త్రిదిబ్ చౌధురి
| త్రిదిబ్ చౌధురి | |||
| పదవీ కాలం 1987 – 1997 | |||
| నియోజకవర్గం | పశ్చిమ బెంగాల్ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 1952 – 1984 | |||
| ముందు | నియోజకవర్గం స్థాపించబడింది | ||
| తరువాత | అతిష్ చంద్ర సిన్హా | ||
| నియోజకవర్గం | బహరంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1911 డిసెంబరు 12 బహరంపూర్, బెంగాల్, బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 1997 మే 11 (వయసు: 85) | ||
| రాజకీయ పార్టీ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | ||
| నివాసం | కోల్‌కతా | ||
త్రిదిబ్ చౌధురి (12 డిసెంబర్ 1911 - 11 మే 1997) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1952 నుండి 1984 వరకు బెర్హంపూర్ నియోజకవర్గం నుండి వరుసగా ఏడుసార్లు లోక్‌సభకు, జూలై 1987 నుండి 1997 డిసెంబర్ 21 వరకు రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]త్రిదిబ్ చౌధురి రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1952, 1957, 1962, 1967, 1971, 1977 & 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బహరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయనను 1974లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీలు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు వ్యతిరేకంగా భారత రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఐక్యంగా నిలబెట్టాయి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ త్రిదిబ్ చౌధురిని 5,76,391 ఓట్ల తేడాతో ఓడించాడు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 7,65,587 ఓట్లు సాధించగా, త్రిదిబ్ చౌధురి 1,89,196 ఓట్లు సాధించాడు.[2]
త్రిదిబ్ చౌధురి జూలై 1987 నుండి 1997 డిసెంబర్ 21న మరణించే వరకు రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు ఉన్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Tridib Kumar Chaudhuri, a Freedom-Fighter-Turned-MP Par Excellence" (in ఇంగ్లీష్). The Wire. 24 June 2025. Retrieved 9 July 2025.
- ↑ "राष्ट्रपति चुनाव के किस्से (पार्ट-4) : आपातकाल के काग़ज़ पर दस्तखत करने वाले फखरुद्दीन अहमद ने त्रिदिब चैधुरी को राष्ट्रपति चुनाव में भारी मतों से पराजित किया था". TV9 Hindi. 5 May 2022. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.