దసరా (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దసరా
దర్శకత్వంశ్రీకాంత్ ఓదెల
రచనశ్రీకాంత్ ఓదెల
నిర్మాతసుధాకర్ చెరుకూరి
తారాగణం
ఛాయాగ్రహణంసత్యన్ సూర్యన్
కూర్పునవీన్ నూలి
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
విడుదల తేదీs
2023 మార్చి 30 (2023-03-30)(థియేటర్)
2023 ఏప్రిల్ 27 (2023-04-27)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
సినిమా నిడివి
2 గంటల 36 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

దసరా 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని, కీర్తి సురేష్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 14న విడుదల చేసి[2] సినిమాను మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన[3], ఈ సినిమా ఏప్రిల్ 27 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]

దసరా సాధారణంగా విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం 7 ఏప్రిల్ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ₹100 కోట్లు రాబట్టింది, తద్వారా 2023లో అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదో భారతీయ చిత్రంగా నిలిచింది.[5]

చిత్ర నిర్మాణం[మార్చు]

దసరా సినిమా షూటింగ్ 2022 ఫిబ్రవరి 16న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.[6] గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని లుక్‌ని 2022 మార్చి 20న విడుదల చేశారు.[7] ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో రూ.12 కోట్లతో ఓ పల్లెటూరు సెట్ వేశారు.[8]

కథ[మార్చు]

వీర్లపల్లి గ్రామంలో ఉండే ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) , వెన్నెల (కీర్తి సురేష్) ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. వెన్నెల (కీర్తి సురేష్) గ్రామంలోని అంగన్ వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంటుంది. వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు, కానీ సూరి వెన్నెలని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలిసి స్నేహితుడి కోసం తన ప్రేమని త్యాగం చేసి సూరికి, వెన్నెలకి పెళ్లి అయేట్టు చేస్తాడు. వెన్నెల‌ను పెళ్లిచేసుకున్న రోజే సూరిని గుర్తు తెలియని ఆగంతకులు చేతిలో దారుణంగా హ‌త్య‌కు గుర‌వుతాడు? అసలు ఈ హత్య చేసిందెవరు ? వారిని ధరణి (నాని) ఎలా కనిపెట్టి వారిని శిక్షించాడు అనేదే మిగతా సినిమా కథ.[9]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
  • నిర్మాత: సుధాకర్ చెరుకూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల[15][16]
  • సంగీతం: సంతోష్ నారాయణన్
  • సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
  • ఎడిటింగ్‌: నవీన్ నూలి
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ చాగంటి
  • ప్రొడక్షన్‌ డిజైనర్‌‌: అవినాష్‌ కొల్లా
  • స్టాంట్స్: రియల్ సతీష్, అంబరీవ్
  • మాటలు: తోట శ్రీనివాస్
  • పాటలు: కాసర్ల శ్యామ్, శ్రీమణి, రెహమాన్, గడ్డం సురేష్
  • కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్, ఈశ్వర్ పేంటీ

పాటలు[మార్చు]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ధూమ్ ధామ్ దోస్తాన్"  రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ, గన్నోరా దాస లక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న (నల్గొండ గద్దర్), కాసర్ల శ్యామ్ 4:02
2. "ఓరి వారి"  సంతోష్ నారాయణన్ 3:34
3. "ఛమ్‌కీలా అంగీలేసి ఓ వదినే"  రామ్ మిరియాల, ధీ 3:23

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (17 March 2023). "'దసరా' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?". Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
  2. Namasthe Telangana (14 March 2023). "యెట్లైతే గట్లాయె సూస్కుందాం.. ఊర మాస్‌గా నాని దసరా ట్రైలర్‌". Archived from the original on 14 March 2023. Retrieved 14 March 2023.
  3. Andhra Jyothy (14 January 2023). "స్కూటర్‌ పై వన్నెలాడి". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  4. Prime9 (20 April 2023). "ఓటీటీలో 'ధూం ధాం' చేయనున్న దసరా". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "Dasara (దసరా) Telugu Movie All Details". FilmiBug. 28 August 2022. Archived from the original on 28 నవంబర్ 2022. Retrieved 26 August 2022. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  6. 10TV (16 February 2022). "నాని 'దసరా' మొదలైంది." (in telugu). Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Prabha News (20 March 2022). "'ద‌స‌రా' మూవీ ఫ‌స్ట్ లుక్ - ఊర‌మాస్ గా నాని". Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.
  8. A. B. P. Desam (25 January 2022). "నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?" (in ఇంగ్లీష్). Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.
  9. Eenadu (25 April 2023). "రివ్యూ: 'దసరా'.. నాని సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
  10. Namasthe Telangana (8 August 2022). "'దసరా' చిత్రంలో నాని". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
  11. Hindustantimes Telugu, Nelki Naresh (17 October 2022). "పెళ్లి కూతురు గెట‌ప్‌లో కీర్తిసురేష్ -ద‌స‌రా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌". Archived from the original on 17 October 2022. Retrieved 17 October 2022.
  12. Namasthe Telangana (12 March 2023). "తెలంగాణ యాస నేర్చుకున్నా!". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  13. Andhra Jyothy (12 March 2023). "'దసరా'తో నా కెరీర్‌ మలుపు తిరిగింది". Archived from the original on 12 March 2023. Retrieved 12 March 2023.
  14. "Nani's Next Telugu Film With Director Srikanth Odela Titled 'Dasara'". FilmiBug. 23 March 2023. Archived from the original on 28 నవంబర్ 2022. Retrieved 23 March 2022. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  15. Eenadu (30 April 2023). "స్నేహితులు దిద్దిన జీవితం నాది". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.
  16. Eenadu (7 May 2023). "ఆయనతో ప్రయాణమే... ఓ పాఠం". Archived from the original on 7 May 2023. Retrieved 7 May 2023.