దస్త్రంపై చర్చ:Telugu wikipedia mahotsavam.png

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయ శుభాకాంక్ష గతం నందనం.. ఆనందనం.. నందన వనాన్ని అందించిన నందనానికి ప్రతిస్పందనం ప్రస్తుత విజయానికి వందనం.. ఆ ఆనందన నవ వనంలో ఇక నా కవనం నాక వనం కాగా విజయ నామ సంవత్సరాది విజయంతో మొదలు కాదా ... ఏచోట ఉన్నా తెలుగు వారి విజయ భేరి మ్రోగుతూనే ఉంటుంది సదా... గతానికి పొడిగింపు వర్తమానం ఇక భవిష్యత్తు దిన దినప్రవర్ధమానం... గతం..స్వగతం..వ్యక్తిగతం.. సహ జీవనం..సహన జీవనం.. కష్టం..ఇష్టం..దుఃఖం..సుఖం.. జీవితంలో భాగం కాగా అవి విజయానికి సోపానాలుగా మలచి..వలచి..శ్రమించి విజయాలని వరించిన విజయులకి "విజయ"స్వాగతం.. ఎల్లలు దాటినా... కల్లా కపటం లేక ఏ మెరికలు లెకుండా … అరమరికలు మరిచి అనుక్షణం అప్రమత్తతో ప్రతీ క్షణం సమవర్తనతో తెలుగు తరం తెలుగు తనం తో విజయబావుటా ఎగురవేయాలని అందుకు "విజయ"దోహద పడాలని విరించి కాంక్ష..ప్రగుణ ఆకాంక్ష..హితైషి శుభాకాంక్ష మన ప్రగతి ప్రకృష్టంగా నిలుచుగాక సమాజ సద్గతికై తోడ్పడుగాక భారత దేశ ఉన్నతికై దోహదపడుగాక ప్రపంచ అభ్యున్నతికై కారణభూతమవ్వుగాక విశ్వశ్రేయస్సును ప్రతిష్ఠించుగాక డా.విరించి

drmavirinchi@gmail.com