దాడిచిలుక వీర గౌరీశంకర రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాడిచిలుక వీర గౌరీశంకర రావు

పదవీ కాలం
1999 -2004
ముందు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్
తరువాత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్
నియోజకవర్గం పార్వతీపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1969-05-12) 1969 మే 12 (వయసు 54)
Palika valasa, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, సీపీఐ
జీవిత భాగస్వామి స్వర్ణలత

దాడిచిలుక వీర గౌరీశంకర రావు (Dadichiluka Veera Gouri Sankara Rao (జ: 1969 మే 12), డి.వి.జి లేదా డి.వి.జి. శంకర్రావు, ప్రముఖ మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు. ఇతడు తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు, 13వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

తొలినాళ్లు[మార్చు]

శంకర్రావు ఆదివాసునిగా 1969 మే 12 తేదీన పాలికవలస గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లాలో జన్మించాడు. ఇతడు ఆంధ్రా మెడికల్ కాలేజీ విశాఖపట్నం నుండి వైద్యశాస్త్రంలో పట్టాపొంది; తర్వాత మత్తుమందు (అనగా Anesthesiology) లో ఎం.డి. పూర్తిచేశాడు. రాజకీయాలలోకి ప్రవేశించి; జిల్లా తెలుగుదేశం పార్టీలో చేరి; తర్వాత ఆంధ్రప్రదేశ్ లోక్ సభకు ఎన్నుకోబడ్డాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఇతడు 1999 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభ సభ్యునిగా పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసాడు. అందులో తన సమీప ప్రత్యర్థి వైరిచర్ల కిషోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ మీద గెలుపొందాడు. లోక్‌సభలో శ్రామికుల సంక్షేమానికి చెందిన కమిటీ, గ్రామీణాభివృద్ధి సలహా మండలి, మానవ వనరుల అభివృద్ధి కమిటీ సహా మరో ఆరు కమిటీ ల్లో సభ్యునిగా వ్యవహరించాడు.ఇంగ్లండ్ లో జరిగిన అంతర్జాతీయ పార్లమెంటు సభ్యుల సదస్సుకి హాజరయ్యారు. తర్వాత 2004 జరిగిన ఎన్నికలలో కిషోర్‌చంద్ర దేవ్ మీదనే పరాజయం పాలయ్యాడు.పిమ్మట మహారాజా వైద్య విజ్ఞాన సంస్థలో ఆచార్యునిగా కొనసాగుతున్నారు [1]

గౌరీశంకర రావు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ నుంచిపాలకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి, 2021లో వైఎస్సార్‌సీపీలో చేరి వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ జోనల్‌ ఇంఛార్జ్‌‌గా, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా పనిచేశాడు . ఆయనను 2023 ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ జాతుల కమిషన్‌ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

వ్యక్తిగత వివరాలు[మార్చు]

ఇతడు స్వర్ణలతను వివాహం చేసుకున్నాడు. తీరికవేళల్లో పద్యరచన ప్రవృత్తిగా చేసుకున్నాడు. ఇతడు రచించిన ఆశాజీవులు ప్రచురించబడింది.వివిధ ఆంగ్ల, తెలుగు దిన పత్రికల్లో 3 వేలకు పైగా లేఖలు, వ్యాసాలు ప్రచురితం. పదేళ్లుగా ప్రతీ రోజూ ప్రచురించబడుతున్నాయి.కథలు 32, కవితలు 350 పబ్లిష్ అయ్యాయి.అందులో250 కవితలు డీ వీ జీ కవితలు పేరుతో సంకలనంగా 2021 లో రూపొందినది.

మూలాలు[మార్చు]

  1. "Rao, V.Chalapati "Andhra Pradesh: VIZIANAGARAM DISTRICT: Irrigation, health major areas of concern" [[The Hindu]] March 4, 2004". Archived from the original on 2008-10-20. Retrieved 2013-05-07.
  2. Andhrajyothy (8 July 2023). "ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎంపీ శంకర్రావ్‌". Archived from the original on 8 January 2024. Retrieved 8 January 2024.