దరువు అంజన్న
స్వరూపం
| దరువు అంజన్న | |
|---|---|
| జననం | కమ్మరి అంజయ్య 1970 రాయపోల్, రాయపోల్ మండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ |
| నివాస ప్రాంతం | హైదరాబాద్, తెలంగాణ |
| ప్రసిద్ధి | ఉద్యమగీత రచయిత, గాయకులు |
| భార్య / భర్త | సునీత |
దరువు అంజన్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమ గీత రచయిత, గాయకుడు. ఆయనను 2025 జూన్ 30న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1][2][3]
ఆయన 2015లో నిజమైన కళాకారులకు ఉద్యోగాలివ్వాలంటూ దగాపడ్డ కళాకారులందరినీ సమీకరించి తెలంగాణ కోసం గజ్జెకట్టి పాడిన కళాకారులను పక్కన పెట్టి, ఉద్యమంతో ఏమాత్రమూ సంబంధం లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ కళాకారుల దీపం కేసీఆర్: సాంస్కృతిక సారథికి శాపం రసమయి బాలకిషన్' పేరిట ప్రత్యేక కార్యక్రమం ధూంధాంను నిర్వహించాడు.
ఆయన 2025 జులై 28న బీసీ కల్చరల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.[4][5]
అవార్డులు
[మార్చు]- నంది అవార్డు - 2023[6]
- గద్దర్ ఐకాన్ అవార్డు - 2024[7]
- తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ వారి గద్దర్ స్మారక పురస్కారం - 2025[8]

మూలాలు
[మార్చు]- ↑ "'సాంస్కృతిక'సలహాదారుగా అంజన్న". Sakshi. 3 July 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
- ↑ "భాషా సాంస్కృతిక శాఖ సలహాదారుల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కోదండరాం". NT News. 30 June 2025. Archived from the original on 1 July 2025. Retrieved 1 July 2025.
- ↑ "'సాంస్కృతిక' సలహాదారుగా దరువు అంజన్న". Sakshi. 3 July 2025. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
- ↑ "సాంస్కృతిక ఉద్యమంతో బీసీ పోరాటం బలోపేతం". Eenadu. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "బీసీల సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం". Andhrajyothy. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
- ↑ "దరువు అంజన్నకు నంది అవార్డు". Disha Daily. 6 February 2023. Archived from the original on 1 August 2025. Retrieved 1 August 2025.
- ↑ "దరువు అంజన్నకు, బుర్ర సతీష్‌కు అవార్డులు". Sakshi. 5 May 2025. Retrieved 1 August 2025.
- ↑ "తెలంగాణ వీరుల పేరిట అవార్డులు అభినందనీయం". Andhrajyothy. 28 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.