తోట నిర్మలారాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోట నిర్మలారాణి
తోట నిర్మలారాణి
జననంసెప్టెంబరు 14
కరీంనగర్, కరీంనగర్ జిల్లా
ప్రసిద్ధికవయిత్రి
మతంహిందూ

తోట నిర్మలారాణి వర్థమాన తెలుగు కవయిత్రి. . కవి సంగమం రచయితలలో ఒకరు.

ఆమె గురించి[మార్చు]

ఈవిడ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ లో జన్మించారు. వృత్తిరీత్యా విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేసే నిర్మల ప్రవృత్తి మాత్రం కవితలు రాయడం. ఊహలకు, ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వగలిగే వయసు వచ్చినప్పటి నుంచి కవితలను డైరీల్లో రాసుకొని దాచుకోవటం అలవాటు చేసుకుంది నిర్మలరాణి. అలా ఎన్నో కవితల్ని రాసింది. తనలోని సున్నిత భావాలను, ప్రతిస్పందనలను కవితలుగా మలిచి రాయడం నిర్మలారాణి ప్రత్యేకత. 'లోపలి మెట్లు' పుస్తకం ఈమె రాసిన తొలి కవితా సంపుటి. నిర్మలారాణి మంచి కవయిత్రే కాకుండా మంచి నటి కూడా! కొన్ని రంగస్థల నాటికల్లో కూడా ఈమె నటించారు.

లోపలి మెట్లు పుస్తకం గురించి[మార్చు]

లోపలి మెట్లు పుస్తక ముఖచిత్రం

నిర్మలమైన ఒరవడితో సాగిన కవిత్వమిది. గులకరాళ్లు, ప్రవాహానికి స్వచ్ఛతను చేకూర్చినట్లే జీవితానుభవాలు, సామాజికానుభవాలే ఈ కవితా సంపుటికి మూలం. ఈ పుస్తకంలో వచన కవిత్వంతో పాటు స్త్రీ సమస్యలు, మానవ సంబంధాలపై కవితలు ఉన్నాయి. లోపలిమెట్లు అంటే అంతరంగపు మెట్లు అని అర్థం. జీవితంలో ఎదగాలంటే ఎన్ని మెట్లు ఎక్కినా.. అంతరంగపు మెట్లు ఒక్కొక్కటిగా దిగాలనే అంశం ఈ పుస్తకంలో ఉంది. లోపలిమెట్లు సమాజాన్ని నిశితంగా గమనిస్తున్న స్త్రీ అంతరంగపు మెట్లు.

కవయిత్రిగా ఎదగటానికి గల కారణం ఆమె మాటల్లో[మార్చు]

ఒక పత్రికలో వచ్చిన కవిత నచ్చడంతో కవి పేరు, ఫోన్‌ నెంబర్ చూసి వారికి నాలుగు వాక్యాలు మెసేజ్ చేశాను. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. నన్ను కవయిత్రిగా నిలబెడుతుందని ఊహించలేదు. ఆ కవి నన్ను ఫేస్‌బుక్‌లోని కవిసంగమం గ్రూపులో జాయిన్ చేశారు. డైరీల్లో రాసుకునే వ్యక్తిగత కవిత్వం కాక సామాజిక దృక్పథంతో కవితలు రాయాలని కొందరు కవులు సూచించారు. ఆ కవుల ప్రోత్సాహం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. నన్ను కవయిత్రిగా నిలబెట్టింది.

మూలాలు[మార్చు]


ఇతర లింకులు[మార్చు]