థమ్స్‌ అప్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

థమ్స్‌ అప్‌ అనేది ఒక కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ (కోలా), భారతదేశంలో[1] బాగా ప్రాచుర్యం చెందిన, ఎక్కువ అమ్ముడవుతున్న డ్రింక్‌. అక్కడ దాని పెద్ద, ఎర్రని బొటనవేలి చిహ్నం చాలా పేరుపొందింది. ఇది అనేక ఇతర కోలాల రుచుల మాదిరిగానే ఉన్నా, వక్కపొడిని గుర్తుకుతెచ్చే ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. 1977లో భారతదేశంలో కోకాకోలా కంపెనీతో పాటు ఇతర విదేశీ కంపెనీల విస్తరణ జరిగినప్పుడు, థమ్స్‌ అప్‌, లిమ్కా మరియు కాంపా కోలాలకు దేశవ్యాప్తంగా ఆమోదం లభించింది. ఈ బ్రాండ్‌ను కోకాకోలా నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాక, కొనుగోలు చేసింది. తర్వాత కాలంలో పెప్సీకి పోటీగా బ్రాండ్‌ను తిరిగి లాంచ్‌ చేసింది.

నేపథ్యం[మార్చు]

1970ల చివరి దశలో, అమెరికన్‌ కోలా దిగ్గజం కోకా-కోలా భారతదేశంలో తమ కార్యకలాపాలను రద్దు చేసింది. అప్పటికే భారతీయ కంపెనీలో ఉన్న తమ వాటా 60 శాతాన్ని బలవంతంగా అమ్మేందుకు ప్రయత్నించింది.[2] దీని తర్వాత, పార్లే బ్రదర్స్‌ రమేశ్‌ చౌహన్‌ మరియు ప్రకాశ్‌చౌహాన్‌ వారి అప్పటి సిఈఓ భాను వకీల్‌ కలిసి థమ్స్‌ అప్‌ను తమ సొంత డ్రింక్‌గా విడుదల చేశారు. వారి పాత డ్రింక్‌లు లిమ్కా (నిమ్మ రుచి) మరియు గోల్డ్‌స్పాట్‌ (ఆరెంజ్‌ రుచి) కి దీనిని కూడా కలిపారు. ప్రాథమికంగా థమ్స్‌ అప్‌ ఒక కోలా డ్రింక్‌. కానీ కంపెనీ ఎప్పుడూ దీనిని అలా క్లెయిమ్‌ చేసుకోలేదు. దీని తయారీ సిద్ధాంతం, ప్రఖ్యాక కోక్‌ తయారీ సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇదే సమయంలో, కోకా కోలా యొక్క బాట్లింగ్‌ ప్లాంట్‌ ప్యూర్‌ డ్రింక్స్‌ లిమిటెడ్‌ వారు, కాంపా కోలా మరియు కాంపా ఆరెంజ్‌ డ్రింక్‌లను విడుదల చేశారు. ఈ రెండింటిలోనూ కార్బన్‌ డయాక్సైడ్‌ అధిక మోతాదులో ఉంది.

దస్త్రం:Manmad.jpg
మన్మాడ్‌ కొండ

థమ్స్‌ అప్‌ లోగో ఎర్రటి 'థమ్స్‌ అప్‌' చేతి సంజ్ఞతో పాటు తెల్లటి శాన్స్‌ సెరిఫ్‌ తరహా రూపాన్ని కలిగి ఉండేది. తర్వాతి కాలంలో కోకాకోలా దీనిని ఆధునీకరించి, దాని చూట్టూ నీలి రంగు గీతలను ఇవ్వడం ద్వారా ఆధునిక తరహాలో కనిపించేలా రూపొందించింది. ప్రధానంగా లోగోలో ఎర్ర రంగులో ఉన్న సంకేతాల ఆధిపత్యాన్ని తగ్గించడానికి చేశారు. చిత్రం థమ్స్‌ అప్‌ మౌంటైన్‌ను లేదా థమ్స్‌అప్‌ పహాడ్‌ (హిందీలో) (తెలుగులో కొండ) ను చూపిస్తుంది. మన్మాడ్‌ కొండలు సహజమైన పై భాగాన్ని థమ్స్‌అప్‌ లోగో తరహాలో కలిగి ఉంటాయి. రైలులో వెళుతున్నప్పుడు కనిపించే అనేక ప్రఖ్యాత దృశ్యాలలో ఇదీ ఒకటి. 1980ల ఆరంభం వరకూ దీని ప్రఖ్యాత నినాదం సంతోషకరమైన రోజులు ఇక్కడ మళ్లీ వచ్చాయి అని ఉండేది. దీనిని ప్రముఖ కాపీ రైటర్‌ వసంత్‌ కుమార్‌ రాశారు. ఈయన తండ్రి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త యు.జి.కృష్ణమూర్తి. తర్వాత ఈ నినాదం నా మెరుపు నాకు కావాలిగా మారింది. ప్రస్తుతం మెరుపు రుచి చూడండ!ి (టేస్ట్‌ ద థండర్‌)గా ఉంది.

థమ్స్‌ అప్‌కు భారత మార్కెట్‌లో ఒక రకంగా ఎదురులేదు. తన ప్రత్యర్థి డ్రింక్‌లు కాంపా కోలా, డబుల్‌ సెవెన్‌ మరియు డ్యూక్స్‌తో పోలిస్తే చాలా బలమైన మార్కెట్‌ ఉండేది. కానీ మార్కెట్‌లో అనేక ప్రాంతీయ డ్రింక్‌లు తమ సొంత మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. ఇది లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ బ్రేవరీస్‌ గ్రూప్‌ (కింగ్‌ఫిషర్‌ బీర్‌ తయారీదారులు) యొక్క మెక్‌డోవెల్స్‌ క్రష్‌, ఇది మరో కోలా డ్రింక్‌, మరియు డబుల్‌ కోలాలకు ధీటుగా నిలబడింది.

1980ల్లో ప్రధాన ప్రకటన దారుల్లో థమ్స్‌ అప్‌ కూడా ఒకటి. 80ల మధ్య కాలంలో, డబుల్‌ కోలా అనే కొత్త డ్రింక్‌ నుంచి కొంత ప్రమాదాన్ని ఎదుర్కొంది. అయితే ఈ డ్రింక్‌ చాలా కొద్ది కాలంలోనే కనుమరుగైంది.

1990లో, భారత ప్రభుత్వం అంతర్జాతీయ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు, తొలుత పెప్సీ వచ్చింది. థమ్స్‌ అప్‌ అంతర్జాతీయ దిగ్గజానికి ఎలాంటి అవకాశం ఇ్వకుండా అన్ని వైపుల నుంచి తన మార్కెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేసింది. పెప్సీ పెద్ద పెద్ద భారత సినిమా తారలు జూహిచావ్లా తదితరులను తమ భారత బ్రాండ్‌లను ప్రమోట్‌ చేసేందుకు ఉపయోగించింది. దీంతో థమ్స్‌ అప్‌ క్రికెట్‌ మీద స్పాన్సర్‌షిప్‌లను పెంచింది. తర్వాత సీసా సామర్ధ్యం 250 మి.లీ. నుంచి 300 మి.లీ.కి పెంచి, దానికి మహాకోలా అని పేరు పెట్టింది. దేశంలోని చిన్న పట్టణాల్లో దీనికి బాగా ప్రాచుర్యం లభించింది. ప్రజలు థమ్స్‌అప్‌ బదులు మహాకోలా ఇవ్వమని అడగటం ప్రారంభించారు. వినియోగదారులు రెండుగా విడిపోయారు. కొందరు పెప్సీ యొక్క రుచి ఘాటుగా లేకుండా బాగుందనే అభిప్రాయానికి వచ్చారు.

1993లోభారతదేశంలో కోకాకోలా పున:ప్రవేశం చేసింది. 1977 నుంచి 1993 వరకు ఈ కంపెనీ భారత మార్కెట్‌లో కనిపించలేదు. కోకాకోలా రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత పోటీకి దారి తీసింది. ఇప్పుడు పోటీ మూడు కంపెనీల మధ్య ఏర్పడింది. అదే ఏడాది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం జరిగింది. పార్లే తమ కంపెనీని కోక్‌కు 60 మిలియన్‌ యూఎస్‌ డాలర్లకు (అప్పుడు మార్కెట్‌లో తనకున్న వాటాను పరిగణలోకి తీసుకుని) అమ్మేసింది. పార్లె రెండు పెద్ద కోలా బ్రాండ్‌లతో పోటీని తట్టుకోలేక ఇలా చేసిందని కొందరు భావించారు; మరికొందరు మాత్రం అంతర్జాతీయ బ్రాండ్‌లు తమ దగ్గర ఉన్న అంతులేని నగదు నిల్వలను పార్లె మీద వెదజల్లాయని భావించారు. ఎలాగైనా , ఇది ఇప్పుడు కోకా కోలా యొక్క మరియు కోక్‌యొక్క బ్రాండ్‌లను చంపే వ్యవహారంగా పరిగణించారు. తమ పేరుతో దానిని చీకట్లోకి నెట్టేశారు. కోకాకోలా తర్వాత తన కోలా క్యాన్‌లను భారతదేశంలో ప్రవేశపెట్టింది. థమ్స్‌ అప్‌ను మరోవైపు ప్రవేశపెట్టింది. అయితే చాలా తక్కువ సంఖ్యలోనే తెచ్చింది. తర్వాత కోకో కోలా క్రమంగా థమ్స్‌ అప్‌ బ్రాండ్‌ను పక్కకు నెట్టే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో దానికి మార్కెట్‌లో 30 శాతం వాటా ఉంది.

పున: ప్రవేశం[మార్చు]

మార్కెట్‌లో బలమైన వాటా ఉన్నప్పటికి, థమ్స్‌ అప్‌ బ్రాండ్‌ క్రమంగా తన ప్రాచుర్యాన్ని కోల్పోవడం మొదలైంది. ముఖ్యంగా కోలాను ఎక్కువగా తాగే 12 నుంచి 25 ఏళ్ల వయసు వారికి ఇది దూరమైంది, దీనికి ప్రచారం లేకపోవడం కూడా ఒక కారణం.

కోకా కోలా ఒక రకంగా థమ్స్‌ అప్‌ బ్రాండ్‌ను చంపేసే ప్రయత్నం చేసింది. కానీ థమ్స్‌ అప్‌ను తొలగించడం వల్ల కోక్‌ కంటే పెప్సీ ఎక్కువ లాభపడుతుందని కంపెనీ గ్రహించింది. పెప్సి మీద దాడికి థమ్స్‌ అప్‌ను వాడటం మంచిదని కోకా కోలా భావించింది. ఆ సమయంలో భారత సాఫ్ట్‌ డ్రింక్‌ మార్కెట్‌లో కోకా కోలాకు 60.5 శాతం వాటా ఉంది. కానీ థమ్స్‌ అప్‌ బ్రాండ్‌ను తొలగించడం వల్ల మార్కెట్‌లో దీని వాటా బాగా తగ్గిపోయి కేవలం 28.72 శాతానికి చేరింది. (ఎన్‌జిఓ ఫైనాన్స్‌ అండ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియా ఇచ్చిన నివేదిక ప్రకారం). దీంతో మరోసారి కంపెనీ థమ్స్‌ అప్‌ బ్రాండ్‌ దుమ్ము దులిపి తిరిగి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈసారి 30 నుంచి 45 ఏళ్ల వయసు వారిని కంపెనీ లక్ష్యంగా చేసుకుంది.

ఈ బ్రాండ్‌ను తిరిగి ఒక మ్యాన్లీ డ్రింక్‌గా ప్రవేశపెట్టారు. బలమైన రుచి లక్షణాలతో తీసుకొచ్చారు.[3] ఇతర కోలాలతో పోలిస్తే దీనిలో అధికమైన ఘాటు ఉండేలా రూపొందించారు. రమ్‌ ఆధారిత కాక్‌టైల్‌ మిశ్రమాలలో ఇది ఫేవరెట్‌గా మారింది. రమ్‌ అండ్‌ థమ్స్‌ అప్‌ అనే కాంబినేషన్‌తో ఉపయోగం పెరిగింది. థమ్స్‌ అప్‌ ప్రచారం నేరుగా పెప్సీ యొక్క టీవీ ప్రకటనలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించింది. దీనిలో ఉన్న ఘాటుపై ఎక్కువగా దృష్టి పెట్టి దీనిని పెద్దలడ్రింక్‌గా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. గ్రోఅప్‌ టు థమ్స్‌ అప్‌ (థమ్స్‌ అప్‌కు ఎదగండి) అని యువ వినియోగదారులను ఆకర్షించింది. ఈ ప్రచారం విజయవంతమైంది. బ్రాండ్‌ యొక్క మార్కెట్‌ వాటా, ఈక్విటీ ఒక్కసారిగా పెరిగాయి. ఈ బ్రాండ్‌ను ఎవరూ కదిలించలేరని అర్థమై, థమ్స్‌ అప్‌ భారత్‌లో ప్రధాన కోలా బ్రాండ్‌గా కోకా కోలా ప్రకటించింది. మార్కెట్‌ వాటా దృష్ట్యా ఈ ప్రకటన ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.[4]

థమ్స్‌ అప్‌ తన ఘాటు ఆధారంగా అనేక రకాల ఇతర ప్రచారాలను చేసి, దీనిని ఒక పురుషుల డ్రింక్‌గా నిలబెట్టడంలో సఫలమైంది.[5] ప్రకటనల్లో థమ్స్‌ అప్‌ మగాడు, ఎడారుల్లో రైడింగ్‌ చేయడం, ఇతర కోలాలతో పోలిస్తే మగవారు దీనినే ఇష్టపడతారని చెప్పడం చేసింది. దీనివల్ల భారత దేశంలో పురుషులమని చెప్పుకునేందుకు యువకులంతా ఈ డ్రింక్‌ను తాగాలనే అభిప్రాయానికి కూడా వచ్చారనడం అతిశయోక్తి కాదు.

స్పాన్సర్‌షిప్[మార్చు]

క్రికెట్‌ మ్యాచ్‌లకు థమ్స్‌ అప్‌ ప్రధాన స్పాన్సర్‌. 1980ల ఆరంభంలో ఈ బ్రాండ్‌సునిల్‌ గవాస్కర్‌, ఇమ్రాన్‌ఖాన్‌లకు సంబంధించిన అనేక పోస్ట్‌కార్డ్‌లతో వచ్చింది. క్రికెటర్లతో పాటు థమ్స్‌ అప్‌ అనేక మంది సెలబ్రిటీలతో ఒప్పందం కుదర్చుకుంది. అక్షయ్‌ కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌లతో పాటు దక్షిణభారతదేశం లో ప్రముఖ హీరోలు చిరంజీవి, మహేశ్‌ బాబులతోనూ ఒప్పందాలు ఏర్పరుచుకుంది. దీనితో పాటు, పార్లే యొక్క దక్షిణాది బాట్లర్‌ భారత మోటార్‌ స్పోర్ట్స్‌కు 80ల్లో పెద్ద స్పాన్సర్‌. అనేకమంది భారత ట్రాక్‌ డ్రైవర్లను స్పాన్సర్‌ చేయడంతో పాటు, చోలవరమ్‌ రేసులను, అనేక ప్రాంతీయ కారు మరియు బైక్‌ ర్యాలీలను కంపెనీ స్పాన్సర్‌ చేసింది.

సూచికలు[మార్చు]

  1. 8 Jan, 2010, 01.27AM IST, Ratna Bhushan,ET Bureau (2010-01-08). "Coke India's new Thums Up ad most expensive ever - The Economic Times". Economictimes.indiatimes.com. Retrieved 2010-09-18.CS1 maint: Multiple names: authors list (link)
  2. అంతర్జాతీయ మార్కెటింగ్‌ మరియు ఎగుమతి మేనేజ్‌మెంట్‌ అల్బామ్‌.జి మరియు డ్యూర్‌.ఇ. ఆరో ఎడిషన్‌ 2008, పియర్‌సన్‌ పి. 265.
  3. "Business Today - India's leading business magazine". Businesstoday.intoday.in. 2009-05-18. Retrieved 2010-09-18.
  4. Bob Page. "How Thums Up became the ruling cola of India". The Mercury Brief. Retrieved 2010-09-18.
  5. "Thums Up- Case Studies - Ormax". Ormaxworld.com. Retrieved 2010-09-18.

బాహ్య లింకులు[మార్చు]

మూస:Colas

మూస:Coca-Cola brands