తైత్తిరీయోపనిషత్తు

వికీపీడియా నుండి
(తైత్తరీయోపనిషత్తు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము


తైత్తిరీయోపనిషత్తు చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. ఉపనిషత్తు‌లలో ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మ కాండలు (పూజలు) మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఇది కృష్ణయజుర్వేదతిత్తిరిశాఖకు చెందినది. దీనిని తిత్తిరిపక్షులు ప్రకటించాయి.

తైత్తరీయోపనిషత్తు అయిదు ప్రశ్నములు (భాగాలు) గా అధ్యాపక ప్రసిద్ధము. అవి

  1. శిక్షాప్రశ్నము లేక శిక్షావల్లి
  2. బ్రహ్మవల్లి లేక ఆనందవల్లి
  3. భృగువల్లి
  4. నారాయణప్రశ్నము
  5. చిత్తిప్రశ్నము

వీటిలో చిత్తి ప్రశ్నము బ్రహ్మవిద్యాప్రతిపాదకము కానందు వల్ల దీనికి ప్రాచుర్యము లేదు. ఈ తైత్తిరీయోపనిషత్తు ఆంధ్ర పాఠము, ద్రావిడ పాఠము అని రిండు విధములుగా ఉంది.ద్రావిడపాఠాన్ని శ్రివైష్ణవులు పఠిస్తారు.ఆంధ్రపాఠాన్ని వింధ్యకు దక్షిణానగల బ్రాహ్మణులు పఠిస్తారు. ద్రావిడపాఠములో లేని కొన్ని మంత్రములు ఆంధ్ర పాఠములో ఉండడంచేత ఆంధ్రపాఠమే హెచ్చు ప్రాచుర్యంలో ఉంది. శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి ప్రశ్నములకు శంకరభగవత్పాదుల భాష్యము, విద్యారణ్యుల బృహద్వివరణము, సురేశ్వరాచార్యుల భాష్యవార్తికము మొదలైన వ్యాఖ్యానాలు ఉన్నాయి. నారాయణ ప్రశ్నమునకు భట్టభాస్కరభాష్యము, సాయనాచార్యుల భాష్యములు ఉన్నాయి. వీటిలో ఆంధ్రపాఠాన్ని అనుసరించి సాయన భాష్యము ఉంటే, ద్రావిడపాఠాన్ని భట్టభాస్కరభాష్యము అనుసరించింది.
తైత్తిరీయోపనిషత్తులో మొత్తం 112 అనువాకాలు ఉన్నాయి. వీటిలో శిక్షావల్లిలో 12, బ్రహ్మవల్లిలో 10, భృగువల్లిలో 10, నారాయణప్రశ్నములో 80 అనువాకాలు ఉన్నాయి.
ప్రతి అనువాకం మంత్రాల సముదాయం.

శిక్షావల్లి[మార్చు]

శిక్షావల్లి ప్రధానంగా విద్యా బోధన గురించి చెప్తుంది (అనంతరకాలంలోని శిక్షా శాస్త్రాలకు ఇదే ఆధారం) బ్రహ్మచర్యంలోని గొప్పతనాల్ని (ఏకాగ్రత సంయమనం, మొదలగు వాటిని గుర్తించి) బోధించింది. స్నాతకుడుగా మారబోతున్న విద్యార్థికి 'సత్యంవద' (సత్యం చెప్పు) 'ధర్మంచర' (ధర్మంగా ప్రవర్తించు) 'మాతృ దేవోభవ 'పితృ,, ఆచార్య,, అతిథిదెవోభవ' (తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని, దేవునిగా పూజించాలి) వంటి ఎన్నో సూక్తులు చెప్తుంది. ఆ సూక్తులు శాశ్వతత్వాన్నికలిగి ఉన్నాయి.
దీనిలో సంహితాధ్యయనం చక్కగా చెప్పబడింది కనుక దీనిని సాంహిత అని కూడా అంటారు. సంహిత అంటే వేదపాఠం.

బ్రహ్మవల్లి[మార్చు]

బ్రహ్మవల్లి, భృగువల్లి ప్రశ్నములను వారుణి అంటారు. బ్రహ్మవిద్యాసాంప్రదాయ ప్రవర్తకుడైన వరుణిని సంబంధముచేత ఈ రెండు ప్రశ్నములకు వారుణి అని పేరు వచ్చింది.
బ్రహ్మవల్లి లేదా ఆనందవల్లి అనబడే ఈ ప్రశ్నమునందు బ్రహ్మ విద్యకు ప్రయోజనము అవిద్యా నివృత్తియని, అవిద్యానివృత్తిచేత జనన మరణ రూపమైన సంసారము నిశ్శేషముగా నశించునని ప్రతిపాదించబడింది.
ఈ ప్రశ్నములోనే క్రింది శాంతి మంత్రము ఉంది.

ఓం సహనావవతు |
సహనౌ భునక్తు |
సహవీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై |

ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః

భృగువల్లి[మార్చు]

భృగుమహర్షి తన తండ్రి అయిన వరుణుని బ్రహ్మను గూర్చి తెలుపవలసినదిగా ప్రార్థించాడు. వరుణుడు తన కుమారుని జిజ్ఞాసకు ప్రీతి చెంది, అన్నము, ప్రాణము, చక్షుస్సు, శ్రోతము, మనస్సు, వాక్కు అనునవి బ్రహ్మప్రాప్తికి ద్వారభూతములని చెప్పి, బ్రహ్మము యొక్క లక్షణమును కూడా భృగువునకు ఉపదేశించెను.ఇది స్థూలముగా భృగువల్లి సారాంశము.

నారాయణప్రశ్నము[మార్చు]

నారాయణప్రశ్నమునకు ఖిలకాండమనిపేరు.శ్రౌతసూత్రములో వినియోగంలేని మంత్రములు ఉండడంచేత ఆపేరు వచ్చింది.దీనికి యాజ్ఞికి అని కూడా పేరు ఉంది. సంధ్యావందనము, దేవతాపూజనము, వైశ్వదేవము మొదలైన కర్మప్రతిపాదకాలైన మంత్రాలు, యజ్ఞ సంబంధమైన మంత్రాలు ఎక్కువగా ఉండడంచేత ఆ పేరు వచ్చింది. అంతమాత్రాన ఇది ఉపనిషత్తు కాదనడానికి వీలులేదు. దీనిలో ప్రారంభంలో బ్రహ్మతత్త్వప్రతిపాదనము, చివరలో దానిని సాధించడానికి ఉపయోగపడే సత్యాది సన్యాసాంత సాధనలున్నూ చెప్పబడ్డాయి కనుక దీనిని ఉపనిషత్తు అనడానికి ఏరకమైన సందేహం కనబడదు.