దత్తోపంత్ ఠెన్గడీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దత్తోపంత్ ఠెన్గడీ
జననం
దత్తోపంత్ బాపూరావ్ ఠెన్గడీ

(1920-11-10)1920 నవంబరు 10
అర్వి గ్రామం, వర్ధా జిల్లా, మహారాష్ట్ర, బ్రిటిష్ భారతదేశం.
మరణం14-10-2004
పూణా, మహారాష్ట్ర, గణతంత్ర భారతదేశం.
మరణ కారణంమహానిర్వాణం, మెదడు లో రక్తస్రావం
సమాధి స్థలంరామ్ నరేశ్ భవన్, దిల్లి.
జాతీయతభారతీయడు.
ఇతర పేర్లుఠెన్గడీజి, రాష్ట్ర ఋషి.
విద్యB.A., LL.B
విద్యాసంస్థమోర్రిస్ కళాశాల, నాగ్‌పూర్ .
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ప్రముఖ హిందూత్వవాది
భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్ వగైరా సంస్థల స్థాపకులు.
మరణించే వరకు రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పూర్తి సమయ ప్రచారక్.
తల్లిదండ్రులుబాపూరావ్ దజీబా ఠెన్గడీ (తండ్రి), శ్రీమతి జానకీ దేవి (తల్లి)
పురస్కారాలుపద్మ భూషణ్ పురస్కారం తో సత్కరించినా తిరస్కరించారు.
వెబ్‌సైటుఆధికారిక వెబ్‌సైటు
సంతకం

దత్తోపంత్ బాపూరావ్ ఠెన్గడీ, (నవంబర్ 10, 1920 - అక్టోబర్ 14, 2004) ఒక గొప్ప హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ ల వ్యవస్థాపకులు. వీరు మహారాష్ట్ర లోని వార్ధా జిల్లా, అర్వి అను గ్రామంలో జన్మించారు. ఠెన్గడీ గారు అక్టోబరు 14 వ తేదీన మరణించే వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పూర్తి సమయ ప్రచారక్ గా పనిచేసారు. వీరు భారతదేశ సామాజిక, ఆర్థిక జీవన పరిస్థితుల పైన తనదైన శైలిలో ముద్ర వేసి, భావితరం వారికి మార్గదర్శకం చేసారు. నిరాడంబర జీవనం, ప్రతీ విషయం పైన సరైన అవగాహన, లోతైన, స్పష్టమైన ఆలోచనలు, దృఢ విశ్వాసం, అకుంఠిత దీక్ష వీరి సుగుణాలు.

జీవిత విశేషాలు[మార్చు]

శ్రీ దత్తోపంత్ ఠెన్గడీ గారు 1920 వ సంవత్సరంలో దీపావళి పర్వదినాన వార్ధా అనే కుగ్రామం ( ఆర్వి జిల్లా, మహారాష్ట్ర) లో జన్మించారు. వీరు వృత్తి నైపుణ్యం గల న్యాయవాది, దార్శనికులు, సంస్థాగతులు, దూరదృష్టి కలవారు. ఆర్వి లోని "వానర సేన", ఉన్నత పాఠశాల విద్యార్థి సంఘాలకి అధ్యక్షత వహించి చిన్నతనం లోనే తన నిరుపమాన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. వీరు స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనేవారు. 1936 నుండి 1938 వరకు హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్.ఎస్.ఆర్.ఏ) లో సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరు 1950-51 కాలంలో భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐ.ఎన్.టి.యు.సి) నకు కార్యనిర్వహణాధికారిగా పనిచేసారు. వీరు తపాలా, రైల్వే కార్మికుల సంఘం (కమ్యునిస్టు పార్టి) తో కూడా సంబంధాలు కలిగివుండేవారు. గురూజీగా పిలువబడే శ్రీ మాధవ్ రావ్ సదాశివరావ్ గొల్వాల్కర్, సమకాలీన నాయకులైన బాబా సాహెబ్ అంబేద్కర్, పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి వారి ప్రభావం ఠెన్గడీ గారి పై ఎక్కువగా ఉండేది. కాలంతో పాటు అనేక సంస్థలను ప్రారంభించిన వీరు హిందూధర్మ, భారత దర్శన సిద్ధాంతాలకు కట్టుబడ్డారు.

సంస్థల స్థాపకులు:[మార్చు]

భారతీయ మజ్దూర్ సంఘ్ (1955), భారతీయ కిసాన్ సంఘ్ (1979), స్వదేశీ జాగరణ్ మంచ్ (1991), సామాజిక్ సమరసతా మంచ్, సర్వ- పంథ్ సమదార్ మంచ్, పర్యావరణ్ మంచ్ లాంటి సంస్థలను స్థాపించి వాటి అభివృద్ధికి పాటుపడ్డారు. అంతేగాక, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ అధివక్త పరిషత్, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్, భారతీయ విచార కేంద్ర్ లాంటి సంస్థలకు వ్యవస్థాపక సభ్యులు.

పార్లమెంటు లో:[మార్చు]

1964-76 కాలంలో రాజ్యసభకు రెండు మార్లు ఎన్నికకాబడి, 1968-70 కాలంలో దానికి ఉపాధ్యక్షతను వహించారు. వీరు పార్లమెంటు సభ్యునిగా చేపట్టిన ప్రతి పనిలో తనదైన శైలిని వ్యక్తపరిచేవారు. 1975 వ సంవత్సరంలో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ శక్తులను ఏకాభిప్రాయానికి తేవడంలో వర్ణనాతీతమైన నాయకత్వ ప్రతిభను కనపరిచారు.

యాత్రలు:[మార్చు]

వీరు భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు. వీరు 1969 లో పార్లమెంటు ప్రతినిధి బృంద సభ్యునిగా సోవియేట్ యూనియన్, హంగరీ దేశాలను, 1979 లో 2వ అంతర్జాతీయ వర్ణవివక్ష వ్యతిరేక సభ కొరకు స్విజర్ల్యాండు లోని జెనీవా నగరాన్ని పర్యటించారు. వీరిని అమెరికా, కెనడా, బ్రిటన్, యుగోస్లేవియా దేశాలు కార్మికోద్యమం మీద సరళీకృత విధానాల ప్రభావాన్ని అధ్యయనం చేయుటకు తమ దేశాలకి ఆహ్వానించాయి. వీరి ప్రతిభ కారణంగా చైనా, ఇండొనేషియా, బంగ్లాదేశ్, బర్మా, థాయ్ ల్యాండ్, మలేశియా, కెన్యా, ఉగాండా, టాంజానియా లాంటి దేశాలను అనేకానేక సందర్భాల్లో సందర్శించారు.

వీరి రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల పై పట్టు, అద్భుత వాక్చాతుర్యం సభికులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. పాశ్చాత్య విధానాలైన పెట్టుబడిదారీ, సామ్యవాద విధానాల పై విసుగు చెంది, సనాతన ధర్మం ఆధారంగా, సామాజిక, ఆర్థిక అభివృద్ధి కొరకు ఒక క్రొత్త మూడవ విధానాన్ని కనుగొన్నారు. తన భావజాలం ఆధారంగానే కాకుండా తన అనుభవం ఆధారంగా కూడా అనేక పుస్తకాలను వ్రాసారు. వాటిలో కొన్ని: ద థిర్ద్ వే; మొడ్రనైజేషన్ వితౌట్ వెస్ట్రనైజేషన్: వాట్ సస్‌టైన్‌స్ సంఘ్?, అవర్ నేష్నల్ రినైసెంస్, ఇట్స్ డైరెక్షన్‌స్ అండ్ డెస్టినేషన్; నేషనల్ పర్స్యూట్; ద గ్రేట్ సెంటినెల్ అండ్ ద పర్స్పెక్టివ్.

ఉపన్యాసం:[మార్చు]

దత్తోపంత్ ఠెన్గడీ గారి యూ ట్యూబ్ ఉపన్యాసాలు

మరణం-సంతాపం[మార్చు]

దత్తోపంత్ ఠెన్గడీ గారు,2004 అక్టోబరు 14 వ తేదీన మెదడులో రక్తస్రావంతో పరమపదించారు. వీరి మృతి పట్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు సానుభూతిని తెలిపారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి:[మార్చు]

దత్తోపంత్ ఠెన్గడీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్న అటల్ బీహరి వాజ్‌పేయి.
అతని పుస్తకాలు మనకు దిక్సూచి


అటల్ బిహారీ వాజ్‌పేయి, భారత ప్రధానమంత్రి:

"ఠెన్గడీ గారితో నాది చాల గొప్ప అనుబంధం. భోపాల్ లో జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ ఎర్పాటు సభలో నేనూ పాల్గొన్నాను. ఆ సభలో కొత్త సంస్థకు ఏ పేరు పెట్టాలని చర్చిస్తుండగా, ఠెన్గడీ గారు శ్రమజీవి సంఘటన్ అనే పేరు ను ప్రతిపాదించారు. కాని కొత్త సంస్థ పేరు సులభంగా ఉండాలనే ఉద్దేశం తో భారతీయ మజ్దూర్ సంఘ్ అని ఖరారు చేసాం. ఇవ్వాళ్టి సమయం లో కార్మికోద్యమం ఎన్నోసవాళ్ళను ఎదుర్కొంటోంది. మన ముందు ఉన్న రెండు ఆర్థిక విధానాలు కాకుండా, కార్మికుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు రెండింటినీ దృష్టి లో ఉంచుకొని, మూడవ విధానాన్ని కనుగొనాల్సిన అవసరం ఉంది.దాని కొరకు, ఠెన్గడీ గారి ఆర్థిక విధానాలను పరిగణలోకి తీసుకోవాలి. ఠెన్గడీ గారి పుస్తకాలను ప్రతి ఒక్కరు చదవాలి. అవే మనకు దిక్సూచి."

లాల్ కృష్ణ అడ్వాణీ:[మార్చు]

దత్తోపంత్ ఠెన్గడీకి శ్రద్ధాంజలి ఘటిస్తున్న లాల్ కృష్ణ అడ్వాణి
అంకితభావం గల దేశ సేవకుడు


ఎల్.కే.అడ్వాణీ, భారత ఉపప్రధాని:

"నాకు ఠెన్గడీ గారితో 50 ఏళ్ల సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాను. ఠెన్గడీ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏమని చెప్పగలం? అంకిత భావం గల దేశసేవకుడనా? ఆయన తన జీవితాంతం ఒక కర్మయోగి లా బ్రతికారు. ప్రతి పనిని పూర్తి భాధ్యతతో మొదలుపెట్టేవారు.తన విశ్వాసాల పై, తన భావజాలాల పై రాజీపడకుండానే ఎంతో మంది స్నేహితులను పొందారు. ఇతని ఆలోచనలు కేవలం కార్మికుల గురించే కాకుండా యావత్ దేశ, ప్రపంచ బాగోగుల గురించి కూడా ఉండేవి. ఠెన్గడీ గారి మరణం నాకు వ్యక్తిగతలోటు కూడా. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది."

అశోక్ సింహల్:[మార్చు]

దత్తోపంత్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న అశోక్ సింఘల్
పేద ప్రజల, రైతుల పాలిట దేవదూత


అశోక్ జీ సింహల్, విశ్వహిందూ పరిషత్, అంతర్జాతీయ అధ్యక్షులు:

"దత్తోపంత్ గారి మరణంతో మనం అనాధలయ్యాం. ఆయన పేద ప్రజల, రైతుల పాలిట దైవదూత. ఠెన్గడీ లాంటి వారు మరణించిన లోటును ఎవరూ పూడ్చలేరు. అతని తల్లి, శ్రీ గురూజి లే అతనికి మార్గదర్శకులు. దేశం క్లిష్టసమస్యలను ఎదుర్కొంటున్న సమయాన ఠెన్గడీ గారు మన మధ్య లేకపోవడం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది."

మూలాలు:[మార్చు]

1.The Organiser, 31 October 2004 issue. p. 13, Article Named- 'His writings will guide us'
2.The Organiser, 31 October 2004 issue. p. 13, Article Named- Messiah of poor and farmer
3.New Indian Express Chennai Article-"A Tapasvi Dies, Unnoticed" by S.Gurumurthy, dated 31-10-2004
4.डा. अम्बेडकर और सामाजिक क्रान्ति की यात्रा, Introduction of Author, paragraph 2
5.A Nationalist Pursuit, Published by Sahitya Sindhu Prakashana- Introduction of the author.
6.Dattopant Thengadi Article on 'Founder' page of BMS' official website.
7.Introduction of SJM on its official website
8.Dattopant Thengadi Article on Bharatiya Kisan Sangh Page as a founder.
9. His Speech at All India National Convention of Swadeshi Jagran Manch, Bhopal. 19th Nov. 2000
10. The Organiser, 31 October 2004 issue. p. 13, Article Named- Dedicated Rashtrasevak

బాహ్యమూలాలలు[మార్చు]

  1. De Facto Official Website- Dattopant Thengadi Archived 2012-09-28 at the Wayback Machine
  2. Swadeshi Jagaran Manch
  3. Bharatiya Kisan Sangh
  4. Bharatiya Mazdoor Sangh
  5. Shri S.Gurumurthy