దశ-అంగములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. (అ.) 1. గుగ్గిలము, 2. మహిషాక్షి, 3. సాలనిర్యాసము, 4. అగరు, 5. దేవదారువు, 6. వట్టివేరు, 7. మారేడుపండు, 8. కురువేరు, 9. చందనము, 10. ముస్తలు [ఇవి ధూపాంగములు] [వృద్ధహారీతస్మృతి 7-104]
  2. (ఆ.) 1. రసము, 2. భావము, 3. అభినయము, 4. ధర్మి, 5. వృత్తి, 6. ప్రవృత్తి, 7. సిద్ధి, 8. స్వరము, 9. ఆతోద్యము, 10. గానము [ఇవి నాట్యాంగములు].
  3. (ఇ.) 1. చారి, 2. స్థానము, 3. న్యాసము, 4. ప్రవిచారము, 5. సౌష్ఠవము, 6. కరణము, 7. వ్యాయామము, 8. మండలము, 9. గతి, 10. ఆసనము [ఇవి ధనుర్వేదాంగములు].
  4. (ఈ.) 1. గేయపదము, 2. స్థితపాఠ్యము, 3. ఆసీనము, 4. పుష్పగంధిక, 5. ప్రచ్ఛేదకము, 6. త్రిమూఢము, 7. సైంధవము, 8. ద్విమూఢము, 9. ఉత్తమోత్తమము, 10. ఉత్త ప్రత్యుక్తకము [ఇవి లాస్యాంగములు] [నృత్తరత్నావళి 1-58]
  5. (ఉ.) 1. సంపత్తు (అక్షర సమృద్ధి), 2. విరామము, 3. పాదములు, 4. దేవత, 5. స్థానము, 6. అక్షరము, 7. వర్ణము, 8. స్వరము, 9. విధి (అక్షరముల కూర్పు), 10. వృత్తి [ఇవి ఛందస్సు యొక్క అంగములు].

"సంపద్విరామపాదాశ్చ దేవతా స్థానమక్షరమ్‌, వర్ణః స్వరా విధీర్వృత్తమితి చ్ఛందోగతో విధిః" [భరతనాట్యశాస్త్రము 14-102]