త్రిపుర సుందరీ దేవి (నేపాల్)
| త్రిపురసుందరి | |||||
|---|---|---|---|---|---|
| నేపాల్ మహారాణి నేపాల్ రాజ ప్రతినిధి రాణి | |||||
త్రిపురసుందరి చిత్రపటం | |||||
| జననం | 1794 నేపాల్ రాజ్యం | ||||
| మరణం | 1832 ఏప్రిల్ 6 (వయసు: 37–38) హనుమాన్ ఢోకా రాజభవనం, కాఠ్మండు, నేపాల్ రాజ్యం | ||||
| Spouse | రాణా బహదూర్ షా | ||||
| |||||
| తండ్రి | నైన్ సింగ్ థాపా | ||||
| తల్లి | రాణా కుమారి పాండే | ||||
| మతం | హిందూ మతం | ||||

త్రిపురసుందరి (Nepali: रानी ललित त्रिपुरासुन्दरी; 1794 – 6 ఏప్రిల్ 1832), లలిత త్రిపుర సుందరి దేవి అని కూడా పిలువబడే ఆమె, నేపాల్ రాజు రాణా బహదూర్ షాను వివాహం చేసుకోవడం ద్వారా నేపాల్ మహారాణిగా నిలిచింది. చాలా చిన్న వయస్సులోనే విధవరాలైన ఆమెకు సంతానం లేకపోయినా, దీర్ఘకాలం పాటు నేపాల్ రాజ్యానికి రాజ ప్రతినిధిగా (రెజెంట్‌గా) సేవలందించింది. ఆమె తన సవతి కుమారుడు గిర్వాణ యుద్ధ విక్రమ షా కొరకు 1806–1819 మధ్యకాలంలో, అలాగే తన సవతి మనవడు రాజేంద్ర కొరకు 1819–1832 మధ్యకాలంలో రాజ ప్రతినిధిగా వ్యవహరించింది. నేపాల్‌లో సాహిత్యాన్ని ప్రచురించిన తొలి మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందింది.
జీవిత చరిత్ర
[మార్చు]లలిత త్రిపుర సుందరి దేవి నేపాల్ రాజ్యంలో ప్రభావవంతమైన సైనిక సామంత కుటుంబంలో జన్మించింది. చారిత్రక ఆధారాల ప్రకారం, ఆమె థాపా కుటుంబంకు చెందినది కాగా, భీమసేన్ థాపా సోదరుడు నైన్ సింగ్ థాపా కుమార్తె.[1][2][3][4] ఆమె సహోదరులలో మథబర్ సింగ్ థాపా (తరువాత నేపాల్ ప్రధానమంత్రి), గణేశ్ కుమారి దేవి ఉన్నారు. గణేశ్ కుమారి దేవి, తరువాత నేపాల్‌పై 100 సంవత్సరాలకు పైగా (1846–1950) రాణా పాలనను స్థాపించిన జంగ్ బహదూర్ రాణా తల్లి.
1805 లేదా 1806లో, త్రిపురసుందరి నేపాల్ రాజు రాణా బహదూర్ షాను వివాహం చేసుకుంది.[5] ఆమె రాజుకు అతి పిన్న వయస్కురాలైన భార్య.[6] ఆ సమయంలో రాణా బహదూర్ షా తన కుమారుడు, వారసుడు గిర్వాణ యుద్ధ విక్రమ షా తరఫున ముఖ్తియార్ (ప్రధాన కార్యనిర్వాహకుడు)గా వ్యవహరిస్తున్నాడు.[7] ఒక సంవత్సరం తరువాత, రాణా బహదూర్ షా తన సహోదరుడి చేత హత్య చేయబడ్డాడు.[7] త్రిపురసుందరి, రాణా బహదూర్ షాలకు సంతానం కలగలేదు.[8]
రాజ ప్రతినిధిత్వం
[మార్చు]1806లో రాణా బహదూర్ షా హత్యకు గురైన తర్వాత, తన సవతి కుమారుడు గిర్వాణ యుద్ధ విక్రమ షా తరఫున రాజ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రాజ రాజేశ్వరి దేవి బలవంతంగా సతి చేయబడింది.[5] దాంతో త్రిపురసుందరి తన సవతి కుమారునికి రాజ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించింది.[6] గిర్వాణ యుద్ధ విక్రమ షా 1816లో అధికారాన్ని పూర్తిగా చేపట్టకముందే మరణించగా, అతని శిశు కుమారుడు రాజేంద్ర రాజుగా ప్రకటించబడ్డాడు.[9] రాజేంద్రుని బాల్యకాలంలో కూడా త్రిపురసుందరి రాజ ప్రతినిధిగా కొనసాగింది.[6]
ఆమె భీమసేన్ థాపాకు గట్టి మద్దతుదారురాలు; అతను ఆమె బంధువై ఉండవచ్చని భావిస్తారు.[9] రాజ ప్రతినిధిగా ఉన్న సమయంలో, ఆమె ప్రభావం వల్ల భీమసేన్ థాపా 1806 నుండి 1832 వరకు 25 సంవత్సరాలకు పైగా నేపాల్ ప్రధానమంత్రిగా కొనసాగగలిగాడు.[9] గిర్వాణ యుద్ధ విక్రమ షా తరఫున పాలన నిర్వహిస్తున్న సమయంలో, త్రిపురసుందరి రాజసభ సభ్యులందరూ భీమసేన్ ఆదేశాలను పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది.[5]
1832 ఏప్రిల్ 6న కాఠ్మండులో వ్యాపించిన కలరా మహమ్మారి సమయంలో ఆమె కాలరా వ్యాధితో మరణించింది.[10] అదే సంవత్సరంలో రాజేంద్రుడు స్వయంగా అధికారాన్ని చేపట్టాడు.[11] ఆమె మరణంతో భీమసేన్ థాపా రాజకీయ ప్రభావం కూడా తగ్గిపోయింది.[9]
సాహిత్య రచనలు
[మార్చు]త్రిపురసుందరి నేపాల్‌లో సాహిత్యాన్ని ప్రచురించిన తొలి మహిళగా గుర్తించబడింది. ఆమె సంస్కృత మహాభారతంలోని శాంతి పర్వంలోని కొన్ని భాగాలను నేపాలి భాషలోకి అనువదించి, రాజు కర్తవ్యాలు, బాధ్యతలపై గ్రంథమైన రాజధర్మ పేరుతో 1824లో ప్రచురించింది.[12] చరిత్రకారులు రాజధర్మను "నేపాలి భాషా సాహిత్యానికి గౌరవకరమైన కృతి"గా ప్రశంసించారు.
ఆమె నేపాలి భాషలో అనేక ఇతర కవితలను కూడా రచించింది. తన రాజసభలో రచయితలు, కవులను ప్రోత్సహించడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రోత్సాహంతో ఆమె సవతి కుమారుడు గిర్వాణ యుద్ధ విక్రమ్, సవతి మనవడు రాజేంద్ర విక్రమ్ తలో మూడు గ్రంథాలను రచించారు.
నిర్మాణాలు, స్మారకాలు
[మార్చు]ధరహరా నిర్మాణాన్ని త్రిపురసుందరి లేదా ఆమె తరఫున భీమసేన్ థాపా ఆదేశించినట్లు భావిస్తారు.[6] ఈ గోపురం 2015 నేపాల్ భూకంపంలో కూలిపోయింది, అనంతరం మళ్లీ పునర్నిర్మించబడింది.[13] ఆమె త్రిపురేశ్వర్లోని త్రిపురేశ్వర్ మహాదేవ ఆలయం నిర్మాణాన్ని కూడా ఆదేశించింది.[14] అలాగే కాఠ్మండు, లలిత్‌పూర్ మధ్య థాపాథలిలో ఒక వంతెన నిర్మాణానికి కూడా ఆమె పునాది వేసింది.
మూలాలు
[మార్చు]ఉల్లేఖనలు
[మార్చు]- ↑ "Nepal Earthquake Destroys Dharahara Tower, A Significant Tourist Attraction In The Heart Of Kathmandu". Bustle (in ఇంగ్లీష్). 2015-04-25. Retrieved 2025-07-12.
- ↑ Karmacharya 2005, p. 86.
- ↑ Acharya 2012, p. 3.
- ↑ Acharya 2012, p. 62.
- 1 2 3 Ācārya, Bāburāma (2012). Janarala Bhīmasena Thāpā : yinako utthāna tathā patana 2069. Kr̥shṇa. Ācārya (Saṃskaraṇa 1 ed.). Kāṭhamāḍaum̐: Śrīkr̥shṇa Ācārya. ISBN 978-9937-2-4174-8. OCLC 837563659.
- 1 2 3 4 Hutt, Michael (24 June 2019). "Revealing What Is Dear: The Post-Earthquake Iconization of the Dharahara, Kathmandu". The Journal of Asian Studies (in ఇంగ్లీష్). 78 (3): 549–576. doi:10.1017/S0021911819000172. ISSN 0021-9118. S2CID 165687047.
- 1 2 Whelpton, John (1987). Nepali politics and the rise of Jang Bahadur Rana, 1830–1857 (PhD thesis) (in ఇంగ్లీష్). SOAS University of London. doi:10.25501/soas.00028837. Archived from the original on 2020-10-07. Retrieved 2026-05-21.
- ↑ A., Raj, Prakash (1997). Queens of the Shah Dynasty in Nepal. Nabeen Publications. OCLC 607611005.
{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) - 1 2 3 4 Whelpton, John (2005). A history of Nepal. Cambridge: Cambridge University Press. ISBN 0-521-80026-9. OCLC 55502658.
- ↑ Nepali, Chitranjan (1965). General Bhimsen Thapa ra Tatkalin Nepal. Kathmandu: Ratna Pustak Bhandar. pp. 38–39.
- ↑ Rose, Leo E. (8 January 2021). Nepal: Strategy for Survival (in ఇంగ్లీష్). Univ of California Press. ISBN 978-0-520-33868-5.
- ↑ Pokhrel, Shanta (1982). Nepalese Women (in ఇంగ్లీష్). Ridhi Charan Pokhrel.
- ↑ "Video: 19th century tower collapses from earthquake in Nepal – Telegraph". 25 April 2015. Archived from the original on 25 April 2015. Retrieved 20 July 2021.
- ↑ Hamal, Nikki (15 January 2018). "KU rebuilding quake-damaged Tripureshwor Mahadev temple". The Himalayan Times (in ఇంగ్లీష్). Retrieved 20 July 2021.
గ్రంథసూచి
[మార్చు]- Acharya, Baburam (2012), Acharya, Shri Krishna (ed.), Janaral Bhimsen Thapa : Yinko Utthan Tatha Pattan (in నేపాలీ), Kathmandu: Education Book House, p. 228, ISBN 9789937241748
- Karmacharya, Ganga (2005), Queens in Nepalese politics: an account of roles of Nepalese queens in state affairs, 1775–1846, Kathmandu: Educational Pub. House, p. 185, ISBN 9789994633937
- Yadav, Pitambar Lal (1996). Nepal ko rajnaitik itihas. Benaras: Modern Deepak Press. p. 142.
- Short description matches Wikidata
- Pages using infobox royalty with unknown parameters
- Articles containing Nepali (macrolanguage)-language text
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1794 జననాలు
- 1832 మరణాలు
- 18వ శతాబ్దపు నేపాలీ రాజవంశీయులు
- 19వ శతాబ్దపు నేపాలీ రాజవంశీయులు
- 19వ శతాబ్దపు కవులు
- 19వ శతాబ్దపు మహిళా రాజ ప్రతినిధులు
- 19వ శతాబ్దపు రాజ ప్రతినిధులు
- 19వ శతాబ్దపు మహిళా రచయితలు
- బగాలే థాపా
- కలరాతో మరణించినవారు
- నేపాలీ హిందువులు
- నేపాల్ మహారాణులు
- నేపాలీ మహిళా కవయిత్రులు
- 19వ శతాబ్దపు నేపాలీ మహిళా రచయితలు
- 19వ శతాబ్దపు నేపాలీ రచయితలు
- నేపాలీ భాషా రచయితలు
- నేపాల్ ఏకీకరణకు సంబంధించిన వ్యక్తులు
- థాపా వంశం
- నేపాలీ రచయిత్రులు