త్రివిక్రమ్ శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రివిక్రమ్ శ్రీనివాస్
Trivikram-srinivas-director.jpg
"అ ఆ" సినీనిర్మాణంలో త్రివిక్రమ్
జననం
ఆకెళ్ల నాగశ్రీనివాస్

(1971-11-07) 1971 నవంబరు 7 (వయస్సు 50)
జాతీయతభారతీయుడు
విద్యఎం. ఎస్. సి, న్యూక్లియర్ ఫిజిక్స్
విద్యాసంస్థఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తిమాటల రచయిత
స్క్రీన్ రచయిత
దర్శకుడు
వాణిజ్య ప్రకటనల దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1999 – ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • ఆకెళ్ల ఉదయభాస్కరరావు (తండ్రి)
  • నరసమ్మ (తల్లి)
పురస్కారాలుసైమా పురస్కారం
ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సౌత్
నంది పురస్కరం

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత, కథారచయిత, దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్. సి చేశాడు. బంగారు పతకం సాధించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. మొదట్లో నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరుపొందాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగశ్రీనివాస్. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ఆకెళ్ల ఉదయ భాస్కరరావు, నరసమ్మలకు దంపతులకు జన్మించాడు. భీమవరంలోని డి.ఎన్.ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అణుకేంద్ర శాస్త్రంలో ఎం. ఎస్. సి పూర్తి చేసుకుని స్వర్ణ పతకం సాధించాడు.[1]

సినీప్రస్థానం[మార్చు]

సాహిత్యం పై ఉన్న ఆసక్తితో సినిమాలోకి రావాలనుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఇద్దరూ కలిసి హైదరాబాదుకు బయలుదేరారు. ఒకే గదిని పంచుకున్నారు. సునీల్ త్రివిక్రమ్ ను తన జీవితంలో ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా భావిస్తాడు. సునీల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను గౌతంరాజుకు పిల్లలకు ట్యూషన్ చెప్పేవాడిగా పరిచయం చేసాడు. అదే సమయంలో ఒక ప్రముఖ వారపత్రికలో శ్రీనివాస్ రాసిన "ది రోడ్" అనే కథ ప్రచురితం అయ్యింది.

కొద్ది కాలానికి పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. 1999లో కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం చిత్రానికి రచయితగా అవకాశం వచ్చింది. తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలకు మాటలు రాశాడు. తర్వాత తరుణ్ కథానాయకుడిగా వచ్చిన నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారాడు. తర్వాత కూడా రచయితగా వాసు, మన్మథుడు, ఒక రాజు ఒక రాణి, మల్లీశ్వరి, జై చిరంజీవ చిత్రాలకు పనిచేశాడు.

నువ్వే నువ్వే చిత్రం తర్వాత మరో చిత్రం దర్శకత్వం వహించడం కోసం మూడేళ్ళ సమయం పట్టింది. మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన అతడు సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత పవన్ కల్యాణ్ తో తీసిన జల్సా సినిమా కూడా ఘనవిజయం సాధించింది. తర్వాత మహేష్ బాబుతో తీసిన ఖలేజా సినిమా అంచనాలను అందుకోలేదు. తర్వాత వచ్చిన జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ విజయవంతం అయ్యాయి. మళ్ళీ అజ్ఞాతవాసి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. తర్వాత వచ్చిన అల వైకుంఠపురములో బాక్సాఫీసు వచ్చ విజయం సాధించింది.

రచనా శైలి[మార్చు]

సినిమాల జాబితా[మార్చు]

Key
Films that have not yet been released విడుల కాని చిత్రాలను సూచిస్తుంది
Year Film దర్శకుడు స్క్రీన్ రైటర్ మాటల రచయిత కథారచయిత Notes
2002 నువ్వే నువ్వే అవును అవును అవును అవును ఉత్తమ మాటల రచయిత- నంది పురస్కారం
2005 అతడు అవును అవును అవును అవును Filmfare Award for Best Director – Telugu
Nandi Award for Best Dialogue Writer
Vamsee International Award for Best Director
2008 జల్సా అవును అవును అవును అవును
2010 ఖలేజా అవును అవును అవును అవును
2012 జులాయి అవును అవును అవును అవును
2013 అత్తారింటికి దారేది అవును అవును అవును అవును Filmfare Award for Best Director – Telugu
SIIMA Award for Best Director - Telugu
SIIMA Award for Best Telugu Film
Nandi Award for Best Popular Feature Film
Nandi Award for Best Dialogue Writer
2015 సన్నాఫ్ సత్యమూర్తి అవును అవును అవును అవును
2016 అ ఆ అవును అవును అవును
2018 అజ్ఞాతవాసి అవును అవును అవును
2019 అరవింద సమేత వీర రాఘవ అవును అవును అవును అవును
2020 అల వైకుంఠపురంలో అవును అవును అవును అవును
2020 మహేష్ బాబు#27dagger అవును అవును అవును అవును

పురస్కారములు[మార్చు]

తెలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారములు[మార్చు]

2005: ఉత్తమ దర్శకుడు అతడు

నంది పురస్కారములు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "'అ ఆ'లతో గారడీ చేసే 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్‌". www.eenadu.net. Retrieved 2020-11-07.
  2. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.