థైమస్ గ్రంథి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థైమస్ గ్రంథి
Illu thymus.jpg
Thymus
Gray1178.png
The thymus of a full-term fetus, exposed in situ.
గ్రే'స్ subject #274 1273
ధమని derived from internal mammary artery, superior thyroid artery, and inferior thyroid artery
నాడి vagus
లింఫు tracheobronchial , parasternal
Precursor third branchial pouch
MeSH Thymus+gland
Dorlands/Elsevier t_10/12807749

బాలగ్రంధి (థైమస్ గ్రంధి) ఛాతీలో ఉండే ఒక అవయవం.

 • థైమస్ గ్రంధి శోషరస వ్యవస్థలో (లింఫోయిడ్ వ్యవస్థ) గోచరించే ప్రాధమిక లింఫ్ అవయవం.
 • ఉరోః కుహర ప్రాంతంలో   ఊర్ధ్వ భాగాన  ఉరోస్థి   వెనుక వైపున , హృదయానికి ముందు భాగంలో, రెండు ఊపిరితిత్తుల మధ్యన    పిరమిడ్ ఆకృతిలో గోచరిస్తుంది[1].  
 • థైమస్  ఆకృతి ,  థైమ్ ఆకు (thyme leaf) రూపాన్ని పోలిఉండడం మూలాన ఈ గ్రంథికి  " థైమస్ " అను పేరు పెట్టడం జరిగింది[2] . పింక్ రంగు లో ఉంటుంది[3].  
 • థైమస్ గ్రంధి  రెండు లంబికల నిర్మాణం .రెండు లంబికలు  ' ఇస్థమస్(isthamus) ' ద్వారా కలుపబడిఉంటాయి.  ప్రతి లంబికలో  అనేక లఘు లంబికలుంటాయి.  ప్రతి   లఘు లంబిక  రెండు స్తరాలతో నిర్మితం.   వెలుపలి స్తరాన్ని 'వల్కలం(cortex) 'అనీ ,లోపలి స్తరాన్ని 'దవ్వ(medulla) ' అనీ వ్యవహరిస్తారు . వల్కల భాగమంతా అపరిపక్వ 'లింఫోసైట్ల '(immature lymphocytes)తోనూ ,    దవ్వ భాగం అంతా ప్రౌఢ 'లింఫోసైట్ల '(mature lymphocytes)లతోను నిండి ఉంటుంది . వల్కలభాగంలోని  'అపరి పక్వ  లింఫోసైట్లు' , పరిపక్వత చెందిన తరువాత అవి దవ్వ ను చేరుకుంటాయి[2] .
 • వల్కలంలో అపరిపక్వ లింఫోసైట్ లతో పాటు 'రెటిక్యూ లార్'  కణాలుంటాయి .ఇవి పెద్దవిగా ఉండి , వల లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి . ఆ వలలో  లింఫోసైట్లు ఇమిడి ఉంటాయి .
 • దవ్వ భాగంలో  రక్తకణాలు , రెటిక్యూలార్ కణాలు, పరిపక్వ లింఫోసైట్ లు  ఉంటాయి.వీటితోపాటు ప్రత్యేకమైన  ' హాసెల్స్  కార్ప సెల్స్ '(Hassall’s corpuscles)ఉంటాయి[1] .  వీటి విధులు ఇంకను నిర్ధారింపబడలేదు . వీటిని వయసు మీరి, క్షీణి స్తున్న కణాలు గా భావిస్తున్నారు[4].  
 • శైశవ దశలలో  అనగా చిన్న వయసు లో  బాగా అభివృద్ధి  చెంది , ప్రౌఢ దశకు చేరుకోగానే ఎక్కువ పరిమాణాన్ని పెంచుకొని ,ఆ తరువాత క్రమేపీ క్షీణిస్తుంది. తరువాత ఆ భాగమంతా క్రొవ్వుతో నిండిపోతుంది . ఈ క్షీణతను  ' థై మిక్  ఇన్ వల్యుష న్(thymic involution) ' అంటారు[2] .

   థైమస్ గ్రంధి - విధులు[మార్చు]

 •   థైమస్ గ్రంధి రెండు విధులలో పాల్గొంటుంది . రోగనిరోధకత్వాన్ని  పెంపొందింప చేయటంలోనూ , హార్మోన్ ల తయారీలోనూ ప్రముఖంగా పాల్గొంటుంది .
 •   ఎముక మూలుగ (bone marrow) లో తయారయిన అపరిపక్వ  టి -లింఫోసైట్ లను ,పరిపక్వ  టి -లింఫోసైట్ కణాలుగా రూపు దిద్దడంలో పాత్ర వహిస్తాయి[5]. ఇవి రక్త ప్రసారం వెంబడి ప్రయాణించి లింఫ్ కణుపులను, ప్లీహం ను చేరి పనితనాన్ని ప్రారంభిస్తాయి. ఇవి రక్త ప్రసారం వెంబడి ప్రయాణించి లింఫ్ కణుపులను(lymph nodes), ప్లీహం(spleen) ను చేరి పనితనాన్ని ప్రారంభిస్తాయి.ముఖ్యంగా  కణ సంబంధ నిరోధకత్వం లో పాల్గొని అనేక వ్యాధికారక జీవరాసుల బారి  నుంచి శరీరాన్ని రక్షిస్తాయి[6] .                         
 •   థైమస్ గ్రంధి లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు వరుసగా  ' థైమోపొయిటిన్(thymopoietin) ', ' థై ములిన్(thymulin) ', ' థైమో సిన్(thymosin) ', 'థై మిక్ హుమోరల్ కారకం(thymic humoral factor(THF))' .    థైమోపొయిటిన్ ', ' థై ములిన్' లు  టి - కణాల విభేధన లోను , టి - కణాల సామర్ధ్యాన్ని పెంపొందించటంలోనూ దోహదం చేస్తాయి.     'థైమో సిన్ 'అసంక్రామ్య అనుక్రియల వేగవంతం చేయడంలోనూ , కొన్ని 'పిట్యూటరీ హార్మోన్ల '  ప్రేరణకు తోడ్పడుతుంది.     థై మిక్ హుమోరల్ కారకం(THF) ము ఖ్యంగా  వైరస్ ల నాశనానికి  తోడ్పడే అసంక్రామ్య చర్యలను వేగవంతం చేస్తాయి [7]
 •  థైమస్ పనితనం జీవితకాలం ఉండదు . శరీరంలో ఇది చురుకుగా పనిచేస్తున్నప్పుడు ,   శరీరాన్ని 'ఆటో ఇమ్మ్యూనిటి(auto-immunity)'  కి గురి కాకుండా రక్షిస్తుంది[7] .

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "Clinical Science" by Dr. Mythili Dheemahi, first edition:2005-'06 ,161-163
 2. 2.0 2.1 2.2 An overview of Thymus gland by Lynne Eldridge,MD- verywellhealth.com
 3. The thyroid gland structure: teachmeanatomy.info/thorax/organs/thymus
 4. Thymus structure and function : microbenotes.com
 5. Thyroid gland-anatomy: innerbody.com
 6. Overview of the Thymus Gland : thoughtco.com
 7. 7.0 7.1 An over view of Thymus: endocrineweb.com