థగ్ లైఫ్
| థగ్ లైఫ్ | |
|---|---|
| దర్శకత్వం | మణిరత్నం |
| రచన | |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | రవి కె. చంద్రన్ |
| కూర్పు | ఎ. శ్రీకర్ ప్రసాద్ |
| సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 2025 జూన్ 5 (థియేటర్) 2025 జులై 3 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
సినిమా నిడివి | 166 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
| బడ్జెట్ | ₹300 కోట్లు[1] |
థగ్ లైఫ్ 2025లో విడుదలకానున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్ & శివ అనంత్ నిర్మించిన సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా కమల్ హాసన్, సిలంబరసన్, త్రిష కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
థగ్ లైఫ్ సినిమా టీజర్‌ను 2024 నవంబర్ 7న,[2] ట్రైలర్‌ను 2025 మే 17న విడుదల చేసి[3] సినిమాను 2025 జూన్ 5న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.[4]
కమల్ హాసన్, మణిరత్నం కలయికలో 1987లో నాయకన్ తర్వాత 37 ఏళ్ల తరువాత థగ్ లైఫ్ సినిమా వచ్చింది.[5]
ఈ సినిమా జులై 3 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[6]
కథ
[మార్చు]రంగరాయ శక్తివేల్ (కమల్‌హాసన్) ఢిల్లీలో పెద్ద గ్యాంగ్‌స్టర్. పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో పేపర్ బాయ్ అమర్ (శింబు) తండ్రి (ఎలాంగో కుమారవేల్) మరణిస్తాడు. అమర్‌ని అడ్డు పెట్టుకొనే ఆ కాల్పుల నుంచి బయటపడిన శక్తివేల్ (కమల్‌హాసన్) అమర్‌ని కన్నబిడ్డలా పెంచుతాడు. కాల్పుల్లో తప్పిపోయిన తన చెల్లిని వెతికి తీసుకొస్తానని మాట అమర్‌కి ఇస్తాడు. అమర్ పెద్దవాడైయ్యాక తన వారసుడు అమరేనంటూ రంగరాయ శక్తివేల్ ప్రకటించడంతో గ్యాంగ్‌లోని ఇతర సభ్యులు శక్తివేల్ అన్నయ్య మాణిక్యం (నాజర్) పత్రోస్ (జోజు జార్జ్) అన్బు రాజ్ (భగవతి పెరుమాళ్) మధ్య మనస్పర్థలు మొదలై, ఈ క్రమంలో అమర్ తండ్రి మరణానికి రంగరాయ శక్తివేలే కారకుడని వారు అమర్ కు చెప్పడంతో రంగరాయ శక్తివేల్‌పై కోపం పెంచుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? రంగరాయ శక్తివేల్ ను అమర్ ఏమి చేశాడు ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా కథ.[7]
నటీనటులు
[మార్చు]- కమల్ హాసన్
- సిలంబరసన్
- త్రిష కృష్ణన్[8]
- అభిరామి
- ఐశ్వర్య లక్ష్మి
- అశోక్ సెల్వన్
- జోజు జార్జ్
- నాజర్
- పంకజ్ త్రిపాఠి
- సంజనా కృష్ణమూర్తి
- మహేష్ మంజ్రేకర్
- తనికెళ్ళ భరణి
- వడివుక్కరసి
- చిన్ని జయంత్
- వైయాపురి
- ఎలాంగో కుమారవేల్
- భగవతి పెరుమాళ్
- బాబురాజ్
- అలీ ఫజల్
- రోహిత్ సరాఫ్
- అర్జున్ చిదంబరం
- చేతన్
- రాజశ్రీ దేశ్‌పాండే
- వెల్మురుగన్ రవి
- శ్రీకాంత్ మీనన్
- నిత్య శ్రీ
- రిషి కార్తీక్
- సన్యా మల్హోత్రా (అతిధి పాత్ర) "జింగుచా" పాటలో
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "జింగుచా[9]" | అనంత్ శ్రీరామ్ | మంగ్లీ, శ్రీ కృష్ణ, ఆషిమా మహాజన్, వైశాలి సామంత్ | 4:32 |
| 2. | "షుగర్ బేబీ[10]" | అనంత్ శ్రీరామ్ | అలెగ్జాండ్రా జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ | 3:31 |
| 3. | "ముద్దు వానా" | అనంత్ శ్రీరామ్ | చిన్మయి శ్రీపాద[11] | |
| 4. | "విశ్వదా నాయక" | అనంత్ శ్రీరామ్ | అలెగ్జాండ్రా జాయ్, ఎ.ఆర్. అమీన్ | |
| 5. | "అఛ్చా వాన" | అనంత్ శ్రీరామ్ | చారులత మణి | |
| 6. | "ఓ మారా" | రాకేందు మౌళి | ఆదిత్య ఆర్.కె | |
| 7. | "అందాల ముసురు" | అనంత్ శ్రీరామ్ | రక్షిత సురేష్ |
మూలాలు
[మార్చు]- ↑ Das, Tina (18 April 2025). "Thug Life is Kamal Haasan's peace offering to fans who waited for Mani Ratnam collab". The Print.
- ↑ "కమల్ హాసన్ 'థగ్ లైఫ్' టీజర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే." 10TV Telugu. 7 November 2024. Archived from the original on 26 May 2025. Retrieved 26 May 2025.
- ↑ "కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ విడుదల". NT News. 17 May 2025. Archived from the original on 26 May 2025. Retrieved 26 May 2025.
- ↑ "కమల్ హాసన్ బర్త్ డే గిఫ్ట్... 'థగ్ లైఫ్' రిలీజ్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మేకర్స్". ABP Desham. 7 November 2024. Archived from the original on 26 May 2025. Retrieved 26 May 2025.
- ↑ "మణిరత్నం- కమల్ కాంబినేషన్ లో 'థగ్ లైఫ్'". Mana Telangana. 12 January 2024. Archived from the original on 26 May 2025. Retrieved 26 May 2025.
- ↑ "ఓటీటీలోకి 'థగ్ లైఫ్'.. సైలెంట్‌గా వచ్చేసిన సినిమా". Eenadu. 3 July 2025. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
- ↑ "రివ్యూ: థగ్ లైఫ్.. కమల్‌హాసన్ - మణిరత్నం కాంబోలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే?". Eenadu. 5 June 2025. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
- ↑ "అందం అసూయ పడేలా ఉందే! త్రిష బర్త్ డే స్పెషల్.. విశ్వంభర, థగ్ లైప్ ఫస్ట్ లుక్స్ రిలీజ్". Chitrajyothy. 4 May 2025. Archived from the original on 26 May 2025. Retrieved 26 May 2025.
- ↑ "ఆకట్టుకుంటున్న కమల్ 'జింగుచా' సాంగ్." NTV Telugu. 4 May 2025. Archived from the original on 26 May 2025. Retrieved 26 May 2025.
- ↑ "'షుగర్ బేబీ' అందాలు చూశారా? - కమల్ హాసన్ 'థగ్ లైఫ్' నుంచి సాంగ్ రిలీజ్". ABP Desham. 22 May 2025. Archived from the original on 26 May 2025. Retrieved 26 May 2025.
- ↑ "Exclusive | Chinmayi interview on 'Thug Life' song: 'Despite praise, I feel numb'" (in Indian English). The Hindu. 31 May 2025. Archived from the original on 3 June 2025. Retrieved 3 June 2025.