థర్మోస్టాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్మిత్‌సోనియన్‌లో హనీవెల్ యొక్క గుండ్రని నమూనాతో ఉన్న T87 థర్మోస్టాట్,
భవనాల్లో ఉపయోగించే ద్విలోహ థర్మోస్టాట్

థర్మోస్టాట్ (తాపస్థాపని) అనేది ఒక వ్యవస్థ ఉష్ణోగ్రతను నియంత్రించే ఉపకరణం, ఒక వాంఛిత నిర్దిష్ట స్థాయి (సెట్‌పాయింట్) ఉష్ణోగ్రతకు దగ్గరిలో వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. థర్మోస్ "వేడి" మరియు స్టాటోస్ "స్థిరముగా ఉండే" అనే రెండు గ్రీకు పదాల నుంచి ఈ పేరు ఉత్పన్నమైంది. తాపన మార్పిడి చేయడం లేదా పనిచేస్తున్న లేదా పని చాలించిన ఉపకరణాలను చల్లబరచడం లేదా అవసరమైన విధంగా ఉష్ణ బదిలీ ద్రవం యొక్క ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా థర్మోస్టాట్ సరైన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది.

థర్మోస్టాట్ అనేది తాపన లేదా శీతలీకరణ వ్యవస్థ యొక్క ఒక నియంత్రణ భాగంగా లేదా హీటర్ లేదా ఎయిర్ కండీషనర్ యొక్క ఒక నిర్మాణ భాగంగా ఉండవచ్చు. థర్మోస్టాట్‌లను అనేక మార్గాల్లో నిర్మిస్తారు, వీటిలో ఉష్ణోగ్రతను కొలిచేందుకు వివిధ రకాల సెన్సార్లను ఉపయోగిస్తారు. సెన్సార్ యొక్క అవుట్‌పుట్ (నిర్గమం), తరువాత తాపన లేదా శీతలీకరణ ఉపకరణాన్ని నియంత్రిస్తుంది.

మొట్టమొదటి ఎలక్ట్రిక్ రూమ్ థర్మోస్టాట్‌ను 1883లో వారెన్ ఎస్. జాన్సన్ కనిపెట్టారు.[1][2]

సాధారణ సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాలు:

ఒక రిటైల్ స్టోర్‌లో ఉన్న హనీవెల్ ఎలక్ట్రానిక్ థర్మోస్టాట్

గతంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాల్లో గ్లాస్ ద్వారా నేరుగా చొప్పించిన ఎలక్ట్రోడ్‌లతో రూపొందించిన పాదరస థర్మామీటర్లు ఉన్నాయి, దీనిలో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను తాకినప్పుడు పాదరసం చేత బంధనాలు విడిపోతాయి. ఒక స్థాయి వరకు ఇవి సరిగా పని చేస్తాయి.

ఇవి తరువాత తాపన మరియు శీతలీకరణ ఉపకరణాన్ని ఈ కింది వాటిని ఉపయోగించి నియంత్రిస్తాయి:

 • ప్రత్యక్ష యాంత్రిక నియంత్రణ (డైరెక్ట్ మెకానికల్ కంట్రోల్)
 • విద్యుత్ సంకేతాలు (ఎలక్ట్రికల్ సిగ్నల్స్)
 • వాయు ప్రమేయ సంకేతాలు (న్యూమాటిక్ సిగ్నల్స్)

యాంత్రిక[మార్చు]

ద్విలోహ[మార్చు]

ఒక ఆవిరి లేదా వేడి-నీరు రేడియేటర్ వ్యవస్థపై థర్మోస్టాట్ అనేది పూర్తిగా ఒక ద్విలోహం ఉన్న యాంత్రిక ఉపకరణంగా ఉండవచ్చు. సాధారణంగా, ఇది ఒక స్వయంచాలక కవాటం (వాల్వ్), ఇది ఉష్ణోగ్రత ఆధారంగా ప్రవాహాన్ని నియంత్రిస్తుంది . ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక భూ-గర్భ రేడియేటర్ వ్యవస్థలు ఎలక్ట్రిక్ వాల్వ్‌లు ఉపయోగిస్తుండటంతో, ఉత్తర అమెరికాలో ఇప్పుడు వీటి ఉపయోగం చాలా అరుదుగా కనిపిస్తుంది, కొన్ని పాత వ్యవస్థాపిత వ్యవస్థలు మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నాయి. అయితే, ఐరోపావ్యాప్తంగా కేంద్ర తాపన రేడియేటర్లలో ఇప్పటికీ వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

మేడలపై టర్బైన్ వెంట్‌లలో డంపర్‌‌లను నియంత్రించేందుకు యాంత్రిక థర్మోస్టాట్‌లు ఉపయోగిస్తున్నారు, ఇవి శీతాకాలంలో భవనం వేడి తగ్గకుండా నియంత్రిస్తాయి.

ఆటోమొబైల్ ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ (వాహనంలో ప్రయాణికులు ఉండే భాగం) యొక్క తాపన వ్యవస్థలో ఒక థర్మోస్టాట్‌తో నియంత్రించబడే వాల్వ్ ఉంటుంది, ఇది ఒక సర్దుబాటు స్థాయికి నీటి ప్రవాహాన్ని మరియు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. పాత వాహనాల్లో గాలి ప్రవాహాన్ని నిర్దేశించేందుకు నీటి వాల్వ్‌లు మరియు ప్లాపర్‌లను నియంత్రించే యాక్చుయేటర్‌కు ఇంజిన్ వాక్యూమ్ యొక్క అనువర్తనాన్ని థర్మోస్టాట్ నియంత్రిస్తుంది. ఆధునిక వాహనాల్లో, వాక్యుమ్ యాక్చుయేటర్‌లు ఒక కేంద్ర కంప్యూటర్ యొక్క నియంత్రణలో ఉన్న చిన్న సోలెనాయిడ్‌ల చేత నిర్వహించబడుతున్నాయి.

వాక్స్ పెలెట్[మార్చు]

కారు ఇంజిన్ థర్మోస్టాట్

ఇంటర్నల్ కంబష్చన్ ఇంజిన్లలో థర్మోస్టాట్‌ను ఇంజిన్‌ను దాని యొక్క వాంఛనీయ నిర్వహణ ఉష్ణోగ్రత వద్ద నిర్వహించేందుకు ఉపయోగిస్తారు, సాధారణంగా వాయు నియంత్రిత రేడియేటర్ వంటి ఒక బాహ్య తాపన తొట్టికి (హీట్ సింక్) శీతలకరణి (కూలాంట్) ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.

ఈ రకమైన థర్మోస్టాట్ యాంత్రికంగా నిర్వహించబడుతుంది. ఇది మూసివున్న ఛాంబర్‌ (గది) లోపల ఒక మైనపు (వాక్స్) దిండు (పెలెట్) ను ఉపయోగించుకుంటుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద మైనం ఘన రూపంలో ఉంటుంది, అయితే ఇంజిన్ వేడెక్కేకొద్ది మైనం కరిగి వ్యాకోచిస్తుంది. మూసివున్న గదికి వ్యాకోచించే గుణం ఉంటుంది, నిర్వహణ ఉష్ణోగ్రత స్థాయి దాటినప్పుడు ఇది ఒక కడ్డీని కదపడం ద్వారా వాల్వ్‌ను తెరుస్తుంది. నిర్వహణ ఉష్ణోగ్రత స్థిరపరచబడి ఉంటుంది, ఇది ఒక ప్రత్యేక మైనపు మిశ్రమం చేత గుర్తించబడుతుంది, అందువలన ఈ రకమైన థర్మోస్టాట్‌లు వివిధ ఉష్ణోగ్రతలను నిర్వహించేందుకు అందుబాటులో ఉన్నాయి, ముఖ్యంగా 70 నుంచి 90°C (160 నుంచి 200°F) ఉష్ణోగ్రతలను ఇవి నిర్వహించగలవు. ఆధునిక ఇంజిన్లు బాగా వేడెక్కుతాయి, ఈ ఇంజిన్లు మరింత సమర్థవంతంగా నడిచేందుకు మరియు వాయు కాలుష్య కారకాల ఉద్గారాన్ని తగ్గించేందుకు ఇవి 80 °C (180 °F) పైగా ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. అనేక థర్మోస్టాట్‌లకు వ్యవస్థలోకి అడుగుపెట్టే ఏదైనా వాయువు, ఉదాహరణ కు, శీతలకరణి పునఃస్థాపన సందర్భంగా ప్రవేశించే వాయువు, బయటకు వెళ్లేందుకు ఒక చిన్న ఉపమార్గ (బైపాస్) రంధ్రం ఉంటుంది, థర్మోస్టాట్ మూసివున్నప్పుడు దానిలో కొద్ది స్థాయిలో శీతలకరణి ప్రవాహన్ని కూడా ఇది అనుమతిస్తుంది. ఈ ఉపమార్గ ప్రవాహం ఇంజిన్ వేడెక్కే కొద్ది శీతలకరణి ఉష్ణోగ్రత మార్పును గ్రహించేందుకు థర్మోస్టాట్‌కు వీలు కల్పిస్తుంది; ఇది లేకపోతే కంబష్చన్ ఛాంబర్‌లు మరియు సిలిండర్ బోర్‌లకు పక్కన ఉన్న శీతలకరణిలో ఉష్ణోగ్రత మార్పులను థర్మోస్టాట్ గ్రహించకుండా దాని చుట్టూ ఏర్పడిన ఒక నిశ్చల శీతలకరణి ప్రాంతం అడ్డుకుంటుంది.

థర్మోస్టాట్ మూసివేయబడి ఉన్నప్పుడు, లూప్‌లో శీతలకరణి ప్రవాహం బాగా నెమ్మదిస్తుంది, దీని వలన కంబష్చన్ ఛాంపర్లు చుట్టూ ఉన్న శీతలకరణి వేగంగా వేడెక్కేందుకు వీలు ఏర్పడుతుంది. థర్మోస్టాట్ తెరుచుకునేందుకు అవసరమయ్యే నామమాత్ర ఉష్ణోగ్రత స్థాయికి శీతలకరణి ఉష్ణోగ్రత చేరుకునే వరకు, అది మూసివేయబడి ఉంటుంది. శీతలకరణి ఉష్ణోగ్రత వాంఛనీయ నిర్వహణ ఉష్ణోగ్రత వరకు పెరిగేకొద్ది థర్మోస్టాట్ వేగంగా తెరుచుకుంటుంది, తద్వారా రేడియేటర్‌లోకి శీతలకరణి ప్రవాహం కూడా పెరుగుతుంది. వాంఛనీయ నిర్వహణ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడు, ఉష్ణోగ్రత మార్పులకు స్పందనగా తన ప్రవేశ ద్వారాన్ని థర్మోస్టాట్ పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది, ప్రభావవంతంగా శీతలకరణి ప్రవాహం మరియు ఇంజిన్ ఉష్ణ నిర్గమం, వాహన వేగం, బాహ్య ఆవరణ ఉష్ణోగ్రత మార్పులకు స్పందనగా ఇంజిన్ ఉష్ణోగ్రతను వాంఛనీయ స్థాయిలో నిర్వహించేందుకు రేడియేటర్‌కు శీతలకరణి ప్రవాహంలో సమతౌల్యత తీసుకొస్తుంది. ఇంజిన్‌పై భారం పెరగడం, శీతలీకరణ వ్యవస్థపై ఉష్ణ ప్రభావం పెరగడం, లేదా వాహన వేగం తగ్గడం లేదా వాయు ఉష్ణోగ్రత పెరగడం, రేడియేటర్ ఉష్ణ నిర్గమం తగ్గడం వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రేడియేటర్‌కు శీతలకరణి ప్రవాహాన్ని మరింత పెంచేందుకు థర్మోస్టాట్ ఇంకా ఎక్కువగా తెరుచుకోవడం ద్వారా ఇంజిన్ తీవ్రతాపనాన్ని నిరోధిస్తుంది. ఈ పరిస్థితులు సద్దుమణిగిన తరువాత, శీతలకరణి ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు థర్మోస్టాట్ తన ప్రవేశమార్గ పరిమాణాన్ని తగ్గిస్తుంది.

సాధారణ నిర్వహణ పరిస్థితుల్లో, థర్మోస్టాట్ యొక్క ప్రవేశ ద్వారం సగం వరకు తెరుచుకుంటుంది, అందువలన ఇది మరింత తెరుచుకునేందుకు లేదా నిర్వహణ పరిస్థితుల్లో మార్పులకు స్పందనగా ప్రవేశమార్గ పరిమాణాన్ని తగ్గించేందుకు వీలుంటుంది. ఇంజిన్ సాధారణంగా పనిచేస్తున్నప్పుడు లేదా తీవ్రతాపన లేదా తీవ్రశీతలీకరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు, సరిగా రూపొందించబడిన థర్మోస్టాట్ ఎప్పుడూ పూర్తిగా తెరుచుకోవడం లేదా పూర్తిగా మూసుకుపోవడం జరగదు.

 • ఉదాహరణ కు, మరింత శీతలీకరణ అవసరమైతే, శీతలకరణి ఉష్ణోగ్రతను పెంచే ఇంజిన్ ఉష్ణ నిర్గమం పెరగడానికి స్పందనగా, రేడియేటర్‌లోకి శీతలకరణి ప్రవాహాన్ని పెంచేందుకు థర్మోస్టాట్ తన ప్రవేశమార్గ పరిమాణాన్ని పెంచుతుంది, తద్వారా ఇంజిన్‌ను చల్లబరుస్తుంది. థర్మోస్టాట్ అప్పటికే పూర్తిగా తెరుచుకొని ఉన్నట్లయితే, అప్పుడు రేడియేటర్‌కు శీతలకరణి ప్రవాహాన్ని పెంచడం సాధ్యపడదు, అందువలన మరింత శీతలీకరణ సామర్థ్యం అందుబాటులో ఉండదు, ఇటువంటి పరిస్థితుల్లో ఇంజిన్ నుంచి ఉష్ణ నిర్గమం పెరిగినట్లయితే, ఫలితంగా తీవ్రతాపనం (తీవ్రంగా వేడెక్కడం) జరుగుతుంది.
 • ఉదాహరణకు తక్కువ శీతలీకరణ అవసరమైతే, శీతలకరణి ఉష్ణోగ్రతను తగ్గించే ఆవరణ ఉష్ణోగ్రత క్షీణించినట్లయితే దానికి స్పందనగా, రేడియేటర్‌లోకి శీతలకరణి ప్రవాహాన్ని తగ్గించేందుకు థర్మోస్టాట్ తన ప్రవేశమార్గాన్ని తక్కువగా తెరిచివుంచుతుంది, తద్వారా ఇంజిన్ శీతలీకరణను తగ్గిస్తుంది. థర్మోస్టాట్ అప్పటికే పూర్తిగా మూసుకుపోయి ఉంటే, శీతలకరణి ఉష్ణోగ్రతలో క్షీణతకు స్పందనగా శీతలీకరణను అది తగ్గించలేదు, అటువంటి పరిస్థితిలో ఇంజిన్ ఉష్ణోగ్రత వాంఛనీయ నిర్వహణ స్థాయి కంటే కిందికి పడిపోతుంది.

ఆధునిక శీతలీకరణ వ్యవస్థలు పాక్షికంగా నిండివున్న విస్తరణ రిజర్వాయర్‌కు దారితీసే ఒక ట్యూబ్‌తో (గొట్టం) స్ప్రింగ్-ఉన్న రేడియేటర్ ప్రెజర్ క్యాప్ రూపంలో ఒక రిలీఫ్ వాల్వ్‌ను కలిగివుంటాయి. అధిక ఉష్ణోగ్రతకు స్పందనగా, శీతలీకరణ వ్యవస్థ రిలీఫ్ వాల్వ్ చేత గరిష్ఠ స్థాయి పీడనానికి చేరుకుంటుంది. అదనపు పీడనం శీతలకరణి యొక్క బాష్పీకరణ బిందువును వాతావరణ పీడనం వద్ద కంటే ఎక్కువ స్థాయికి పెంచుతుంది.

థర్మోస్టాట్‌లో ఉపయోగించే మైనపు ఉత్పత్తిని తయారు చేసేందుకు ఒక ప్రత్యేక ప్రక్రియ అవసరమవుతుంది. విస్తృతమైన కార్బన్ గొలుసు కలిగివున్న ప్రామాణిక పారాఫిన్ వాక్స్ మాదిరిగా కాకుండా, తక్కువ స్థాయి కార్బన్ పరమాణు గొలుసులు ఉన్న మైనాన్ని థర్మోస్టాట్‌లో ఉపయోగిస్తారు. సాధారణంగా నిర్దిష్ట తుది వినియోగానికి అవసరమైన తాపన లక్షణాలు ద్వారా గొలుసుల పరిధిని గుర్తిస్తారు. ఈ పద్ధతిలో ఒక ఉత్పత్తిని తయారు చేసేందుకు బాగా కచ్చితమైన స్థాయిల్లో స్వేదనం అవసరమవుతుంది, అనేక మైనపు శుద్ధి కర్మాగారాలకు దీనిని తయారు చేయడం కష్టమైన లేదా అసాధ్యమైన పని.

వాయువు వ్యాకోచం[మార్చు]

కొన్నిసార్లు థర్మోస్టాట్‌‍లను గ్యాస్ ఒవెన్‌లు (గ్యాస్ పొయ్యిలు) నియంత్రించేందుకు ఉపయోగిస్తారు. దీనిలో సిలిండర్ కాపర్ ట్యూబ్ చేత కేంద్ర భాగానికి కలుపబడి ఉండే వాయు-పూర్ణమైన బల్బ్ ఉంటుంది. బల్బ్ సాధారణంగా ఒవెన్ పైభాగంలో ఉంటుంది. ఒక డయాఫ్రమ్ (విభాజకం) చేత మూసివున్న ఒక ఛాంబర్‌కు ట్యూబ్ కలపబడి ఉంటుంది. థర్మోస్టాట్ వేడెక్కే కొద్ది వాయువు వ్యాకోచించి డయాఫ్రమ్‌పై పీడనాన్ని పెంచుతుంది, ఈ డయాఫ్రమ్ ఆపై బర్నర్‌కు వాయువు సరఫరాను తగ్గిస్తుంది.

వాయు ఒత్తిడి[మార్చు]

వాయుఒత్తిడితో పని చేసే థర్మోస్టాట్ (న్యూమాటిక్ థర్మోస్టాట్) అనేది వాయువుతో నిండిన నియంత్రణ ట్యూబ్‌ల ద్వారా తాపన మరియు/లేదా శీతలీకరణ వ్యవస్థను నియంత్రిస్తుంది. అవసరమైనప్పుడు తాపన లేదా శీతలీకరణను క్రియాశీల పరిచేందుకు నియంత్రణ ట్యూబ్‌లో పీడన మార్పులకు ఈ వాయు నిర్వహణ వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది.[3][4]

ఎలక్ట్రికల్[మార్చు]

ద్విలోహ తాపస్తాపక భాగాలు (బైమెటాలిక్ థర్మోస్టాటిక్ కాంపోనెంట్స్)[మార్చు]

ఇవి ఆవరణ ఉష్ణోగ్రతకు తెరువబడి ఉండే హీటర్ లేదా ఎయిర్-కండిషనర్ యొక్క ప్లేట్ లేదా లోహ భాగానికి జోడించబడి ఉండే చిన్న వృత్తాకార స్వీయ-నియంత్రిత భాగాలు. అంతర్గత సెన్సార్ సాధారణంగా తన యొక్క మధ్యభాగంగా ఒక ఎలక్ట్రికల్ కాంటాక్ట్‌తో ద్విలోహ డిస్క్ (పళ్లెం) కలిగివుంటుంది. మార్పిడి ఉష్ణోగ్రత వద్ద, డిస్క్ పుటాకారం నుంచి కుంభాకారంలోకి మారుతుంది, దీని వలన అవసరమైన మార్పు ఆధారంగా కాంటాక్ట్ తెరుచుకోవడం లేదా మూసుకోవడం జరుగుతుంది (సాధారణంగా తెరుచుకోవడం లేదా సాధారణంగా మూసివేయబడటం). తీవ్రతాపన నిరోధక స్విచ్‌లో కూడా ఈ ఉపకరణాన్ని ఉపయోగించవచ్చు.

సాధారణ రెండు తీగల థర్మోస్టాట్‌లు[మార్చు]

మిల్లీవోల్ట్ థర్మోస్టాట్ యాంత్రిక విధానం

ఈ చిత్రణ ఉష్ణ-నియంత్రణకు మాత్రమే పనికొచ్చే ఒక సాధారణ రెండు తీగన గృహావసర థర్మోస్టాట్ అంతర్భాగాన్ని చూపిస్తుంది, ఒక ఎలక్ట్రిక్ గ్యాస్ వాల్వ్ (విద్యుత్ వాయు కవాటం) ద్వారా వాయువు-తో మండే హీటర్‌ను నియంత్రించేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఇటువంటి వ్యవస్థలనే ఆయిల్ ఫర్నెస్‌లు, బాయిలర్లు, బాయిలర్ జోన్ వాల్వ్‌లు, ఎలక్ట్రిక్ ఆటిక్ ఫాన్‌లు, ఎలక్ట్రిక్ ఫర్నెస్‌లు, ఎలక్ట్రిక్ బేస్‌బోర్డ్ హీటర్లు మరియు రిఫ్రిజిరేటర్లు, కాఫీ పాట్‌లుమరియు హెయిర్ డ్రైయర్లు వంటి గృహావసర అనువర్తనాలను నియంత్రించేందుకు కూడా ఉపయోగించవచ్చు. థర్మోస్టాట్ ద్వారా వెళ్లే శక్తి తాపన ఉపకరణం అందిస్తుంది, సాధారణ ఉత్తర అమెరికా నిర్మాణంలో ఇది మిల్లీవోల్ట్‌ల నుంచి 240 వోల్ట్‌ల వరకు ఉంటుంది, ప్రత్యక్షంగా (ఎలక్ట్రిక్ బేస్‌బోర్డ్ హీటర్లు మరియు కొన్ని ఎలక్ట్రిక్ ఫర్నెస్‌లు) లేదా పరోక్షంగా (అన్ని గ్యాస్, ఆయిల్ మరియు ఫోర్స్‌డ్ హాట్ వాటర్ వ్యవస్థలు) తాపన వ్యవస్థను నియంత్రించేందుకు దీనిని ఉపయోగిస్తారు. థర్మోస్టాట్ వద్ద వివిధ రకాల సంభవనీయ వోల్టేజ్‌లు మరియు ప్రవాహాలు (కరెంట్‌లు) ఉంటాయి కాబట్టి, ఒక పునఃస్థాపన ఉపకరణాన్ని ఎంచుకునే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి.

 1. స్థిర బిందు నియంత్రణ తులాదండం. అధిక ఉష్ణోగ్రత వద్ద ఇది కుడివైపుకు కదులుతుంది. రెండో స్లాట్ మధ్యలో గుడ్రంగా ఉన్న సూచిక పిన్ బాహ్య భాగంలో ఒక సంఖ్యా స్లాట్ ద్వారా సూచించబడుతుంది.
 2. కాయిల్ లోపలికి చొప్పించబడి ఉండే ద్విలోహ బద్ద. కాయిల్ మధ్యభాగం తులాదండానికి (1) జోడించివున్న ఒక భ్రమణ స్తంభానికి కలపబడి ఉంటుంది. కాయిల్ చల్లబడేకొద్ది, కదిలే చివర (4) - సవ్యదిశలో కదులుతుంది.
 3. వశ్యమైన తీగ. రెండు తీగల్లో ఒక తీగ ద్వారా ఎడమ భాగం హీటర్ నియంత్రణ వాల్వ్‌కు అనుసంధానం చేయబడి ఉంటుంది.
 4. ద్విలోహ కాయిల్‌కు, తద్వారా హీటర్ యొక్క నియంత్రకితో, అనుసంధానించబడిన కదిలే కాంటాక్ట్ (బంధం).
 5. అయస్కాంతం. కాంటాక్ట్ మూసివేయబడినప్పుడు మంచి కాంటాక్ట్‌ను అందిస్తుంది. కాంటాక్ట్‌లు తెరుచుకునే ముందు ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల వరకు పెరగాలి కాబట్టి, స్వల్పకాలిక తాపన చక్రాలను నిరోధించేందుకు ఇది శైథిల్యాన్ని అందిస్తుంది. ఇది ఒక ప్రత్యామ్నాయం, కొన్ని థర్మోస్టాట్‌లు దీనికి బదులుగా ద్విలోహ కాయిల్ చివరి భాగంలో ఒక మెర్క్యూరీ స్విచ్ ఉపయోగిస్తాయి. పాదరసం బరువు కాయిల్ చివరిలో దానిని అక్కడ ఉంచేందుకు ఉపయోగపడుతుంది, అంతేకాకుండా స్వల్పకాలిక తాపన చక్రాలను నిరోధిస్తుంది. అయితే, ఈ రకమైన థర్మోస్టాట్ అనేక దేశాల్లో నిషేధించబడింది, పాదరసం అధిక స్థాయి మరియు శ్వాశత విష స్వభావం కలిగివుంటుంది, ఇది పగిలినట్లయితే ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉండటంతో ఈ థర్మోస్టాట్‌లను ఉపయోగించడం లేదు. ఈ థర్మోస్టాట్‌లను పునఃస్థాపించే సమయంలో, వాటిని రసాయన వ్యర్థాలుగా పరిగణించాలి.
 6. స్థిర కాంటాక్ట్ స్క్రూ. తయారీదారు చేత ఇది సర్దుబాటు చేయబడి ఉంటుంది. జత తీగల్లో రెండో తీగకు ఇది విద్యుత్‌తో థర్మోకపుల్‌కు మరియు విద్యుత్ ఆధారంగా నిర్వహించబడే హీటర్ యొక్క గ్యాస్ వాల్వ్‌కు అనుసంధానించబడి ఉంటుంది.

ఈ చిత్రంలో కనిపించని మరో భాగం ద్విలోప తాపక్రమమాని (ఉష్ణమాపకం లేదా థర్మామీటర్), ఇది బాహ్య భాగంపై ఉంటుంది, థర్మోస్టాట్ వద్ద వాస్తవ ఉష్ణోగ్రతను చూపించేందుకు ఇది ఉద్దేశించబడింది.

మిల్లీవోల్ట్ థర్మోస్టాట్‌లు[మార్చు]

పైన థర్మోస్టాట్ ఉపయోగంలో సోదాహరణ చేసిన విధంగా, థర్మోకపుల్ చేత పాటవం అందజేయబడుతుంది, పైలెట్ లైట్ చేత వేడెక్కుతుంది. ఇది కొద్ది పాటవాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, అందువలన వ్యవస్థ గ్యాస్‌ను నియంత్రించేందుకు తక్కువ పాటవ వాల్వ్‌ను ఉపయోగించాలి. ఈ రకమైన ఉపకరణం సాధారణంగా ఉపయోగించడానికి తగినది కాదు, ఎందుకంటే పైలెట్ లైట్లు ఆశ్చర్యకరమైన స్థాయిలో గ్యాస్‌ను వృథా చేస్తాయి (సుదీర్ఘ కాలంలో ఒక డ్రిప్పింగ్ ఫాసెట్ భారీ పరిమాణంలో నీటిని వృథా చేసిన విధంగానే), ఇప్పుడు వీటిని స్టౌవ్‌లలో ఉపయోగించడం లేదు, అయితే వీటిని ఇప్పటికీ అనేక గ్యాస్ వాటర్ హీటర్లలో గుర్తించవచ్చు. (వాటి పేలవమైన సమర్థత వాటర్ హీటర్‌లలో ఉపయోగకరంగానే ఉంటుంది, ఎందుకంటే పైలెట్ లైట్‌పై వృథా అయిన శక్తి నీటితో చేరి, ట్యాంక్‌ను వెచ్చగా ఉంచేందుకు సాయపడుతుంది. అంతేకాకుండా వాటర్ హీటర్‌లో పనిచేసేందుకు ఒక విద్యుత్ వలయాన్ని ఉపయోగించడం అనవసరం. ట్యాంక్‌లులేని (అవసరమైతే) వాటర్ హీటర్లకు, ఉష్ణ-ఉపరితల జ్వలనం కంటే వేగవంతమైనది కావడం మరియు నిప్పురవ్వ జ్వలనం కంటే ఎక్కువ ఆధారపడిదగినది కావడంతో పైలెట్ జ్వలనం మేలైనదిగా పరిగణించబడుతుంది.)

కొన్ని ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్‌లు ఈ వ్యవస్థలను నియంత్రిస్తాయి.

24 వోల్ట్ థర్మోప్లాస్ట్[మార్చు]

ఆధునిక తాపన/శీతలీకరణ/ఉష్ణ యంత్ర థర్మోప్లాస్ట్‌ల్లో ఎక్కువ భాగం తక్కువ వోల్టేజ్ (ప్రధానంగా 24 వోల్టుల AC) నియంత్రణ సర్క్యూట్ (వలయం) లపై నిర్వహించబడుతున్నాయి. 24 వోల్ట్ AC విద్యుత్‌కు మూలం ఒక నియంత్రణ ట్రాన్స్‌ఫార్మర్, ఇది తాపన/శీతలీకరణ పరికరంలో భాగంగా వ్యవస్థాపన చేయబడి ఉంటుంది. తక్కువ వోల్టేజ్ నియంత్రణ వ్యవస్థ యొక్క ప్రయోజనం ఏమిటంటే, అది అంతర్గతంగా సురక్షిత వోల్టేజ్ మరియు విద్యుత్ ప్రవాహ (కరెంట్) స్థాయిలను ఉపయోగించుకునే రిలేలు, కాంటాక్టర్‌లు మరియు సీక్వెన్సెర్‌ల వంటి బహుళ విద్యుత్ యాంత్రిక మార్పిడి ఉపకరణాలను (ఎలక్ట్రోమెకానికల్ స్విచ్చింగ్ డివైస్‌లు) నిర్వహించే సామర్థ్యం కలిగివుంటుంది.[5] థర్మోస్టాట్ లోపల నిర్మించబడటం వలన, ఇది భవిష్యదూహను ఉపయోగించి విస్తృతమైన ఉష్ణోగ్రత నియంత్రణను సాధ్యపరుస్తుంది. హీట్ యాంటిసిపేటర్ (ఉష్ణాన్ని ముందుగా ఉహించే ఉపకరణం) తాపన ఉపకరణం పనిచేస్తున్నప్పుడు సెన్సింగ్ భాగానికి కొద్దిస్థాయిలో అదనపు ఉష్ణాన్ని సృష్టిస్తుంది. ఇది తాపన కాంటాక్ట్‌లను కాస్త ముందుగానే తెరిచి, బాగా మితిమీరుతున్న థర్మోస్టాట్ అమరిక నుంచి అంతర ఉష్ణోగ్రతను నిరోధిస్తుంది. యాంత్రిక హీట్ యాంటిసిపేటర్ సాధారణంగా సర్దుబాటు చేసే విధంగా ఉంటుంది, వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు తాపన నియంత్రణ సర్క్యూట్‌లోకి ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనుగుణంగా దీనిని స్థిరపరచాలి. శీతలీకరణ యాంటిసిపేటర్, శీతలీకరణ ఉపకరణం పని చేయనప్పుడు, సెన్సింగ్ (గ్రాహ్య) భాగానికి కొద్దిస్థాయిలో అదనపు ఉష్ణాన్ని సృష్టిస్తుంది. ఈ ఉష్ణం కాంటాక్ట్‌లు శీతలీకరణ ఉపకరణాన్ని కాస్త ముందుగానే శక్తివంతం చేసేందుకు కారణమవుతుంది, మితిమీరుతున్న పరిస్థితి నుంచి అంతర ఉష్ణోగ్రతను ఇది నిరోధిస్తుంది. శీతలీకరణ యాంటిసిపేటర్‌లు సాధారణంగా సర్దుబాటు చేయలేని విధంగా ఉంటాయి. విద్యుత్ యాంత్రిక థర్మోస్టాట్‌లు యాంటిసిపేటర్‌లుగా నిరోధక మూలకాలను ఉపయోగిస్తాయి. అనేక ఎలక్ట్రానిక్ థర్మోప్లాస్ట్‌లు భవిష్యదూహ క్రియకు థర్మిస్టర్ పరికరాలు లేదా ఇంటిగ్రేటెడ్ లాజిక్ ఎలిమెంట్‌లలో ఏదో ఒకదానిని ఉపయోగిస్తాయి. కొన్ని థర్మోస్టాట్‌లలో, థర్మిస్టర్ యాంటిసిపేటర్ బయటవైపు ఉండవచ్చు, బాహ్య ఉష్ణోగ్రత ఆధారంగా వివిధ భవిష్యదూహలను అది అందజేస్తుంది. థర్మోస్టాట్ ఉపకరణాలు బాహ్య ఉష్ణోగ్రత డిస్‌ప్లే, ప్రోగ్రామబులిటీ మరియు వ్యవస్థ లోప సూచికను కలిగివుంటాయి. ఇటువంటి 24 వోల్ట్ థర్మోస్టాట్‌లు మెయిన్స్ పవర్ పోయినప్పుడు పర్నెస్‌ను నిర్వహించడంలో పనికిరావు, హీటెట్ ఎయిర్ ఫ్యాన్‌ల కోసం అనేక ఫర్నస్‌లకు మెయిన్స్ పవర్ అవసరం అవుతుంది (మరియు తరచుగా హాట్-సర్‌ఫేస్ లేదా ఎలక్ట్రానిక్ స్పార్క్ ఇగ్నిషన్), దీని వలన ఎటువంటి పనితీరు దెబ్బతినదు. పైలేటెడ్ వాల్ మరియు "గ్రావిటీ" (ఫ్యాన్‌లెస్) ఫ్లోర్ మరియు సెంట్రల్ హీటర్స్ వంటి ఇతర పరిస్థితుల్లో తక్కువ వోల్టేజ్ వ్యవస్థ విద్యుత్ శక్తి అందుబాటులో లేనప్పుడు పని చేయడం కొనసాగించే సామర్థ్యం కలిగివుంటుంది.

ఆధునిక వ్యవస్థలో జ్వలన క్రమాలు[మార్చు]

 • గ్యాస్ (వాయువు)
 1. చిమ్నీపై ప్రవహించే వాయు స్తంభాన్ని సృష్టించేందుకు డ్రాఫ్టింగ్ ఫ్యాన్ (ఫర్నెస్ బాగా కొత్తదై ఉంటే) ప్రారంభించాలి.
 2. ఇగ్నైటర్‌ను వేడి చేయడం లేదా స్పార్క్-ఇగ్నిషన్ వ్యవస్థ (నిప్పు రవ్వ జ్వలన వ్యవస్థ)ను ప్రారంభించాలి.
 3. ప్రధాన బర్నర్‌లను మండించేందుకు గ్యాస్ వాల్వ్‌ను తెరవాలి
 4. (ఫర్నస్ బాగా కొత్తదై ఉంటే) మెయిన్ బ్లోవర్ ఫ్యాన్ లేదా సర్క్యులేటర్ పంప్‌ను ప్రారంభించే ముందు హీట్ ఎక్స్ఛేంజర్ సరైన నిర్వహణ ఉష్ణగ్రత వద్దకు చేరుకునే వరకు వేచివుండాలి
 • చమురు
 1. వాయువుతో మాదిరిగానే, వాల్వ్‌ను తెరవడానికి బదులుగా, బర్నర్‌లోకి చమురు (ఆయిల్)ను ప్రవేశపెట్టేందుకు ఫర్నస్ ఒక ఆయిల్ పంప్‌ను ప్రారంభిస్తుంది
 • విద్యుత్తు
 1. బ్లోవర్ ఫ్యాన్ లేదా సర్క్యూలేటర్ పంప్ ప్రారంభమవుతుంది మరియు పెద్ద ఎలక్ట్రోమెకానికల్ రిలే లేదా TRIAC హీటింగ్ ఎలిమెంట్‌లను ప్రారంభిస్తుంది
 • బొగ్గు (మొక్కజొన్నలు, గోధుమ మరియు బార్లీ వంటి ధాన్యాలు మరియు చెక్క, బెరడు లేదా కార్డ్‌బోర్డ్‌లతో సహా)
 1. ఈ రోజుల్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది (ధాన్యాలు మరియు పెల్లెట్‌లకు ఆదరణ పెరుగుతుంది): గ్యాస్ మాదిరిగానే, అయితే వాల్వ్ ప్రారంభించడాన్ని మినహాయించి, బొగ్గు/ధాన్యం/కలపను ఫైర్‌బాక్స్‌లోకి తీసుకెళ్లేందుకు ఫర్నస్ ఒక స్క్రూ (సీల)ను ప్రారంభిస్తుంది

మండలేతర వ్యవస్థల్లో (నివాసంలో, ఒక ఇళ్లు మొత్తానికి ఒకే థర్మోస్టాట్), థర్మోస్టాట్ యొక్క R (లేదా Rh) మరియు W టెర్మినళ్లు అనుసంధానం చేసినప్పుడు, ఫర్నస్ తన యొక్క ప్రారంభ క్రమాల గుండా వెళ్లి, ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది.

మండల వ్యవస్థల్లో (కొన్ని నివాసాలు, అనేక వ్యాపార వ్యవస్థలు - ఒకే భవనంలో అనేక థర్మోస్టాట్‌ల నియంత్రిస్తున్న వివిధ మండలాలు) థర్మోస్టాట్ చిన్న ఎలక్ట్రిక్ మోటార్లు ఉపయోగించి వాల్వ్‌లు లేదా డంపర్లు తెరుస్తుంది మరియు పని చేయని స్థితిలో ఉన్నట్లయితే, ఫర్నస్ లేదా బాయిలర్‌ను ప్రారంభిస్తుంది.

ఎక్కువగా ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్‌లు ఈ వ్యవస్థలను నియంత్రిస్తుంటాయి.

లైన్ వోల్టేజ్ థర్మోస్టాట్‌లు[మార్చు]

బేస్‌బోర్డ్ హీటర్ లేదా డైరెక్ట్-వైర్డ్ ఎలక్ట్రిక్ ఫర్నస్ వంటి ఎలక్ట్రిక్ స్పేస్ హీటర్‌ల కోసం సాధారణంగా లైన్ వోల్టేజ్ థర్మోస్టాట్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. లైన్ వోల్టేజ్ థర్మోస్టాట్ ఉపయోగించినట్లయితే, వ్యవస్థ విద్యుత్ (అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, 120 లేదా 240 వోల్ట్‌లు) నేరుగా థర్మోస్టాట్ చేత మార్చబడుతుంది. విద్యుత్ ప్రవాహ మార్పిడి తరచుగా 40 ఆంపియర్‌లు దాటుతుండటంతో, ఒక లైన్ వోల్టేజ్ సర్క్యూట్‌పై తక్కువ వోల్టేజ్ థర్మోస్టాట్ ఉపయోగించడం వలన థర్మోస్టాట్ విఫలం కావడం మరియు మంటలు చెలరేగడం జరగవచ్చు. లైన్ వోల్టేజ్ థర్మోస్టాట్‌లను కొన్నిసార్లు కేంద్రీకృత బాయిలర్‌లు మరియు చిల్లెర్‌లను ఉపయోగించే పెద్ద వ్యవస్థల్లో ఫ్యాన్-కాయిల్ నియంత్రణ (ఒక పెద్ద వ్యవస్థ చేత తాపన లేదా శీతలీకరించబడే కాయిల్ గుండా వెళ్లే లైన్ వోల్టేజ్ నుంచి ఫ్యాన్‌కు విద్యుత్ సరఫరా చేయబడుతుంది) కేంద్రాల్లో లేదా హైడ్రానిక్ హీటింగ్ అనువర్తనాల్లో కంట్రోల్ సర్క్యులేషన్ పంప్‌లు వంటి ఇతర అనువర్తనాల్లో ఉపయోగిస్తారు.

కొన్ని ప్రోగ్రామబుల్ (క్రమణిక చేయదగిన) థర్మోస్టాట్‌లు లైన్ వోల్టేజ్ వ్యవస్థలను నియంత్రించేందుకు అందుబాటులో ఉన్నాయి. ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్ నుంచి ముఖ్యంగా బేస్‌బోర్డ్ హీటర్లు లబ్ధి పొందుతాయి, ఈ థర్మోస్టాట్‌లు నిరంతర నియంత్రణ (కొన్ని హనీవెల్ నమూనాల్లో మాదిరిగా) సామర్థ్యం కలిగివుంటాయి, ల్యాంప్ డిమ్మెర్ వంటి హీటర్‌ను నియంత్రించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి, స్థిరైన గది ఉష్ణోగ్రతను అందించేందుకు క్రమంగా ఉష్ణాన్ని తగ్గించడం లేదా పెంచడం చేస్తాయి (శైథిల్యం యొక్క సగటు ప్రభావాలపై ఆధారపడకుండా నిరంతర నియంత్రణ అందిస్తాయి). ఫ్యాన్ (ఎలక్ట్రిక్ ఫర్నెస్‌లు, వాల్ హీటర్లు, తదితరాలు) వంటి వ్యవస్థలు సాధారణ ఆన్/ఆఫ్ నియంత్రణలను ఉపయోగిస్తాయి.

సంయోగ తాపన/శీతలీకరణ నియంత్రణ[మార్చు]

నియంత్రించబడే అంశం ఆధారంగా, ఒక ఫోర్స్‌డ్-ఎయిర్ ఎయిర్ కండీషనింగ్ థర్మోస్టాట్ సాధారణంగా హీట్/ఆఫ్/కూల్ కోసం ఒక బాహ్య స్విచ్ కలిగివుంటుంది, మరో ఆన్/ఆటో స్విచ్ స్థిరంగా లేదా తాపనం మరియు శీతలీకరణ జరుగుతున్నప్పుడు మాత్రమే బ్లోవర్ ఫ్యాన్ తిరిగేలా చేస్తుంది. ప్రధాన తాపన/శీతలీకరణ భాగం (సాధారణంగా ఇది సమీపంలో, బేస్‌మెంట్ లేదా అప్పుడప్పుడు అటకపై ఉంటుంది) నుంచి మధ్యభాగంలో-ఉన్న థర్మోస్టాట్‌కు నాలుగు తీగలు వస్తాయి: ఒక తీగ థర్మోస్టాట్‌కు 24 వోల్ట్‌ల AC విద్యుత్ సరఫరా చేస్తుంది, మిగిలిన మూడు తీగలు థర్మోస్టాట్ నుంచి నియంత్రణ సంకేతాలను బదిలీ చేస్తాయి, వీటిలో ఒకటి తపనానికి, మరొకటి శీతలీకరణకు, మరొకటి బ్లోవర్ ఫ్యాన్‌ను ప్రారంభించడానికి ఉద్దేశించబడింది. ఒక ట్రాన్స్‌ఫార్మర్ చేత విద్యుత్ సరఫరా చేయబడుతుంది, థర్మోస్టాట్‌లోకి విద్యుత్ ప్రవహించినప్పుడు, తాపన/శీతలీకరణ భాగానికి వెనుకవైపు ఉండే మరో తీగ భాగం యొక్క క్రియాత్మకతను ఉత్తేజపరుస్తుంది.

శీతలీకరణకు ఉద్దేశించబడిన ఒక థర్మోస్టాట్, నిర్దిష్ట ఉష్ణోగ్రతను గది ఉష్ణోగ్రత అధిగమించినప్పుడు మాత్రమే పనిచేయడం మొదలుపెడుతుంది. అందువలన, తాపన లేదా శీతలీకరణ వ్యవస్థ పని చేయనప్పుడు, నియంత్రిత ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత సాధారణంగా వాంఛిత అమరిక కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, బయటివైపు ఉష్ణోగ్రత ఎలా ఉన్నప్పటికీ థర్మోస్టాట్‌ను శీతలీకరణ అమరికలో ఉంచడం ఉత్తమం. మరోవైపు, నియంత్రిత ప్రదేశం యొక్క ఉష్ణోగ్రత వాంఛిత స్థాయి కంటే తక్కువగా ఉన్నట్లయితే, థర్మోస్టాట్‌ను తాపన అమరికలో ఉంచాలి.

హీట్ పంప్ (ఉష్ణ యంత్రం) నియంత్రణ[మార్చు]

ఉష్ణ యంత్రం అనేది ఒక శీతలీకరణ ఆధారిత ఉపకరణం, అంతర్గత మరియు బాహ్య కాయిల్స్ మధ్య శీతలకరణి ప్రవాహాన్ని తిరగవేస్తుంది. ఇది ఒక రివర్సైజింగ్ వాల్వ్‌ను క్రియాశీలపరచడం ద్వారా జరుగుతుంది (దీనిని "4-వే" లేదా "చేంజ్-ఓవర్" వాల్వ్‌గా కూడా గుర్తిస్తారు). శీతలీకరణ సందర్భంగ, అంతర్గత కాయిల్ ఒక ఎవాపరేటర్‌గా పనిచేస్తుంది, అంతర్గత గాలి నుంచి ఉష్ణాన్ని తొలగించి, దానిని బాహ్య కాయిల్‌కు బదిలీ చేస్తుంది, అక్కడ అది బాహ్య వాయువులోకి వెళుతుంది. తాపన సందర్భంగా, బాహ్య కాయిల్ ఎవాపరేటర్‌గా పనిచేస్తుంది, బాహ్య గాలి నుంచి సేకరించిన వేడిని అది అంతర్గత కాయిల్‌కు ద్వారా అంతర్గత గాలిలోకి బదిలీ చేస్తుంది. థర్మోస్టాట్ చేత నియంత్రించబడే రివర్సింగ్ వాల్వ్ తాపనం నుంచి శీతలీకరణకు మార్పు చెందేందుకు కారణమవుతుంది. నివాస ఉష్ణ యంత్ర థర్మోస్టాట్‌లు సాధారణంగా "O"ను కలిగివుంటాయి, శీతలీకరణలో రివర్సింగ్ వాల్వ్‌ను ఉత్తేజపరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది. కొన్ని నివాస మరియు అనేక వ్యాపార కేంద్రాల్లో ఉష్ణ యంత్ర థర్మోస్టాట్‌లు "B" టెర్మినల్‌ను ఉపయోగిస్తాయి, ఇది తాపనంలో రివర్సింగ్ వాల్వ్‌ను ఉత్తేజ పరుస్తుంది. ఉష్ణ యంత్రం యొక్క తాపన సామర్థ్యం బయటి ఉష్ణోగ్రతల తగ్గేకొద్ది క్షీణిస్తుంది. కొన్ని బాహ్య ఉష్ణోగ్రతలు వద్ద (సమతౌల్య స్థితి) ఉష్ణాన్ని బదిలీ చేయడంలో శీతలీకరణ వ్యవస్థ యొక్క సామర్థ్యం భవనం యొక్క ఉష్ణ అవసరాల కంటే తక్కువ స్థాయిలోకి పడిపోతుంది. బాహ్య ఉష్ణోగ్రత సమతౌల్య స్థాయి కంటే తక్కువకు పడిపోయినప్పుడు ఉష్ణాన్ని సరఫరా చేసేందుకు ఎలక్ట్రిక్ తాపన ఉపకరణాలు గల ఒక విలక్షణ ఉష్ణ యంత్రం ఉపయోగకరంగా ఉంటుంది. ఉష్ణ యంత్ర థర్మోస్టాట్‌లో ఉపభాగ ఉష్ణం యొక్క పనితీరు ఒక ద్వితీయ దశ తాపన కాంటాక్ట్ చేత నియంత్రించబడుతుంది. తాపనం సందర్భంగా, బాహ్య కాయిల్ బయటి ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తున్నప్పుడు, కాయిల్‌పై సంఘననం జరుగవచ్చు. ఈ సంఘననం తరువాత కాయిల్‌ను గడ్డకట్టేలా చేసి, దాని ఉష్ణ బదిలీ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందువలన అప్పుడప్పుడు బాహ్య కాయిల్‌ను కరిగేలా చేసే బాధ్యత తాపన యంత్రాలపై ఉంటుంది. దీనిని శీతలీకరణ అమరికలోకి చక్రాన్ని మళ్లించడం ద్వారా దీనిని చేయవచ్చు, అప్పుడు బాహ్య ఫ్యాన్‌ను ఆపివేసి, ఎలక్ట్రిక్ హీటింగ్ ఎలిమెంట్‌లను శక్తివంతం చేయాలి. కరిగించే అమరికలో ఎలక్ట్రిక్ హీట్ భవనంలోకి చల్లని గాలి ప్రవేశించకుండా వ్యసస్థను రక్షించేందుకు అవసరమవుతుంది. ఈ భాగాలను తరువాత తిరిగి పునఃతాపక క్రియలో ఉపయోగించవచ్చు. వ్యవస్థ కరిగిపోయే స్థితిలో ఉన్నట్లు మరియు ఎలక్ట్రిక్ హీట్ క్రియాశీలపరిచినట్లు సూచించగలదు, కరిగే ప్రక్రియ మాత్రం థర్మోస్టాట్ నియంత్రణలో ఉండదు. ఉప మరియు పునఃతాపనాలకు ఉష్ణ యంత్రానికి ఎలక్ట్రిక్ హీట్ భాగాలు ఉంటాయి కాబట్టి, ఎలక్ట్రిక్ హీట్ భాగాల యొక్క ఉపయోగం కోసం అందజేసే ఉష్ణ యంత్ర థర్మోస్టాట్ శీతలీకరణ వ్యవస్థను విఫలం చేస్తుంది. ఈ క్రియ సాధారణంగా థర్మోస్టాట్‌పై "E" టెర్నినల్ ద్వారా క్రియాశీల పరచబడుతుంది. అత్యవసర ఉష్ణం అవసరమైనప్పుడు, థర్మోస్టాట్ కంప్రెసర్ లేదా బాహ్య ఫ్యాన్‌ను పని చేయించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయదు.

డిజిటల్[మార్చు]

నివాసాల్లో ఉపయోగించే డిజిటల్ థర్మోస్టాట్

ఆధునిక డిజిటల్ థర్మోస్టాట్‌లు ఉష్ణోగ్రతను కొలిచేందుకు ఎటువంటి కదిలే భాగాలు కలిగివుండవు, వీనికి బదులుగా ఇవి థర్మిస్టర్‌లు లేదా రెసిస్టెన్స్ థర్మోమీటర్ (నిరోధక ఉష్ణోగ్రత గ్రాహకి) వంటి ఇతర సెమీకండక్టర్ పరికరాలుపై ఆధారపడతాయి. దీనిని నిర్వహించేందుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సాధారణ బ్యాటరీలు వ్యవస్థాపన చేయాలి, పవర్ స్టీలింగ్ డిజిటల్ థర్మోస్టాట్‌లుగా పిలిచే కొన్ని విద్యుత్ మూలంగా సాధారణ 24 వోల్ట్ AC సర్క్యూట్‌లను ఉపయోగించుకుంటాయి, అయితే కొన్ని ఫర్నస్‌లలో ఉపయోగించే థర్మోపైల్ ఆధారిత మల్లీవోల్ట్ సర్క్యూట్‌లపై ఇవి పనిచేయవు. ప్రతి థర్మోస్టాట్‌కు ప్రస్తుత ఉష్ణోగ్రత మరియు ప్రస్తుత అమర్పు చూపించే ఒక LCD స్క్రీన్ ఉంటుంది. ఎక్కువ ఉపకరణాలకు ఒక గడియారాన్ని కూడా ఉంటుంది, ఉష్ణోగ్రతకు రోజులో సమయం మరియు వారంలో రోజు కూడా అమర్పులు చేయవచ్చు, దీని వలన సౌకర్యవంతంమైన మరియు ఇంధన ఆదాతో కూడిన ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని అధునాతన నమూనాలు టచ్ స్క్రీన్‌లు లేదా ఇంటి ఆటోమేషన్ లేదా బిల్డింగ్ ఆటోమేషన్ వ్యవస్థలతో కలిసి పనిచేసే సామర్థ్యం కలిగివుంటాయి.

డిజిటల్ థర్మోస్టాట్‌లు ఒక రిలే లేదా ట్రాయాక్ వంటి సెమీకండక్టర్ పరికరం రూపంలో HVAC యూనిట్ నియంత్రణకు స్విచ్‌గా పనిచేస్తాయి. రిలేస్‌తో ఉన్న యూనిట్‌లు మిల్లీవోల్ట్ వ్యవస్థలను నిర్వహిస్తాయి, స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసే సమయంలో తరచుగా వినిపించే "క్లిక్" శబ్దాన్ని చేస్తాయి.

మరింత వ్యయభరిత నమూనాలు ఒక అంతర్నిర్మాణ PID కంట్రోలర్‌ను కలిగివుంటాయి, దీని వలన తన ఆదేశాలకు వ్యవస్థ ఏ విధంగా స్పందిస్తుందో థర్మోస్టాట్‌కు ముందుగానే తెలుస్తుంది. ఉదాహరణకు, ఉదయం 7 గంటలకు ఉష్ణోగ్రతను 21 °C వద్ద అమర్చినట్లయితే, ఆ సమయంలో ఉష్ణోగ్రత 21 °C వద్ద ఉందో లేదో సరిచూసుకోండి, ఒక సంప్రదాయ థర్మోస్టాట్ ఆ సమయంలో పని చేయడం ప్రారంభిస్తుంది. వాంఛిత సమయంలో కోరిన ఉష్ణోగ్రతను చేరుకోవాలంటే ఏ సమయంలో వ్యవస్థను క్రియాశీల పరచాలో PID కంట్రోలర్ నిర్ణయిస్తుంది. ఇది ఉష్ణోగ్రత బాగా స్థిరంగా ఉండేటట్లు చూస్తుంది (ఉదాహరణకు, ఓవర్‌షూట్‌లు తగ్గించడం ద్వారా[ఆధారం చూపాలి]).

ఉత్తర అమెరికా మరియు ఐరోపా ఖండాల్లో సాధారణ నివాస వినియోగంలో ఉన్న ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్‌ల వంటి డిజిటల్ థర్మోస్టాట్‌లు ఎక్కువగా ఉపయోగంలో ఉన్నాయి, వీటిని డిఫాల్ట్ ప్రోగ్రామ్‌లతో అమలు చేసినట్లయితే, 30% శక్తి ఆదా చేస్తాయి; ఈ డిఫాల్ట్ ప్రోగ్రామ్‌లకు ఏవైనా మార్పులు చేసినట్లయితే, శక్తి ఆదాలు పెరుగుతుంది లేదా తగ్గుతుంది.[ఆధారం చూపాలి] ప్రోగ్రామబుల్ థర్మోస్టాట్ వ్యాసంలో దీని యొక్క పనితీరుపై ప్రాథమిక సమాచారంతోపాటు, ఇటువంటి ఒక థర్మోస్టాట్‌ను ఎంపిక చేసుకోవడం మరియు వ్యవస్థాపన చేయడానికి సంబంధించిన వివరాలు ఉంటాయి.

గృహ థర్మోస్టాట్ ఉంచే ప్రదేశం[మార్చు]

గది యొక్క శీతలీకరణ లేదా తాపన వెట్‌లు లేదా ఉపకరణం నుంచి థర్మోస్టాట్‌ను దూరంగా ఉంచాలి, గది నుంచి సాధారణ వాయు ప్రవాహాన్ని నియంత్రించే విధంగా దానిని ఏర్పాటు చేయాలి. ఏక మండల వ్యవస్థకు తెరిచివున్న హాలుమార్గం అత్యంత యోగ్యమైన ప్రదేశం, ఈ వ్యవస్థలో నివసించే గదులు మరియు బెడ్‌రూములు ఏక మండలంగా నిర్వహించబడతాయి. నియంత్రిత ప్రదేశాల నుంచి హాలుమార్గం తలుపులతో మూసివున్నట్లయితే, వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు తలుపులు తెరిచివుంచాలి. నియంత్రిత మూలానికి థర్మోస్టాట్ దగ్గరగా ఉన్నట్లయితే, అప్పుడు వ్యవస్థ స్వల్ప చక్రం ఏర్పడుతుంది, ఎక్కువసార్లు ఆగిపోవడం మరియు ప్రారంభమవడం చికాకు పెడతాయి, కొన్ని సందర్భాల్లో ఉపకరణం యొక్క జీవితకాలాన్ని తగ్గిస్తుంది. బహుళ మండల వ్యవస్థ వ్యక్తిగత ప్రదేశాలను నియంత్రించడం ద్వారా గణనీయమైన స్థాయిలో శక్తిని ఆదా చేస్తుంది, తాపన లేదా శీతలీకరణను ఆపివేయడం ద్వారా ఉపయోగించని గదుల ఉష్ణోగ్రతను సాధారణంగా ఉంచుతుంది.

నకిలీ థర్మోస్టాట్‌లు[మార్చు]

కార్యాలయ భవనాల్లో ఉండే అనేక థర్మోస్టాట్‌లు నిష్క్రియాత్మకమైన నకిలీ ఉపకరణాలుగా ఉండే అవకాశం ఉంది, ఉద్యోగులకు నియంత్రణ భ్రమను కల్పించేందుకు వీటిని వ్యవస్థాపన చేస్తారు.[6][7] ఇక్కడ ఈ నకిలీ థర్మోస్టాట్‌లు ఉత్తుత్తిమాత్రల మాదిరిగా ఉంటాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Thermostat Maker Deploys Climate Control Against Climate Change". America.gov. మూలం నుండి 2009-04-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-10-03. Cite web requires |website= (help)
 2. "Johnson Controls Inc. | History". Johnsoncontrols.com. 2007-11-07. మూలం నుండి 2010-03-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-10-03. Cite web requires |website= (help)
 3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-10-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-26. Cite web requires |website= (help)
 4. [1]
 5. ఒక నిశ్చల ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా సరఫరా చేసినప్పుడు అనేక విద్యుత్ సంకేతాల పరిధిలో 24 వోల్ట్‌ల కంటే తక్కువ స్థాయిలో ఉన్న విద్యుత్ పీడనాలను సేఫ్టీ ఎక్స్‌ట్రా-లో వోల్టేజ్‌గా వర్గీకరిస్తారు.
 6. Sandberg, Jared (15 Jan 2003). "Employees Only Think They Control Thermostat". The Wall Street Journal. Retrieved 2009-09-02.
 7. Katrina C. Arabe (April 11, 2003). ""Dummy" Thermostats Cool Down Tempers, Not Temperatures". Retrieved 2010-02-13. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]