దమోహ్
Damoh జిల్లా दामोह जिला | |
---|---|
![]() Madhya Pradesh లో Damoh జిల్లా స్థానము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | Madhya Pradesh |
పరిపాలన విభాగము | Sagar |
ముఖ్య పట్టణం | Damoh |
ప్రభుత్వం | |
• లోకసభ నియోజకవర్గాలు | Damoh |
విస్తీర్ణం | |
• మొత్తం | 7 కి.మీ2 (2,821 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 12,63,703 |
• సాంద్రత | 170/కి.మీ2 (450/చ. మై.) |
జనగణాంకాలు | |
• అక్షరాస్యత | 70.92 per cent |
• లింగ నిష్పత్తి | 913 |
జాలస్థలి | అధికారిక జాలస్థలి |
మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో దామోహ్ జిల్లా (హిందీ:दमोह ज़िला) ఒకటి.దామోహ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సాగర్ డివిషన్లో భాగంగా ఉంది.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
జిల్లాలో చరిత్రప్రాధాన్యత కలిగిన పలు ప్రాంతాలు ఉన్నాయి. దామోహ్ పట్టణానికి 21కి.మీ దూరంలో గౌరయా నదీ తీరంలో ఉన్న నొహటా పట్టణం చండేలా రాజపుత్రులకు రాజధానిగా ఉండేది..
చారిత్రాత్మక ప్రాంతాలు[మార్చు]
దామోహ్ పట్టణానికి 6కి.మీ దూరంలో రాజ్నగర్ గ్రామాన్ని ముగలులు స్థాపించారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన మరొక ప్రాంతం సింఘోర్గర్ కోట. దీనిని రాజ వైన్ బాసన్ స్థాపించాడు. గోండి ప్రజల రాజులు ఈ కోటలో దీర్ఘకాలం నివసించారు. గోండ్ రాజా దలపత్ షా మరియు రాణి దుర్గావతి ఈ కోటలో 15వ శతాబ్దం చివరి వరకు నివసించారు. దలపత్ సింగ్ మరణించిన తరువాత అక్బర్ చక్రవర్తి సేనాధిపతితో రాణి దుర్గావతి సిగ్రాంపూర్ వద్ద యుద్ధం చేసింది.
భౌగోళికం[మార్చు]
నర్సింగ్గర్ పట్టణం సొనార్ నదీతీరంలో ఉంది. ఇక్కడ షాహ్ తైయాబ్ నిర్మించిన పురాతన కోట ఉంది. నర్సింగ్గర్ పట్టణం సమీపంలో ఆదిత్యా బిర్లాగ్రూప్ స్థాపించిన సిమెంటు ఫాక్టరీ ఉంది.
ఆలయాలు[మార్చు]
కుండల్పూర్లో పలు ప్రముఖమైన జైన ఆలయాలు ఉన్నాయి. కండలూర్ దామోహ్ పట్టణానికి 58 కి.మీ దూరంలో ఉంది. కండలూర్లో 58 జైన ఆలయాలు ఉన్నాయి..
పర్యాటక ఆకర్షణలు[మార్చు]
- బందక్పూర్ వద్ద ఉన్న జగేశ్వర్నాథ్ ఆలయం ప్రముఖ హిందూయాత్రా స్థలంగా ఉంది.
- దామోహ్లో లోడీ రాజపుత్రులు (ఠాకూర్) మరియు రాయ్ ఆధిక్యత కలిగి ఉన్నారు.
- దామోహ్లో అందమైన ఘంటాగర్ (గడియారపు ఇల్లు) సర్క్యూట్ హౌస్, జబల్పూర్ వద్ద మహారాణా ప్రతాప్ శిల్పం, కీర్తి స్తంభ్, గజాననన్ పహాడి, నౌగజ పహాడీ, తహ్సిల్ మైదానం సమీపంలో ఉన్న రాణి దమయంతి బాయి కోట, నెహ్రుపార్క్ మరియు చాలా అందమైన జఠాశంకర్ ఆలయం ఉన్నాయి.
- కుండల్పూర్ (సంస్కృతం: कुण्डलपुर) దేశంలో ప్రముఖ జైన యాత్రాప్రదేశాలలో ఇది ఒకటిగా భావించబడుతుంది. కండలూర్ దామోహ్ నగరానికి 35 కి.మీ దూరంలో మధ్యప్రదేశ్ కేంద్రస్థానంలో ఉంది.
- " తరుణ్ సాగర్ జీ మహరాజ్ " జన్మ స్థానం దామోహ్ జిల్లాలోని గుహంచి గ్రామం.
ఆర్ధికం[మార్చు]
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దామోహ్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,263,703,[2] |
ఇది దాదాపు. | ఎస్టోనియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | న్యూహాంప్ షైర్ నగర జనసంఖ్యకు సమం..[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 383వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 173 .[2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 16.58%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 913:1000,[2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 70.92%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires
|website=
(help) - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires
|website=
(help) - ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Estonia 1,282,963 July 2011 est.
line feed character in|quote=
at position 8 (help); Cite web requires|website=
(help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
New Hampshire 1,316,470
line feed character in|quote=
at position 14 (help); Cite web requires|website=
(help)
బయటి లింకులు[మార్చు]
![]() |
చత్తర్పూర్ జిల్లా | పన్నా జిల్లా | ![]() | |
సాగర్ జిల్లా | ![]() |
కత్ని జిల్లా | ||
| ||||
![]() | ||||
నర్సింగ్పూర్ జిల్లా | జబల్పూర్ |
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to దమోహ్. |