దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె
దస్త్రం:Bendre.jpg
శ్రీ బెంద్రె
కలం పేరు: అంబికాతనయ దత్త
జననం: 1896 జనవరి31
ధారవాడ
మరణం: 1981 అక్టొబరు 27
ముంబాయి
వృత్తి: వరకవి,అధ్యపకుడు
జాతీయత: భారతీయ
రచనా కాలము: (మొదటి ప్రచురణ నుండి చివరి ప్రచురణ వరకు)
శైలి: కథ,కవిత్వం,విమర్శ,అనువాదం
Subjects: కర్నాటక,జానపద,శ్రావణ,జీవన,ధారవాడ
Literary movement: నవోదయ
తొలి కృతి: (మొదటి ప్రచురణ కృతి)కృష్ణకుమారి
ప్రభావాలు: ఖలీల్ గిబ్రాన్,శ్రీ అరవిందరు ,రవింద్రనాథ టాగూర్
(ఇతర విషయాలు)

జననం-జీవనం[మార్చు]

బెంద్రె క్రీ.శ.1896 జనవరి 31 న కర్ణాటక (ಕರ್ನಾಟಕ) లోని ధారవాడలో జన్మించారు[1].తండ్రి పేరు రామచంద్ర బట్ట, తల్లి పేరు అంబికె (అంబవ్వ). బెంద్రె తన తల్లిపైన అభిమానం కొద్దీ అంబికాతనయ దత్తను కావ్యనామం (కలం పేరు) గా పెట్టుకున్నారు. ఆయన వంశం మూలనామం రోసర. బెంద్రె వైదిక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. బెంద్రె కుటుంబం ఆ కాలంలోని సాంగ్లి సంస్థానికి చెందిన గదగ నగారానికి సమీపాన వున్న శిరహట్టి అనే గ్రామంలో నివాసముండేవారు. బెంద్రెకు 13 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించాడు. క్రీ.శ.1913లో మెట్రిక్యులేషన్ చదువు ముగించుకొని, ఆపైపూనేలోని కాలేజిలో చదువు కొనసాగించి 1918లో బి.ఎ.పట్టభద్రుడయ్యాడు. బి.ఎ.విద్య అనంతరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. 1935లో ఎం.ఏ.లో ఉత్తీర్ణత సాధించాడు. ఎం.ఏ.పట్టం పొందిన తరువాత సొలాపూర్/సొల్లాపూర్ లోని డి.ఎ.వి.కాలేజిలో అధ్యాపకుడుగా 1944-1956 వరకు పనిచేశారు.
బెంద్రె వివాహం లక్ష్మిబాయితో 1919 లో హుబ్బళిలో జరిగింది.ఈ సమయంలోనే ఆయన ప్రథమ కావ్య సంకలనం కృష్ణకుమారి ప్రచురించారు. కవి, దార్శనికుడు అయిన బెంద్రె క్రీశ.1981 అక్టోబరులో మరణించారు. సార్వకాలికమైన కన్నడ కవిత్వాన్ని కన్నడ సాహిత్యానికి అందించిన అపురూపమైన వ్యక్తిత్వమున్న గొప్ప కవి బెంద్రె.[2]

సాహిత్యం రంగంలో[మార్చు]

బెంద్రె జీవితమంతా సాహిత్య ప్రేమికునిగా ఎన్నో రచనలను చేశారు. కాలేజీ చదివే కాలంలోనే కవిత్వరచనను ప్రారంభించారు. 1918లో ఆయన మొదటి కవిత ప్రభాత అనే పత్రికలో ప్రచురించారు. అప్పటి నుండి చివరివరకు ఆయన కావ్యరచన కొనసాగింది. రామచంద్ర బెంద్రె గరి ,కామకస్తూరి ,సూర్యపాన ,నాదలీలె ,'నాకుతంతి మొదలైన కవితా సంకలనాలను ప్రచురించారు. కవితలే కాక బెంద్రె నాటకాలు, సంశోధనాత్మక రచనలు, కావ్య విమర్శలు కూడా రచించారు. 1921లో ధారవాడలో తన మిత్రులతో కలిసి ప్రారంభించిన గెళెయర గుంపు(ಗೆಳೆಯರ ಗುಂಪು)సంస్థలో బెంద్రె గారి రచన కార్యక్రమాలు చాలా చురుగ్గా సాగేవి.1943లో శివమొగ్గలో జరిగిన 27వ కన్నడ సాహిత్య సమ్మేళనానికి అధ్యక్షత వహించాడు. క్రీ.శ.1954 లో నిర్మించిన విచిత్ర ప్రపంచ అనే చలనచిత్రానికి మాటలు, పాటలు రచించారు (1954 సం, చందమామ అక్టొబరు సంచికలో ప్రకటించారు).బెంద్రె కన్నడ భాషలో మాత్రమే కాక మరాఠి భాషలో కూడా రచనలు చేశాడు. బెంద్రె చక్కని ఉపన్యాసకుడు. ఆయన ఉపన్యాసం అంటే శ్రోతలు మక్కువ చూపేవారు. ఆయన ప్రసంగంలో కూడా కవిత్వం తొణకిసలాడేది.[3]

స్వాతంత్ర్య్య సమరంలో[మార్చు]

బెంద్రె ఉత్సాహపూరితంగా సాహిత్యసృజన చేసే రోజుల్లో భారతదేశంలో స్వాతంత్ర్య సమరం ఉద్రేకపూరితంగా సాగేది .ఆ సమయంలో బెంద్రె వ్రాసిన గరి కవిత సంకలనంలో వున్న నరబలి అన్న కవిత నాటి బ్రిటీష్ ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైంది. దేశభక్తుడైన బెంద్రె స్వత్రంత్ర పోరాటంలో పాల్గొని చెరసాల శిక్షను కూడా అనుభవించాడు.

ప్రాచుర్యం[మార్చు]

ఆయన రచించిన నాకుతంతి కృతికి 1974లో ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. ఆయన గీతాలు జానపద శైలిలో పాడేందుకు అనుకూలంగా వుండటంతో, గాయకులు మిక్కిలి సునాయసంగా, శ్రావ్యంగా ఆలపించేవారు. ఇప్పటికి ఆయన గీతంపాతర గిత్తి పక్కనోడిదేన అక్క చిరస్మరణీయమైన, కన్నడనాట జనులందరికి అత్యంత ప్రీతికరమైన పాటగా నిలిచింది.

రచనలు-రచనాకాలం[మార్చు]

 • 1922:కృష్ణాకుమారి (ಕೃಷ್ಣಾಕುಮಾರಿ)
 • 1932:గరి (ಗರಿ)
 • 1934:మూర్తి మరియు కామకస్తూరి (ಮೂರ್ತಿ ಮತ್ತು ಕಾಮಕಸ್ತೂರಿ)
 • 1937:సఖీగీత (ಸಖೀಗೀತ)
 • 1938:ఉయ్యాలె (ಉಯ್ಯಾಲೆ)
 • 1938:నాదలీలె (ನಾದಲೀಲೆ)
 • 1943:మేఘదూత (కాళిదాసు సంస్కృతకావ్యానికి కన్నడ సేత)
 • 1946:హాడుపాడు (ಹಾಡು ಪಾಡು)
 • 1951:గంగావరతణ (ಗಂಗಾವತರಣ)
 • 1956:సూర్యపాన (ಸೂರ್ಯಪಾನ)
 • 1956:హృదయ సముద్ర (ಹೃದಯಸಮುದ್ರ)
 • 1956:ముక్తకంఠ (ಮುಕ್ತಕಂಠ)
 • 1957:చైత్యాలయ (ಚೈತ್ಯಾಲಯ)
 • 1957జీవలహరి (ಜೀವಲಹರಿ)
 • 1957:అరళు మరళు (ಅರಳು ಮರಳು)
 • 1958:నమన ( ನಮನ)
 • 1959:సంచయ (ಸಂಚಯ)
 • 1960:ఉత్తరాయణ (ಉತ್ತರಾಯಣ)
 • 1961:ముగిల మల్లిగె (ಮುಗಿಲಮಲ್ಲಿಗೆ)
 • 1962:యక్షయక్షి (ಯಕ್ಷ ಯಕ್ಷಿ)
 • 1964:నాకుతంతి (ನಾಕುತಂತಿ)
 • 1966:మర్యాదె (ಮರ್ಯಾದೆ)
 • 1968:శ్రీమాతా (ಶ್ರೀಮಾತಾ)
 • 1969:బా హత్తిర (ಬಾ ಹತ್ತರ)
 • 1970:ఇదు నభోవాణి (ಇದು ನಭೋವಾಣಿ)
 • 1972:వినయ (ವಿನಯ)
 • 1973:మత్తె శ్రావణ బంతు (ಮತ್ತೆ ಶ್ರಾವಣಾ ಬಂತು)
 • 1977:ఒలవే నమ్మ బదుకు (ಒಲವೇ ನಮ್ಮ ಬದುಕು)
 • 1978:చతురోక్తి మరియు ఇతర కవితలు (ಚತುರೋಕ್ತಿ ಮತ್ತು ಇತರ ಕವಿತೆಗಳು)
 • 1982:పరాకి (ಪರಾಕಿ)
 • 1982:కావ్యవైఖరి (ಕಾವ್ಯವೈಖರಿ)
 • 1983:తా లెక్కణకి తా దౌతి (ತಾ ಲೆಕ್ಕಣಕಿ ತಾ ದೌತಿ)
 • 1983:బాలభోధె (ಬಾಲಬೋಧೆ)
 • 1983:చైతన్యద పూజె (ಚೈತನ್ಯದ ಪೂಜೆ)
 • 1987:ప్రతిబింబగళు (ಪ್ರತಿಬಿಂಬಗಳು)

విమర్శ వ్యాసాలు[మార్చు]

 • 1937:సాహిత్య మత్తు విమర్శె (ಸಾಹಿತ್ಯ ಮತ್ತು ವಿಮರ್ಶೆ)
 • 1940:సాహిత్య సంశోధనె (ಸಾಹಿತ್ಯಸಂಶೋಧನೆ)
 • 1945:విచార మంజరి (ವಿಚಾರ ಮಂಜರಿ)
 • 1945:కవి లక్ష్మిశ గారి జైమిని భారతానికి మున్నుడి (ಕವಿ ಲಕ್ಷ್ಮೀಶನ ಜೈಮಿನಿಭಾರತಕ್ಕೆ ಮುನ್ನುಡಿ)
 • 1959:మహారాష్ట్ర సాహిత్య;సాయో ఆట (నాటక) (ಮಹಾರಾಷ್ಟ್ರ ಸಾಹಿತ್ಯ;ಸಾಯೋ ಆಟ (ನಾಟಕ) )
 • 1962:కావ్యోద్యోగ (ಕಾವ್ಯೋದ್ಯೋಗ)
 • 1968:కన్నడ సాహిత్యదల్లి నాల్కు నాయకరత్నగళు (ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯದಲ್ಲಿ ನಾಲ್ಕು ನಾಯಕರತ್ನಗಳು)
 • 1974:సాహిత్య విరాట్ స్వరూప (ಸಾಹಿತ್ಯದ ವಿರಾಟ್ ಸ್ವರೂಪ)
 • 1976:కుమారవ్యాస పుస్తికె (ಕುಮಾರವ್ಯಾಸ ಪುಸ್ತಿಕೆ)

బయటి లింకులు[మార్చు]

 1. [1] కన్నడరత్న.కాం

మూలాలు[మార్చు]