నాంచి జిల్లా

వికీపీడియా నుండి
(దక్షిణ సిక్కిం జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నాంచి జిల్లా
సిక్కిం రాష్ట్ర జిల్లా
సిక్కింలోని ప్రాంతం ఉనికి
సిక్కింలోని ప్రాంతం ఉనికి
రాష్ట్రంసిక్కిం
దేశంభారతదేశం
ముఖ్య పట్టణంనాంచి
Area
 • Total750 km2 (290 sq mi)
Population
 (2011)
 • Total1,46,742
 • Density200/km2 (510/sq mi)
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Websitehttp://ssikkim.gov.in

నాంచి జిల్లా, భారతదేశం సిక్కిం రాష్ట్రం లోని ఒక జిల్లా. "నాంచి" ఈ జిల్లా ముఖ్యపట్టణం.

భౌగోళికం[మార్చు]

దక్షిణ సిక్కిం సముద్రమట్టానికి 400-2000 ఎత్తులో ఉపస్థితమై ఉంది. సంవత్సరమంతా పర్వతప్రాంతాలలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. నంచి, రవంగ్ల, జోర్తంగ్ బజార్, మెల్లి.

జాతీయ అభయారణ్యం[మార్చు]

  • " మీనం విల్డ్ లైఫ్ శాక్చ్యురీ ".

" మీనం - ల" ఔషధాలకు నిధివంటింది. ఈ ప్రాంతంలో అనేక ఆయుర్వేద మూలికలు లభ్యమౌతాయి. హిమాలయ పర్వతాలలో లభించే అమూల్యమైన ఆయుర్వేద మూలికలకు, పర్వతారోహణకు ఇది అనుకూలమైన ప్ర్రంతం. ఈ అరణ్యాలలో ఎర్రని పాండా, గోర్ల్, సెరో, బార్కింగ్ డీర్, మార్బ్లెడ్-క్యాట్ " , చివెట్- క్యాట్, బ్లడ్ ఫీసెంట్, కామన్ హిల్ పార్ట్రిడ్జ్, మ్యాగ్పీ, బ్లాక్ ఈగల్, నీలకంఠ్ పిట్ట, సన్ బర్డ్స్, ఇతర వైవిధ్యమైన జంతువులు నివసిస్తున్నాయి. ఈ శాంక్చ్యురీ వైశాల్యం 36.43 చ.కి.మీ.శాక్చ్యురీ సముద్రమట్టానికి 2400 నుండి 3263 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ శాంక్చ్యురీ తూర్పు భూభాగంలో ప్రవహిస్తున్న సెలఏర్లు తీస్తా నదులో విలీనం ఔతుంటాయి. తిస్తా నదీ జలాలు రంగిత్ నదిలో కలుస్తుంటాయి. ఈ శాంక్చ్యురీ నుండి తిస్తా నది సుదూరంగా కనిపిస్తుంటుంది.

ఆర్ధికరంగం[మార్చు]

దక్షిణ సిక్కిం జిల్లా తూర్పు సిక్కిం, గాంటక్‌లతో పోల్చిచూస్తే అభివృద్ధి చెందుతున్న జిల్లాలలో ఒకటిగా భావించవచ్చు. రాష్ట్రంలో జనసాంధ్రత అధికంగా ఉన్న జిల్లాలలో ఇది రెండవ స్థానంలో ఉంది. జిల్లా ప్రజలలో అత్యధికులు వ్యవసయదారులే. ప్రజల ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. మొక్కజొన్నలు, వడ్లు, అల్లం, యాలుకలు, ఆరంజి పండ్లు, ఉర్లగడ్డలు, వాణిజ్య పంటలు పండిస్తున్నారు. వ్యవసాయంతో తరువాత పర్యాటకం, వ్యాపారం, గ్రామసందర్శన పర్యాటకం, టీ తోటల పెంపకం ప్రధానమైనవిగా అంచనా.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .. 146,742, [1]
ఇది దాదాపు... సెయింట్ లూసియా దేశజసంఖ్యకు సమం [2]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 600 [1]
1చ.కి.మీ జనసాంద్రత 196 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 11.57%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 194:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 82.06%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

జిల్లా ప్రజలలో అత్యధికులు నేపాలీలు ఉండగా తరువాతి స్థానాలలో లెప్చా, భుటియా ప్రజలు ఉన్నారు. అలాగే అత్యధికమైన ప్రజలు నేపాలీ భాషను మాట్లాడుతున్నారు.

జీవజాలం, జంతుజాలం[మార్చు]

1987లో సిక్కిం జిల్లాలో 35చ.కి.మీ వైశాల్యంలో " మీనం విల్డ్‌లైఫ్ సాక్ంచ్యురీ " ఏర్పాటు చెయ్యబడింది.[3]

విభాగాలు[మార్చు]

పాలనా విభాగాలు[మార్చు]

దక్షిణ సిక్కిం 2 ఉపవిభాగాలుగా విభజించబడింది:[4]

పేరు ప్రధాన కేంద్రం గ్రామాలసంఖ్య[5] ప్రాంతం
నాంచి నాంచి
రవోంగ్ రవోంగ్

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Saint Lucia 161,557 July 2011 est.
  3. Indian Ministry of Forests and Environment. "Protected areas: Sikkim". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
  4. Sikkim Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.{{cite map}}: CS1 maint: unrecognized language (link)
  5. "MDDS e-Governance Code (Sikkim Rural)" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. 2011. Retrieved 2011-10-15.

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]