త్యాగరాయ గానసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

త్యాగరాయ గానసభ హైదరాబాద్ లోని చిక్కడపల్లి ప్రాంతంలోని ప్రముఖ సభా వేదిక. ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హైదరాబాదు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ వారు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.

చరిత్ర[మార్చు]

శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్

1966 వ సంవత్సరములో వివేక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతములో హైదరాబాద్ నందు స్థాపించబడిన ఈ కళాక్షేత్రం తెలుగు భాషను, కళలను ప్రోత్సహించడమే దీనిని నెలకొలపడంలో ఉద్దేశ్యం . మొట్టమొదలు ఒక ఆడిటోరియంతో ప్రారంభమై, ఇపుడు అయిదు ఆడిటోరియంలతో మొత్తం 700 మంది ఒకేసారి కార్యక్రమాలను వీక్షించవచ్చును.[1] . గత 40 సంవత్సరాల నుండి గరిష్ట సంఖ్యలో కార్యక్రమాలను నిర్వహించడములో ప్రపంచ రికార్డు చరిత్రను సృష్టించింది. 1970 నుండి ప్రతి సంవత్సరం, రోజుకు రెండు షిఫ్టులలో 500 కి పైగా కార్యక్రమాలు జరుగుతాయి. త్యాగరాయ గానసభ వారు ఇప్పటి వరకు 28000 కి పైగా కార్యక్రమాలను నిర్వహించారు. ఇది ఒక నిర్దిష్ట రకమైన సంఘటనకు సరైన పరిమాణం, హైదరాబాద్ నగరములో కళలను , సంస్కృతి ని ప్రజలకు అందచేయడములో చేరువ అయినది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం.[2]

మూలాలు[మార్చు]

  1. Gana Sabha, Sri Thyagaraya. "Sri Thyagaraya Gana Sabha – A 'Treasure Trove Of Telugu Culture' In Hyderabad". hydnews.net. Archived from the original on 14 ఫిబ్రవరి 2021. Retrieved 8 ఫిబ్రవరి 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "MAXIMUM PROGRAMME ORGANIZE SINCE 1970". worldrecordsindia.com/. December 19, 2012. Archived from the original on 29 నవంబరు 2021. Retrieved 8 February 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)