తోడూ నీడా (1965 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోడూ నీడా
(1965 తెలుగు సినిమా)
TeluguFilm Todu Needa NTR.jpg
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
నిర్మాణం ఎన్.ఎన్.భట్,
ఎ. రామిరెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
పి.భానుమతి,
ఎస్.వి. రంగారావు,
జమున,
నాగయ్య,
గీతాంజలి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విజయ భట్ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ[మార్చు]

దయామయుడైన ధర్మారావుకు రాజా అనే కుమారుడు, రాధ అనే కుమార్తె ఉంటారు. రాజా తన క్లాస్‌మేట్ రాణిని వివాహం చేసుకుంటారు. ధర్మరావు తన కుమార్తెను గోపీకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. రాధ తన కూతురును పట్టించుకోకపోవడంతో ఆ పాప రాధ, గోపీలకు చేరువ అవుతుంది. వారిని అమ్మ, నాన్న అని పిలుస్తూ వుంటుంది. అది రాణి తండ్రి నాగరాజుకు కంటగింపుగా వుంటుంది. ఆ చిన్నారి పాప ధర్మారావు ఆస్తికి వారసురాలు అనే విషయం బాగా తెలిసిన నాగరాజు రాధ,గోపీలను విడగొట్టడానికి ప్రయత్నించి సఫలీకృతుడౌతాడు. గోపీ క్రుంగిపోతాడు. చివరకు కలెక్టరు ఆనందరావు కుమార్తె, రాధ స్నేహితురాలు లక్ష్మిని వివాహం చేసుకుంటాడు. కానీ అతడు రాధను మరిచిపోలేక పోతాడు. లక్ష్మిని తన జీవితంలోనికి ఆహ్వానిచలేక పోతాడు. అయితే లక్ష్మి అతని మనసును, పాప మనసును ఎలా గెలుచుకున్నది అనేది మిగతా కథ.[1]

పాటలు[మార్చు]

  1. అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మ ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా ఆడుకొని ఆడుకొని అలసిపోతివా అలుపు తీర బజ్జో మా అందాల బొమ్మా - పి.సుశీల
  2. ఎందులకీ కన్నీరు, ఎందుకిలా వున్నారు, నేనేమైపోయాను వున్నాను నీడై వున్నాను - పి.సుశీల
  3. అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ( బిట్) - పి. భానుమతి
  4. జో ఆచ్యుతానందా జోజో ముకుందా..అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా - పి. భానుమతి
  5. మళ్ళున్నా మాన్యాలున్నా మంచెమీద మగువుండాలి - సుశీల,ఘంటసాల
  6. వలపులోని చిలిపితనం ఇదేలే నీ చెలిమిలోని గట్టి సిగ్గు అదేలే - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి
  7. వెన్ ఐ వజ్ జెస్ట్ యె లిటిల్ గర్ల్ ( ఇంగ్లీష్ పాట ) - పి. భానుమతి

మూలాలు, వనరులు[మార్చు]

  1. M.L., Narasimham (15 December 2017). "Blast from the past Thodu Needa (1965)work=The Hindu".
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.