దస్త్రంపై చర్చ:Gita-kalamkari-painting.JPG

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లైసెన్సు చెల్లదు[మార్చు]

(నా చర్చా పేజీలోని విషయాన్ని ఇక్కడికి మారుస్తున్నాను. కాపీ హక్కుల విషయంలో అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని. ఒక వేళ ఈ బొమ్మను తొలగిస్తే ఈ చర్చను వికీపీడియా చర్చ:కాపీహక్కులు కు మారుస్తాను- --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:15, 13 ఏప్రిల్ 2008 (UTC))[ప్రత్యుత్తరం]


బొమ్మ:Gita-kalamkari-painting.JPG కు మీరు GFDL లైసెన్సు ట్యాగు తగిలించారు. కాని ఆ బొమ్మ మీరు గీయలేదు కదా. మీరు ఫోటో మాత్రమే తీసారు. కాబట్టి ఆ బొమ్మ కాపిహక్కులకు మీకు ఏ సంబంధము ఉండదు. ఆ బొమ్మ కాపిహక్కులు ఆ painting గీసిన వారికే చెందుతాయి. ఉదాహరణకు Image:Leonardo self.jpg చూడండి. ఆ బొమ్మ కాపిహక్కులు డా వించికే చెందుతాయి. కాబట్టి PD ట్యాగు తగిలించారు. సాయీ(చర్చ) 18:13, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

en:Image:Dora Maar Au Chat.jpg కూడా చూడండి. ఆ painting గీసింది పికాసో. ఫోటో తీసింది, అప్లోడ్ చేసింది, en:User:El C. ట్యాగ్ ఫెయిర్ యూస్ ఉంది. సాయీ(చర్చ) 18:27, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అవును. నాకూ ఈ సందేహం ఉంది. నా వుద్దేశ్యం ఫొటోను గురించే. అయితే FAir Use లైసెన్సు ఇవ్వాలా? లేకపోతే PD ఇవ్వాలా? వీలు చూసుకొని పరిశీలిస్తాను. మరయితే బొమ్మ:Kalamkari.JPG సంగతేమిటి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:08, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
PD ఏలా ఇస్తారు? ఆ బొమ్మ 1948 కంటే ముందే గీయబడిందా? ఆ బొమ్మ వికీపీడియా కు అవసరమైతే Fair Use ట్యాగ్ తగిలించండి. లేదంటే తీసేసేయండి. Image:Kalamkari.JPG నేను చూసాను. కామన్స్‌లో Deletion Request పెడతాను. సాయీ(చర్చ) 19:16, 12 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించడానికి నాకు అభ్యంతరమైతే లేదు. ఇది Fair Use క్రింద పెట్టాల్సినంత విలువ గలది కాదనుకొంటాను. కాని నేను పుర్తిగా convince కాలేదు.

  • నా కృతి "ఫొటో తీయడం" మాత్రమే. చిత్రంలో ఉన్న కళ కాదు. అయితే ఈ వాదన పూర్తిగా చెల్లదని (అందులో అస్పష్టత ఉందని) ఆంగ్ల వికీలో కాపీ హక్కుల గురించిన వ్యాసంలో ఉన్నది. సరే. ఒప్పుకొంటాను.
  • ఇది నేను దుకాణంలో కొన్న పటం యొక్క ఫొటోగ్రాఫ్. ఆ కళాకారుడి నైపుణ్యం అల్లా ఆ సంప్రదాయ చిత్రాన్ని గుడ్డపై వేయగలగడం. దాని మీద నేను హక్కును క్లెయిమ్ చేయడం లేదు. కనుక అతని (ఆమె) కాపీ హక్కును ఉల్లంఘించడం లేదు కదా? కాని బొమ్మ మాత్రం వారు ఒరిజినల్ గా సృష్టించినది కాదు. తరతరాలుగా వస్తున్న డిజైను.
  • ఇటువంటిదే మరొక బొమ్మ బొమ్మ:Kalamkari.JPG వికీ కామన్స్‌లో ఉంది [1]. దానిమీద సాయీ "తొలగించు" నోటీసు పెట్టాడు. [2]

దాని గురించిన నిర్ణయం కోసం వేచి చూస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:15, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

లైసెన్సు అంగీకరించవచ్చును[మార్చు]

మీరు ఈ బొమ్మ కొన్నారని నాకు తెలియదు. ఏదైనా exhibitionలో ఫోటో తీసారనుకున్నాను. కొంటే కాపిహక్కులు మీవే. లైసెన్సు మీ ఇష్టం సాయీ(చర్చ) 14:22, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదు శిల్పారామంలో కొన్నాను! ఫ్రేమ్ కట్టించి, మస్కట్‌లో మా డ్రాయింగ్ రూమ్‌లో పెట్టాము. ఆ చిత్రం ముందు ఫొటోలు దిగడానికి చాలామంది ఇష్టపడతారు. నువ్వు లేవనెత్తిన చర్చవలన చాలా సంగతులు నేర్చుకొన్నాను. Threshold of originality అనేది ఒకటి ఉందని నాకు ఇంతదాకా తెలియదు! - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:50, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ అలాగా. మస్కట్‌లో మీరు ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? నాకు Threshold of originality అని పేరు గుర్తు లేదు కాని అలాంటి రూలు ఒకటి ఉందని తెలుసు. సాయీ(చర్చ) 14:55, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
15 సంవత్సరాలనుండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:12, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

Threshold of originality నియమం ప్రకారం ఈ బొమ్మపై కాపీ హక్కు ఆ చిత్రాన్ని ప్రింట్ చేసినవారికి లేదనుకొంటున్నాను. ఈ విషయం గురించి ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం ఈ పేజీలు చూడవచ్చును --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:47, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కుదరదంటే చెప్పండి. మాది ఎటూ కాళహస్తి కాబట్టి, అక్కడ ఎవరైనా కళాకారులను అడిగి అనుమతి తీసుకుని మరిన్ని బొమ్మలను సంపాదించుకుని వస్తాను.వారి కళ గురించి ఇంటర్నెట్ లో పెడుతున్నామంటే వారు సంతోషంగా అంగీకరిస్తారని నా అభిప్రాయం. ఈ గొడవలన్నీ ఎందుకు?. రవిచంద్ర(చర్చ) 12:01, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కృతజ్ఞతలు. రవీ! మనకు కాపీ హక్కుల విషయంలో స్పష్టత ఏర్పడాలనే నేనీ చర్చ కొనసాగిస్తున్నాను కాని పంతానికి కాదు. ఈ సారి వీలున్నపుడు నువ్వు కాళహస్తిలో దశావతారాల బొమ్మలు ఒక్కొక్కటీ విడివిడిగా ఫొటో తీసుకోగలవా? ఎందుకంటే మూస:దశావతారములులో వాడిన బొమ్మలు అంత ఆకర్షణీయంగా లేవు. అన్ని అవతారాలకూ ఒకే విధమైన బొమ్మలుంటే చాలా బాగుంటుంది. అలాగే అద్దకం పని చేసే వారి ఫొటో తీసి కలంకారీ వ్యాసంలో పెట్టు. పురాణాలకు సంబంధించిన చిత్రాలు తీసి ఆయా వ్యాసాలలో పెట్టు. పురాణాల గురించి మనం లోకల్ బొమ్మలు వాడితే బాగుంటుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:25, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]