తెలుగు: ఈ చిత్రం కడప పట్టణంలోని నకాష్ వీధిలో సమీపంలో ఉన్న ఆస్తానయె ఇలాహికి చెందింది.దీనిని పెద్ద దర్గా లేక అమీన్ పీర్ దర్గా అని కూడా అంటారు. ఇది దక్షిణ భారతదేశం లో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్గా కావడం వల్ల దీనిని దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ (Ajmer of South India) అంటారుఈ దర్గా మొదటి సూఫీ (మూలపురుషుడు) హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేనీ చిష్తీవుల్ ఖాద్రీ నాయబ్-ఎ-రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యాడు.
ఈయన సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందాడు.ఇతని శిష్యుడు నేక్ నామ్ ఖాన్ కడపను పాలించాడు. నేక్ నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్దదర్గా. అప్పట్లోనే దర్గా నిర్మించారు.
పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుండవచ్చు. ఈ ఫైలును అసలు స్థితి నుండి మారిస్తే, ఆ మారిన ఫైలులో కొన్ని వివరాలు పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.