Coordinates: 20°22′54″N 99°52′06″E / 20.38167°N 99.86833°E / 20.38167; 99.86833

థాయిలాండ్ కేవ్ రెస్క్యూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థాయిలాండ్ కేవ్ రెస్క్యూ
సంఘటన స్థలం
తేదీ23 జూన్ – 10 జూలై 2018
(18 days)
ప్రదేశంతామ్ లుయాంగ్ గుహ, చియాంగ్ రాయ్ ప్రావిన్స్, థాయిలాండ్[1]
భౌగోళికాంశాలు20°22′54″N 99°52′06″E / 20.38167°N 99.86833°E / 20.38167; 99.86833
కారణంవర్షాకాలపు వరదలు[2]
ఫలితం12 మంది పిల్లలతో పాటు ఒక కోచ్.[3][4]
మరణాలుసమన్ కునాన్[5]
గాయపడినవారుMinor scrapes and cuts, mild rashes,[6][7] lung inflammation[8]
Location within Thailand


థాయిలాండ్ కేవ్ రెస్క్యూఆనేది థాయిలాండులో థామ్ లూయింగు అనే ఒక కొండ గుహలో ఒక ఫుట్బాల్ బృందం కోఛ్ తోసహా,అదిక వానలవలన మార్గం మూసుకు పోయి బందీలుగా లోపల వుండి పోయినపుడు థాయిలాండు ప్రభుత్వం ప్రపంచ దేశాలకు సంబంధించిన నిపుణులసహయంతో చేసిన రక్షణ చర్య.సహయక బృందం విజయవంతంగా లోపల చిక్కుకు పోయిన అందర్ని బయటికి ప్రాణాలతో బయటికి తెచ్చారు.18 రోజులు పాటు వాళ్లు చుట్టూ నీళ్ళు చీకటి గుహలో వుండి పోవడంతో ప్రపంచమంతా ఈ సంఘటన ఉత్కంఠత రేపింది.వార్త పత్రికలు,మీడియా కూదా ఈ సంఘటనకు ఎక్కువ ప్రాధన్యత ఇచ్చాయి.చివరికి కథ సుఖాంతం అయ్యింది.కాక పోతే ఈ ఆపరేసనులోఒక థాయ్ మాజీ నౌకాదళ సీల్, సమన్ కునాన్, ఒక రాత్రిపూట మార్గంలో ఆక్సిజన్ కానరీలను ఉంచడానికి వెళ్ళిమరణించాడు.[9]

ది ముపా (వైల్డ్ బోర్సు)అకాడమీ

[మార్చు]

ఇది ఫుట్బాల్ ఆటగాళ్లకు తర్ఫీదు ఇచ్చే అకాడమి. గుహలో చిక్కుకున్న వారు ఈ అకాడమి ఆటగాళ్లు.

ఏమి జరిగింది

[మార్చు]

థాయిలాండు లోని ది ముపా (వైల్డ్ బోర్సు)అకాడమీకి చెందిన11 నుండి 16 ఎప్ప వయస్సు వున్న ఫుట్బాల్ ఆటగాళ్ళు తమ 25 ఏళ్ల కోచ్ కోచ్ ఏకపోల్ చంటవొంగ్తో కలసి డోయినాంగ్ నాన్ పర్వతములోవున్న,ఆరు మైళ్ళ పొడవున్న లుయాంగ్ గుహకు 23 జూన్ ౨౦౧౮న వెళ్లి లోపల చిక్కుకు పోయారు.తొమ్మిది రోజుల తర్వాత, రక్షక లోయీతగాల్ల బృందం నీటితో ఆవరించిన గుహ ఆవరణలో ఆశ్రయంపొందుతున్న ఫుట్బాల్ టీం సురక్షితగా వుడటం గుర్తించారు. ఇరుకైన రెండు మైళ్ళ మార్గాలు ప్రధాన ద్వారం నుండి వారు వుండు ప్రదేశాన్ని వేరు చేశాయి. వర్షాలు తగ్గడంతో అధికారులు మొదట పంపుల ద్వారా నీటిని బయటికి తోడటం మొదలెట్టారు. ఫుట్ బాల్ ఆట ప్రాక్టిసు తరువాత ఆటగాళ్ళు కోచ్ తో కల్సి లోపలి వెళ్లి ఇరుక్కు పోయారు.[10]

రక్షణ చర్యల వరుసక్రమం

[మార్చు]

23జూన్,2018

[మార్చు]

పరిశోధక బృందానికి గుహ ముందున్న ద్వారం బయట వున్న కంచెకు వాళ్ళ సైకిల్లు, బూట్లు కట్టబండి వుండటంతో వారు గుహలోకి వెళ్ళారని గుర్తించారు.గుహ బయట వానాకాలంలో లోపలి వేల్లరాడనే ఎచ్చరిక నోటిసు కుడా వున్నది.

24జూన్,2018

[మార్చు]

పార్కు అధికారులు, .పోలీసులు భారీ వానలు వచ్చే ప్రమాదం ఉన్నందున వెదకడం ముమ్మరం చేసారు.లోపల లభించిన చేతి, కాలుముద్రలను బట్టి వరద వలన దారి ముసుకు పోవడంతో పిల్లలు తిరిగి సొరంగం లోకి వెళ్ళినట్లు అర్థమైంది.బందువులు సొరంగం బయట నిఘా పెట్టారు

25జూన్,2018

[మార్చు]

థాయ్ నౌకాదళం సీల్ డైవర్స్ పిల్లల కోసం ఆక్సిజన్ ట్యాంకులు, ఆహారాన్ని తీసుకు గుహలోకి ప్రవేశించాయి.తల్లిదండ్రులకు ప్రార్ధన చేయటానికి, అర్పణలు చేసుకోవడానికి త్యాగ విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. భారీ వర్షం కొనసాగుతోంది. బాలురు గుహలోకి మరింత లోపలికి వెళ్లిపోయారని నమ్మినారు

26జూన్,2018

[మార్చు]

డైవర్స్ T- జంక్షను చేరుకున్నప్పటికీ బయటికి బలంగా ప్రవహిస్తున్న వరద నీటి వలన వెనక్కి రావలసి వచ్చింది. థాయిలాండ్ ప్రధానమంత్రి, ప్రౌత్ చాన్-ఓచా, జాతికి రక్షించడానికి మద్దతు ఇవ్వాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

27జూన్,2018

[మార్చు]

అమెరికా పసిఫిక్ కమాండ్ నుండి 30 కన్న ఎక్కువ మంది అమెరికాసైనిక సిబ్బంది సైటుకు చేరుకున్నారు ఇందులో మూడు బ్రిటీష్ డైవింగ్ నిపుణులు ఉన్నారు.

28జూన్,2018

[మార్చు]

పెరుగుతున్న వరద నీటిని హరించడానికి నీటి పంపులను తీసుకువచ్చారు, బ్రిటీష్ డైవర్స్, ఇతరులు గుహలోకి వెళ్ళు ప్రత్యామ్నాయ ప్రవేశం కోసం పర్వతాన్ని జల్లెడ పట్టారు. గుహలోకి క్రిందికి చేరుకునే టందుకు కొత్త పొగ గొట్టాలనువేయటానికి సహాయం చేయడానికి డ్రోన్లు పంపబడినాయి.

29జూన్,2018

[మార్చు]

థాయిలాండ్ ప్రధానమంత్రి సైట్ను సందర్శించి, ఆశలను వదులుకోవద్దని రక్షక బృందాన్ని కోరాడు.

30జూన్,2018

[మార్చు]

రక్షక బృందం పిల్లలను ప్రాణాలతో కనుగోన్నచో, సురక్షితంగా బాలురను బయటికి తెచ్చుటకు ప్రాక్టీస్ కసరత్తులు నిర్వహించారు.

1జులై2018

[మార్చు]

గుహ సముదాయంలోని 700 మీటర్ల దూరంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేయబడింది. వందల ఆక్సిజన్ ట్యాంకులు, ఇతర సరఫరాలు కేంద్రానికి తీసుకు రాబడినవి. ప్రవేశద్వారం నుండి 1,500 మీటర్లు దూరంలో వున్నమోన్క్'స్ జంక్షన్ చేరారు.

2 జులై2018

[మార్చు]

12 మంది పిల్లలను, కోచ్ ను, పట్టాయ బీచ్ అనబడే ప్రాంతానికి 400 మీటర్ల దూరంలో సజీవంగా గుర్తించారు.

4 జులై 2018

[మార్చు]

లోపలి వెళ్ళిన మెడికల్ బృందం వాళ్ళను పరీక్షించి చిన్న గాయాలు మినహా అందరు క్షేమగా వున్నారని చెప్పారు.

5జులై 2018

[మార్చు]

గుహలోని తొలి భాగంలో నీటి స్థాయిని 40 శాతం తగ్గించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రవేశద్వారం నుండి మూడో చాంబరు వరకు నడవడానికి ఇప్పుడు అవకాశం దొరికింది. బాలురకు ఇప్పుడు ఫాయిల్ దుప్పట్లు, ఆహారం, ఇవ్వబడినవి.అంతేకాదు, ఏడు డైవర్లు, వైద్యులను వారికి తోడుగా వుంచారు.

6జులై 2018

[మార్చు]

ఒక థాయ్ మాజీ నౌకాదళ సీల్, సమన్ కునాన్, ఒక రాత్రిపూట గుహమార్గంలో ఆక్సిజన్ కానరీలను ఉంచడానికి వెళ్ళిమరణించాడు. అతని ఆక్సిజన్ సిలిండరు ఖాళి అవ్వడం వలన మరణించి ఉండొచ్చు.దీని వలన రక్షణ చర్య ఎంత ప్రమాదకరమో తెలిసి వచ్చింది.

7 జులై 2018

[మార్చు]

నీటిని నిరతంరం తోడటం వలన సొరంగంలో నీరు గణనీయంగా తగ్గింది. కాని గుహలో ఆక్సిజన్ ప్రమాణం తగ్గిపోతున్నండున రక్షణ చర్యలు వేగవంతం చెయ్యాల్సివున్నది,అంతేకాదు బారివానాలు పదోచ్చునని వాతావరణ శాఖ చెప్పింది.అందువలన రాబోయే రెండు మూడు రోజుల్లో గుహలో చిక్కుకున్నవారిని ఎలాగైనా బయటికి తేవటానికి సిద్దమైనది.

8 జులై 2018

[మార్చు]

రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు మొదట నలుగురు అబ్బాయిలను బయటికి తెచ్చారు.సయహాకులతో కల్సి 10 నిమిషాల వ్యవధిలో ఇద్దరు మొదట బయటికి వచ్చారు.రెండు గంటల తరువాత మరో ఇద్దరు బయటికి తీసుకు రాబడినారు. నలుగురు బాలురులను వెంటనే చియాన్గ్ రై హాస్పిటల్కు వైద్య పరీక్షలకై తీసుకు వెళ్ళారు.

9 జులై 2018

[మార్చు]

మరో నలుగురు బాలురను బయటికి తీసుకువచ్చారు ముందు రోజుకన్నా చాలా త్వరగా బయటికి తీసుకువచ్చారు.వారిని కుడా వెంబడే హెలికాప్టరుద్వారా చియాన్గ్ రై హాస్పిటల్కు వైద్య పరీక్షల కై తీసుకు వెళ్ళారు.

10 జులై 2018

[మార్చు]

ప్రమాదం జరిగిన,పిల్లలు గుహలో ఇరుక్కుపోయిన 18 రోజుల తరువాత మిగిలిన నలుగు పిల్లలు, కోచ్ సురక్షితగా గుహబయటికీ రక్షక బృందం తెచ్చినది.

పిల్లల ఆరోగ్య స్థితి

[మార్చు]

రక్షింపబడిన పిల్లల అందరి ఆరోగ్యం బాగానే వుందని.ఊపిరితిత్తుల అంటువ్యాధికల్గిన కొందరికి మాత్రం వైద్యం కొనసాగుతున్నట్లు పబ్లి హెల్త్ మినిస్టరు తెలిపాడు.[11]

సహాయక బృందంలోని దేశాలు

[మార్చు]

సహకబృందంలో థాయిలాండ్తో పాటు బ్రిటన్,అమెరికా,ఆస్ట్రేలియా తదితర దేశాలనుండి వచ్చిన నిపుణులు వున్నారు.అమెరికా వాయుసేనకు చెందిన డెరెక్ అండర్సన్ ఒకరు.ఈయన జపాన్ లోణి ఒకినావాలో అమెరికా వైమానిక స్థావరంలో పనిచేసేవాడు.ఇయన తన బృందంతో కల్సి గుహవద్దకు 28 తేదిన వచ్చాడు[12]

ఆధారాలు

[మార్చు]
 1. Safi, Michael; Thoopkrajae, Veena (8 July 2018). "Thailand cave rescue begins as four of 12 boys freed in day of drama". The Guardian. Archived from the original on 8 July 2018. Retrieved 9 July 2018.
 2. "Former Thai Navy SEAL dies in rescue operation for soccer team trapped in cave". MassLive. 6 July 2018. Archived from the original on 8 July 2018. Retrieved 8 July 2018.
 3. Neumann, Scott; Chappell, Bill (10 July 2018). "All 12 Boys And Their Coach Are Rescued From Thai Cave, After 2 Weeks". NPR. Archived from the original on 10 July 2018. Retrieved 10 July 2018.
 4. Staff (10 July 2018). "Thai Cave Live Updates: All 13 Are Free After Weeks of Ordeal - 08:24 am/et/usa". The New York Times. Archived from the original on 10 July 2018. Retrieved 10 July 2018.
 5. "Diver dies in Thailand cave rescue attempt". BBC News. 6 July 2018. Archived from the original on 6 July 2018. Retrieved 6 July 2018.
 6. "Thailand cave rescue: Boys appear in new video, 'I am healthy'". CNN. 4 జూలై 2018. Archived from the original on 4 జూలై 2018.
 7. "Monsoon rains could damper rescue efforts to save soccer team in Thailand cave". ABC News. 5 July 2018.
 8. McKirdy, Euan; Olarn, Kocha; Berlinger, Joshua. "Thai rescue: Hopes high 4 boys, coach will be freed from cave Tuesday". CNN. Archived from the original on 10 July 2018. Retrieved 10 July 2018.
 9. "ఆపరేసన్ థాయి సఖాంతం". shakshi. Archived from the original on 2018-07-11. Retrieved 2018-07-11. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 10. "Thailand cave rescue:". theguardian.com. Archived from the original on 2018-07-10. Retrieved 2018-07-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 11. "All those rescued from Tham Luang cave in good condition". bangkokpost.com. Retrieved 2018-07-11.
 12. సాక్షి తెలుగు దినపత్రిక .తేది:12-07-2018.పుట:5
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.