దయానంద్ చందేలా
స్వరూపం
| దయానంద్ చందేలా | |||
| పదవీ కాలం 2008 – 2013 | |||
| ముందు | రమేష్ లాంబా | ||
|---|---|---|---|
| తరువాత | మంజీందర్ సింగ్ సిర్సా | ||
| నియోజకవర్గం | రాజౌరి గార్డెన్ | ||
| పదవీ కాలం 2003 – 2008 | |||
| ముందు | మహీందర్ సింగ్ సాథి | ||
| తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
| నియోజకవర్గం | విష్ణు గార్డెన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1954 ఖ్యాలా, న్యూఢిల్లీ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2008 వరకు) | ||
| జీవిత భాగస్వామి | ధన్వతి చందేలా | ||
| బంధువులు | మీనాక్షి (కోడలు)[1] | ||
| సంతానం | మేఘరాజ్, ప్రియా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దయానంద్ చందేలా (జననం 1954) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]దయానంద్ చందేలా రాజకీయాల్లోకి రాకముందు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఇంజనీరింగ్ విభాగంలో నాన్-టెక్నికల్ సూపర్‌వైజర్‌గా పని చేసి రాజకీయాల పట్ల ఆసక్తితో 1986లో ఉద్యోగ విరమణ చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన 1993, 1998లో శాసనసభ ఎన్నికలలో విష్ణు గార్డెన్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
- 1997లో డాక్టర్ చందేలా ఆయన భార్య ధన్వతి చందేలా ఇద్దరూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి విష్ణు నగర్ & గురునానక్ నగర్ వార్డుల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా భారీ ఆధిక్యంతో గెలిచి ఒకే ఎన్నికల్లో వేర్వేరు వార్డుల నుండి గెలిచిన ఏకైక వివాహిత జంటగా వారి పేర్లు గిన్నిస్ పుస్తకంలో నమోదు చేయబడ్డాయి.
- 2002లో వాళ్లిదరు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా టికెట్‌పై మళ్ళీ పోటీ చేసి తిరిగి ఎన్నికయ్యారు.
- 2003లో దయానంద్ చందేలా బిజెపిలో చేరి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విష్ణు గార్డెన్ పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 2004లో తన కుమారుడు మెఘ్‌రాజ్ వచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి టికెట్ ఆశించగా పార్టీ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.
- 2007లో ఆయన కుమారుడు మేఘరాజ్, కోడలు మీనాక్షి చండిలా రాజౌరి గార్డెన్ నియోజకవర్గంలో భాగమైన విష్ణు గార్డెన్& ఖ్యాలా వార్డు నుండి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా టిక్కెట్‌పై పోటీ చేసి గెలిచారు.
- ఆయన 2008లో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరి రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
- 2012లో ఆయన కుమారుడు మేఘరాజ్, కోడలు మీనాక్షి చండిలా రాజౌరి గార్డెన్ నియోజకవర్గంలో భాగమైన విష్ణు గార్డెన్& ఖ్యాలా వార్డు నుండి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి గెలిచారు.
- ఆయన భార్య ధన్వతి చందేలా 2013 ఎన్నికలలో, కోడలు మీనాక్షి చందేలా 2015, 2017 రాజౌరి గార్డెన్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు.[2]
- 2017లో ఆయన కుమార్తె ప్రియా చందేలాఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఖ్యాలా వార్డ్ నుండి గెలిచింది
- 2020లో ఆయన భార్య ధన్వతి చందేలాతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి, అతని భార్య ధన్వతి చందేలా రాజౌరి గార్డెన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
మూలాలు
[మార్చు]- ↑ "Rift within Congress over MCD election tickets" (in ఇంగ్లీష్). India Today. 28 March 2012. the original నుండి 13 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2025.
- ↑ "Rajouri Garden bypolls: We are making up for lack of leadership in the area, says Congress candidate" (in ఇంగ్లీష్). The Indian Express. 20 March 2017. the original నుండి 13 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2025.