దండా వెంకట సుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దండా వెంకట సుబ్బారెడ్డి (1899–1987) వైద్య శాస్త్రవేత్త. దక్షిణ భారతదేశంలో వైద్యశాస్త్ర చరిత్రలో మేథావి.[1] ఆయన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్జ్ ఇన్ హైదరాబాదు అనే సంస్థకు వ్యవస్థాపకుడు[2]. ఆయన హైదరాబాదు లోని గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా మే 4, 1957 నుండి జనవరి 29, 1959 వరకు అన సేవలనందించాడు.[3] ఆయన అనేక వైద్య వ్యాసాలను, పుస్తకాలను రచించారు. ఆయన 1966 లో "గ్లింప్సెస్ ఆఫ్ హెల్త్ అండ్ మెడిసిన్ ఇన్ మౌర్యన్ అంపైర్" అనే పుస్తకాన్ని రాసాడు.[4]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణంలో 1899 ఏప్రిల్ 6 న జన్మించారు. ఆయన తండ్రి పేరు ఓబుల్ రెడ్డి. మద్రాసు మెడికల్ కళాశాల నుంచి ఎం.బి.బి.ఎస్ పట్టాను 1925లో అందుకున్నాడు. ఆయన బ్రిటన్ దేశం వెళ్ళి లండన్, ఎడింబరో విశ్వవిద్యాలలాలలో చర్మవ్యాధుల చికిత్స మీద శిక్షణలు పొందాడు. అనేక పరిశోధనలు చేసాడు. "వైద్యరంగ చరిత్ర" మిద విశేష అబినివేశం కల్పించుకున్నారు.

స్వదేశం వచ్చిన తరువాత ప్రొఫెసరుగా పనిచేస్తూనే ప్రపంచ స్థాయిలో వైద్యశాస్త్రం పరిణామం చెందిన తీరుతెన్నులను వివరించుతూ వైద్య శాస్త్ర చరిత్ర గురించి అనేక వ్యాసాలను పత్రికలలో వలువరించారు. "Indian Association of History of Medicine" సంస్థను నెలకొల్పి, సంస్థ అతరపున "indian journal of History of medicine" మాసపత్రికను ప్రారంభించి సంపాకదకులుగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించి, ఉస్మానియా యూనివర్శిటీలోని మెడికల్ కాలేజీలో ప్రత్యేక చరిత్ర శాఖను ఏర్పాటు చేయించి, దానికి తొలి ప్రొఫెసరుగా, అదే సాటిగా రూపొందించారు. సర్వతోముఖాభివృద్ధిని పొందిన ఈ శాఖ యొక్క ఆపురూప మ్యూజియం ను కేంద్రం ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నది. అనంతరం "ఇండియన్ మెడికల్ హిస్టరీ ఇనిస్టీట్యూట్" గా ఎదిగింది.

జాతీయ, అంతర్జాతీయ వైద్య సదస్సులు అనేకాలోనూ పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. పలు గ్రంథాలను రచించారు. "ఆరోగ్య వ్యాసమంజరి" ప్రసిద్ధమైనది.[5] తెలుగు భాషా సమితికి దశాబ్దకాలం పాటు కార్యదర్శిగా ఉన్నారు. "bullitin of the indian inistitute of history of medicine" మాసపత్రికను కొంతకాలం నిర్వహించారు. స్వకులాభిమానంతోనూ కొన్ని మంచి పనులు చేసారు. హైదరాబాదు 1987 ఫిబ్రవరి 2 తవ తేదీన మరణించారు.

సాహితీకారునిగా[మార్చు]

1925 లో ఆయన ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొంది వైద్య వృత్తిలొ ప్రవేశించిన కొద్ది కాలములో జిల్లా ఆరోగ్యాధికారి ఆయనను ఆరోగ్యవార మహోత్సవ సంస్థకు కార్యదర్శిగా చేసిరి. జిల్లా బోర్డువారు ఆరోగ్య ప్రచారముకై ఒక వార పత్రికలో కొన్ని పుటకు ప్రత్యేకించి ఆరోగ్య ప్రచారమునకై ఒక కమిటీని ఏర్పరచి దానికి ఆయనను కార్యదర్శిగా చేసిరి. దీనికొరకు ఆయన భాషరానివారికి, ఆంధ్రేతరులకు తెలుగులో ఆరోగ్య విషయములు తెలుపుట అవసరమైనది. ప్రతి వారము తెలుగు పత్రికలో ఆరోగ్య ప్రచారము జరుగవలసి యుండెను. తెలుగు వ్రాయనేర్చినవారికి ఆరోగ్య విజ్ఞానము లేకుండెను. ఆరోగ్య శాస్త్రములో పరిచయముండినవారు తెలుగులొ వ్రాయలేకుండిరి. కనుక ఆయన సాహిత్యాభిమాని కనుక విజ్ఞాశాస్త్ర వ్యాసములు వ్రాయవలసి యుండెడిది. ఆయన "సింహపురి", "దేశబంధు" మొదలగు పత్రికలలో వ్యాసములనేకం వ్రాసిరి. వాని ప్రతిలు 1927 నవంబరులో నెల్లురులో సంభవించిన తుఫాను దెబ్బకు చెల్లాచెదరైపోయినవి. వాటిలో దక్కినవి రెండు వ్యాసములు మాత్రమే. ఆ తరువాత ఆయన 1928 లో ఇంగ్లాండు ప్రయాణం, 1929 లో పునరాగమనము, 1930 లో ఆంధ్రా మెడికల్ కాలెజీలో ఉద్యోగం ప్రాప్తించినందున విశాఖపట్టణం చేరుట తటస్థించినది. తదనంతరము అచ్చట "రెడ్డి పత్రిక" యొక్కయు, "విశాఖ పత్రిక" యొక్కయు సంపాదక వ్యాసములకై ప్రాథేయపడుచుండిరి. ఇంతేకాక విశాఖపట్టనం నకు ఆరోగ్య వారోత్సవ సందర్భంగా తెలుగు మాట్లాడు వైద్య ప్రముఖులెవ్వరూ లేకుండిరి. కాబట్టి ప్రతి సంవత్సరము ఆ జిల్లాలో వివిధ కేంద్రములలో, ఆరోగ్య సందర్భోపన్యాసములలో పాల్గొనుట ఆయన విధి అయ్యెను. ఈ విధముగా ఆయన ఉపన్యాసములు, 1942 లో విశాఖపట్టణమున, జపాను విమానములు బాంబులు విసరినపుడు పోగా మిగిలినవాతిని స్వీకరించి ఆయన "ఆరోగ్యవ్యాసమంజరి" అనే పుస్తకమున ప్రచురించిరి. 1940 మొదలు 1945 వరకు విశాఖపట్నం మండల రెడ్ క్రాస్ సంఘ కార్యదర్శిగా నుండినందున వివిధ పాఠశాలలలో, వివిధ ప్రదేశములలో నొసగబడిన ఉపన్యాసములు కూడా ఈ గ్రంథములో చేర్చబడినవి. ఆయన 1951 లో గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్న సమయంలో ఈ గ్రంథాన్ని అందించిరి. [6]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]