దండె విఠల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దండె విఠల్
దండె విఠల్


ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
5 జనవరి 2022 నుండి 4 జనవరి 2028
ముందు పురాణం సతీశ్ కుమార్
నియోజకవర్గం ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 22 డిసెంబర్ 1970
కాగజ్‌నగర్‌, కొమరంభీం జిల్లా తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు దండే రాంప్రసాద్ రావు
జీవిత భాగస్వామి మాధవి తాతినేని
సంతానం 2
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఎంబీఏ, నాగపూర్ యూనివర్సిటీ
మతం హిందూ మతము

దండె విఠల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ‘స్థానిక సంస్థల’ కోటా టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దండె విఠల్ 1970లో తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్‌లో జన్మించాడు. ఆయన మహారాష్ట్రలోని అమరావతి యూనివర్సిటీ నుండి బిటెక్ పూర్తి చేసి నాగపూర్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. దండే విఠల్‌ 2000లో అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రారంభించాడు. ఆయన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నావిట్ సాఫ్ట్‌వేర్‌ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తాన్వి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ప్రారంభించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దండె విఠల్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశాడు. ఆయన 2009 నుంచి 2013 వరకు సనత్‌నగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సనత్‌నగర్‌ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. దండె విఠల్ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ 2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయ సమన్వయ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2]

తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విఠల్‌ దండే పేరును టిఆర్ఎస్ అధిష్టానం 2021 నవంబరు 21న ఖరారు చేసింది.[3][4][5] ఆయన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబరు 23న నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశాడు.[6] దండే విఠల్ 2021 డిసెంబరు 10లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి పోటీ చేసి 667 ఓట్ల మెజారిటీతో గెలిచి 2021 డిసెంబరు 14న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[7] ఆయన 2022 ఫిబ్రవరి 21న శాస‌న‌మం‌డలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[8][9][10][11]

ఆయన 2024 జులై 5న టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[12]

మూలాలు

[మార్చు]
 1. Andhrajyothy (15 December 2021). "ఆరూ.. కారుకే!". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
 2. 10TV (13 January 2020). "మున్సిపల్‌ ఎన్నికలు : 9 మందితో టీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ" (in telugu). Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
 3. Andhrajyothy (21 November 2021). "దండే విఠల్‌కు ఎమ్మెల్సీ సీటు". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
 4. ETV Bharat News. "తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
 5. Sakshi (22 November 2021). "టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!". Archived from the original on 22 November 2021. Retrieved 22 November 2021.
 6. Telangana Today (23 November 2021). "TRS candidate file nomination for Adilabad LAC seat". Archived from the original on 23 November 2021. Retrieved 23 November 2021.
 7. V6 Velugu (14 December 2021). "సిక్స్ కొట్టిన టీఆర్ఎస్" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 8. HMTV (21 February 2022). "ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురి ప్రమాణ స్వీకారం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
 9. Prabha News (21 February 2022). "ఎమ్మెల్సీలుగా ఆ నలుగురు ప్రమాణం". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
 10. EENADU (4 May 2024). "ఎమ్మెల్సీ దండే విఠల్‌ ఎన్నిక రద్దు". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
 11. EENADU (4 May 2024). "ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకం". Archived from the original on 5 May 2024. Retrieved 5 May 2024.
 12. NT News (5 July 2024). "కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు." Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.

చిత్రమాలిక

[మార్చు]