Jump to content

దయారామ్ సాహనీ

వికీపీడియా నుండి
రావు బహుదూర్ దయారామ్ సాహనీ =

జననం (1879-12-16)1879 డిసెంబరు 16
భోడా, బ్రిటీష్ పంజాబ్, ప్రస్తుత పాకిస్తాన్
మరణం1939 మార్చి 7(1939-03-07) (వయసు: 59)
జైపూర్ రాజస్థాన్
ప్రాముఖ్యతహరప్పా

రావు బహదూర్ దయా రామ్ సాహనీ (16 డిసెంబర్ 1879 - 7 మార్చి 1939) 1921–22లో సింధు లోయ నాగరికత ప్రదేశమైన హరప్పాలో తవ్వకాలకు నాయకత్వం వహించిన భారతీయ పురావస్తు శాస్త్రవేత్త . 1931 సంవత్సరంలో, సాహనీ భారత పురావస్తు సర్వే సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన మొదటి భారతీయుడు అయ్యాడు. ఆయన 1935 వరకు ఈ పదవిలో కొనసాగారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, 1922లో, శ్రీ రాఖల్‌దాస్ బనర్జీ తవ్వకాలలో మరొక ప్రదేశాన్ని కనుగొన్నారు.

అతను జాన్ మార్షల్ కు సహాయకుడిగా పనిచేస్తున్న సమయములో ఈ తాజా ప్రదేశం కనుగొనబడిన తర్వాత, ఈ నాగరికత బహుశా సింధు నది లోయకే పరిమితమై ఉంటుందని భావించారు; అందువల్ల, ఈ నాగరికతకు 'సింధు లోయ నాగరికత' అని పేరు పెట్టారు.

జీవిత విశేషాలు

[మార్చు]

దయారామ్ సాహనీ 1879 డిసెంబర్ 16న పంజాబ్‌లోని షాపూర్ జిల్లాలోని భేడా అనే పట్టణంలో జన్మించాడు. ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో పట్టభద్రుడయ్యాడు, అందులో బంగారు పతకాన్ని అందుకున్నాడు. 1903లో, అతను ఓరియంటల్ కళాశాల నుండి ఎం.ఎ. చేసాడు, అందులో కూడా మొదటి స్థానం సాధించాడు. తన అత్యుత్తమ విజయాల కారణంగా, దయారామ్ సహానీకి భారత పురావస్తు సర్వే సంస్థ స్పాన్సర్ చేసిన సంస్కృత స్కాలర్‌షిప్ లభించింది. తన చదువు పూర్తయిన తర్వాత, ఆయనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసే అవకాశం లభించింది.

మూలములు

[మార్చు]

దయారామ్ సాహనీ

ఇవి కూడా చూడండి

[మార్చు]

రాఖల్‌దాస్ బనర్జీ