త్రిభుజాకార త్రి డ్రమ్ము బాయిలరు

వికీపీడియా నుండి
(త్రి డ్రమ్ము బాయిలరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
త్రి డ్రమ్ము బాయిలరు.పరిత్వచం/తొడుగు తొలగించిన చిత్రం
Yarrow బాయిలరు
నార్మండ్ బాయిలరు
రీడ్ బాయిలరు
త్రి డ్రమ్ము బాయిలరు

త్రి డ్రమ్ము బాయిలరు వాటరు ట్యూబు బాయిలరు.ఈ బాయిలరు చూచుటకు త్రికోణాకారపు నిర్మాణంలో వుండును[1].ఈ బాయిలరును నౌకలలో విద్యుత్తు ఉత్పత్తి చెయ్యుటకు వాడెదరు.ఈ బాయిలరు ఇమిడిక వుండి ఎక్కువ భాష్ఫీ భావన సామర్ధ్యం ఉన్నందున నౌకలలో ఈరకపు బాయిలరులకు ఆదరణ ఉంది.ఈ బాయిలరును స్థిర బాయిలరుగా పరిశ్రమలలో వాడటం అరుదు.స్టెర్లింగు బాయిలరు కూడా మూడు డ్రమ్ములను కలిగి వున్నను అది త్రిభుజాకారంగా వుండదు.

బాయిలరులో వుండు ప్రధాన భాగాలు[మార్చు]

 • 1.స్టీము –వాటరు డ్రమ్ము-ఒకటి
 • 2.వాటరు డ్రమ్ములు-రెండు
 • 3.డౌన్ కమర్ ట్యూబులు
 • 4.వాటరు ట్యూబులు
 • 4.ఫర్నేసు
 • 5.గ్రేట్ లేదా ఆయిల్ బర్నరు
 • 6.బాయిలరు బాహ్యతొడుగు/పరివేష్టితం

స్టీము –వాటరు డ్రమ్ము[మార్చు]

ఇది క్షితిజ సమాంతరంగా వున్న స్తూపాకార నిర్మాణం.రెండు చివరలు కొద్దిగా ఉబ్బుగా వుండును.ఈ డ్రమ్ములో కింది సగభాగంలో వేడీ నీరు మిగిలిన సగభాగంలో ఉత్పత్తి అగు నీటిఆవిరి/స్టీము జమాగును.ఈ భూసమాంతర పీపా/డ్రమ్ము యొక్క పార్శభాగంలో అనగా స్తూపాకార పొడవు బాగంలో, వాటరు డ్రమ్ము నుండి వచ్చిన వాటరు ట్యూబులు రెండు వైపుల అతుకబడి వుండును.స్టీము –వాటరు డ్రమ్ము పై భాగాన ప్రధాన స్టీము కవాటం/వాల్వు, సేఫ్టి వాల్వు, ఎయిర్ వెంట్ ., స్టీము ప్రెసరు గేజి/పీడనమపకం బిగించబడి వుండును.పక్క భాగంలో వాటరు గేజి, ఫిడ్ వాటరు ఇన్లెట్ పైపు వుండును.

వాటరు డ్రమ్ములు[మార్చు]

ఇవి రెండు ఉండును.ఫర్నేసుకు కిందవైపు వుండును.ఇవికూడా క్షితిజ సమాంతరంగా, పొడవుగా వుండును.ఈ డ్రమ్ముల పై ఉపరితలం నుండి స్టీము-వాటరు డ్రమ్ముకు పెక్కు వాటరు ట్యూబులు రెండు వరుసల్లో కలపబడి వుండును.కొన్ని బాయిలర్లో చివర్లో ఎయటివంటి వంపులు లేకుండా అతుకబడి వుండగా, కొన్ని బాయిలరులలో స్టీము డ్రమ్ము, వాటరు డ్రమ్ముల కలయిక వద్ద చిన్న వంపుతో అతుకబడి వుండును.సామన్యంగా ట్యూబుల వ్యాసం రెండు లేదా రెండున్నర అంగుళాలు వుండును.

డౌన్ కమరు ట్యూబులు[మార్చు]

ఈ డౌన్ కమరు ట్యూబుల ద్వారా స్టీము-వాటరు డ్రమ్ములోని వేడీ నీరు వాటరుట్యూబుల్లోకి ప్రవహించును.వేడి వాయువుల వలన ట్యూబుల్లోని నీరు ఆవిరిగా మారి స్టీము డ్రమ్ముకు వెళ్ళి ట్యూబుల్లో నీటి మట్తం తగ్గగానే వాటరు డ్రమ్ముల్లోని నీరు వాటరు ట్యూబుల్లోకి వెల్లును.బాయిలరు పనిచేస్తున్నప్పుడు నీటీ ప్రసరణ సహజ ప్రసరణ విధానంలో ప్రసరణ అగును.

ఫర్నేసు[మార్చు]

ఇది తాపహర మృత్తిక ఇటుకలతో/కొలిమి ఇటుకలతో నిర్మింపబడివుండును.ఫర్నేసు ఇటుకలు ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోగలిగిన దృఢత్వాన్నికల్గి వుండును.ఈ ఫర్నేసులోనే ఇంధన దహనం జరిగి వేడి వాయువులు ఉత్పన్నం అగును.

గ్రేట్(grate)[మార్చు]

బొగ్గు ఇంధన ఫర్నేసు అయిన ఫర్నేసుకు అడుగున గ్రేట్‌అను నిర్మాణం వుండును.ఆయిల్ లేదా గ్యాసు ఇంధ్నం అయినచో బర్నరులు వుండుడును.

బాయిలరు బహ్య తొడుకు/పరివేష్టితం[మార్చు]

బాయిలరు ఫర్నేసు లోపలి వరుస కొలిమి ఇటుకలతో పేర్చబడి, వాటి తరువాత బయటి వైపు ఉష్ణవ్యాప్తి నిరోధకం ఇటుకలు (insulation bricks) వుండును.ఈ ఇన్సులేసన్ ఇటుకలు కొలిమి ఇటుకలనుండివేడీని రేడియేసన్ ద్వారా నష్టపోకుండా నిరోధించును.ఈ ఇన్సులేసన్ ఇటుకల చుట్టు ఉష్ణాన్నివ్యాప్తిని నిరోధించే మినరల్ ఊల్/గ్లాస్ వూల్ ను కప్పిదానిపై పలుచని లోహపలకలు కప్పి వుండును.అందువలన ఉష్ణ వికిరణం ద్వారా జరుగు ఉష్ణ నష్టనివారణ జరుగును.

బాయిలరు పైన అమర్చిన ఉపకరణాలు[మార్చు]

 • 1.వాటరు గేజి
 • 2.సేఫ్టి వాల్వు
 • 3.ప్రధాన స్టీము వాల్వు
 • 4.బ్లోడౌన్ వాల్వు
 • 5.ప్రెసరు గేజి
 • ఫీడ్ పంపు/జలయంత్రం

నిర్మాణం[మార్చు]

ఎడంగా వున్నరెండు వాటరు డ్రమ్ముల పైన స్టీము-వాటరు డ్రమ్ము వుండును.ఈ మూడు డ్రమ్ముల అమరిక త్రిభుజాకరంగా వుండును. త్రిభుజం లోని మూడు కోణమూలలలో మూడు డ్రమ్ములు వుండును. పైన శీర్ష భాగాన స్టీము-వాటరు డ్రమ్ము వుండి, భూ సమాంతర భుజం అంచుల మీద వాటరు డ్రమ్ములు వుండి, వాటరు డ్రమ్ముల నుండి వాటరు ట్యూబులు స్టీము-వాటరు డ్రమ్ముకు కలుపబడి వుండును.వాటరు డ్రమ్ముల నుండి ట్యూబులు పలు వరుసలలో స్టీము డ్రమ్ముకు ఇరు పార్శాల్లో కలుపబడి వుండును.ఈ డ్రమ్ముల, ట్యూబుల అమరిక చూచుటకు త్రిభుజా కారంగా వుండును.ఈ త్రిభుజాకార నిర్మాణం మధ్య భాగంలో ఫర్నేసు/కొలిమి వుండును.ఈ మొత్తం నిర్మాణం రక్షణ ఉష్ణ నిరోధక తొడుగుతో/ (casing) కప్పబడి వుండును.ఇంధనంగా బొగ్గు లేదా ఆయిల్ ను ఉపయోగిస్తారు.బొగ్గు అయిన ఫర్నేసు లోపల గ్రేట్ నిర్మాణం, యాష్ పాన్ వుండును.ఆయిల్ ఫైర్ అయిన బర్నరులు వుండును.ఫైరు డోరులు బాయిలరు సైజును బట్టి ఒకటికన్న ఎక్కువ వుండును.కొన్ని బాయిలరులలో రెండు పక్కల నుండి ఇంధనాన్ని మండించే విధంగా నిర్మాణం వుండును.

19 వశతాబ్ది చివరి కాలంలో నావికా దళానికి చెందిన ఓడల్లో ఎక్కువ విద్యుత్తు ఉత్పాదన అవసరం పెరగడంతో కాంపాక్ట్ బాయిలరుల అవసరం పెరిగింది.ఆ కారణంచే త్రి డ్రమ్ముబాయిలరుల నిర్మాణం వాడకం పెరిగింది. 19 వ శాతాబ్ది చివరి కాలం నాటికే ఫైరు ట్యూబు బాయిలరు స్థానంలో బాబ్‌కాక్ అండ్ విల్‌కాక్సు బాయిలరు, బెల్లెవిల్ బాయిలరు వాడకం పెరిగింది.వాటితో పోల్చిన విద్యుతు ఉత్పత్తికి త్రి డ్రమ్ము బాయిలరు డిజైన్ తేలిక అయ్యినది, యిమిడిక నిర్మాణం ఉంది.

ఈ బాయిలరును రూపొందించిన కొత్తలో మొదటి తరంలో వాటరు ట్యూబుల వ్యాసం 3 (75 మిల్లీమీటర్లు) లేదా 4 (100 మిల్లీమీటర్లు) అంగుళాలు వుండేవి.తరువాత తరంలో ఈవాటరు ట్యూబుల వ్యాసాన్ని 2 (50 మిల్లీమీట ర్లు) తగ్గించారు.ఫలితంగా ఎక్కువ ట్యూబుల అమరిక వలన ట్యూబుల, ఘనపరిమాణంతో పోల్చుకున్న ట్యూబుల తాపక ఉపరితల వైశాల్యం /హీటీంగు సర్ఫేస్ ఏరియా నిష్పత్తి గణనీయంగ పెరిగింది. ఫలితంగా స్టీము ఉత్పత్తి వేగం పెరిగింది. ఇలా తక్కువ వ్యాసం వున్న వాటరు ట్యూబుల వాడకం కారణంగా వీటిని ఎక్సుప్రెస్ బాయిలర్లు అని కుడా పిలవసాగారు[2].

ట్యూబులు[మార్చు]

వాటరు ట్యూబులు సాధారణంగా వాటరు డ్రమ్ముల నుండి స్టీము-వాటరు డ్రమ్ముకు పార్శ భాగంలో ఆతుకబడి వుండును.చాలా త్రి డ్రమ్ము బాయిలరులలో ట్యూబుల చివరలు నిటారుగా ఎటువంటి వంపు లేకుండా వాటరు, స్టీము డ్రమ్ముకు కలపబడి వుండును.ఇటువంటి ట్యూబుల లోపల పేరుకు పోయిన స్కేలు/పొలుసును బ్రస్సు ద్వారా శుభ్రపరచడం సులభం కొన్ని రకాల బాయిలరులో ట్యూబుల చివర కొద్దిగా వంపు కల్గి ఆతుక బడి వుండును.ఇటు వంటి ట్యూబులను మామూలు బ్రస్సు/కుంచెలతో క్లీను చెయ్యడం కష్టం. వాటికి ప్రత్యేకమైన బ్రస్సులను వాడాలి. లేదా కెమికల్ సర్కులేసన్ ద్వారా ట్యూబులలో పేరుకు పోయిన స్కేలును తొలగించాలి.

త్రి డ్రమ్ము బాయిలరులోని రకాలు[మార్చు]

బాయిలరు తయారు దారులు పలు బ్రాండు పేర్లతో బాయిలరులను తయారు చేస్తున్నారు[2].అవి

 • 1.డు టెంపుల్ బాయిలరు
 • 2.నార్మండ్ బాయిలరు
 • 3.యార్రో బాయిలరు
 • 4.వైట్ ఫార్స్టర్ (White-Forster) బాయిలరు
 • 5.రీడ్ బాయిలరు
 • 6. అడ్మిరట్లి బాయిలరు Admiralty boiler

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

 1. "Boiler Operators Handbook". books.google.co.in. Retrieved 2018-01-31.
 2. 2.0 2.1 "Three-drum boilers". www.revolvy.com. Retrieved 2018-01-31.