దగ్గరగా దూరంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దగ్గరగా దూరంగా
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం రవి సి. కుమార్
కథ రవి సి. కుమార్
తారాగణం సుమంత్, వేదిక, సిందూ తొలాని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కొండవలస లక్ష్మణరావు, ఆలీ, రంగనాథ్
నిర్మాణ సంస్థ సుధా సినిమా
విడుదల తేదీ 26 ఆగష్టు 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దగ్గరగా దూరంగా 2011 లో విడుదలైన శృంగార థ్రిల్లర్ సినిమా. సుమంత్, వేదిక [1], సింధు తొలానీ నటించారు. ఇది 2011ఆగస్టు 26 న విడుదలై బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. దీనిని మలయాళంలో పూవితాల్ అజాకు (పచ్చదనం), తమిళంలో పూవూడం పుయలోడం, హిందీలో ఆతంక్ కి జంగ్ అనే పేర్లతో అనువదించారు.

కథ[మార్చు]

గౌతమ్ ( సుమంత్ ) ప్రకటన చిత్రాల నిర్మాత. అతను తన ప్రాజెక్టులలో ఒకదాని కోసం ఊహాత్మక డిజిటల్ నమూనాను సృష్టిస్తాడు. ఆ మోడల్ అనుకోకుండా నిజ జీవిత మహిళ మీనాక్షి ( వేధిక ) ని పోలి ఉంటుంది, గౌతమ్ యొక్క రెచ్చగొట్టే ప్రకటన కారణంగా ఆమె పెళ్ళి నిశ్చితార్థం రద్దవుతుంది. కోపంతో మీనాక్షి, గౌతమ్ పైన, అతని ప్రకటన ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

గౌతమ్‌పై చర్యలు తీసుకోవడానికి ఆమె తన స్నేహితురాలు జహ్రీన్ ( సింధు తోలాని) అనే పరిశోధనాత్మక జర్నలిస్టును సంప్రదిస్తుంది. జహ్రీన్ ఓ ప్రమాదకరమైన మిషన్‌లో పనిచేస్తూ ఉంటుంది. రాబోయే ఉగ్రవాద దాడిని బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తూంటుంది. జహ్రీన్ మీనాక్షికి ఉగ్రవాదుల వివరాలతో కూడిన ఓ డివిడిని అందజేసి చనిపోతుంది.

ఆ డివిడి కోసం ఉగ్రవాదులు ఇప్పుడు మీనాక్షి వెంటపడతారు. అనుకోకుండా ఆమె చిక్కుకున్న ఈ దుస్థితి నుండి ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఉగ్రవాద చర్యను నిరోధించగలిగేది ఇప్పుడు పరారీలో ఉన్న మీనాక్షి, గౌతమ్ లు మాత్రమే.

తారాగణం[మార్చు]

సమీక్షలు[మార్చు]

Rediff.com యొక్క సమీక్ష ప్రకారం మొత్తమ్మీద దగ్గరగా దూరంగా చూడదగిన సినిమాయే. సుమంత్, వేదిక ఈ చిత్రాన్ని వారి భుజాలపై వేసుకున్నారు.. సుమంత్ చక్కటి నటనను ప్రదర్శించాడు. వేధికకు చాలా గణనీయమైన పాత్ర ఉంది, దానికి అనుగుణంగా జీవించింది.[2]

మూలాలు[మార్చు]

  1. I have an important role in Daggaraga Dooranga
  2. "Review: Daggaraga Dooranga is worth a watch". rediff. 26 August 2011. Retrieved 3 March 2014.