దస్త్రం:Vsm master.jpg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసలు దస్త్రం(1,280 × 1,600 పిక్సెళ్ళు, ఫైలు పరిమాణం: 108 KB, MIME రకం: image/jpeg)

సారాంశం[మార్చు]

ప్రజలలో పెరిగి, ప్రజల నడుమ తిరిగి, ప్రజల మనస్సున కెక్కి పదస్థులయిన దేశనాయకులలో రాయవరం మునసబుగారొకరు. ధైర్య స్థైర్యాలు మునసబు గారికి సహజ కవచాల వంటివి. ధృతవ్రతమే ఆయనకు దృఢవ్రతం. మిన్ను విరిగి మీదపడ్డా చలించని మేరు ధీరులు శ్రీ వుండవిల్లి సత్యనారాయణమూర్తి. ఆయన ఏ కాలేజీలోనూ చదవక పోయినా, ఎందరో మనుషుల జీవితాలను కూలంకషంగా చదివినవారు.. కాలేజి విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించినవారు...ఎన్నో బృహత్తర. ప్రజాహిత కార్యక్రమాలను- ఏకవ్యక్తిగా, స్వశక్తితో సాధించినవారు.. రాజకీయ నాయకుల్లో అరుదుగా కనిపించే ఒక ప్రత్యేకత మునసబుగారిలో చూస్తాం..అదేమిటంటే ఆయనకు జాతి, కుల, మత విభేదాలు లేకపోవడం..అన్ని ‘ఇజాల’లోకి ‘కమ్యూనలిజం’ భయంకర శత్రువని ఆయన అభిప్రాయం..ఆయన్ను అభిమానించే వారు స్వకులంలో కంటే- యితర కులాల్లోనే ఎక్కువగా వుండటం, ఆయనలోని ఆదర్శనీయమైన ప్రత్యేకత...మునసబుగారికి ఎన్నో పదవులు రావచ్చు..పోవచ్చు..కాని, ఆయనకు తిరుగులేని శాశ్వతమైన పదవి ఒక్కటే..అదే "రాయవరం మునసబు"- అది ఆయనకు దేవుడిచ్చిన వరం.. లక్షలాది ప్రజలు ప్రేమానురాగాలతో-గౌరవించే పెద్ద బిరుదు.. మనసులో ఒకమాట పైకొకమాట అనే బాపతు వ్యక్తిత్వం కాదాయనది. ఆ అనేమాట ఏదో ముక్కుసూటిగా గట్టిగా అంటేగానీ ఆ రాత్రికి ఆయనకు నిద్రపట్టదు. పైగా ఆయనది గంభీర కంఠస్వరం. రూపంలో మాటలో చేతలో మునసబుగిరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వుండవిల్లి సత్యనారాయణ మూర్తి ప్రజాహిత కార్యక్రమాలలో ముఖ్యముగ రామచంద్రపురం కళాశాల నిర్మాణము, భవన నిర్మాణము అన్నవి ఆదర్శప్రాయము. శాసనపరిషత్తు సభ్యులుగా, రాయవరము పంచాయితి సమితి అద్యక్షులుగా, రామచంద్రపురం కేంద్ర సహకార బ్యాంకు అద్యక్షులుగా ప్రజలకు సేవచేసి యున్నారు....

లైసెన్సింగ్[మార్చు]

ఫైలు చరితం

తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.

తేదీ/సమయంనఖచిత్రంకొలతలువాడుకరివ్యాఖ్య
ప్రస్తుత14:06, 6 అక్టోబరు 200914:06, 6 అక్టోబరు 2009 నాటి కూర్పు నఖచిత్రం1,280 × 1,600 (108 KB)Kkkotha (చర్చ | రచనలు)ప్రజలలో పెరిగి, ప్రజల నడుమ తిరిగి, ప్రజల మనస్సున కెక్కి పదస్థులయిన దేశనాయకులలో రాయవరం మునసబుగ�

ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.

మెటాడేటా