంగా, ముఖ్యమైన సెన్సార్ కాని, ఒక ఆయుధ సరఫారా ప్యాడ్‌తో కొనసాగుతున్న ఆయుధీకరణ పరీక్షలు తగ్గించాలని ADA నిర్ణయించింది, దీంతో కీలకమైన పరీక్షలు నిలిచిపోయాయి. పరీక్ష నివేదికల ప్రకారం, LRDE చేత నిర్మించబడిన అధునాతన సిగ్నల్ ప్రాసెసర్ మాడ్యూల్ (SPM) మరియు రాడార్ మధ్య పొందిక కుదరకపోవడం ఈ సమస్య యొక్క ఆయువుపట్టు అని తేలింది. ఎల్టా యొక్క EL/M-2052 వంటి "ఆఫ్-ది-షెల్ఫ్" విదేశీ రాడార్‌ను ఒక మధ్యంతర ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ప్రతిపాదన తీవ్రంగా పరిగణించబడింది.[28]

ఇంజిన్ మరియు ప్రొపల్షన్[మార్చు]

కావేరీ ఇంజిన్ మరియు జాప్యాలు[మార్చు]

మొదట, నమూనాత్మక విమానంలో జనరల్ ఎలక్ట్రిక్ F404-GE-F2J3 ఆఫ్టర్‌బర్నింగ్ టర్బోఫాన్ ఇంజిన్‌ను అమర్చాలని నిర్ణయించారు. దీనితోపాటే, 1986లో, ఒక స్వదేశీ పరిజ్ఞానంతో ఇంజిన్‌ను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఒక సమాంతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో, GTRE GTX-35VS, దీనికి "కావేరీ " అని నామకరణం చేశారు, ఇంజిన్‌ను F404 స్థానంలో అన్ని ఉత్పాదక విమానంలో ప్రవేశపెట్టాలని భావించారు, అయితే, కావేరీ అభివృద్ధి కార్యక్రమంలో పురోగతి సాంకేతిక ఇబ్బందుల కారణంగా నెమ్మదించింది. 2004 మధ్యకాలంలో, రష్యాలో నిర్వహించిన పరీక్షల్లో కావేరీ బాగా ఎత్తైన ప్రదేశంలో ఎగరడంలో విఫలమైంది, దీంతో తొలి ఉత్పాదక తేజస్ విమానంలో ఈ ఇంజిన్‌ను అమర్చడంపై చివరి ఆశలు అడుగంటాయి.[30]

కావేరీ తదుపరి అభివృద్ధి కార్యకలాపాల కోసం కంపెనీలను ఆహ్వానిస్తూ ఒక RFP జారీ చేయబడింది. ఫిబ్రవరి 2006లో, కావేరీ యొక్క సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక సాయం అందించడం కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ కంపెనీ స్నెక్మాతో ADA ఒప్పందం కుదుర్చుకుంది.[11] ఆ సమయంలో, కావేరీ ఇంజిన్ తేజస్‌లో ఉపయోగించేందుకు 2009-10నాటికి అందుబాటులోకి వస్తుందని DRDO భావించింది.

GE F404[మార్చు]

ఉత్పాదన దశకు ముందు తయారు చేస్తున్న ఎనిమిది LSP విమానాలు మరియు రెండు నౌకా దళ నమూనా విమానాలకు అమర్చేందుకు ఉద్దేశించిన జనరల్ ఎలక్ట్రిక్ F404-IN20 ఇంజిన్.

కావేరీ అభివృద్ధిలో సమస్యలు కొనసాగుతుండటంతో ఎనిమిది ఉత్పాదన దశకు ముందుగా తయారు చేస్తున్న ఎనిమిది LSP విమానాల్లో మరియు రెండు నౌకా దళ నమూనాల్లో ఉపయోగించేందుకు 2003లో ధరపెంచిన జనరల్ ఎలక్ట్రిక్ F404, F404-GE-IN20 ఇంజిన్‌ను సేకరించాలని నిర్ణయించారు. ADA ఫిబ్రవరి 2004లో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి మరియు 17-IN20 ఇంజిన్లు ఉత్పత్తి చేసేందుకు US$ 105 మిలియన్ల కాంట్రాక్టును జనరల్ ఎలక్ట్రిక్‌కు అప్పగించింది, ఈ ఇంజిన్ల సరఫరా 2006లో ప్రారంభమైంది.

ఫిబ్రవరి 2007లో, భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన తొలి తేజస్ యుద్ధ విమాన దళ నిర్వహణ కోసం HAL అదనంగా 24 F404-GE-IN20 ఇంజిన్ల కోసం ఆర్డర్లు ఇచ్చింది.[31] తర్వాతి ఆర్డర్‌కు ముందు, F404-GE-IN20ను పరీక్షించేందుకు తేలికపాటి యుద్ధ విమానం (LCA)లో అమర్చారు, 2007 మధ్యకాలానికి దీనిని సిద్ధం చేయడానికి ఉద్దేశించిన ప్రణాళికల్లో భాగంగా తుది అంచనాలు తయారు చేసే చర్యల్లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించారు. F404-GE-IN20 ఇంజిన్ 19,000 పౌండ్ల (85 kN) అవ్యవస్థాపన పీడనాన్ని సృష్టించింది మరియు 330 గంటల యాక్సెలరేటెడ్ మిషన్ టెస్టింగ్‌ను పూర్తి చేసింది, ఇది 1,000 గంటల విమానయానానికి సమానం. -F2J3 డెవెలప్‌మెంట్ ఇంజిన్ల స్థానంలో వచ్చిన -IN20 ఇంజిన్లను సుమారు 600 విమానయానాలకు ఉపయోగించారు, ఈ పరీక్షలను మొత్తం 8 ఇంజిన్లపై నిర్వహించడం జరిగింది.

కొత్త ఇంజిన్ అంచనాలు[మార్చు]

థ్రస్ట్-విక్టరింగ్ కలిగివున్న ప్రతిపాదిత యూరోజెట్ EJ200 ప్రొపల్షన్.

సెప్టెంబరు 2008లో, తేజస్ సమయానికి కావేరీ సిద్ధం కాదని ప్రకటించారు, నిర్మాణ దశలో ఉన్న ఒక పవర్‌ప్లాంట్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.[32] మరింత శక్తివంతమైన 95 నుంచి 100 కిలోన్యూటన్ (kN) (21,000–23,000 lbf) పరిధిలోని ఇంజిన్ కోసం ఒక ప్రతిపాదన విజ్ఞప్తిని జారీ చేసేందుకు ADA ప్రణాళికలు రచించింది. దీని కోసం యూరోజెట్ EJ200 మరియు జనరల్ ఎలక్ట్రిక్ F414 ఇంజిన్లు పోటీపడ్డాయి. యూరోజెట్ EJ200 ప్రొపల్షన్ ఆఫర్ థ్రస్ట్-విక్టరింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా కలిగివుంది. మొదట భారతీయ శాస్త్రవేత్తలకు ఇచ్చేందుకు తిరస్కరించిన సింగిల్ క్రిస్టల్ టర్బైన్ బ్లేడ్ టెక్నాలజీని కూడా EJ200 ఇంజిన్‌తోపాటు ఇచ్చేందుకు యూరోజెట్ అంగీకరించింది.[33]

మే 2009లో Rs 3,300 కోట్ల (RS 33,000,000,000 లేదా $750 మిలియన్ల) ఒక అంతర్జాతీయ టెండర్‌ను ప్రకటించారు, దీనిలో భాగంగా రెండు శక్తివంతమైన ఇంజిన్లను సేకరించాలని సంకల్పించారు, సంతృప్తి ఆయుధ లోడ్‌తో యుద్ధ యుక్తులు నిర్వహించేందుకు ప్రస్తుత జనరల్ ఎలక్ట్రిక్ F-404 ఇంజిన్లు విమానానికి కావాల్సినంత పీడనాన్ని అందించలేకపోవడంతో దీని కంటే శక్తివంతమైన ఇంజిన్లు సేకరించాలని నిర్ణయించారు. LCAకు యూరోజెట్ టర్బో మరియు అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్‌లు 100 ఇంజిన్లు సరఫరా చేసేందుకు పోటీపడుతున్నాయి. యూరోజెట్ EJ200 మరియు GE F-414 ఇంజిన్లు IAF యొక్క అవసరాన్ని తీరుస్తాయి, ఇవి 95–100 కిలోన్యూటన్ల పీడనాన్ని సృష్టించగలవు. భారీ ఇంజిన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎయిర్‌ఫ్రేమ్ నమూనాను తయారు చేసేందుకు మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని IAF వర్గాలు వెల్లడించాయి. తేజస్ యొక్క ప్రాథమిక ఉత్పత్తిలో తయారయ్యే విమానాలు తక్కువ సామర్థ్యం కలిగిన జనరల్ ఎలక్ట్రిక్ F-404 ఇంజిన్లు ఉపయోగించనున్నారు, ఇవి 80–85 కిలోన్యూటన్ల పీడనాన్ని సృష్టించగలవు. [34]

వ్యయాలు[మార్చు]

డిసెంబరు 1996లో, A. P. J. అబ్దుల్ కలాం, తరువాత శాస్త్రీయ సలహాదారు, ఒక్కో తేజస్ యుద్ధ విమానం తయారీకి US$21 మిలియన్ల వ్యయం అవుతుందని లెక్కించారు. 2001 ముగింపు సమయానికి, ADA మరియు LCA కార్యక్రమ డైరెక్టర్ డాక్టర్ కోటా హరినారాయణ ఒక LCA తయారీకి (మొత్తం 200 విమానాల తయారీలో ఒక్కోదానికి) US$17–20 మిలియన్ల మధ్య ఖర్చు అవుతుందని అంచనా వేశారు, ఉత్పాదన వేగం అందుకుంటే, ఒక్కో విమానం తయారీకి అయ్యే వ్యయం US$15 మిలియన్ల తగ్గుతుందని పేర్కొన్నారు.

అయితే, 2001లో ఇతరులు ఒక్కో LCA తయారీకి US$24 మిలియన్ల వ్యయం అవుతుందని (ఒక్కో విమానం తయారీకి Rs. 100 కోట్లు [Rs. 1,000,000,000]) సూచించారు. ఈ అంచనా US$ (అమెరికా డాలర్‌)తో రూపాయి మారకపు విలువ 41 రూపాయలు వద్ద ఉన్నప్పుడు ఈ అంచనా వేశారు, ఇప్పుడు ఈ విలువ 47 వద్ద ఉంది. ప్రస్తుత రేట్లలో ఒక్క విమానం తయారీకి US$21.27 మిలియన్ల ఖర్చు అవుతుంది. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుంటే, కొందరు విమానయాన రంగ నిపుణులు ఈ యుద్ధ విమనం బయటకు వచ్చే సమయానికి ఒక్కో విమానం ధర US$35 మిలియన్లకు పెరగవచ్చని అభిప్రాయపడ్డారు.[35] 20 తేజస్ యుద్ధ విమానాల కోసం సిద్ధం చేసిన Rs. 2,000 కోట్ల (US$450 మిలియన్లకుపైగా) విలువైన ఆర్డర్ ప్రకారం..ఒక్కో విమానానికి US$22.6 మిలియన్ల సేకరణ వ్యయమైంది, ఇది అబ్దుల్ కలాం యొక్క అంచనాకు దాదాపుగా దగ్గరగా ఉంది. ఒక్కో విమానం ధర సుమారు US$ 20 మిలియన్ల నుంచి 32 మిలియన్ల (Rs. 100-150 కోట్లు) వరకు ఉన్నప్పుడు, ఇతర 4.5 తరం యుద్ధ విమానాలతో పోలిస్తే తేజస్ తయారీకి చాలా తక్కువ వ్యయం అవుతుంది. (పోలిక కోసం, టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక్కో ఫ్రెంచ్ రాఫెల్ తయారీకి Rs. 270 కోట్లు లేదా US$61 మిలియన్ల ఖర్చు అయినట్లు వెల్లడించింది). టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన ఫెడ్ 03, 2010 నివేదిక ప్రకారం, LCA కార్యక్రమాన్ని కొనసాగించేందుకు భారత ప్రభుత్వం మరో 8000 కోట్ల నిధులు అందజేయనున్నట్లు తెలుస్తోంది.[36]

ఆరు నౌకాదళ LCAల కోసం ఉద్దేశించిన ఆర్డర్‌లకు భారతీయ నౌకా దళం ఆమోదం తెలిపింది. ఒక్కో విమానాన్ని సుమారుగా US$31.09 మిలియన్లు (Rs 150 కోట్లు) ధర వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది.[37]

జాప్యం[మార్చు]

LCA అభివృద్ధి చేయడంలో జాప్యం జరగడానికి ఆధునిక యుద్ధ విమానాన్ని రూపొందించడంలో భారత్‌కు అనుభవం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. భారతదేశం దీనికి ముందు గడిచిన 1950వ దశకంలో ఒక రెండో తరం యుద్ధ విమానాన్ని (HF-24 మారుత్) మాత్రమే తయారు చేసింది. 2వ తరం విమానం తయారీ తరువాత ఏకంగా 4.5 తరం యుద్ధ విమానం తయారీకి ప్రయత్నించడం ప్రధాన అవరోధంగా మారింది. భారతదేశం యొక్క వివాదాస్పద అణు పరీక్షల కారణంగా అమెరికా విధించిన ఆంక్షలు మరియు ఎప్పటికప్పుడు మారిపోతున్న IAF అవసరాలు LCA ప్రాజెక్టుకు ప్రతికూలంగా మారాయి. మే 2006లో ఒక ఇంటర్వ్యూలో, HAL ఛైర్మన్ అశోక్ బావెజా మాట్లాడుతూ.. ఐదో నమూనా వాహనం (PV-5), ఇది శిక్షణ కార్యక్రమాలకు ఉద్దేశించిన నమూనా, మరియు ఎనిమిది LSP విమానాల్లో మొదటి విమానాన్ని 2006 సంవత్సరం ముగిసేలోగా సరఫరా చేస్తామని ప్రకటించారు. LCA కోసం ప్రాథమిక నిర్వహణ అనుమతులను వేగపరిచేందుకు ఈ విమానాలు సాయపడతాయని పేర్కొన్నారు.

2006 ముగింపు సమయానికి IAFలోకి దీనిని ప్రవేశపెట్టాలని భావించారు, LCA యొక్క సిస్టమ్ డిజైన్ & డెవెలప్‌మెంట్ (SDD) దశ చివరకు 2010లో పూర్తి అవుతుంది.[38] శిక్షణ ఉద్దేశిత విమానం అభివృద్ధిలో ఉండగా, నౌకా దళ ఉద్దేశిత విమానం రూపకల్పన పూర్తయింది, వాస్తవానికి ఇవి 2008లో ఆకాశంలోకి అడుగుపెడతాయని భావించారు. అయితే LSP-1 తొలి విమానయానం ఏప్రిల్ 2007లో జరిగింది, శిక్షణ నమూనా విమానం మాత్రం ఇప్పటికీ సిద్ధం కావాల్సి ఉంది.

భారత వైమానిక దళం ఆర్డర్ చేసిన ఇరవై విమానాలకు (16 ఒకే సీటు ఉండే విమానాలు మరియు నాలుగు రెండు-సీట్ల శిక్షణ విమానాలు) నిర్వహణపరమైన అనుమతులు 2012 తరువాతి వరకు పొందే అవకాశం కనిపించడం లేదు.[39]

స్థితి[మార్చు]

నిర్మాణంలో ఉన్న తేజస్ శిక్షణ విమానం.

తేజస్ విమానాలు ప్రస్తుతం ఆకాశయాన పరీక్షల్లో ఉన్నాయి. ప్రాథమిక నిర్వహణ అనుమతి (IOC) సాధించిన వెంటనే పరిమిత సంఖ్యలో వీటిని IAFలో ప్రవేశపెడతారు. తుది నిర్వహణ అనుమతి (FOC) సాధించిన తరువాత పూర్తిస్థాయిలో ఈ విమానాలను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెడతారు. IOC పరీక్షలు 2009నాటికి, మరియు FOC 2010నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. స్వతంత్ర విశ్లేషకులు మరియు IAFలోని అధికారులు తేజస్ యుద్ధ విమానాల సరఫరా 2010లో ప్రారంభమవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు, 2012 సమయానికి యుద్ధ సేవల కోసం ఉద్దేశించిన విమానాలు కూడా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.[40][41]

IAF 14 మంది సభ్యులు ఉన్న ఒక "LCA ప్రవేశ బృందాన్ని" ఏర్పాటు చేసింది, దీనిలో IAF పైలెట్‌లు మరియు అధికారులు ఉన్నారు, దీనికి ఎయిర్ వైస్ మార్షల్ BC నంజప్ప నేతృత్వం వహిస్తున్నారు. LCAను భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టే చర్యలను పర్యవేక్షించడం, ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం, తేజస్‌ను ఉపయోగించేందుకు అనుగుణంగా మార్పులు చేయడంలో దానిని అభివృద్ధిచేసేవారికి సాయం చేయడం, సిద్ధాంతాన్ని, శిక్షణ కార్యక్రమాలను, నిర్వహణ కార్యక్రమాలు సృష్టించడంలో సాయం చేయడం, తేజస్‌ను ఉపయోగించేందుకు వేగంగా IAFను సిద్ధం చేయడంలో సాయం చేయడం వంటి కార్యకలాపాల కోసం ఈ బృందం ఏర్పాటు చేయబడింది. LCA అభివృద్ధిలో మరింత పాలుపంచుకోవడం, ఈ కొత్త యుద్ధ విమానాన్ని సాధ్యమైంత త్వరగా దళంలోకి ప్రవేశపెట్టాలనే IAF కోరిక దీని ద్వారా స్పష్టమవుతుంది. ఈ బృందం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది.[42][43]

మార్చి 2005లో IAF 20 తేజస్ యుద్ధ విమానాల కోసం Rs. 2,000 కోట్ల (US$450 మిలియన్లకుపైగా) విలువైన ఆర్డర్‌ను ప్రకటిస్తుందని, మరో 20 యుద్ధ విమానాల కోసం ఇటువంటి మరో ఆర్డర్‌ను దీని తరువాత ప్రకటించనున్నట్లు సీనియర్ HAL అధికారులు వెల్లడించారు. ఈ 40 యుద్ధ విమానాలు F404-GE-IN20 ఇంజిన్‌ను కలిగివుంటాయి.[44] ఇప్పటివరకు, Rs. 4806.312 కోట్ల నిధులను వివిధ రకాల తేలికపాటి యుద్ధ విమానాన్ని తయారు చేయడంపై వెచ్చించారు.[45]

తేజస్ అనే పేరు కలిగిన స్వదేశంలో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం (LCA) మొదటి దళాన్ని దక్షిణాది భారత రాష్ట్రం తమిళనాడులో మోహరిస్తారు, 2009-2010లో భారత వైమానిక దళం (IAF)లోకి మొదటి బ్యాచ్‌లో భాగంగా ప్రవేశపెట్టే 20 యుద్ధ విమానాలను తమిళనాడు కేంద్రంగా పనిచేస్తాయి.

లెహ్‌లో నిర్వహించిన HAL తేజస్ హై-ఆల్టిట్యూడ్ పరీక్షలు (ఎత్తైన ప్రదేశాల్లో ప్రయాణించే సామర్థ్యాన్ని పరీక్షించే పరీక్షలు) డిసెంబరు 2008లో విజయవంతంగా పూర్తయ్యాయి.

2008 మే 30న తేలికపాటి యుద్ధ విమానం యొక్క వేడి వాతావరణ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. LCA 'తేజస్' ఉత్పత్తి శ్రేణి విమానం 2008 జూన్ 16న ఆకాశంలో విహరించింది. డిసెంబరు 2008 నుంచి, బాగా ఎత్తైన ప్రాంతం నిర్వహించిన HAL తేజస్‌ పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి, ఈ పరీక్షలను లెహ్‌లో నిర్వహించారు.[46]

2009 జూన్ 22న LCA తేజస్ 1000 ప్రయోగాత్మక విమానయానాలు పూర్తి చేసింది.[47] తేజస్ 530 గంటల విమానయాన పరీక్షను కూడా పూర్తి చేసింది.[48]

ఫిబ్రవరి 2009నాటికి ఏరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ అధికారులు.. తేజస్ ఆయుధాలతో ఆకాశంలో తిరగడం ప్రారంభించిందని, రాడార్‌లతో సమగ్రపరచడం మార్చి 2009నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. ఈ సమయానికి దాదాపుగా అన్ని వ్యవస్థల అభివృద్ధి కార్యకలాపాలు పూర్తవతాయని పేర్కొన్నారు.[49]

ఆరు నౌకా దళ LCAల కోసం భారత నౌకా దళం కూడా ఆర్డర్ ప్రకటించింది. దీని ద్వారా నౌకా దళ LCA కార్యక్రమంపై ఒక్కో విమానానికి సుమారు US$31.09 మిలియన్ల (Rs 150 కోట్లు) ధరతో, మొత్తం US$187 మిలియన్ల (Rs 900 కోట్ల) నిధులు వెచ్చించబడ్డాయి.[50]

భారత వైమానిక దళం మరియు భారత నౌకా దళం కోసం యుద్ధ విమానాల తయారీని ప్రారంభించేందుకు డిసెంబరు 2009లో భారత ప్రభుత్వం Rs 8,000 కోట్ల నిధులు మంజూరు చేసింది.[51]

2004 ఫిబ్రవరి 24న భారత ప్రభుత్వం విడుదల చేసిన ఒక మీడియా ప్రకటన..భారత వైమానిక దళంలోకి LCA తేజస్ యుద్ధ విమానాలు మార్చి 2011నాటికి ప్రవేశపెడతామని వెల్లడించింది. 20 LCAల కోసం పైన పేర్కొన్న కాంట్రాక్టుతోపాటు, అదనంగా 20 LCA యుద్ధ విమానాల సేకరణ ప్రతిపాదనకు సంబంధించి, తుది నిర్వహణ అనుమతుల అమరిక ప్రారంభమైంది. LCAకు సంబంధించిన లక్షణాలన్నీ IAF రూపొందించిన వైమానిక సేవా అవసరాలకు అనుగుణంగా ఉన్నాయి.[52][52]

తేజస్ మార్క్-2 మరియు నౌకా దళ LCA[మార్చు]

మార్క్-1 భారత వైమానిక సిబ్బంది అవసరాలను అందుకోలేని కారణంగా తేజస్ మార్క్-2ని కూడా అభివృద్ధి చేసే ఆలోచన ఉంది, 2005లో ఆర్డర్ చేసిన 40 యుద్ధ విమానాలకు మించి, భారత వైమానిక దళం మార్క్-1 యుద్ధ విమానాలకు కొనుగోలు చేయాలనుకోవడం లేదు. మార్పులతో కూడిన మార్క్-2ని అభివృద్ధి చేస్తే, 125 వరకు యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదనను భారత వైమానిక దళం ఇప్పటికీ పరిశీలిస్తోంది.[39] మార్క్ 2 విమానం మరింత శక్తివంతమైన ఇంజిన్, మెరుగైన ఏరోడైనమిక్స్, అప్రచలనాన్ని తగ్గించే ఇతర భాగాలు కలిగివుంటుందని ఒక IAF ప్రతినిధి వెల్లడించాడు.[39] భారత నౌకా దళ మార్క్ 2 శ్రేణి తేజస్ యుద్ధ విమానం విమానవాహక నౌకపై అతి తక్కువ దూరంతో టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగివుంటుంది.[53]

నౌకా దళ శ్రేణి తేజస్ యుద్ధ విమానం త్వరలోనే సిద్ధమయ్యే అవకాశం ఉంది. డిసెంబరు 2009 నుంచి, నౌకా దళ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అడ్మిరల్ నిర్మల్ వర్మ తన తొలి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2013నాటికి విమానవాహక నౌకపై పరీక్షలకు మరియు గోర్ష్‌కోవ్/విక్రమాదిత్యతోపాటు IACపై మోహరించేందుకు LCA యొక్క నౌకా దళ యుద్ధ విమానం సిద్ధమవుతుందని DRDO తమకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. IAC-2 కోసం మరింత సామర్థ్యం కలిగిన యుద్ధ విమానం కోసం నౌకా దళం అధ్యయనం చేస్తుందని ఆయన తెలిపారు.[54]

"నౌకా దళం కోసం ఉద్దేశించిన LCA"లో కొన్ని లక్షణాలు:

 • స్కీ-జంప్ మరియు అరెస్టెడ్ ల్యాండింగ్‌తో విమానవాహక నౌక నిర్వహణ
 • కాక్‌పిట్ వీక్షణను మెరుగుపరిచేందుకు కుదించిన ముక్కు
 • LEVCON వంటి అదనపు ఏరోడైనమిక్ లక్షణాలు మరియు నౌకపై ల్యాండింగ్ వేగాన్ని తగ్గించేందుకు ఫోర్ ప్లేన్
 • నౌక నుంచి గరిష్ట టేకాఫ్ బరువు-12.5 టన్నులు[అస్పష్టంగా ఉంది]
 • నౌక నుంచి ఎక్స్‌టర్నల్ స్టోర్ కారియింగ్ కెపాసిటీ-3.5 టన్నులు
 • పటిష్టపరిచిన ఫ్యూజ్‌లేజ్ (విమాన మధ్యభాగం)
 • ఎక్కువ సింక్ రేట్ (ఎత్తు తగ్గే రేటు) కారణంగా బలమైన అండర్‌కారేజ్ (అడుగు) భాగం
 • డెస్క్ రికవరీ కోసం అరెస్టర్ హుక్
 • ఫ్యూయల్ డంప్ సిస్టమ్

రూపకల్పన[మార్చు]

భారత వైమానిక దళంలో ఉపయోగించే జాడను కప్పిపుచ్చే ధూసరవర్ణంలో PV-3.

తేజస్ ఒకే ఇంజిన్ కలిగిన బహుళ-వినియోగ యుద్ధ విమానం, ఇది తోకలేని, మిశ్రమ సమద్విబాహు త్రిభుజాకర రెక్కల ఆకృతిని కలిగివుంటుంది, యుక్తులు ప్రదర్శించే సామర్థ్యాన్ని విస్తరించేందుకు "రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ" (విమానం తన యొక్క వాటాన్ని మరియు వాలు కోణాన్ని తనంతటతానుగా మార్చుకునే లక్షణం)తో ఈ యుద్ధ విమానానికి రూపకల్పన జరిగింది. మొదట భూమిపై బాంబులు జారవిడిచే ద్వితీయ శ్రేణి సామర్థ్యంతో వాయు అధికత యుద్ధ విమానంగా సేవలు అందించేందుకు ఇది ఉద్దేశించబడినప్పటికీ, ఈ నమూనా యొక్క వశ్యత లక్ష్యనిర్దేశిత ఎయిర్-టు-సర్‌ఫేస్ (ఆకాశం నుంచి భూమిపై లక్ష్యాలను ఛేదించగల) మరియు నౌకా విధ్వంసక ఆయుధాలను దీనికి జోడించేందుకు వీలు ఏర్పడింది, ఈ విధంగా తేజస్‌కు బహుళవినియోగ మరియు బహుళవిన్యాస సామర్థ్యాలు జోడించబడ్డాయి.

తేజస్‌ పరిమాణాన్ని మరియు బరువును తక్కువగా ఉంచేందుకు తోకభాగం లేకుండా చేయడం, మిశ్రమ-సమద్విబాహు త్రిభుజ ఆకృతిని ఎంచుకున్నారు.[55] ఇటువంటి ఆకృతిని ఉపయోగించడం వలన నియంత్రించేందుకు అవసరమైన ఉపరితలం పరిమాణం కూడా తగ్గుతుంది (టెయిల్‌ప్లేన్‌లు లేదా ఫోర్‌ప్లేన్‌లు (వెనుక రెక్కలు, ముందు రెక్కలు) ఉండవు, ఒక నిలువైన టెయిల్‌ఫిన్ (విమానం వెనుక నిటారుగా ఉండే తోక) మాత్రం ఉంటుంది), అంతేకాకుండా శిలువఆకార-రెక్కలు కలిగిన నమూనాలతో పోలిస్తే, ఈ తరహా నమూనాలు విస్తృతస్థాయిలో బాహ్య బరువులను మోసుకెళ్లే, బాగా-దగ్గరగా వెళ్లి యుద్ధం చేసే సామర్థ్యాలు, అధిక-వేగం మరియు అధిక-ఆల్ఫా ప్రదర్శన లక్షణాలు కలిగివుంటాయి. కొలబద్ద నమూనాలు మరియు సంక్లిష్ట కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ విశ్లేషణలపై విస్తృతమైన విండ్ టన్నెల్ పరీక్షలు జరిపిన కారణంగా, LCAకు సమర్థవంతమైన ఏరోడైనమిక్ అమరిక సాధ్యపడింది, దీని ద్వారా విమానం బరువు మరియు దాని యొక్క రెక్కల నిష్పత్తి (వింగ్-లోడింగ్) తక్కువగా ఉండే, మరియు అధిక రోల్ మరియు పిచ్ రేట్లు కలిగిన సూపర్‌సోనిక్ డ్రాగ్ (కర్పణం)ను LCAకు అందించారు.

ఒకటి లేదా ఏడు వరకు హార్డ్‌పాయింట్‌లపై 4,000 kg కంటే ఎక్కువ బరువున్న ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఇది కలిగివుంది: ప్రతి రెక్క కింద మూడు స్టేషన్లు ఉంటాయి, మరొకటి ప్యూజ్‌లేజ్ మధ్యభాగంలో అడుగువైపున ఉంటుంది. దీనికి ఎనిమిదో స్టేషను కూడా ఉంటుంది, ఈ ఆఫ్‌సెట్ స్టేషను ఇన్‌టేక్ ట్రంక్ పోర్ట్-వైపు అడుగు భాగంలో ఉంటుంది, ఇది వివిధ రకాల పాడ్‌లను (FLIR, IRST, లేజర్ రేంజ్‌ఫైండర్/డిజిగ్నేటర్, లేదా రికానిసన్స్) తీసుకెళ్లగలదు, విమానం మధ్యభాగం అడుగున ఉండే స్టేషను మరియు రెక్కలపై ఉండే స్టేషను‌లకు కూడా ఈ సామర్థ్యాన్ని కలిగివుంటాయి.

తేజస్ తన మధ్యభాగం మరియు రెక్కల్లో 3,000 kgల ఇంధనాన్ని మోసుకెళ్లగల సమగ్ర అంతర్గత ఇంధన ట్యాంక్‌లు కలిగివుంటుంది, ఫ్యూజ్‌లేజ్ ముందు స్టార్‌బోర్డ్‌వైపు ఒక స్థిరమైన ఇన్‌ఫ్లైట్ రీఫ్యూయలింగ్ ప్రోబ్ (మార్గమధ్యంలో ఇంధనం నింపుకోగల వ్యవస్థ) ఉంటుంది. వెలుపలివైపు, ఇన్‌బోర్డ్ మరియు మిడ్-బోర్డ్ వింగ్ స్టేషన్లు మరియు సెంటర్‌లైన్ ఫ్యూజ్‌లేజ్ స్టేషను‌పై మూడు 1,200- లేదా ఐదు 800-లీటర్ల (320- లేదా 210-US గాలన్లు; 260- లేదా 180-Imp గాలన్లు) ఇంధన ట్యాంక్‌ల వరకు "వెట్" హార్డ్‌పాయింట్ సదుపాయాలు ఉంటాయి.

ఎయిర్‌ఫ్రేమ్[మార్చు]

ఏరో-ఇండియా 09లో తేజస్
LCAలో ఉపయోగించిన మిశ్రమాలు

LCA అల్యూమినియం-లిథియం ధాతు మిశ్రమాలు, కార్బన్-ఫైబర్ సంక్లిష్ట పదార్థాలు (C-FC) మరియు టైటానియం-ధాతు సమ్మేళన ఉక్కుతో నిర్మించబడుతుంది. బరువు ప్రకారం తేజస్ యాంత్రిక నిర్మాణం (ఎయిర్‌ఫ్రేమ్)లో C-FC పదార్థాలు 45% వరకు కలిగివుంటుంది, ఫ్యూజ్‌లేజ్ (తలుపులు మరియు బాహ్యపొరలు), రెక్కలు (బాహ్య పొర, లోపలి భాగాలు మరియు రిబ్‌లు), ఎలెవోన్‌లు, టెయిల్‌ఫిన్, రూడెర్, ఎయిర్ బ్రేక్‌లు మరియు ల్యాండింగ్ గేర్ తలుపులు ఈ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. పూర్తిస్థాయి-లోహ నమూనాతో పోల్చినప్పుడు, విమానాన్ని తేలికపరిచేందుకు మరియు బలపరిచేందుకు మిశ్రమ పదార్థాలు ఉపయోగించారు మరియు ఈ తరగతిలో సమకాలీన విమానాలతో పోలిస్తే LCA నిర్మాణంలో బాగా ఎక్కువ C-FCలను ఉపయోగించారు.[56] విమానాన్ని బాగా తేలికపరచడంతోపాటు, విమానం యొక్క మన్నికను పెంచే మరియు నిర్మాణపరమైన దుర్బలత్వ పగుళ్లు సంభవించే అవకాశాన్ని తగ్గించే కొద్ది జాయింట్‌లు లేదా రివెట్‌లు కూడా ఉన్నాయి.

LCA యొక్క టెయిల్‌ఫిన్ ఒక మోనోలిథిక్ హనీకాంబ్ భాగం, సంప్రదాయ "వ్యవకలన" లేదా "నిగమన" పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతి వలన దీని యొక్క ఉత్పాదక వ్యయం 80% మేర తగ్గించారు, కంప్యూటరీకరించిన సంఖ్యా నియంత్రిత యంత్రం ద్వారా నలుపు వర్ణంలోని టైటానియం ధాతు మిశ్రమ భాగం నుంచి షాప్ట్‌ను మలిచారు. మరో ఇతర విమాన నిర్మాణ సంస్థ ఒకే భాగం నుంచి ఫిన్‌లు తయారు చేయలేదు.[57] రూడర్‌కు 'నోస్'ను రివిట్‌ల ద్వారా అతికించారు.

లోహ శరీరాన్ని ఉపయోగించడంతో పోల్చినప్పుడు, LCAలో మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా మొత్తం భాగాల సంఖ్య 40% తగ్గింది. అంతేకాకుండా, ఫాస్ట్నెర్‌ల సంఖ్య కూడా మిశ్రమ నిర్మాణం వలన సగానికి తగ్గాయి, లోహ నిర్మాణంలో ఇవి 10000 వరకు అవసరమవతాయి. మిశ్రమాలు ఉపయోగించడం వలన విమాన నిర్మాణంలో భాగంగా చేయాల్సిన మొత్తం రంధ్రాల్లో 2000 రంధ్రాలు తగ్గించగలిగారు. మొత్తంమీద, విమానం బరువు 21% తగ్గించడం సాధ్యపడింది. ఈ కారణాలు అన్నీ ఉత్పాదక వ్యయాలను తగ్గించగలవు, గణనీయంగా ఖర్చులు తగ్గించడాన్ని వీలు ఏర్పడటంతోపాటు, విమానాన్ని నిర్మించేందుకు తక్కువ సమయం మాత్రం పడుతుంది, దీనిని అదనపు ప్రయోజనంగా చెప్పవచ్చు- విమానం లోహ నిర్మాణానికి 11 నెలల సమయం పడుతుండగా, LCAకు ఏడు నెలల సమయం మాత్రమే అవసరమవుతుంది.[58]

నౌకా దళ శ్రేణి తేజస్ యుద్ధ విమాన శరీర నిర్మాణం (ఎయిర్‌ఫ్రేమ్)లో ల్యాండింగ్ చేసే సందర్భంగా మెరుగైన వీక్షణ సౌకర్యాన్ని కల్పించేందుకు కుదించిన ముక్కును ఏర్పాటు చేశారు, దీనితోపాటు లిఫ్ట్‌ను పెంచేందుకు వింగ్ లీడింగ్ ఎడ్జ్ వర్టెక్స్ కంట్రోలర్లు (LEVCON) దీనికి అమర్చారు. వింగ్-రూట్ లీడింగ్ ఎడ్జ్ నుంచి విస్తరించి ఉండే నియంత్రణ ఉపరితలాలను LEVCONలు అంటారు, వీటి వలన తక్కువ-వేగంతో LCAను మెరుగ్గా నియంత్రించడం సాధ్యపడుతుంది, ఇవి లేకుంటే డెల్టా-వింగ్ నమూనా ఫలితంగా కర్పణ శక్తి పెరిగి కొంత ప్రతికూలత ఎదురయ్యేది. వీటి ద్వారా మరో అదనపు ప్రయోజనం ఏమిటంటే, LEVCONలు హై యాంగిల్స్ ఆఫ్ ఎటాక్ (AoA) వద్ద నియంత్రణను పెంచుతాయి.

నౌకా దళ తేజస్ పటిష్ఠపరిచిన స్పైన్, ఒక పొడుగైన మరియు బలమైన అండర్‌కారేజ్ మరియు డెక్ యుక్తులు ప్రదర్శించేందుకు వీలుగా శక్తివంతమైన నోస్ వీల్ స్టీరింగ్‌ను కూడా కలిగివుంటుంది.[44][59] శిక్షణ కార్యకలాపాలకు ఉద్దేశించిన తేజస్ యుద్ధ విమానం కూడా రెండు సీట్ల నౌకా దళ విమానాలతో ఏరోడైనమిక్ సారూప్యత కలిగివుంటుంది.[60]

ల్యాండింగ్ గేర్[మార్చు]

ద్రవచాలిత ప్రమేయంతో ముడుచుకునే ట్రైసైకిల్-టైప్ ల్యాండింగ్ గేర్.

తేజస్ ఒక ద్రవచాలిత ముడుచుకునే ట్రైసైకిల్-రకానికి చెందిన ల్యాండింగ్ గేర్‌ను కలిగివుంటుంది, దీనితోపాటు ఒక జత లోపలికి ముడుచుకునే ప్రధాన చక్రాలు మరియు ఒక స్టీరబుల్, రెండు-చక్రాల ముందుకు-ముడుచుకునే నోస్ గేర్ ఉంటాయి. ల్యాండింగ్ గేర్‌ను మొదట దిగుమతి చేసుకోవాలని భావించారు, అయితే వాణిజ్యపరమైన ఆంక్షలు విధించబడటంతో, HAL సొంతంగా ఈ పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేసింది.

భారతదేశం యొక్క అణు ఇంధన సముదాయం (NFC) నేతృత్వంలోని బృందం హైడ్రాలిక్ పవర్ ట్రాన్స్‌మిషన్‌కు ఉపయోగించిన టైటానియం హాఫ్-అల్లాయ్ ట్యూబ్‌లను అభివృద్ధి చేసింది, LCAలో ఇవి కీలకమైన భాగాలు, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతరిక్ష ప్రయోగాల్లో కూడా ఉపయోగించవచ్చు.[61]

ఫ్లైట్ కంట్రోల్స్[మార్చు]

తేజస్ 'రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ' నమూనా కావడం వలన, పైలెట్ పనిని సులభం చేసేందుకు దీనికి క్వాడ్రుప్లెక్స్ డిజిటల్ ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌ను అమర్చారు.[62] తేజస్ యొక్క ఏరోడైనమిక్ అమరికను రెక్కలపై భుజం ఎక్కినట్లు ఉండే శుద్ధమైన డెల్టా వింగ్ నమూనా ఆధారంగా రూపొందించారు. దీని యొక్క నియంత్రణ ఉపరితలాలు అన్నీ ద్రవచాలితంగా ప్రేరేపించబడతాయి. రెక్క యొక్క బాహ్య లీడింగ్ ఎడ్జ్ (ముందువైపు కొనభాగం) మూడు-భాగాల స్లాట్‌లు కలిగివుంటుంది, లోపలి రెక్కపై వర్టెక్స్ లిఫ్ట్‌ను సృష్టించేందుకు లోపలివైపు భాగాలు అదనపు స్లాట్‌లు కలిగివుంటాయి మరియు ఇవి టెయిల్ ఫిన్ వ్యాప్తంగా అధిక-శక్తివంతమైన వాయు-ప్రవాహం అధిక-AoA స్థిరత్వాన్ని విస్తరించడంతోపాటు నియంత్రిత విమానయానం నుంచి నిష్క్రమణను అడ్డుకుంటాయి. రెక్క యొక్క వెనుకవైపు కొనభాగంపై పిచ్ మరియు యా కంట్రోల్‌ను అందజేసేందుకు రెండు-భాగాల ఎలెవోన్‌లు ఉంటాయి. ఒక రూడెర్ మరియు రెండు ఎయిర్‌బ్రేక్‌లను విమానం వెనుక భాగం-పై ఉన్న నియంత్రణ ఉపరితలాలుగా చెప్పవచ్చు, ఫ్యూజ్‌లేజ్ యొక్క వెనుక ఎగువ భాగంలో ఎయిర్‌బ్రేక్‌లు ఉంటాయి, ఫిన్ యొక్క ఏదోఒకవైపు ఇవి ఒక్కొక్కటి ఉంటాయి.

తేజస్ యొక్క డిజిటల్ FBW వ్యవస్థ నాలుగు కంప్యూటింగ్ ఛానళ్లు కలిగిన ఒక శక్తివంతమైన డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ (DFCC)ని కలిగివుంటుంది, దీనిలో ప్రతి ఛానల్ స్వతంత్ర విద్యుత్ సరఫరాను కలిగివుంటుంది, ఇవన్నీ ఒక LRUలో ఉంటాయి. DFCCకి వివిధ రకాల సెన్సార్లు మరియు పైలెట్ కంట్రోల్ స్టిక్ ప్రవేశాంశాల నుంచి సంకేతాలు అందుతాయి, ఎలెవోన్స్ మరియు రూడెర్ మరియు లీడింగ్ ఎడ్జ్ స్లాట్ ద్రవచాలిత సాధనాలను ప్రేరేపించేందుకు మరియు నియంత్రించేందుకు ఈ సంకేతాలను DFCC సంవిధానం చేస్తుంది. 32-బిట్ మైక్రోప్రాసెసర్ల చుట్టూ DFCC ఛానళ్లు నిర్మించబడివుంటాయి, సాఫ్ట్‌వేర్ అమలు కోసం ఇవి అడా భాష యొక్క ఒక ఉపసమితిని ఉపయోగించుకుంటాయి. MIL-STD-1553B మల్టీప్లెక్స్ ఏవియానిక్స్ డేటా బసెస్ మరియు RS-422 సీరియల్ లింకుల ద్వారా MFDల వంటి పైలెట్ డిస్‌ప్లే భాగాలతో కంప్యూటర్ సంకర్షణ జరుపుతుంది.

ప్రొపల్షన్[మార్చు]

ఆమోదయోగ్యమైన విరూపణ స్థాయిల వద్ద, అధిక AoA వద్ద కూడా, ఇంజిన్‌కు నిరంతర వాయు సరఫరాను అందించేందుకు రెక్కల రక్షణ ఉన్న, ప్రక్కవైపు రెండు భాగాలుగా విభజించిన, స్థిర-జ్యామెట్రీ Y-డక్ట్ ఎయిర్ ఇన్‌టేక్‌లు (వాయు ప్రవేశ ద్వారాలు) ఒక ఆశావహ డైవర్టర్ అమరికను కలిగివుంటాయి.

మొదట తయారు చేసే LCA నమూనా విమానానికి జనరల్ ఎలక్ట్రిక్ F404-GE-F2J3 ఆఫ్టర్‌బర్నింగ్ టర్బోఫాన్ ఇంజిన్‌ను అమర్చాలని, తరువాత ఉత్పదక దశలో తయారయ్యే విమానాలకు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన GTRE GTX-35VS కావేరీ టర్బోఫాన్‌ను అమర్చాలని ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేశారు, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ నేతృత్వంలో స్వదేశీ పరిజ్ఞానంతో కావేరీ ఇంజిన్ అభివృద్ధి జరుగుతోంది. అయితే అభివృద్ధి దశలో పదేపదే సమస్యలు ఎదురువడంతో, ఎనిమిది ఉత్పాదక-దశకు ముందు తయారయ్యే LSP విమానల్లో మరియు రెండు నౌకా దళ నమూనా విమానాల్లో కావేరీ స్థానంలో ఉపయోగించేందుకు ధరపెంచిన F404-GE-IN20 ఇంజిన్లను సేకరించాలని 2003లో నిర్ణయం తీసుకున్నారు. -IN20 ఇంజిన్ పరీక్షలను వేగవంతం చేసిన తరువాత, ఉత్పాదక దశలో తయారయ్యే మొదటి 20 యుద్ధవిమానాల్లో అమర్చేందుకు మరో 24 IN20 ఇంజిన్‌ల కోసం ఆర్డర్ ఇచ్చారు.

కావేరీ తక్కువ-బైపాస్-నిష్పత్తి (BPR) కలిగిన ఆఫ్టర్‌బర్నింగ్ టర్బోఫాన్ ఇంజిన్, ఇది వైవిధ్యభరిత ఇన్‌లెట్ గైడ్ వానెస్ (IGVలు)లతో ఒక ఆరు-దశల కేంద్ర అధిక-పీడన (HP) కంప్రెసర్‌ను, ట్రాన్సోనిక్ బ్లేడింగ్‌తో ఒక మూడు దశల తక్కువ-పీడన (LP) కంప్రెసర్‌ను, ఒక యాన్యులర్ కంబషన్ ఛాంబర్ మరియు శీతల ఏక-దశ HP మరియు LP టర్బైన్‌లను కలిగివుంటుంది. అభివృద్ధి చేస్తున్న నమూనా ఒక అధునాతన కన్వర్జెంట్-డైవర్జెంట్ ("con-di") వేరియబుల్ నాజిల్‌తో అమర్చబడి ఉంటుంది, ఉత్పత్తి చేసే తేజస్ విమానంలో మల్టీ-యాక్సిస్ థ్రస్ట్-వెక్టరింగ్ వెర్షన్‌ను అమర్చాలని GTRE భావిస్తుంది. డిఫెన్స్ ఏవియానిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DARE) కావేరీ (KADECU) కోసం పూర్తిస్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఒక ఫుల్-అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్‌ను అభివృద్ధి చేసింది. DRDO యొక్క సెంట్రల్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (CVRDE) తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్-మౌంటెడ్ యాక్సెసరీ గేర్ బాక్స్ (AMAGB) మరియు పవర్ టేకాఫ్ (PTO) షాఫ్ట్‌ల రూపకల్పన మరియు అభివృద్ధి బాధ్యతలు స్వీకరించింది.

ఏవియానిక్స్[మార్చు]

తేజస్ ఒక నైట్ వెర్షన్ గాగుల్స్ (NVG)-అనుకూల "గ్లాస్ కాక్‌పిట్"ను కలిగివుంది, ఇది స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెడ్-అప్ డిస్‌ప్లే (HUD)తో నియంత్రించబడుతుంది, వీటితోపాటు మూడు 5 ఇన్ x 5 ఇన్ మల్టీ-ఫంక్షన్ డిస్‌ప్లేలు, రెండు స్మార్ట్ స్టాండ్‌బై యూనిట్‌లు (SSDU), మరియు ఒక "గెట్-యు-హోమ్" ప్యానల్ (ఇది అత్యవసర సమయంలో పైలెట్‌కు అవసరమైన విమానయాన సమాచారాన్ని అందజేస్తుంది[63]) ఉంటాయి. CSIO-అభివృద్ధి చేసిన HUD, ఎల్బిట్-కలిగిన DASH హెల్మెట్-మౌంటెడ్ డిస్‌ప్లే అండ్ సైట్ (HMDS), మరియు హాండ్స్-ఆన్-త్రోటల్-అండ్-స్టిక్ (HOTAS) కంట్రోల్స్ పైలెట్‌పై భారాన్ని తగ్గిస్తాయి, కాక్‌పిట్ కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం లేకుండా చేయడం ద్వారా, ఇవి మార్గనిర్దేశం మరియు ఆయుధాలు-గురిపెట్టే సమాచారానికి ప్రాప్తి కలిగించి పైలెట్‌కు పరిస్థితి అవగాహనను పెంచుతాయి.

MFDలు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇంజిన్, హైడ్రాలిక్‌లు, ఎలక్ట్రికల్, ఫ్లైట్ కంట్రోల్ మరియు పర్యావరణ నియంత్రణ వ్యవస్థలపై సమాచారాన్ని అందజేస్తాయి, వీటితోపాటు ప్రాథమిక విమానయాన మరియు యుక్తుల సమాచారాన్ని ఇవి తెలియజేస్తాయి. ద్వంద్వ అధిక డిస్‌ప్లే ప్రాసెసర్లు ఈ డిస్‌ప్లేలపై కంప్యూటర్‌లో సృష్టించిన చిత్రాలను ప్రదర్శిస్తాయి. ఒక సాధారణ బహుళక్రియాత్మక కీబోర్డు మరియు ఫంక్షన్ అండ్ సెన్సార్ సెలెక్షన్ ప్యానళ్ల ద్వారా పైలెట్ సంక్లిష్ట ఏవియానిక్స్ వ్యవస్థలతో సంకర్షణ జరుపుతాడు.

లక్ష్య నిర్దేశాన్ని ఒక అధునాతన రాడార్ ద్వారా నిర్వహిస్తాడు - ఈ వ్యవస్థ ఒక లేజర్ డిజిగ్నేటర్ పాడ్, ఫార్వర్డ్-లుకింగ్ ఇన్‌ఫ్రా-రెడ్ (FLIR) లేదా ఇతర ఆప్టో-ఎలక్ట్రానిక్ సెన్సార్లు కలిగివుంటుంది- హనన సంభావ్యతలను విస్తరించేందుకు ఇవి కచ్చితమైన లక్ష్య సమాచారాన్ని అందజేస్తాయి. ఒక రింగ్ లేజర్ గైరో (RLG)-ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ (INS) పైలెట్‌కు కచ్చితమైన మార్గనిర్దేశక సాయం అందజేస్తుంది. "ఐడెంటిఫై ఫ్రెండ్ ఆర్ ఫియో" (IFF) ట్రాన్స్‌పాండర్/ఇంటరాగేట్, VHF/UHF రేడియోలు, మరియు ఎయిర్-టు-ఎయిర్/ఎయిర్-టు-గ్రౌండ్ డేటా‌లింక్‌లు వంటి సురక్షితమైన మరియు జామ్-నిరోధక కమ్యూనికేషన్ వ్యవస్థలను LCA కలిగివుంది. విమానయాన నియంత్రణలు (ఫ్లైట్ కంట్రోల్స్), పర్యావరణ నియంత్రణలు, విమాన ప్రయోజన వ్యవస్థల నిర్వహణ, స్టోర్ల నిర్వహణ వ్యవస్థ (SMS), తదితరాలను ADA సిస్టమ్స్ డైరెక్టరేట్ యొక్క ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్స్ సూట్ (IDAS) మూడు 1553B బస్సులుపై కేంద్రీకృత 32-బిట్, హై-థ్రూపుట్ మిషన్ కంప్యూటర్‌తో సమగ్రపరుస్తుంది.

రాడార్[మార్చు]

గరిష్ఠంగా 10 లక్ష్యాలను నిర్వహించగలగే విధంగా మరియు ఏకకాలంలో బహు-లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు వీలుగా LCA యొక్క పొందిక గల పల్స్-డోప్లెర్ మల్టీ-మోడ్ రాడార్ రూపొందించబడింది. దీనిని LRDE మరియు HAL హైదరాబాద్ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి, MMRను ఉత్పాదన దశలో ఉన్న తేజస్ యుద్ధ విమానాల్లో అమరుస్తారు, నమూనా విమానంలో దీనిని పరీక్షించి చూశారు. MMR బహుళ-లక్ష్య శోధన, ట్రాక్-వైల్-స్కాన్ (TWS), మరియు గ్రౌండ్-మ్యాపింగ్ క్రియలను ప్రదర్శించింది. ఇది లుక్-అప్/లుక్-డౌన్ మోడ్‌లు, లో-/మీడియం-/హై-పల్స్ రిపిటీషన్ ఫ్రీక్వెన్సీస్ (PRF), ప్లాట్‌ఫామ్ మోషన్ కాంపెన్సేషన్, డోప్లెర్ బీమ్-షార్పెనింగ్, మువింగ్ టార్గెట్ ఇండెంటిఫికేషన్ (MTI), డోప్లెర్ ఫిల్టరింగ్, కాన్‌స్టాంట్ ఫాల్స్-అలారం రేట్ (CFAR) డిటెక్షన్, రేంజ్-డోప్లెర్ యాంబిగ్యుటీ రెసొల్యూషన్, స్కాన్ కన్వర్షన్, మరియు చెడిపోయిన ప్రాసెసర్ భాగాలను గుర్తించేందుకు ఆన్‌లైన్ డయాగ్నోస్టిక్స్ వంటి చర్యలను కూడా నిర్వహించగలదు. అయితే దీని అభివృద్ధి దశలో జాప్యాల కారణంగా, తేజస్ ప్రారంభ నమూనా విమానాలకు అమర్చేందుకు విదేశీ "ఆఫ్-ది-షెల్ఫ్" రాడార్లు సేకరించాలని నిర్ణయించారు.

MMR అభివృద్ధిలో జాప్యం కారణంగా, కొత్త రాడార్ కోసం ఎల్టాతో కలిసి EL/M-2052 AESA అనే సెన్సార్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం IAIతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది, మిగిలిన భాగాలు మరియు సాఫ్ట్‌వేర్ మాత్రం MMR మరియు IAI అభివృద్ధి చేసిన ఉత్పత్తుల మేళనంగా ఉంటుంది. వరదరాజన్, (డైరెక్టర్ — LRDE) ఎయిర్‌బర్న్ అనువర్తనాలకు యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కానింగ్ అర్రే రాడార్[64]ను అభివృద్ధి చేసే ప్రక్రియను LRDE ప్రారంభించిందని తెలిపారు. ఈ రాడార్లను 2012-13నాటికి తేజస్ తేలికపాటి యుద్ధ విమాన-మార్క్ II శ్రేణిలో ప్రవేశపెడతామని వెల్లడించారు.

ఆత్మరక్షణ[మార్చు]

తీవ్ర యుద్ధ పరిస్థితుల సందర్భంగా తేజస్ యొక్క మనుగడను విస్తరించేందుకు ఒక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ రూపొందించబడింది. LCA యొక్క EW సూట్‌ను డిఫెన్స్ ఏవియానిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DARE) అభివృద్ధి చేస్తుంది - దీనిని జూన్ 2001 వరకు అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ అండ్ ఎవాల్యూషన్ ఆర్గనైజేషన్ (ASIEO)గా గుర్తించేవారు- ఈ సూట్‌ను తయారు చేయడంలో DAREకి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబోరేటరీ (DLRL) సాయం చేస్తుంది.[65] ఈ EW సూట్‌ను " మాయావి"గా కూడా గుర్తిస్తారు (సంస్కృతం: Illusionist), దీనిలో ఒక రాడార్ హెచ్చరిక గ్రాహకి (RWR), ఆత్మ-రక్షణ జామర్, లేజర్ హెచ్చరిక వ్యవస్థ, క్షిపణి దాడి హెచ్చరిక వ్యవస్థ మరియు చాఫ్/ప్లేర్ డిస్పెన్సెర్ ఉంటాయి. మధ్యంతర ప్రణాళికల్లో భాగంగా, భారత రక్షణ మంత్రిత్వ శాఖ తాము ఇజ్రాయేల్‍‌కు చెందిన ఎలిస్రా నుంచి LCA నమూనాల కోసం EW సూట్‌లను కొనుగోలు చేశామని వెల్లడించింది, అయితే ఎన్ని సూట్‌లను కొనుగోలు చేశారో బయటపెట్టలేదు.[66]

తేజస్‌ ను "స్టీల్త్" స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని ADA ప్రకటించింది. తక్కువ పరిమాణంలో ఉండటంతో, చూసేందుకు స్టీల్త్ మాదిరి సారూప్యత ఈ యుద్ధ విమానం కలిగివుంది, అయితే ఎయిర్‌ప్రేమ్ రూపకల్పనలో ఉన్నత స్థాయి మిశ్రామాలు ఉపయోగించడం (ఇవి రాడార్ తరంగాలను పరావర్తనం చేస్తాయి), పరిశోధించే రాడార్ తరంగాలను ఎదుర్కోకుండా ఇంజిన్ కంప్రెసర్‌కు రక్షణగా ఉండే ఒక Y-డక్ట్ ఇన్‌లెట్, రాడార్-అబ్జార్బెంట్ మెటీరియల్ (RAM) కోటింగ్‌లు వేయడం మొదలైన జాగ్రత్తలు ఈ విమానాన్ని ప్రత్యర్థి యుద్ధ విమానాల రాడర్లు గుర్తించకుండా మరియు కనిపెట్టకుండా ఉండేందుకు పాటించారు, ఎయిర్‌బర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (AEW&C) విమానం, క్రియాశీల-రాడార్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్‌లు (AAM), మరియు సర్‌ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (SAM) రక్షణ వ్యవస్థలు కూడా దీనిని సులభంగా గుర్తించకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

తప్పించుకునే వ్యవస్థలు[మార్చు]

రెండు సీట్లు ఉన్న శ్రేణి LCAలకు ప్రణాళికలు రచించినప్పటికీ, ఒక పైలెట్‌తో నడిచే నమూనాలను మాత్రమే ఈ రోజు వరకు నిర్మించారు, దీని కోసం మార్టిన్-బేకెర్ జీరో-జీరో ఎజెక్షన్ సీట్‌ను ఉపయోగించారు. బ్రిటీష్ మార్టిన్-బేకెర్ ఎజెక్షన్ సీటు స్థానంలో స్థానికంగా అభివృద్ధి చేసే ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రణాళికా రచన చేశారు.[67] ఎజెక్షన్ సమయంలో పైలెట్ భద్రతను మెరుగుపరిచేందుకు, అర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE), పూణే, భారతదేశం, కొత్త లైన్-ఛార్జ్‌డ్ కానోపీ సెవెరాన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది, దీనిని మార్టిన్-బేకెర్ ధ్రువపరిచింది.

ఫ్లైట్ సిమ్యులేటర్[మార్చు]

విమానానికి మద్దతుగా ఒక డోమ్-ఆధారిత సిమ్యులేటర్ (అనుకరణ యంత్రం)ను బెంగళూరులోని ఏరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE)ని అభివృద్ధి చేస్తుంది. దీనిని భారత వైమానిక దళం డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రారంభించారు. LCA అభివృద్ధి ప్రారంభ దశ సందర్భంగా నమూనా మద్దతు అందజేసేందుకు, ముఖ్యంగా నాణ్యత అంచనా మరియు ప్రణాళిక మరియు ఆచరణ కార్యక్రమ ధోరణిని నిర్వహించేందుకు దీనిని ఉపయోగించారు.

వైవిధ్యాలు[మార్చు]

నమూనాలు[మార్చు]

దస్త్రం:LCATrainerModel.jpg
తేజస్ నౌకా దళ శ్రేణి విమానం నమూనా
నౌకా దళ LCA యొక్క సంభావిత చిత్రం
LCA శిక్షణ విమానం

ఇప్పటికే నిర్మించిన విమానాలు మరియు నిర్మించాల్సిన నమూనాలు. మోడల్‌ను పిలిచేందుకు ఉద్దేశించిన పేర్లు, తోకభాగంపై ఉండే సంఖ్యలు మరియు తొలిసారి ఆకాశంలోకి ఎగిరిన తేదీలు తెలియజేయబడ్డాయి.

టెక్నాలజీ డెమానుస్ట్రేటర్స్ (TD)
 • TD-1 (KH2001) - 2001 జనవరి 4
 • TD-2 (KH2002) - 2002 జనవరి 6
నమూనా వాహనాలు (ప్రోటోటైప్ వెహికల్స్) (PV)
 • PV-1 (KH2003) - 2003 నవంబరు 25
 • PV-2 (KH2004) - 2005 డిసెంబరు 1
 • PV-3 (KH2005) - 2006 డిసెంబరు 1 - ఇది ఉత్పాదన దశకు చెందిన శ్రేణి
 • PV-4 - దీనిని మొదట విమానవాహక నౌకపై నిర్వహించేందుకు ఉద్దేశించిన నౌకా దళ శ్రేణి విమానంగా తయారు చేయాలని భావించారు, అయితే ఇప్పుడు ఇది ఉత్పాదన దశలో రెండో శ్రేణి విమానం.
 • PV-5 (KH-T2009) - 2009 నవంబరు 26 - యుద్ధవిమాన/శిక్షణ శ్రేణి
నౌకా దళ నమూనాలు (నావెల్ ప్రోటోటైప్స్) (NP)
 • NP-1 - నౌకలపై కార్యకలాపాలకు ఉద్దేశించిన రెండు-సీట్ల నౌకా దళ శ్రేణి విమానం.
 • NP-2 - నౌకలపై కార్యకలాపాలకు ఉద్దేశించిన ఒక-సీటు గల నౌకా దళ శ్రేణి విమానం.
పరిమిత శ్రేణి ఉత్పాదన (LSP) విమానం

ప్రస్తుతం, 28 LSP శ్రేణి విమానాలను ఆర్డర్లపై తయారు చేస్తున్నారు.

 • LSP-1 (KH2011) - 2007 ఏప్రిల్ 25
 • LSP-2 (KH2012) - 2008 జూన్ 16. GE-404 IN20 ఇంజిన్ అమర్చిన తొలి LCA విమానం ఇది.
 • LSP-3 - MMR కలిగివుండే తొలి విమానం ఇది మరియు IOC ప్రమాణానికి ఇది దగ్గరలో ఉంటుంది.
 • LSP-4 నుంచి LSP-28 - 2010 ముగిసేనాటికి ఆకాశంలోకి అడుగుపెడతాయని భావిస్తున్నారు.

ఈ విమానాలు 2010 నుంచి సేవలు అందిస్తాయని భావిస్తున్నారు.

ప్రణాళికల్లో ఉన్న ఉత్పాదన శ్రేణి విమానాలు[మార్చు]

 • తేజస్ ట్రైనర్  – జనవరి 2010, రెండు-సీట్ల నిర్వహణ పరివర్తన శిక్షణ విమానం, దీనిని భారత వైమానిక దళం కోసం తయారు చేస్తున్నారు.
 • తేజస్ నేవీ  – రెండు- మరియు ఒక-సీటు కలిగిన విమానవాహక నౌకపై నిర్వహించగల సామర్థ్యం కలిగిన విమానాలు, వీటిని భారత నౌకా దళం కోసం తయారు చేస్తున్నారు
 భారతదేశం

సమగ్ర వివరాలు (HAL తేజస్)[మార్చు]

General characteristics

 • Crew: 1
 • Length: 13.20 m (43 ft 4 in)
 • Wingspan: 8.20 m (26 ft 11 in)
 • Height: 4.40 m (14 ft 9 in)
 • Wing area: 38.4 m² (413 ft²)
 • Empty weight: 5680kg[68] (14,330 lb)
 • Loaded weight: 9,500 kg (20,945 lb)
 • Max. takeoff weight: 13,500 kg (31,967 lb)
 • Internal fuel capacity: 3000 liters
 • External fuel capacity: 5×800 liter tanks or 3×1,200 liter tanks, totaling 4,000/3,600 liters

Performance

 • Maximum speed: Mach 1.8 (2,376+ km/h at high altitude) at 15,000 m
 • Range: 3000 km (1,840 mi (without refueling))
 • Service ceiling: 16,500 m (54,000 ft (engine re-igniter safely capable))
 • Wing loading: 221.4 kg/m² (45.35 lb/ft²)

Armament

 • Guns: 1× mounted 23 mm twin-barrel GSh-23 cannon with 220 rounds of ammunition.
 • Hardpoints: 8 total: 1× beneath the port-side intake trunk, 6× under-wing, and 1× under-fuselage with a capacity of >4000 kg external fuel and ordnance
 • Missiles:
HAL Tejas carrying R-73 missile and Drop Tank.

Avionics
EL/M-2052 AESA radar

ఇవి కూడా చూడండి[మార్చు]

మూస:Aircontent

సూచనలు[మార్చు]

 1. PTI (17 January 2015). "After 32 years, India finally gets LCA Tejas aircraft". Economic Times. Retrieved 17 January 2015.
 2. "Tejas: IAF inducts HAL's 'Made in India' Light Combat Aircraft – 10 special facts about the LCA". financialexpress.com. Retrieved 1 July 2016.
 3. "Final Version of Tejas PV6, 2-Seater Trainer Takes to Sky in Maiden Flight". The Economic Times, 9 November 2014.
 4. "EXCLUSIVE: With only two planes and issues unresolved, IAF to bring LCA Tejas home". India Today. Retrieved 1 July 2016.
 5. 5.0 5.1 "World's smallest combat jet's Mark-II avatar to be longer". Times of India. Retrieved 6 January 2016.
 6. Majumdar, Bappa. "India's light combat aircraft to phase out Russian jets." Reuters, 28 April 2009. Retrieved 29 May 2012. Archived 31 August 2009 at the Wayback Machine.
 7. "Indian Air Force to launch first squadron of Tejas fighter jets in Bengaluru". Deccan Chronicle. Retrieved 1 July 2016.
 8. ఇక్కడ "టెయిల్‌ లెస్" అనే పదం విమానానికి సమాంతర టెయిల్‌ ప్లేన్‌లు లేకపోవడాన్ని సూచిస్తుంది; అయినప్పటికీ దీనికి ఒక వర్టికల్ (నిలువైన) టెయిల్‌ ఫిన్ ఉంటుంది.
 9. అనాన్. (ఏప్రిల్ 27, 2003). మే 4న ప్రధానమంత్రి LCA కోసం ఒక సంస్కృత పేరు పెట్టనున్నారు'. తరువాత రక్షణ శాఖ మంత్రి సలహాదారు డాక్టర్ వసుదేవ్ K. ఆత్రే వెల్లడించిన సమాచారం ప్రకారం, LCA కోసం పరిగణలోకి తీసుకున్న 20 పేర్లలో "తేజాస్ " అనే పేరును ఎంపిక చేయడం జరిగింది; దీని కోసం తుది పరిగణలోకి తీసుకున్న మరో ప్రత్యామ్నాయ పేరు ఏమిటంటే "సారంగ్ ".
 10. అనాన్. (ఆగస్టు 21, 2003). LCA ఫస్ట్ ప్రోటోటైప్ వెహికల్ టు ఫ్లై నెక్స్ట్ మంత్. Indiainfo.com .
 11. 11.0 11.1 జాక్సన్, పాల్; మున్సన్, కెన్నెత్; & పీకాక్, లిండ్సే (Eds.) (2005) “ADA తేజాస్” ఇన్ జానెస్ ఆల్ ది వరల్డ్స్ ఎయిర్‌క్రాఫ్ట్ 2005-06 . కౌల్స్‌డన్, సర్రే, UK: జానెస్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ లిమిటెడ్, పేజి 195. ISBN 0-7106-2684-3.
 12. http://www.hindu.com/2008/11/26/stories/2008112651981400.htm
 13. LCA ఇండక్షన్ ఇన్‌టు IAF లైక్‌లీ బై 2010: ఎయిర్ చీఫ్
 14. "Fighter aircraft Tejas clocks fastest speed during testing". Indian Express. Cite web requires |website= (help)
 15. అనాన్. (ఆగస్టు 15, 2006). తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA). గ్లోబల్ సెక్యూరిటీ . ఆగస్టు 25, 2006న సేకరించబడింది.
 16. అయ్యర్, సుకుమార్ R. (మార్చి-ఏప్రిల్ 2001). LCA: ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ డిఫెన్స్. భారత్ రక్షక్ మోనిటర్ .
 17. అనాన్. (2004). రిమెంబరెన్స్ ఆఫ్ ఏరోనాటికల్ మాటర్స్ పాస్ట్. వేయు ఏరోస్పేస్ & డిఫెన్స్ రివ్యూ . మార్చి 31 2007న సేకరించబడింది.
 18. 18.0 18.1 18.2 రెడ్డి, C. మన్మోహన్ (సెప్టెంబరు 16, 2002). LCA ఎకనామిక్స్ ది హిందూ .
 19. http://www.hindu.com/2008/08/04/stories/2008080452510500.htm
 20. అక్టోబరు 1948లో, స్వదేశీ పరిజ్ఞానంతో HT-2ని అభివృద్ధి చేసేందుకు HALకు అనుమతి ఇచ్చారు, ఇది ఆగస్టు 5, 1951న తొలిసారి ఆకాశంలో విహరించింది.
 21. చటర్జీ, K. (n.d.). హిందూస్థాన్ ఫైటర్ HF-24 మారుత్; పార్ట్ I: బిల్డింగ్ ఇండియాస్ జెట్ ఫైటర్. ఆగస్టు 23, 2006న సేకరించబడింది.
 22. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; DRDO-LCA అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 23. http://www.aerospaceweb.org/aircraft/fighter/lca/
 24. నేషనల్ కంట్రోల్ లా టీమ్ అధిపతి శ్యామ్ శెట్టితో ఇంటర్వ్యూ. "NAL అండ్ LCA-1: ఫ్లైట్ కంట్రోల్ లాస్". నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ (NAL) ఇన్ఫర్మేషన్ పేస్ట్‌బోర్డ్ (జూన్ 25 – జులై 1 2001).
 25. టేలర్, జాన్ W. R.; మున్సన్, కెన్నెత్; & టేలర్, మైకెల్ J. H. (Eds.) (2005) "HAL లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్" ఇన్ జానెస్ ఆల్ ది వరల్డ్స్ ఎయిర్‌క్రాఫ్ట్ 1989-1990. కౌల్స్‌డన్, సర్రే, UK: జానెస్ ఇన్ఫర్మేషన్ గ్రూప్ లిమిటెడ్. పేజి 104. ISBN 0-7106-0896-9.
 26. గమనిక: జూన్ 2006లో ఎరిక్‌సన్ మైక్రోవేవ్ సిస్టమ్స్‌ను శాబ్ కొనుగోలు చేసింది; ఫెరాంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌ను 1990లో GEC-మార్కోనీ కొనుగోలు చేసింది, ఇది తరువాత బ్రిటీష్ ఏరోస్పేస్ (BAe)తో విలీనమై నవంబరు 1999లో BAE సిస్టమ్స్ ఏర్పాటయింది.
 27. గమనిక: వెస్టింగ్‌హౌస్ — ఇప్పుడు నార్త్‌రోప్ గ్రూమాన్AN/APG-66, దీనిని F-16 విమానంపై ఏర్పాటు చేశారు, 1992లో ADA పరిశీలించిన రాడర్‌లలో ఇది కూడా ఉంది. (శర్మ, రవి (జులై 16-29, 2005)ని చూడండి. LCA ఫజిల్. ఫ్రంట్‌లైన్.)
 28. 28.0 28.1 అరోర్, శివ్ (ఏప్రిల్ 8, 2006). 'ఇండిజెనస్' ఎయిర్‌క్రాఫ్ట్ నీడ్స్ ఫారిన్ లిఫ్ట్, ఫర్ ఇట్స్ రాడార్. ది సండే ఎక్స్‌ప్రెస్.
 29. ముదుర్, నిరాద్ (మే 1, 2006). గ్లిట్చెస్ ఇన్ LCA రాడార్. విజయ్ టైమ్స్ .
 30. భారత్ వద్ద సరిపోలిన విమానం లేకపోవడంతో, కావేరీ ని బాగా ఎత్తైన ప్రదేశాల్లో పరీక్షించేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు, దీని కోసం Tu-16 యుద్ధ విమానాన్ని ఉపయోగించారు. జూన్ నుంచి సెప్టెంబరు 2006 వరకు తదుపరి పరీక్షల కోసం రష్యాకు పంపబడిన మరో కావేరీ ఇంజిన్‌ను Tu-16 విమానంలో కాకుండా, Il-76 విమానంలో అమర్చి పరీక్షించారు.
 31. GE ఒక మీడియా ప్రకటన ప్రకారం
 32. Sharma, Ravi (2008-09-27). "Kaveri engine programme delinked from the Tejas". The Hindu. Retrieved 2008-09-28.
 33. http://www.defensenews.com/story.php?i=4441913
 34. సూచన <Nuclearram> http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?id=daadd3e5-489f-4403-b7bb-95411457188f
 35. శర్మ, రవి (జనవరి 20 – ఫిబ్రవరి 2 2001). ఎయిర్‌బర్న్, ఎట్ లాస్ట్. ఫ్రంట్‌లైన్
 36. http://timesofindia.indiatimes.com/india/On-for-27-yrs-LCA-project-gets-Rs-8000-crore-more/articleshow/5529518.cms
 37. http://news.rediff.com/report/2009/sep/21/navy-places-order-for-6-tejas-lca.htm నేవీ ప్లేసెస్ Rs 900-cr ఆర్డర్ ఫర్ 6 తేజాస్ LCA
 38. అనాన్. (మే 15, 2006). హాల్ టు గో ఇన్‌టు సూపర్‌సోనిక్ మోడ్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (వయా ICAST ఆర్కైవ్స్).
 39. 39.0 39.1 39.2 ది హిందూ డిసెంబరు 5, 2008
 40. అనాన్. (ఆగస్టు 22, 2006). HAL's LCA లైక్లీ టు హావ్‌ లాక్‌హీడ్ పార్టిసిపేషన్. WebIndia123.com .
 41. అనాన్. (మే 16, 2006). హాల్ టు పర్స్యూ LCA-తేజాస్ విగోరస్లీ టు మీట్ 2008 డెడ్‌లైన్. వన్ ఇండియా .
 42. IAF టీమ్ టు ఓవర్‌సీ LCA ఇండక్షన్ అండ్ ఆపరేషన్, ది హిందూ , డిసెంబరు 12, 2006 నివేదిక.
 43. ఫైటర్ ప్రాజెక్ట్ ఆన్ ఫాస్ట్ ట్రాక్ మోడ్ – newindpress.com నివేదిక. సేకరించిన తేదీ: ఏప్రిల్ 6, 2008.
 44. 44.0 44.1 అనాన్. ఫిబ్రవరి 17, 2006 ఇండియా: LCA తేజాస్ బై 2010 - బట్ ఫారిన్ హెల్ప్ సాట్ విత్ ఇంజిన్. డిఫెన్స్ ఇండస్ట్రీ డైలీ .
 45. "Flight Testing of LCA" (Press release). Ministry of Defence (India), Press Information Bureau, GoI. 3 March 2008. Retrieved 2008-04-06.
 46. http://timesofindia.indiatimes.com/LCA_high-altitude_trials_at_Leh_successful_DRDO_/articleshow/3847266.cms?TOI_latestnews
 47. http://www.ada.gov.in/Others/CurrentNews/weeklyReport-Lca1/_22_1002-Jan-09_Tejas-LCA_/_22_1002-Jan-09_tejas-lca_.html
 48. http://timesofindia.indiatimes.com/India/Tejas_LCA_completes_1000th_sortie/articleshow/4017994.cms
 49. http://www.zeenews.com/nation/2009-02-03/504327news.html లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజాస్ హాజ్ స్టార్టెడ్ ఫ్లైయింగ్ విత్ వెపన్స్
 50. http://news.rediff.com/report/2009/sep/21/navy-places-order-for-6-tejas-lca.htm నేవీ ప్లేసెస్ (Rs 900-cr) ఆర్డర్ ఫర్ 6 తేజాస్ LCA
 51. http://203.197.197.71/presentation/leftnavigation/news/india/nod-to-rs-8,000cr-for-production-of-tejas.aspx
 52. 52.0 52.1 http://pib.nic.in/release/release.asp?relid=58285
 53. ఏరోఇండియా 2009: LCA ప్రోగ్రామ్ ఓవర్ ది హంప్ - సెకెండ్ జనరేషన్ టు 4+, సేస్ ADA డైరెక్టర్, Dr PS సుబ్రమణ్యం న్యూస్
 54. http://indiatoday.intoday.in/site/Story/73256/Top%20Stories/First+indigenous+aircraft+carrier+to+be+launched+next+year:+Navy+chief.html
 55. LCA అండ్ ఇట్స్ ఫీచర్స్. సెప్టెంబరు 24, 2006న సేకరించబడింది.
 56. హారీ, B. (వాల్యూమ్ I, ఫిబ్రవరి 2005; వాల్యూమ్ II, ఏప్రిల్ 2005). రేడియన్స్ ఆఫ్ ది తేజాస్ (2 పార్ట్స్). వాయు ఏరోస్పేస్ & డిఫెన్స్ రివ్యూ .
 57. ప్రకాశ్, Sqn. Ldr. B.G. (ఫిబ్రవరి 16, 2001). డ్రీమ్స్ లైటెన్ ఇన్ LCA. స్ట్రాటజిక్ ఎఫైర్స్ — టెక్నాలజీ (పేజి 3).
 58. అనాన్. (ఆగస్టు 19, 2002). ఎయిర్‌క్రాఫ్ట్: LCA. స్పేస్ ట్రాన్స్‌పోర్ట్ .
 59. వోలెన్, M. S. D., ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) (మార్చి-ఏప్రిల్ 2001). ది లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ స్టోరీ. భారత్ రక్షక్ మోనిటర్ .
 60. ఏరోనాటికల్ డెవెలప్‌మెంట్ ఏజెన్సీ (n.d.). [1]. సెప్టెంబరు 24 2006న సేకరించబడింది.
 61. అనాన్. (జూన్ 9, 2006). NFC డెవెలప్స్ టైటానియం ప్రోడక్ట్ ఫర్ LCA, GSLV. బిజినెస్ లైన్ .
 62. rediff.com స్పెషల్: ది సాగా ఆఫ్ ఇండియాస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్
 63. http://frontierindia.net/light-combat-aircraft-tejas-testing — జులై 5, 2008న సేకరించబడింది
 64. http://www.bharat-rakshak.com/NEWS/newsrf.php?newsid=10439
 65. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; lektra అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 66. రఘువంశీ, వివేక్ (24 July 2006). ఇండియా, ఇజ్రాయెల్ ప్రపోజ్ జాయింట్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వెంచర్. Rantburg.
 67. B. హారీ ఆఫ్ ACIG.org 's రిపోర్ట్ ఫ్రమ్ DEFEXPO-2004
 68. http://forums.bharat-rakshak.com/viewtopic.php?p=827366
 69. http://www.flickr.com/photos/20125521@N02/2366848903/

బాహ్య లింకులు[మార్చు]

లక్షణాలు మరియు విశ్లేషణ:

సాంకేతిక వివరాలు:

సాధారణ వివరాలు:

మూస:HAL aircraft