Jump to content

త్రిబాణధారి బార్బరిక్

వికీపీడియా నుండి
త్రిబాణధారి బార్బరిక్‌
దర్శకత్వంమోహన్ శ్రీవత్స
రచన
  • మోహన్ శ్రీవత్స
నిర్మాత
  • విజయ్‌పాల్‌ రెడ్డి అడిదెల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతరాజేష్ నంబూరు
తారాగణం
ఛాయాగ్రహణంకుశేందర్ రమేష్ రెడ్డి[1]
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఇన్ఫ్యూషన్ బ్యాండ్
నిర్మాణ
సంస్థ
  • వానర సెల్యూలాయిడ్‌
విడుదల తేదీ
2025 ఆగష్టు 29
దేశంభారతదేశం
భాషతెలుగు

త్రిబాణధారి బార్బరిక్ 2025లో తెలుగులో విడుదలైన సోషియో ఫాంటసీ సినిమా. మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌ బ్యానర్‌పై విజయ్‌పాల్‌ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించాడు. సత్యరాజ్, వశిష్ట ఎన్‌ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 3న,[2] ట్రైలర్‌ను ఆగష్టు 13న విడుదల చేయగా,[3] సినిమా ఆగస్ట్ 22న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆగష్టు 29న విడుదల చేశారు.[4]

త్రిబాణధారి బార్బరిక్ అక్టోబర్ 10 నుండి స‌న్ నెక్ట్స్‌లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5][6]

సైక్రియాట్రిస్ట్ డాక్టర్‌ శ్యామ్‌ కత్తు (సత్యరాజ్‌) కొడుకు, కోడలు చనిపోవడంతో మనవరాలు నిధి (మేఘన) ని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఓ రోజు స్కూల్‌కు వెళ్లిన నిధి కిడ్నాప్ అవుతుంది. దీంతో శ్యామ్ కంగారుగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీస్ విచారణ సమయంలో కీలక విషయాలు బయటపడతాయి. లేడీ డాన్ వాకిలి పద్మ (ఉదయభాను) మేనల్లుడు దేవ్ (క్రాంతి కిరణ్)కు పాప మిస్సింగ్ కేసుకు ఉన్న సంబంధం ఏంటి ? తప్పిపోయిన నిధి ఏమయింది? తన మనవరాలిని శ్యామ్ కనిపెట్టగలిగాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."త్రిబాణధారి బార్బరిక్‌ థీమ్ సాంగ్"సనారేకృష్ణ చైతన్య, సాయి చరణ్, శివ, హర్ష వర్దన్, వల్లి గాయత్రి, సింధూజ శ్రీనివాసన్, నాద ప్రియ, బృంద, ఆదిత్య అయ్యంగార్ (ర్యాప్‌)2:06
2."అనగా అనగా కథలా[10]"సనారేకార్తీక్5:23
3."నీవల్లే[11]"రఘురాంసిద్ శ్రీరామ్4:21

మూలాలు

[మార్చు]
  1. "'త్రిబాణధారి బార్బరిక్' లాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి - ప్రముఖ సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి". Mahaa News. 24 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  2. "ఆకట్టుకునేలా 'త్రిబాణధారి బార్బరిక్‌' టీజర్‌". Eenadu. 3 January 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  3. "ఉదయభాను అగ్రెసివ్ రోల్.. త్రిభాణధారి బార్బరిక్‌ ట్రైలర్‌ చూశారా?". Sakshi. 13 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  4. "డేట్ మారింది.. మంచి థియేటర్ల కోసమే". Chitrajyothy. 19 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  5. "రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫాంల‌లో త్రిబాణధారి బార్బరిక్.. ఇంత‌కీ ఎన్ని భాష‌ల్లోనో తెలుసా..?". NT News. 10 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  6. "ఇన్నాళ్లకు.. ఓటీటీకి బార్బరిక్! ఇక్క‌డైనా చూస్తారా". Chitrajyothy. 5 October 2025. Archived from the original on 10 October 2025. Retrieved 10 October 2025.
  7. "బర్బరికుడి శక్తి గురించి చెప్పాం!". NT News. 27 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  8. "నాపాత్ర సరికొత్తగా ఉంటుంది: వశిష్ట ఎన్‌. సింహా". Sakshi. 27 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  9. "విలన్‌గా ఉదయభాను రీఎంట్రీ - నోటి నుంచి ఆ డైలాగ్స్... ఆమెను ఇలా ఎప్పుడైనా చూశారా?". ABP Desam. 14 August 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  10. "హృదయాలను హత్తుకునేలా అనగా అనగా కథలా' పాట". Sakshi. 3 April 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.
  11. "త్రిబాణధారి బార్భరిక్ నుంచి సిద్ శ్రీరామ్ 'నీవల్లే సాంగ్ రిలీజ్." 10TV Telugu. 8 February 2025. Archived from the original on 27 August 2025. Retrieved 27 August 2025.

బయటి లింకులు

[మార్చు]