త్రోవగుంట
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°33′07″N 80°03′29″E / 15.552°N 80.058°ECoordinates: 15°33′07″N 80°03′29″E / 15.552°N 80.058°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | ఒంగోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 14.02 కి.మీ2 (5.41 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 7,992 |
• సాంద్రత | 570/కి.మీ2 (1,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1048 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523262 ![]() |
త్రోవగుంట, ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలంనకు చెందిన [2] పిన్ కోడ్: 523 262. ఎస్.టి.డి.కోడ్ = 08592.
గ్రామ భౌగోళికం[మార్చు]
ఈ గ్రామం ఒంగోలుకు అతిదగ్గరలో, 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మండలం పేరు | ఒంగోలు |
జిల్లా | ప్రకాశం |
రాష్ట్రం | ఆంధ్రపదేశ్ |
భాష | తెలుగు |
ఎత్తు: సముద్రమట్టానికి | 12 మీటర్లు |
పిన్‌కోడ్ | 523262 |
తపాలా కార్యాలయం |
సమీపంలోని గ్రామాలు[మార్చు]
నందిపాడు 2.6 కి.మీ, చేకూరుపాడు 2.6 కి.మీ, కొప్పోలు 2.6 కి.మీ, ఏడుగుండ్లపాడు 3.3 కి.మీ, కరవది 3.6 కి.మీ.
సమీప పట్టణాలు[మార్చు]
ఒంగోలు 7.3 కి.మీ, మద్దిపాడు 7.5 కి.మీ, నాగులుప్పలపాడు 9.4 కి.మీ, సంతనూతలపాడు 17.1 కి.మీ.
గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
రక్షిత త్రాగునీటి సౌకర్యం[మార్చు]
ఈ గ్రామంలో 2014, అక్టోబరు-31న ఐ.టి.సి. మరియూ శ్రీజ సంస్థలు సంయుక్తంగా నిర్మించు సామాజిక రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన నిర్వహించారు. [2]
వృద్ధాశ్రమం[మార్చు]
ఈ గ్రామ సమీపంలో, కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో, 4.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని, 2015, నవంబరు-22న ఉదయం 8 గంటలకు ప్రారంభించెదరు. మొత్తం 150 మందికి వసతి గల ఈ ఆశ్రమానికి, దాత శ్రీ నల్లూరి వెంకటరావు, ఒక ఎకరం స్థలాన్ని వితరణ చేయగా, పలువురు దాతలు భూరివిరాళాలు సమకూర్చారు. [3]
గ్రామ పంచాయతీ[మార్చు]
మండవ పిచ్చయ్య, మాజీ సర్పంచ్.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)[మార్చు]
గ్రామంలోని ఈ ఆలయం (శివాలయం) మహిమాన్వితమయినది.
శ్రీ రామాలయం[మార్చు]
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]
ఒంగోలు మండలం, సుందరయ్యనగర్, త్రోవగుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి విగ్రహా ప్రతిష్ఠా మహోత్సవం, 2017, మార్చి-16వతేదీ గురువారం 10-01 కి, మంగళవాయిద్యాలు, వేదమమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానికులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు, అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం 11-00 నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [4]
గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]
త్రోవగుంట గ్రామం పొగాకు కంపెనీలకు ప్రసిద్ధి.
గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
- త్రోవగుంట హసాన్ సాహెబ్ 1915 (చినమౌలా గురువుగారు), నాదస్వర విద్వాంసులు
గ్రామంలొని విశేషాలు[మార్చు]
ఆంధ్రజ్యోతి ముద్రణా ప్రెస్, ఒంగోలు ఆటొనగర్, ఈ గ్రామంలో ఉన్నాయి.
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,203.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,570, మహిళల సంఖ్య 3,633, గ్రామంలో నివాస గృహాలు 1,768 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,402 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లంకెలు[మార్చు]
గ్రామ సంబంధిత వివరాలు [1] [2] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2014, నవంబరు-1; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2015, నవంబరు-13; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/ఒంగోలు; 2017, మార్చి-17; 1వపేజీ.