దరోగ ప్రసాద్ సరోజ
| దరోగ ప్రసాద్ సరోజ | |||
| పదవీ కాలం 2024 జూన్ 4 | |||
| ముందు | సంగీత ఆజాద్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | లాల్‌గంజ్ | ||
| పదవీ కాలం 2004 – 2009 | |||
| ముందు | బాలి రామ్ | ||
| తరువాత | బాలి రామ్ | ||
| పదవీ కాలం 1998 – 1999 | |||
| ముందు | బాలి రామ్ | ||
| తరువాత | బాలి రామ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1956 జనవరి 1 అజంగఢ్ , ఉత్తరప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| జీవిత భాగస్వామి | పట్టి దేవి | ||
| నివాసం | మోహన్‌పూర్ పట్వాన్స్, మాధోపూర్, ధరంగ్, అజంగఢ్ , ఉత్తరప్రదేశ్ | ||
| పూర్వ విద్యార్థి | గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం[1] | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | |||
దరోగ ప్రసాద్ సరోజ్ (జననం 1 జనవరి 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]దరోగ ప్రసాద్ సరోజ సమాజ్‌వాది పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లాల్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి బాలి రామ్ చేతిలో 54,190 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి బాలి రామ్ పై 16996 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
దరోగ ప్రసాద్ సరోజ 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి బాలి రామ్ చేతిలో 30,999 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి బాలి రామ్ పై 42,731 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
దరోగ ప్రసాద్ సరోజ 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ 147182 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2004 లోక్‌సభ ఎన్నికలలో ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజెపీ అభ్యర్థి నీలం సోంకర్ పై 1,15,023 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "DAROGA PRASAD SAROJ(Samajwadi Party(SP)):Constituency- Lalganj(UTTAR PRADESH) - Affidavit Information of Candidate".
- ↑ "लालगंज लोकसभा सीट से जीतने वाले सपा के दरोगा सरोज कौन हैं? जानिए अपने सांसद को" (in హిందీ). TV9 Bharatvarsh. 6 June 2024. Archived from the original on 14 June 2025. Retrieved 14 June 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Lalganj". Election Commission of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.
- ↑ "Lalganj Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 23 June 2025. Retrieved 23 June 2025.