దస్త్రం:Musi River 2.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(4,160 × 3,120 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 1.09 MB, MIME రకం: image/jpeg)

సారాంశం

వివరణ

మూసీనది:


మూసీ నది కృష్ణా నదియొక్క ఉపనది. తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాద్  యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్  సరస్సు నిర్మించబడింది.


మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా,వికారాబాద్ వద్ద అనంతగిరి  కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట  వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం  కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35% సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు బీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర ఉంది.

మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు  ఉన్నాయి. వీటిలో పురానా పుల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షా వంశస్తుడైన ఇబ్రహీం కుతుబ్ షా  1578 లో నిర్మించాడు. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. నయా పుల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉంది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నాయి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.


 1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్థ్యం ఉంది. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.


Source: తెలుగు వికీపీడియా
తేదీ 9 సెప్టెంబరు 2018 (according to Exif data)
మూలం స్వంత కృతి
కర్త Adbh266

లైసెన్సింగ్

నేను, ఈ కృతి యొక్క కాపీహక్కుదారుని, దీన్ని ఈ లైసెన్సు క్రింద ఇందుమూలముగా ప్రచురిస్తున్నాను:
Creative Commons CC-Zero ఈ దస్త్రం క్రియేటివ్ కామన్స్ CC0 వెయివర్ క్రింద లభ్యం.
ఈ కృతితో సంబంధమున్న వ్యక్తి తనకు ప్రపంచవ్యాప్తంగా కాపీహక్కుల చట్టం క్రింద ఈ కృతిపై ఉన్న అన్ని హక్కులని మరియు ఈ కృతిలో తనకి ఉన్న సంబంధిత న్యాయపరమైన హక్కులని, చట్టం అనుమతించిన మేరకు, వదులుకుని ఈ కృతిని కామన్స్‌కి అంకితమిచ్చారు. CC0 క్రింద ఉన్న కృతులకు ఆపాందింపు అవసరం లేదు. కృతిని ఉటంకించేప్పుడు, కృతికర్త యొక్క ఆమోదాన్ని మీరు అంతర్నిహితంగా సూచించకూడదు.


This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.7.2.

Captions

Add a one-line explanation of what this file represents

Items portrayed in this file

చిత్రణ

source of file ఇంగ్లీష్

original creation by uploader ఇంగ్లీష్

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత05:05, 11 సెప్టెంబరు 201805:05, 11 సెప్టెంబరు 2018 నాటి కూర్పు నఖచిత్రం4,160 × 3,120 (1.09 MB)Adbh266Uploaded using Commons Mobile App

కింది పేజీలలో ఈ ఫైలుకు లింకులు ఉన్నాయి:

మెటాడేటా

"https://te.wikipedia.org/wiki/దస్త్రం:Musi_River_2.jpg" నుండి వెలికితీశారు