థావర్ చంద్ గెహ్లాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థావర్ చంద్ గెహ్లాట్
థావర్ చంద్ గెహ్లాట్

థావార్ చంద్ గెహ్లాట్


కర్ణాటక రాష్ట్ర 19వ గవర్నరు [1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 జులై 11 [2]
ముందు వాజుభాయ్ వాల

కేంద్ర సామాజిక న్యాయం , సాధికారత శాఖ మంత్రి
పదవీ కాలం
2014 మే 26 – 2021 జులై 7
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ముందు మల్లికార్జున్ ఖర్గే

వ్యక్తిగత వివరాలు

జననం (1948-05-18) 1948 మే 18 (వయసు 76)
మధ్య ప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి
జీవిత భాగస్వామి అనిత గెహ్లాట్
సంతానం 6
నివాసం రాజ్ భవన్, బెంగళూరు [3]

థావర్ చంద్ గెహ్లాట్, (జననం 1948 మే 18) భారత దేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు.[4] కర్ణాటక రాష్ట్ర 19వ గవర్నరుగా 2021 అక్టోబరునాటికి విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతకు పూర్వం ఇతను 2014 నుండి 2021 వరకు కేంద్ర సామాజికన్యాయం, సాధికారత శాఖ మంత్రిగా పనిచేసాడు

తొలినాళ్లలో

[మార్చు]

గెహ్లాట్ మధ్య భారత ఏజెన్సీ ప్రాంతంలోని రుపేట గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. ఈ ఏజెన్సీ ప్రాంతం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంది. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన  సీనియర్ నాయకుడు.

మధ్యప్రదేశ్ రాష్ట్ర ఉజ్జయిని పట్టణంలోని విక్రమ్ విశ్వవిద్యాలయం నుండి గెహ్లాట్ తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ని పూర్తి చేసాడు.[5]

వృత్తి జీవితం

[మార్చు]

గెహ్లాట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంనుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు. బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి సామాజిక విజ్ఞాన శాస్త్రంలో గౌరవ డాక్టరేటు పట్టా పొందాడు. 1996 నుండి 2009 వరకు షాజాపూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా పనిచేశాడు.[6] 2021 జూలై 6న భారత ప్రభుత్వంచే కర్ణాటక గవర్నరుగా నియమించబడ్డాడు.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. "Thawarchand Gehlot will be sworn-in as Governor of Karnataka on July 11". India Tv. Retrieved 2021-07-11.
  2. "Thawar Chand Gehlot sworn in as Governor of Karnataka". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2021-07-11.
  3. "Thaawarchand Gehlot takes over as Karnataka governor from Vajubhai Vala". Hindustan Times. 6 July 2021.
  4. "thawar chand gehlot: Latest News, Videos and thawar chand gehlot Photos | Times of India". The Times of India. Retrieved 2021-10-08.
  5. Minister Biodata (PDF). Ministry of Social Justice (Report).
  6. 6.0 6.1 "BJP National office bearers". BJP. Archived from the original on 2014-10-22. Retrieved 2021-09-30. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. "Thawar Chand Gehlot: The Scheduled Caste face in Narendra Modi's cabinet". The Economic Times. 31 May 2014. Retrieved 31 May 2014.
  8. "63 साल में पहली बार दलित और आदिवासी को देश में मिली मानद उपाधि, इन्होंने बढ़ाया मान". Patrika. 19 November 2019.

బయటి లంకెలు

[మార్చు]