తేనె మనసులు (1965 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేనె మనసులు
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం సి. సుందరం
కథ ముళ్ళపూడి వెంకటరమణ
చిత్రానువాదం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం కృష్ణ (బసవరాజు),
సంధ్యారాణి,
సుకన్య (భానుమతి),
పద్మనాభం,
కె.వి.చలం,
పుష్పకుమారి,
రాధాకుమారి,
చలపతిరావు
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆచార్య ఆత్రేయ, కె. విశ్వనాధ్
నిర్మాణ సంస్థ బాబూ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తేనెమనసులు బాబూ మూవీస్ వారు 1965లో అందరూ కొత్తవారితో దర్శకులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

చిట్టిబాబు (రామ్మోయన్) కు సీత (సంధ్యారాణి) తో పెళ్ళిచూపులయ్యాయి. పెళ్ళి నిర్ణయమయింది. అతను అమెరికా వెళ్ళాలంటే డబ్బు కావాలి. కాబట్టి ఎక్కువ కట్నం అడుగుతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో సీత తండ్రి దొంగతనం చేసి డబ్బు సమకూరుస్తాడు.

చిట్టిబాబు వివాహానంతరం అమెరికా వెళ్ళొస్తాడు. చిట్టిబాబు స్నేహితుడు బసవరాజు (కృష్ణ) డ్రిల్లు మాస్టారుగా పనిచేస్తుంటాడు. అతను, భానుమతి (సుకన్య) పరస్పరం ప్రేమించుకుంటారు. విదేశాల నుంచి వచ్చిన చిట్టిబాబు వద్ద సెక్రటరీగా పనిచేస్తుంది భానుమతి. పల్లెటూరి టైపులో వుండే భార్యను కాదని, భనుమతిని ప్రేమిస్తాడు చిట్టిబాబు. అతనికి జ్ఞానోదయం కలగాలని అతన్ని ప్రేమిస్తున్నట్టు నటించి ఒకనాటి రాత్రివేళ తనలాగా సీతను అలంకరించి చిట్టిబాబు వద్దకు పంపిస్తుంది భానుమతి. ఈ నాటకం తెలియని బసవరాజు భానుమతిని అనుమానించి చిట్టిబాబుతో గొడవ పడతాడు. భానుమతితో బసవరాజు పెళ్ళి జరుగుతుంది.

నటవర్గం[మార్చు]

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

ముళ్ళపూడి వెంకటరమణ రచనలో ఆదుర్తి సుబ్బారావు నిర్మాత, దర్శకునిగా తీసిన మూగ మనసులు ఘన విజయం సాధించడంతో మరో సినిమా తీద్దామని, దానికి కథ రాయమని రమణకి ఆదుర్తి పురమాయించారు. దాంతో కథను సీనిక్ ఆర్డరుతో, కొద్ది అతిముఖ్యమైన సంభాషణలతో కథ రాసి, తేనె మనసులు అన్న పేరుపెట్టి ఆదుర్తికి ఇచ్చారు రమణ. అయితే సంభాషణలు రాయకుండానే రమణకీ, ఆదుర్తికీ వివాదం వచ్చి, ఆదుర్తితో ముందు అనుకున్న మరికొన్ని సినిమాలతో పాటుగా ఈ సినిమానూ వదిలేశారు రమణ. దాంతో సినిమా సంభాషణలు సహాయ దర్శకునిగా పనిచేస్తున్న కె.విశ్వనాథ్ తో కొంతవరకూ, ఆచార్య ఆత్రేయ తో మరికొంత రాయించుకుని స్క్రిప్ట్ పని పూర్తిచేశారు.[3]

నటీనటుల ఎంపిక[మార్చు]

సినిమాలో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కథ చదివాక ఆదుర్తి ఇలాంటి సినిమాలో ఎవరిని పెట్టి తీసినా మంచి విజయమే అందుకుంటుంది కనుక తారలకు పెద్ద పారితోషికాలు ఇచ్చేకన్నా కొత్తవాళ్ళతో తీయడం మేలని నిర్ణయించుకున్నారు. నెలరోజుల్లో చిట్టిబాబు పాత్రకు రామ్మోహన్, సీత పాత్రకు సంధ్యారాణి, బసవరాజు పాత్రకు కృష్ణ, భానుమతి పాత్రకు సుకన్య లను ఎంపికచేశారు దర్శకుడు. [3] హేమమాలిని, జయలలిత లు కూడా స్క్రీన్ టెస్ట్ కు వచ్చారు కానీ వారిద్దరు ఎంపిక కాలేదు.

చిత్రీకరణ[మార్చు]

ఆదుర్తి సుబ్బారావు తీసిన మూగ మనసులు సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగే సమయానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నాక, అప్పుడే కొత్తగా వచ్చిన కలర్లో తీస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని నమ్మి బ్లాక్ అండ్ వైట్లో తీసినదంతా పక్కనపెట్టేశారు. మళ్ళీ మొదటినుంచీ కలర్లో షూటింగ్ చేయడం ప్రారంభించి, చివరకు కలర్ చిత్రంగానే పూర్తిచేశారు.[3]

విడుదల[మార్చు]

స్పందన[మార్చు]

సినిమా విడుదలయ్యాక మంచి విజయం సాధించింది.[3]

ప్రాచుర్యం[మార్చు]

సినిమాలో నటించిన కొత్త హీరో హీరోయిన్లందరూ చలనచిత్రాల్లో రాణించారు.[3]

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఎవరో ఎవరో నీవాడు దాశరథి
దివినుండి భువికి దిగివచ్చే, దిగివచ్చే పారిజాతమే నీవై, నీవై దాశరథి కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
దేవుడు నేనై పుట్టాలి ఆత్రేయ కే. వి. మహదేవన్ ఘంటసాల, సుశీల, పి. బీ. శ్రీనివాస్
ఎమమ్మా నిన్నేనమ్మా ఆత్రేయ కే. వి. మహదేవన్ ఘంటసాల, సుశీల
నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల
మాస్టారు డ్రిల్లు మాస్టారు ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల, పద్మనాభం
అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే అదేమిటో ఆడదంటె మగవాడికి అలుసులే ఆత్రేయ కె.వి.మహదేవన్ పి.సుశీల

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 89.
  2. Andhra Jyothy (31 March 2023). "మొదటి సినిమాకి 58 ఏళ్ళు, అది ఎలా మొదలయిందంటే... |". Archived from the original on 31 March 2023. Retrieved 31 March 2023.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 బి.వి.ఎస్.రామారావు (అక్టోబరు 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
  • మంచి ఫలితాన్నిచ్చిన "తేనెమనసులు", నాటి 101 చిత్రాలు, ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీలు 211-12.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.