థాయ్ ఎయిర్ వేస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థాయ్ ఎయిర్ బాస్ A300, ఫుకెట్ ఎయిర్పోర్ట్, 2008

థాయిలాండ్ దేశం యొక్క ప్రధాన వైమానిక సంస్థ.[1] [2] ఈ సంస్థ కార్పోరేట్ ప్రధాన కార్యాలయం బ్యాంకాక్ లోని చాటుచక్ జిల్లా, విభావడి- రంగ్సిట్ రోడ్ లో ఉంది.[3] స్టార్ అలయెన్స్ లో థాయ్ వ్యవస్థాపక సభ్యురాలు. థాయ్ సంస్థకు చవక ధరల వైమానిక సంస్థగా పేరున్న నోక్ ఎయిర్ లోనూ 49% వాటా ఉంది.[4] అంతేగాకుండా థాయ్ స్మైల్ పేరుతో 2012 మధ్య కాలంలో ప్రాంతీయ వైమానిక సంస్థను థాయ్ సంస్థ ఆరంభించింది.[5] థాయ్ ప్రస్తుతం బ్యాంకాక్ యునైడెట్, రెడ్ బుల్ రేసింగ్ లకు అధికారిక స్పాన్సర్ గా ఉంది.

చరిత్ర[మార్చు]

థాయ్ ఎయిర్ వేస్ మూలాలు 1960లోనే ఉన్నాయి. అప్పట్లో స్కాండనేవియన్ ఎయిర్ లైన్స్ (ఎస్.ఎ.ఎస్.), థాయ్ ఎయిర్ వేస్ కంపెనీ (థాయ్:เดินอากาศไทย) సంయుక్త భాగస్వామ్యంలో ఇది ఏర్పడింది. థాయ్ ఎయిర్ వేస్ కంపెనీకి ఉన్న దేశీయ విమాన సంస్థకు అంతర్జాతీయ శాఖను ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ సంయుక్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అవసరమైన అన్ని వనరులను ఎస్.ఎస్.ఎస్. సమకూర్చింది. ఈ వైమానిక సంస్థ తొలి రెవెన్యూ విమాన సేవలు 1960 మే 1నాడు, మొదటి అంతర్జాతీయ విమాన సేవలు 1971లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత యూరప్, ఉత్తర అమెరికాకు ప్రారంభించారు. 1977 ఏప్రిల్ 1లో ఎస్.ఎ.ఎస్.కు ఈ సంస్థలో ఉన్న 15 శాతం వాటాలను థాయ్ లాండ్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో ఈ సంస్థ పూర్తిగా థాయ్ ప్రభుత్వ సంస్థగా మారిపోయింది. 1991 జూన్ 25లో ఈ సంస్థకు చెందిన, దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను విలీనం చేసి ప్రస్తత థాయ్ ఏయిర్ వేస్ ఇంటర్నేషనల్ గా మార్చారు.

గమ్యాలు[మార్చు]

ప్రధాన వ్యాసం:ఎయిర్ వేస్ గమ్యాలు

విమానాలు[మార్చు]

మే 2015 నాటికి థాయ్ ఎయిర్ వేస్ విమానాలు:[6][ఉత్తమమైన ఆధారాలు కావాల్సి ఉంది.] ఎయిర్ బస్ ఎ320-200, ఎయిర్ బస్ ఎ330-300, ఎయిర్ బస్ ఎ350-900, ఎయిర్ బస్ ఎ380-800, బోయింగ్ 737-400, బోయింగ్ 747-400, బోయింగ్ 777-200, బోయింగ్ 777-200ఇఆర్, బోయింగ్ 777-300 ఇఆర్, బోయింగ్ 787-8, బోయింగ్ 787-9

సేవలు[మార్చు]

థాయ్ సంస్థ ప్రయాణికులకు ఎలాంటి బోర్ లేకుండా ఇంట్రాక్టివ్ అవాడ్ (AVOD) విధానంతో పాటు పెద్ద తెరలు, టచ్ కంట్రోలు కమాండ్లతో కూడిన కొత్త సినిమాలు, ఆపాత మధురమైన సంగీతం, ప్రజాధరణ పొందిన టీవీ కార్యక్రమాలు వంటివెన్నో అందిస్తోంది. ఈ విధానంలో ప్రయాణికులు కొత్త భాషలు నేర్చుకోవడంతో పాటు, ధ్యానం వంటివి అభ్యసించవచ్చు. బ్యాంకాక్ నుంచి బయలు దేరే రాయల్ మొదటి తరగతి ప్రయాణికులకు ప్రత్యేకమైన 'చెఫ్ ఆన్ కాల్' సదుపాయం ఉంది. ముందుగా అభ్యర్థించి తమకు కావాల్సిన ప్రత్యేక మెనూ వంటలు తెప్పించుకోవచ్చు.

ప్రమాదాలు-సంఘటనలు[మార్చు]

1967 జూన్ 30: థాయ్ ఏయిర్ వేస్ ఇంటర్నేషనల్ విమానం 601 భారీ తుఫాన్ కారణంగా కాయ్ టక్ విమానాశ్రయాన్ని సమీపిస్తుండగా ఓడరేవు నీటిని ఢీకొట్టిన ఘటనలో విమానంలో ఉన్న 80 మందిలో 24 మంది చనిపోయారు.

1990 నవంబరు 10: థాయ్ విమానం ఎయిర్ బస్ ఎ300-600 యాంగాన్ నుంచి డాన్ మాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తుండగా దుండగులు దారి మళ్లించేందుకు (హైజాకింగ్) కు ప్రయత్నించారు.[7]

జులై 31, 1992: ఎయిర్ బస్ ఎ310-300 బ్యాంకాక్ నుంచి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తుండగా ఉత్తర ఖాడ్మండు సమీపంలో ఓ కొండ అంచుకు ఢీ కొట్టిన దుర్ఘటనలో 99 మంది ప్రయాణికులు 14 మంది విమాన సిబ్బంది దుర్మరణం చెందారు.[8]

1998 డిసెంబరు 11: A310-200 విమానం భారీ వర్షంలో చిక్కుకుని ఒక వరిపొలంలో పడిపోయింది. విమానంలో ఉన్న 146 మందిలో 101 మంది చనిపోయారు.

ఇవి కాకుండా 1969 జూలై 9, 1973 మే 10[9], 1994 2001 అక్టోబరు 22 2013 మార్చి 3 సెప్టెంబరు 8[10] న కూడా ఈ సంస్థ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Kositchotethana, Boonsong (26 May 2015). "Carriers in Asia Pacific stuck in red". Bangkok Post. Retrieved 2015-07-22.
  2. Yukako, Ono. "Flag carrier back in black helped by cheap oil, forex gain in Q1". Archived from the original on 2015-06-04. Retrieved 2015-07-22.
  3. "Details of Shareholders and Board of Directors" (PDF). Thai Airways International. Retrieved 2015-07-22.
  4. "Shareholders". Nok Air. Archived from the original on 2012-10-29. Retrieved 2015-07-22.
  5. "THAI realigns plan for a better year". The Nation. Retrieved 2015-07-22.
  6. "Thai Airways International Flights". cleartrip.com. Retrieved 2015-07-22.
  7. Harro Ranter (10 November 1990). "ASN Aircraft accident Airbus A300 registration unknown Calcutta". aviation-safety.net. Retrieved 2015-07-22.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-11. Retrieved 2015-07-22.
  9. Harro Ranter (10 May 1973). "ASN Aircraft accident Douglas DC-8-33 HS-TGU Kathmandu-Tribhuvan Airport (KTM)". Retrieved 2015-07-22.
  10. "ASN Aircraft accident Airbus A330-321 HS-TEF Bangkok-Suvarnabhumi International Airport (BKK)." Aviation Safety Network.Retrieved 2015-07-22.