థామస్ పైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థామస్ పైన్
థామస్ పైన్
Portrait of Thomas Paine.jpg
థామస్ పైన్
ఉచ్ఛారణథామస్ పైన్
జననం
థెట్‌ఫోర్డ్
మరణంజూన్ 8, 1809 (వయస్సు 72)
న్యూయార్క్ నగరం, న్యూయార్క్ ,
జాతీయతఅమెరికన్
పౌరసత్వంఅమెరికన్
సంతకం
Thomas Paine Signature.svg

థామస్ పైన్ అమెరికాకు చెందిన ప్రముఖ తత్వవేత్త, రాజకీయ ఉద్యమ కర్త, రాజనీతి సిద్ధాంతకర్త.  అమెరికా దేశ వ్యవస్థాపక నాయకులలో ఒకరు. థామస్ పేన్ అమెరికా దేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రచించిన రెండు ప్రముఖ సంపుటాలు "కామన్ సెన్సు, ది ఏజ్ ఆఫ్ రీజన్" అతనికెంతో కీర్తిని తెచ్చినవి. అతని రచనలు అమెరికా దేశానికి బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందేటందుకు పోరాడిన విప్లకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. చివరికి 1776 లో ఆ స్పూర్తే అమెరికా దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధింపజేసింది.[1] థామస్ పేన్ యొక్క ఆలోచనలు సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ప్రతిబింబింపజేసేవిగా వుండేవి. .[2] థామస్ పేన్ ను ప్రవృత్తి రీత్యా వైద్యునిగాను, వృత్తి రీత్యా పాత్రికేయునిగాను, సమాజంలో ఏర్పడే మార్పుల ద్వారా విప్లవ ప్రచార కర్తగానూ పలురకాల పాత్రలను పోషించాడని మేధావుల అభిప్రాయం.[3]

ప్రారంభ జీవితం విద్య[మార్చు]

థామస్ పైన్ ఇంగ్లాండు దేశానికి  చెందిన థెట్ఫోర్డ్ లో జన్మించాడు. ఇతడు ప్రఖ్యాత శాస్త్రవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడైన "బెంజమిన్ ఫ్రాంక్లిన్ ద్వారా 1774లో అప్పటి బ్రిటష్ కాలనీలుగా పిలువబడే అమెరికాకు పయనమయ్యాడు. అతను అమెరికాలో ప్రవేశించిన సమయంలో అమెరికా దేశానికి స్వాతంత్ర్యం కోసం విప్లవాత్మక సంఘర్షణలు జరుగుతున్నాయి. ఆ సమయంలో పేన్ "కామన్ సెన్సు" పేరుతో 1776లో కరపత్రాలను అమెరికా వ్యాప్తంగా పంపిణీ చేసాడు. అది విప్లవ నాయకులకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఆ తరువాతి కాలంలో అమెరికా దేశ స్వాతంత్ర్యం కోసం" ది అమెరికన్ క్రైసిస్" అనే మరో కరపత్రిక రచించాడు. Common Sense రచన గురించి అమెరికా దేశ వ్యవస్థాపకులలోఒకరైన జాన్ఆడంస్ "కామన్ సెన్ స్ రచయిత కలం యొక్క ప్రభావం గనక లేకపోతే జార్జ్ వాషింగ్టన్ యొక్క ఖడ్గ ప్రభావం నిష్ఫలమై వుండేది."

థామస్ పైన్1790వ దశకంలో ఫ్రాన్సులో నివసించాడు. అప్పుడు జరుగుతున్న ఫ్రెంచి విప్లవంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. 1791లో "రైట్స్ ఆఫ్ ఎ మాన్" అనే కరపత్రికను ఫ్రెంచి విప్లవం పట్ల సుముకంగా లేని విమర్శకులను వుద్దేశిస్తూ ఈ రచనను చేసాడు. థామస్ పేన్ ఫ్రెంచి విప్లవానికి పూర్తి మద్దతు ప్రకటించాడు. ఫ్రెంచి భాష రాకపోయినా పేన్ ఫ్రాన్సు జాతీయ కన్వెషన్కు ఎన్నికయ్యాడు. ఫ్రెంచి విప్లవంలో రెండు వర్గాలలో ఒకటైన జిరాండిస్టులు థామస్ పేన్ను తమ మిత్రునిగా భావించేవారు. మరొక వర్గమైన జాకొబిన్ వర్గ నాయకుడైన రాబిస్పియర్ పేన్ను తమ శత్రువుగా భావించేవారు.

ది ఏజ్ ఆఫ్ రీజన్[మార్చు]

1793లో థామస్ పైన్ ను బంధించి లక్సెంబర్గు కారాగారంలో ఖైదు చేసారు. జైలు జీవితంలో తన బృహత్గ్రంథం "ది ఏజ్ ఆఫ్ రీజన్" (1793-94) రచనలో నిమగ్నమైయ్యాడు. థామస్ పేన్ను ఫ్రాన్సు దేశంలో బంధించారనే విషయం అమెరికా దేశ వ్యాప్తంగ ప్రకంపనలు సృష్టించింది. అమెరికాకు అప్పటికి కాబోయే భావి అధ్యక్షుడు "జేమ్స్ మన్రో" తన పలుకుబడిని ఉపయోగించి దౌత్య సంబంధాల ద్వారా థామన్ పేన్ను విడుదల చేయించాడు. అప్పటికే తన రచన "ది ఏజ్ ఆఫ్ రీజన్" ద్వారా మత ఛాందసవాదుల నుంచి ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తన గ్రంథంలో "దీయిసమ్" అనే వాదనను సమర్ధించాడు. ఈ వాదం ఏమిటంటే భగవంతుడు ఈ సృష్టిని తయారు చేసి దాని కంటూ కొన్ని నియమాలు ఏర్పరచాడు. ఆ తరువాత ఆ నియమాల అనుసారం ఈ సృష్టి నడుస్తుందే తప్ప భగవంతుని జోక్యం ఇందులో వుండదు. ఈ సిద్ధాంతం అప్పట్లో ఎన్నో అలజడులను సృష్టించింది. మత ఛాందసవాదులనుంచి విమర్శలను ఎదుర్కొంది. ఈ సిద్ధాంతాన్ని అప్పటి మేధావులైన "వోల్టేర్" "బెంజమిన్ ఫ్రాంక్లిన్" "థామస్ జెఫర్ సన్" వంటి వారు అనుసరించారు. థామస్ పేన్ తన 72వ ఏట 1809 జూన్ 8వ తేదీన వృద్ధాప్యంలో అమెరికాలోని తన స్వంత గృహంలో తుది శ్వాస విడిచాడు. అప్పటి క్రైస్తవ మత అధికారులకు భయపడి పేన్ యొక్క అంతిమ యాత్రకు కేవలం 6గురు మాత్రమే హాజరయ్యారు.

నోట్స్[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Henretta, James A.; et al. (2011). America's History, Volume 1: To 1877. Macmillan. p. 165. ISBN 9780312387914.
  2. Jason D. Solinger.
  3. Saul K. Padover, Jefferson: A Great American's Life and Ideas, (1952), p. 32.