దత్తా గైక్వాడ్
1928, అక్టోబర్ 27న గుజరాత్ లోని వదోదరలో జన్మించిన దత్తా గైక్వాడ్ (Dattajirao Krishnarao Gaekwad) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతని పూర్తి పేరు దత్తారావు కృష్ణారావు గైక్వాడ్. భారత్ తరఫున ఇతడు 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 1952, 1959లో ఇంగ్లాండు పర్యటించిన, 1952-53లో వెస్టీండీస్ పర్యటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. 1959లో పర్యటించిన భారత జట్టుకు నాకకత్వం కూడా వహించాడు.
టెస్ట్ క్రికెట్[మార్చు]
దత్తా గైక్వాడ్ ప్రారంభంలో బాంబే విశ్వవిద్యాలయం, బరోడా లోని మహారాజా సవాజి విశ్వవిద్యాలయం తరఫున ఆడినాడు. 1952లో లీడ్స్లో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసాడు. ఎప్పుడూ ఓపెనింగ్ బ్యాత్స్‌మెన్‌గా విధులు నిర్వర్తించకనే ఏకంగా తొలి టెస్టులోనే ఓపెనర్‌గా రంగప్రవేశం చేశాడు. తదుపరి సంవత్సరంలో వెస్టీండిస్ పర్యటనలో రెండో టెస్టులో క్యాచ్ పట్టేసమయంలో విజయ్ హజారేతో ఢీకొని భుజం గాయం కారణంగా వెస్టీండీస్ పర్యటన అర్థాంతరంగా ఆగిపోయింది.
1957-58లో బరోడా రంజీ జట్టుకు నేతృత్వం వహించి త్రోఫీ సంపాదించిపెట్టాడు. తొమ్మిదేళ్ళలో బరోడాకు ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. ఇదే సీజన్‌లో బలవంతమైన బాంబే రంజీ జట్టుపై డబుల్ సెంచరీ సాధించి సెలెక్టర్లను ఆకట్టుకొని 1958-59లో వెస్టీండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులోకి చివరి టెస్టు కొరకు ఆహ్వానించబడ్డాడు. ఆ టెస్టు రెండో ఇన్నింగ్సులో చేసిన 52 పరుగులే గైక్వాడ్ టెస్ట్ జీవితంలో సాధించిన ఏకైక అర్థసెంచరీ. 1959లో ఇంగ్లాండు పర్యటించిన భారత జట్టుకు హేము అధికారి కెప్టెన్ కాగా అతడు అందుబాటులో లేకపోవడంతో దత్తా గైక్వాడ్ సారథ్యం వహించాడు. కాని సీరీస్ సమయంలో అస్వస్థతకు గురై జట్టుపై పట్టు కోల్పోయాడు. ఆ సీరీస్‌లోని మొత్తం 5 టెస్టులలో పరాజయం పాలై మళ్ళీ దత్తా గైక్వాడ్ టెస్టులలో ఆడలేకపోయాడు.
రంజీ ట్రోఫీ[మార్చు]
దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 శతకాలతో 3139 పరుగులు సాధించాడు. రంజీలో అతని అత్యధిక స్కోరు 1959-60లో మహారాష్ట్రపై సాధించిన 249 పరుగులు.
కుటుంబం[మార్చు]
భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన అంశుమన్ గైక్వాడ్ దత్తా గైక్వాడ్ కుమారుడే. ఇతనికి బరోడా రాజకుటుంబీకులతో కూడా సంబంధముంది. బరోడా సంస్థానానికి డిప్యూటీ కంప్ట్రోలర్‌గా కూడా పనిచేశాడు.