Jump to content

దండుబోయిన పేరయ్య

వికీపీడియా నుండి
దండుబోయిన పేరయ్య

ఎమ్మెల్యే
పదవీ కాలం
1972 -1978
ముందు గొట్టుముక్కల రామ చంద్రరాజు
తరువాత కే.ఏ .గోకరాజు
నియోజకవర్గం ఉండి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1935
కలిసిపూడి, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం 2021 ఆగష్టు 26
హైదరాబాద్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు రెడ్డి కాంగ్రెస్ పార్టీ
సంతానం ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు
వృత్తి రాజకీయ నాయకుడు

దండుబోయిన పేరయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దండుబోయిన పేరయ్య పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, కలిసిపూడి గ్రామా సర్పంచ్‌గా 1959 నుండి 1972 వరకు పని చేశాడు. ఆయన 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. దండుబోయిన పేరయ్య అనంతరం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

మరణం

[మార్చు]

దండుబోయిన పేరయ్య 2021 ఆగష్టు 26న హైదరాబాద్ లో అనారోగ్యంతో మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (26 August 2021). "ఉండి మాజీ ఎమ్మెల్యే దండుబోయిన పేరయ్య కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.
  2. Andhra Jyothy (26 August 2021). "ఉండి మాజీ ఎమ్మెల్యే దండుబోయిన పేరయ్య మృతి". Archived from the original on 8 February 2022. Retrieved 8 February 2022.