త్రిప్తి మిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిప్తి మిత్ర
జననం
త్రిప్తి భాదురి

(1925-10-25)1925 అక్టోబరు 25
దినాజ్‌పూర్, పశ్చిమ బెంగాల్
మరణం1989 మే 24(1989-05-24) (వయసు 63)
వృత్తినాటకరంగ, సినిమా నటి, దర్శకురాలు
జీవిత భాగస్వామిసోంభు మిత్ర
పిల్లలుషావోలీ మిత్ర
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారాన్ని (1971)

త్రిప్తి మిత్ర (1925 అక్టోబరు 25 - 1989 మే 24 ) బెంగాలీ నాటకరంగ, సినిమా నటి. ప్రముఖ నాటక దర్శకుడు సోంభు మిత్ర భార్య అయిన త్రిప్తి మిత్ర జుక్తి తక్కో ఆర్ గప్పో, ధరతీ కే లాల్ వంటి సినిమాలలో నటించింది. 1962లో కేంద్ర సంగీత నాటక అకాడమీ నుండి సంగీత నాటక అకాడమీ అవార్డును, కళారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు 1971లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.

జననం[మార్చు]

త్రిప్తి మిత్ర 1925 అక్టోబరు 25న అశుతోష్ భాదురి - శైలబాలా దేబీ దంపతులకు దినాజ్‌పూర్ లో జన్మించాడు. దినాజ్‌పూర్ మైనర్ స్కూల్‌లో ఆరో తరగతి వరకు చదివిన త్రిప్తి కోల్‌కతాకు వచ్చి ప్యారిచరణ్ స్కూల్‌లో అడ్మిషన్ పొందింది. అక్కడ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక, అశుతోష్ కాలేజీలో అడ్మిషన్ పొందింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

1945 డిసెంబరులో సోంభు మిత్రతో త్రిప్తి వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె షావోలీ మిత్ర (నటి, దర్శకురాలు) కుమార్తె ఉంది. 

నాటక, సినిమారంగం[మార్చు]

యుక్తవయస్సు నుండి నాటకరంగంలో పనిచేస్తున్న త్రిప్తి, మొదటిసారిగా 1943లో తన కజిన్ బిజోన్ భట్టాచార్య రూపొందించిన అగున్ (అగ్ని) నాటకంలో నటించింది. 1943 బెంగాల్ కరువు ఆధారంగా ఇప్టా నాటక సంస్థ నాటకం నబన్నా (హార్వెస్ట్) లో రంగస్థల ప్రదర్శనను చూసిన తర్వాత, దర్శకుడు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ఆమెను 1943లో గాన నాట్య సంఘ చిత్రం ధర్తీ కే లాల్‌లో నటించడానికి బొంబాయికి తీసుకెళ్ళడు. 1953లో పాథిక్ అనే సినిమాలో తొలిసారిగా నటించింది. ఈ సినిమాకి దేబాకి కుమార్ బసు దర్శకత్వం వహించాడు. రిత్విక్ ఘటక్ నటించిన చివరి సినిమా జుక్తి తక్కో ఆర్ గప్పో (1974) లో కూడా నటించింది. 1948లో శోంభు, తృప్తి మిత్ర కలిసి బోహూరుపీ పేరుతో తమ సొంత థియేటర్ గ్రూప్‌ని స్థాపించారు.[1]

సినిమాలు[మార్చు]

  • జుక్తి తక్కో ఆర్ గప్పో (1974)
  • చరంకబి ముకుంద దాస్ (1968)
  • సెబా (1967)
  • కాంచనరంగ (1964)
  • సూర్యస్నన్ (1962)
  • మానిక్ (1961)
  • ది డే షల్ డాన్ (1959)
  • శుభా బిబాహా (1959)
  • ఆశా (1956)
  • జాయ్ మా కాళి బోర్డింగ్ (1955)
  • రిక్షా-వాలా (1955)
  • మొయిలా కగాజ్ (1954)
  • పాథిక్ (1953)
  • బోధోడోయ్ (చిన్న) (1951)
  • గోపీనాథ్ (1948)
  • ధరి కే లాల్ (1946)

నాటకాలు[మార్చు]

  • అగున్
  • నాబన్నా
  • జబన్‌బందీ
  • గోపీనాథ్
  • ఉలూఖాగ్రా
  • ఛార్ అధ్యాయ్ (రవీంద్రనాథ్ ఠాగూర్ నవల ఆధారంగా)
  • రక్త కరాబి (ఠాగూర్ "రెడ్ ఒలియాండర్")
  • రాజా (ఠాగూర్ "ది కింగ్ ఆఫ్ ది డార్క్ ఛాంబర్")
  • బాకీ ఇతిహాస్
  • డాక్ఘోర్ (ఠాగూర్ ది పోస్ట్ ఆఫీస్ (నాటకం) ని నిర్మించి దర్శకత్వం వహించింది)
  • సుతోరాంగ్
  • అపరాజిత
  • విసర్జన్[2]

అవార్డులు[మార్చు]

మరణం[మార్చు]

తృప్తి మిత్ర 1989 మే 24న మరణించింది.

మూలాలు[మార్చు]

  1. "Bohurupee". Archived from the original on 2012-02-02. Retrieved 2022-04-08.
  2. Dharwadker, Aparna Bhargava (2005). Theatres of independence : drama, theory, and urban performance in India since 1947 ([Online-Ausg.] ed.). Iowa City: Univ. of Iowa Press. pp. 490 pages. ISBN 0877459614. Retrieved 2022-04-08.
  3. "SNA: List of Akademi Awardees". Sangeet Natak Akademi Official website. Archived from the original on 17 February 2012.
  4. "Padma Awards Directory (1954-2009)" (PDF). Ministry of Home Affairs (India). Archived from the original (PDF) on 10 May 2013.
  5. "Kalidas Award Holders (Theatre)". Department of Culture, Government of Madhya Pradesh. Archived from the original on 2011-01-20. Retrieved 2022-04-08.

బయటి లింకులు[మార్చు]