థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్
దర్శకత్వంరమేష్‌ రాపర్తి
నిర్మాతమాగుంట శరత్‌చంద్రా రెడ్డి
తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి
తారాగణంఅనసూయ భరధ్వాజ్, అశ్విన్‌ విరాజ్‌
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
సంగీతంగుణ బాలసుబ్రమణియన్
విడుదల తేదీ
7 మే 2021 (2021-05-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శ‌ర‌త్‌చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మాతలుగా, అనసూయ భరధ్వాజ్, అశ్విన్ విరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్‌ రాపర్తి దర్శకత్వం వహించాడు.[1] ఈ చిత్ర ట్రైలర్‌ను 2021 జనవరి 26న సినీ నటుడు వెంకటేష్‌ విడుదల చేశారు.[2] ఈ చిత్రం 2021, ఏప్రిల్ 30న[3] థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2021, మే 7న ఆహా ఓటీటీలో విడుదలైంది.[4]

అభి (విరాజ్ అశ్విన్) బాధ్యతలు లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు. ప్రియ (అనసూయ భరద్వాజ్) భర్త సూర్య (ఆదర్శ్) ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మరణిస్తాడు. భర్త మరణంతో అభి తల్లి భాను (అర్చనా అనంత్), డాక్టర్ ప్రేమ్ (అనీష్‌ కురువిల్లా) ను వివాహం చేసుకుంటుంది. అది అభికి నచ్చదు. దాంతో తల్లితో ఎడముఖం పెడముఖంగా ఉంటాడు. ఫెండ్స్ తో తాగి తందనాలు ఆడటం, నచ్చిన అమ్మాయితో గడిపేయడం అతని అలవాటుగా మారిపోతుంది. అతనికి సమీర (మోనికా రెడ్డి) అనే ప్రియురాలు ఉంటుంది. విపరీతమైన యాటిట్యూడ్ ప్రదర్శించే అభిని ఎలా దారికి తీసుకురావాలో అతని తల్లికి అర్థం కాకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ లేడీతో కలిసి అభి అనుకోకుండా ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోతాడు. అది కాస్త చెడిపోయి మధ్యలో ఆగిపోతుంది. అలాంటి అభి.. కష్టాల్లో ఉన్న ప్రియకు ఎలా సాయం చేశాడు?.. అసలు ఈ ఇద్దరూ కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? లిఫ్ట్‌లో ఇరుకున్న ప్రియ, అభిలు ఎలా బయటపడ్డారు? అన్నదే సినిమా కథ.[5]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
 • స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : రమేష్ రాప‌ర్తి
 • నిర్మాతలు : మాగుంట శరత్‌చంద్రారెడ్డి, తారక్‌ భూమిరెడ్డి
 • సంగీతం: గుణ బాలసుబ్రమణ్యం
 • సినిమాటోగ్ర‌ఫీ : సురేష్ ర‌గుతు
 • ఆర్ట్‌ : పురుషోత్తం ప్రేమ్‌
 • పిఆర్ఓ : వంశీ - శేఖర్, నవీన్ కట్స్

పాటల జాబితా

[మార్చు]

1: దీ సోల్ ఆఫ్ థాంక్యూ బ్రదర్, రచన: లక్ష్మీ ప్రియాంక, గానం.శక్తి శ్రీ గోపాలన్, గుణ బాలసుబ్రమణ్యం

మూలాలు

[మార్చు]
 1. TV9 Telugu (20 November 2020). "అనసూయ కొత్త చిత్రం 'థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్' టైటిల్ పోస్టర్‌ లాంచ్." Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 7 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. ETV Bharat News. "ఆకట్టుకుంటోన్న'థ్యాంక్ యు బ్రదర్'ట్రైలర్". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 7 May 2021.
 3. Disha daily (దిశ) (17 April 2021). "అనసూయ 'థ్యాంక్ యు బ్రదర్'.. రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 7 May 2021.
 4. Namasthe Telangana (7 May 2021). "క‌రోనా క‌ష్టాలు.. ఓటీటీలో అన‌సూయ చిత్రం విడుద‌ల‌". Archived from the original on 26 ఏప్రిల్ 2021. Retrieved 7 May 2021.
 5. Sakshi (7 May 2021). "Anasuya Bharadwaj: 'థ్యాంక్‌ యు బ్రదర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 7 మే 2021. Retrieved 7 May 2021.