దత్తాత్రేయ హోసబలె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దత్తాత్రేయ హోసబలె
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ(ప్రధాన కార్యదర్శి)
In office
మార్చి 2021
వ్యక్తిగత వివరాలు
జననం
దత్తాత్రేయ హోసబలె

(1954-12-01) 1954 డిసెంబరు 1 (వయసు 68)
సొరబ్, కర్ణాటక
జాతీయతభారతీయుడు
వృత్తిసర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్

దత్తాత్రేయ హోసబలె (జననం: 1 డిసెంబర్ 1954) జాతీయ భావాలు కలిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త. ఇతను సంఘ్ పరివార్ విద్యార్థి సంస్థ అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో 15 ఏళ్లపాటు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ప్రస్తుతం మార్చి 2021 నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి)బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

దత్తాత్రేయ హోసబలె 1954లో కర్ణాటకలోని షిమోగాలోని సొరబ్‌లో జన్మించాడు. ఆరెస్సెస్ కార్యకర్తల కుటుంబం నుండి వచ్చిన అతను లాభాపేక్ష లేని విధాన పరిశోధన సంస్థ అయిన ఇండియా పాలసీ ఫౌండేషన్‌కి వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహరించాడు.[1][2]

ఆరెస్సెస్ తో అనుబంధం[మార్చు]

అతను మైసూరు విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, 1968లో ఆరెస్సెస్ లో చేరాడు. 1972లో ఎబివిపిలో చేరి, 1978లో పూర్తిస్థాయి కార్యకర్తగా మారాడు. ఎబివిపిలో అతని చేసిన కృషి 1978లో ఎబివిపి ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వడానికి దారి తీసింది. అతను 15 సంవత్సరాలకు పైగా ఆ పదవిలో ఉన్నాడు. అస్సాంలోని గౌహతిలో యూత్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడంలో కూడా ఇతను చురుకైన పాత్ర పోషించాడు.[3]

అతను కన్నడ, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో నిష్ణాతుడు. అసీమా అనే కన్నడ మాసపత్రిక వ్యవస్థాపక సంపాదకుడు. 2004లో హోసబలె ఆరెస్సెస్ సహ-బౌధిక్ ప్రముఖ్ (ఆరెస్సెస్ మేధో విభాగానికి రెండవ కమాండ్) అయ్యాడు. ఆ తర్వాత, 2009లో, సర్ కార్యవాహ బాధ్యతలో ఉన్న మోహన్ భగవత్ స్థానంలో సురేష్ జోషి వచ్చినప్పుడు, అతను సహ-సర్ కార్యవాహ అయ్యాడు. మార్చి 2021లో సురేష్ జోషి స్థానంలో హోసబలె వచ్చాడు.[4][5] [6]

గుర్తింపు[మార్చు]

ప్రచారక్‌గా ఉంటూ ఎక్కువ సమయం ఎబివిపిలో గడిపిన మొదటి సర్-కార్యవాహ హోసబలె.

మూలాలు[మార్చు]

  1. "Karnataka man may be No. 2 in RSS - Times of India". The Times of India. Retrieved 2018-03-13.
  2. "Welcome to India policy foundation". www.indiapolicyfoundation.org. Retrieved 2018-03-13.
  3. "Explained: Who is Dattatreya Hosabale, the new RSS sarkaryawah?". The Indian Express (in ఇంగ్లీష్). 2021-03-20. Retrieved 2021-03-20.
  4. "RSS conclave: All eyes on Dattatreya Hosabale elevation". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-10. Retrieved 2018-03-13.
  5. Yuva Bharati (in ఇంగ్లీష్). Vivekananda Rock Memorial Committee. 1984.
  6. Hebbar, Nistula (2021-03-20). "Analysis | Who is Dattatreya Hosabale?". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-03-20.