టి.ప్రకాశ్ గౌడ్
తొలకంటి ప్రకాష్ గౌడ్ | |||
![]()
| |||
పదవీ కాలం 2009 - 2014 2014 - 2018 2018 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 05 మే 1959 మైలార్‌దేవపల్లి, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | ![]() | ||
తల్లిదండ్రులు | గండయ్య గౌడ్ - లక్ష్మమ్మ | ||
జీవిత భాగస్వామి | సులోచన | ||
సంతానం | ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు | ||
నివాసం | మైలార్‌దేవపల్లి |
తొలకంటి ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2][3] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[4]
జననం, విద్య[మార్చు]
ప్రకాష్ గౌడ్ 1959, మే 5న గండయ్య గౌడ్ - లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలంలోని మైలార్‌దేవపల్లి గ్రామంలో జన్మించాడు. పదవ తరగతి వరకు చదువుకున్నాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ప్రకాష్ గౌడ్ కు సులోచనతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ విశేషాలు[మార్చు]
తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ప్రకాశ్ గౌడ్, ఆ పార్టీలో నాయకుడిగా కీలకపాత్ర పోషించాడు. 2009లో 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, 2014లో జరిగిన 1వ తెలంగాణ శాసనసభకు తెలుగుదేశం పార్టీ పై రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పై రెండుసార్లు గెలుపొందాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై రాజేంద్రనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకుంట్ల గణేష్ పై 25,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6] [7]
శాసనసభకు పోటీ[మార్చు]
సంవత్సరం | నియోజకవర్గం | గెలిచిన అభ్యర్థి | పార్టీ | ఓట్లు | ఓడిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ |
---|---|---|---|---|---|---|---|---|
2009 | రాజేంద్రనగర్ | టి.ప్రకాశ్ గౌడ్ | తెలుగుదేశం పార్టీ | బొర్రా జ్ఞానేశ్వర్ | కాంగ్రెస్ పార్టీ | 7485 | ||
2014 | రాజేంద్రనగర్ | టి.ప్రకాశ్ గౌడ్[8] | తెలుగుదేశం పార్టీ | బొర్రా జ్ఞానేశ్వర్ | కాంగ్రెస్ పార్టీ | 25881 | ||
2018 | రాజేంద్రనగర్ | టి.ప్రకాశ్ గౌడ్ | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | రేణుకుంట్ల గణేష్ | తెలుగుదేశం పార్టీ | 58373 |
ఇతర వివరాలు[మార్చు]
ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు[మార్చు]
- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Tolkanti Prakash Goud MLA of Rajender Nagar Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
- ↑ "Rajendranagar Electiion Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2021-09-23. Retrieved 2021-09-23.
- ↑ Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 July 2021. Retrieved 15 July 2021.
- ↑ "T. Prakash Goud(TDP):Constituency- RAJENDRANAGAR(RANGAREDDY) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-09-23.
- ↑ Sakshi (12 December 2018). "ప్రకాష్.. హ్యాట్రిక్". Retrieved 4 March 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "RAJENDRANAGAR Election Result 2018, Winner, RAJENDRANAGAR MLA, Telangana". NDTV.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-23.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ రాజకీయ నాయకులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- 1959 జననాలు
- రంగారెడ్డి జిల్లా వ్యక్తులు
- రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు
- రంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2018)