దాతృత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Globalize/USA

దాతృత్వం అంటే మానవజాతి శ్రేయస్సును పెంచడానికి ధర్మకర్తృత్వ సహాయం లేదా విరాళాల ద్వారా చేసే ప్రయత్నం లేదా అభిరుచి.

పద వ్యుత్పత్తి శాస్త్రం మరియు అసలు అర్థం[మార్చు]

ఈ పదం 2500 సంవత్సరాల క్రితం ప్రాచీన గ్రీసులో నాటక కర్త ఎస్కిలస్ ద్వారా లేదా ప్రోమోథియస్ బౌండ్ (పంక్తి 11) ని రాసిన వారి ద్వారా సంగ్రహించబడిందని సాధారణంగా అంగీకరిస్తున్నారు. దాంట్లో రచయిత కల్పనగా చెబుతూ, మానవులుగా సృష్టించబడిన ఆదిమ ప్రాణులు మొదట్లో ఎలాంటి విజ్ఞానాన్ని, నైపుణ్యాలను లేదా ఎలాంటి సంస్కృతిని కలిగి లేరని, దీంతో వారు గుహల్లో, చీకట్లో తమ ప్రాణాల పట్ల నిరంతర భయాలతో జీవించేవారని చెప్పారు. దేవతల నిరంకుశ చక్రవర్తి అయిన జ్యూస్, వీరిని అంతమొందించాలని నిర్ణయించాడు కాని, “ముందుచూపు కలవాడు” అనే అర్థాన్నిచ్చే పేరుగల దానవుడు ప్రొమెథియస్, తన "దాతృత్వ దళాలు " లేదా “మానవ ప్రేమిక స్వభావం”తో వారికి రెండు ప్రాణాధార బహుమతులను ప్రసాదించాడు: ఒకటి నిప్పు, సమస్త జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సాంకేతిక జ్ఞానాన్ని, కళలను శాస్త్ర విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది, రెండు గుడ్డి విశ్వాసం లేదా ఆశావాదం. ఇవి రెండూ కలిసిపోయాయి— నిప్పుతో మానవులు ఆశావాదంతో ఉండగలరు; ఆశావాదంతో, వీరు మానవుల స్థితిని మెరుగుపర్చడానికి, నిప్పును నిర్మాణాత్మకంగా ఉపయోగించగలరు.

కొత్త పదం φιλάνθρωπος ఫిలాంత్రోపోస్ , అనేది: φίλος ఫిలోస్ , ప్రయోజనం కలిగించడం, సంరక్షించడం, పెంచి పోషించడం అనే అర్థంలో "ప్రేమించడం", మరియు ἄνθρωπος ఆంత్రోపోస్, "మానవ జాతి", "మానవత్వం" లేదా "మానవీయత" అనే అర్థంలో రెండు పదాలను కలిపింది. ఆదిమ మానవులను ప్రోమెథియస్ వ్యక్తిగతంగా ప్రేమించలేదు, ఎందుకంటే, కాలంలో ఆ కాల్పనిక క్షణంలో వ్యక్తిత్వం అనేది అప్పటికి ఇంకా ఉనికిలో లేదు—దీనికి సంస్కృతి అవసరం.[dubious ] అందుచేత, వారి మానవ సామర్థ్యాన్నే అంటే "నిప్పు" మరియు "గుడ్డి విశ్వాసం"తో వారు సాధించిన దాన్ని అతడు సాక్ష్యపూర్వకంగా "ప్రేమించాడు" ఈ రెండు బహుమతులు విశిష్టమైన నాగరిక జంతువుగా మానవజాతి సృష్టిని పూర్తి చేశాయి. 'ఫిలంత్రోపియా '—మానవుడికి సంబంధించినదాన్ని ప్రేమించేది—నాగరికతకు కీలకమైనదిగా భావించబడింది.[1]

గ్రీకులు “మానవ ప్రేమను” విద్యాపరమైన ఆదర్శంగా తీసుకున్నారు, వీరి లక్ష్యం శ్రేష్టత (అరెటె ) — శరీరం, మనస్సు, ఆత్మ యొక్క సంపూర్ణ అభివృద్ధి, ఇది ఉదారవాద విద్య యొక్క సారాంశం. ప్లెటోనిక్ అకాడమీ యొక్క తత్వశాస్త్ర నిఘంటువు ఫిలాంత్రోపియాను ఇలా నిర్వచించింది: మానవ ప్రేమ నుంచి పుట్టుకొచ్చిన చక్కటి విద్యావంతపు అలవాట్ల స్థితి. మానవులకు ప్రయోజనం కలిగించే ఉత్పాదక స్థితి.” ఫిలాంత్రోపియా తర్వాత రోమన్ల ద్వారా లాటిన్ భాషలోకి సాదాగా హ్యుమానిటస్ —మానవ-త్వం అని అనువదించబడింది. మరియు ప్రోమోథియస్ యొక్క మానవులకు సాధికారిత కలిగించే బహుమతులు జ్యూస్ నియంతృత్వంపై తిరుగుబాటు చేశాయి, ఫిలాంత్రోపియా స్వాతంత్ర్యం మరియు ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉండేది. సోక్రటీస్ మరియు ఏథెన్స్ చట్టాలు రెండూ “దాతృత్వపరమైన మరియు ప్రజాస్వామ్యపరమైన”— సాధారణ వ్యక్తీకరణలా వర్ణించబడ్డాయి, దాతృత్వం కలిగిన మానవులు స్వయం ప్రభుత్వాన్ని నడపగలుగుతారనే భావం దీంట్లో ఉండేది.

వీటిన్నటినీ ఆధునిక అర్థాలలోకి తీసుకువస్తే, “దాతృత్వం” పదానికి సాంప్రదాయిక భావనకు సన్నిహితంగా ఉండేటటువంటి నాలుగు సాపేక్ష సాధికారిక నిర్వచనాలు ఉంటున్నాయి: జాన్ W. గార్డెనర్ “ప్రజల శ్రేయస్సు కోసం ప్రైవేట్ చర్యలు”; రాబర్ట్ పేటన్స్ యొక్క “ప్రజాశ్రేయస్సు కోసం స్వచ్ఛంద చర్య”; లెస్టర్ సాలమన్’యొక్క “ప్రజా ప్రయోజనాలకోసం వ్యక్తిగతం ఇస్తున్న సమయం లేదా అమూల్యవస్తువులు” మరియు రాబర్ట్ బ్రెమ్‌నెర్ యొక్క “మానవ జీవన నాణ్యతను మెరుగుపర్చడమే దాతృత్వ లక్ష్యం”. ఆధునిక దాతృత్వాన్ని దాని పూర్వ చరిత్ర మొత్తంతో ముడిపెట్టి మేళవించినప్పుడు, “దాతృత్వం” అనే భావనను “జీవన నాణ్యతపై దృష్టి పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం చేపట్టే ప్రైవేట్ చర్యలు” అని నిర్వచించవచ్చు.

ప్రభుత్వం నుంచి (ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వ చర్యలు) మరియు వ్యాపారం (ప్రైవేట్ శ్రేయస్సు కోసం ప్రైవేట్ చర్యలు) నుంచి ఈ నిర్వచనం దీన్ని వేరు చేస్తోంది. నిర్దిష్ట ఆర్టికల్ అయిన “ది”ని “ప్రజాశ్రేయస్సు”లోంచి తీసివేసినప్పుడు ప్రజాశ్రేయస్సు అనే ఏకైక అంశమే ఉందనే అవాస్తవ అభిప్రాయాన్ని అధిగమిస్తుంది, ఏ విధంగానైనా సరే ప్రజలు దాని అర్థం పట్ల ఎన్నటికీ అంగీకరించకపోవచ్చు; పైగా, లబ్దిదారు విస్తృతార్థంలో ప్రైవేట్ శ్రేయస్సు లేదా ప్రయోజనం కంటే “పబ్లిక్” ప్రయోజనాన్నే కోరుకుంటాడని ఈ నిర్వచనం, చెబుతుంది. “జీవన నాణ్యత” అనే పదం చేరిక ప్రొమోథియన్ నమూనాలోని బలమైన మానవత్వపు వక్కాణింపును చాటి చెబుతుంది.

మధ్యయుగాల్లో మాయమైన దాతృత్వపు సాంప్రదాయిక దృక్పధం పునరుజ్జీవన కాలంలో తిరిగి కనుగొనబడి, పునరుద్ధరించబడింది మరియు 17వ శతాబ్ది ప్రారంభంలో ఇంగ్లీష్ భాషలోకి వచ్చి చేరింది. సర్ ఫ్రాన్సిస్ బేకన్ 1952లో ఒక ఉత్తరంలో తన “విస్తృతమైన ఆలోచనల ముగింపు” తన “దాతృత్వాన్ని” వ్యక్తపరుస్తోందని రాశారు, 1608లో తను రాసిన మంచితనం పై వ్యాసంలో తన పరిశీలనాంశాన్ని “ఫిలాంత్రోపియా అని గ్రేసియన్స్ పిలిచింది మనిషి ముద్రపై ప్రభావితం చేస్తుందని” నిర్వచించాడు. హెన్రీ కొఖెరమ్, తన ఇంగ్లీష్ నిఘంటువులో (1623), “ఫిలాంత్రోపీ”ని “హ్యుమనైట్” (లాటిన్‌లో హ్యుమానిటీస్) కి పర్యాయపదంగా సూచించాడు — ఆవిధంగా సాంప్రదాయిక నిర్వచనాన్ని తిరిగి ధ్రువీకరించాడు.

యుఎస్ఎలో దాతృత్వం[మార్చు]

"స్వచ్ఛంద సేవా సంస్థలు"[మార్చు]

ఈ మార్గంలో సహకార సంస్కృతి ఆవిర్భవించింది. వలస సమాజం స్వచ్ఛంద సేవకులచే నిర్మించబడింది లేక తదనంతరం అలెక్సిస్ డె టొక్వెవిల్లె వీటిని పేర్కొన్నట్లుగా, " "స్వచ్ఛంద సేవా సంస్థలు" — అంటే, "ప్రజల శ్రేయస్సు కోసం జీవన ప్రమాణంపై చూపు సారించే వ్యక్తిగత చర్యలు". అమెరికన్ జీవితంలోనికి ఇవి చొచ్చుకు పోయాయని, అమెరికా వ్యక్తిత్వానికి మరియు సంస్కృతికి ఇవి విశిష్ట లక్షణమని, అమెరికా ప్రజాస్వామ్యానికి ఇవి కీలకమైనవని ఇతడు అభిప్రాయపడ్డాడు.[ఆధారం అవసరం] అమెరికన్లు తమ ప్రజా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇతరులపై - ప్రభుత్వం, కులీన వర్గం లేదా చర్చ్ -పై ఆధారపడరని ఇతడు చెప్పాడు; అందుగు భిన్నంగా వారు తమకు తాముగా స్వచ్ఛంద సంస్థల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారు. అందుకనే దాతృత్వాన్ని స్వభావరీత్యానే ప్రజాస్వామ్యంగా చెప్పవచ్చు.

మొట్టమొదటి వాటిలో, వీటిలో మొట్టమొదటిది కానప్పటికీ, తొలి అమెరికన్ ప్రభుత్వాలలో ఒకటి: 1620 మేఫ్లవర్ కాంపాక్ట్. [ఆధారం అవసరం] యాత్రికులు, ఇప్పటికీ తీరానికి దూరంగానే కాని అమెరికా జలాల్లోనే ఉన్నవారు “తాము గర్వంతోనూ, ఉమ్మడిగాను మమ్మల్ని మేము ఉత్తమంగా పాలించుకోవడానికి, కాపాడుకోవడానికి గాను, దేవుడి సమక్షంలో పౌర రాజకీయ విభాగంగా మిళితమవుతున్నామని,” ప్రకటించుకున్నారు. మసాచుసెట్స్ బే కాలనీలోనే ఉంటున్న మొట్టమొదటి కార్పొరేషన్ హార్వర్డ్ కాలేజ్ (1636), యువకులకు మత కార్యక్రమాలలో శిక్షణ ఇప్పించేందుకోసం ఏర్పర్చబడిన స్వచ్ఛంద దాతృత్వ సంస్థగా ఉండేది.

ఆ కాలంలో సర్వసాధారణంగా, అమెరికన్ దాతృత్వ సంస్థలు భావజాలపరమైన పరిమితులతో ఉండేవి. మూడు ప్రముఖ ఇంగ్లీష్ వలసలు—మసాచుసెట్స్, పెన్సిల్వేనియా, వర్జీనియా— “కామన్‌వెల్త్‌లు”గా గుర్తించబడేవి, సారాంశంలో ఇదొక ఆదర్శపూరితమైన సమాజమని దీనర్థం, దీంట్లో సభ్యులందరూ “కామన్ వీల్”‌ అంటే ప్రజా శ్రేయస్సు కోసం తోడ్పడేవారు.

ఈ సంప్రదాయిక మరియు క్రైస్తవ ఆదర్శం యొక్క ప్రముఖ ప్రోత్సాహకుడు కాటన్ మథెర్, ఇతడు 1710లో విస్తృతంగా చదవబడుతున్న అమెరికన్ సాంప్రదాయిక రచన బోనిఫాసియస్ లేక ఎన్ ఎస్సే టు డూ గుడ్‌ని ప్రచురించాడు. అసలైన ఆదర్శవాదం క్షీణించిపోయిందని మథెర్ కలవరపడేవాడు, కాబట్టి దాతృత్వ ప్రయోజనాన్ని అతడు జీవనమార్గంగా ప్రబోధించేవాడు. అతడి నేపథ్యం క్రిస్టియన్ అయినప్పటికీ, అతడి ఆదర్శం స్వభావరీత్యా అమెరికన్ తత్వంతో మరియు స్పష్టంగా పునరుజ్జీవన మార్గంలో సాంప్రదాయికంగా ఉండేది.

"ప్రపంచంలో మంచికోసం పాటుపడే శాశ్వత కృషి ప్రతిపాదనను ఆమోదించకుండా, క్రిస్టియన్ పేరుతో ఏ మనిషీ నటించకుండా ఉండేలా చేద్దాం.… [ఉపయోగకరంగా] ఉండాలనే ఆకాంక్షను కలిగి ఉండని క్రైస్తవులు, బహుదేవతారాధకులచేత ఖండించబడతారు; వీరికి సంబంధించినంతవరకు ఇది అత్యున్నత గౌరవానికి సంబంధించిన పదం, ఇది ఉపకారిగా పేర్కొనబడింది; మంచి చేయగలగడం గౌరవనీయమైనదిగా గుర్తించబడింది. ప్రతి ఒక్కరూ మంచివాడిగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఎందుకు ఆకాంక్షిస్తారని, తత్వవేత్త [ఉదా. అరిస్టాటిల్] ప్రశ్నించబడ్డాడు! ఇది గుడ్డివాడు వేసే ప్రశ్న అని అతడు జవాబిచ్చాడు. ఏ మనిషయినా దాని అర్థాన్ని ప్రశ్నించినట్లయితే, ప్రపంచంలో మంచి పని చేయడానికి విలువ ఏముంటుంది! నేను చెప్పి తీరాలి. ఇది ఒక మంచి వ్యక్తి వేసే ప్రశ్నగా ధ్వనించదు.” (పుట. 21)

మంచి చేయడానికి సంబంధించి మథెర్ చేసిన పలు ఆచరణాత్మక సూచనలు బలమైన పౌర ప్రాధాన్యతను కలిగి ఉండేవి—పాఠశాలలు, గ్రంథాలయాలు, ఆసుపత్రులు స్థాపించడం, ఉపయోగరమైన ప్రచురణలు చేయడం వంటివి. ఇవి ప్రాథమికంగా నిరుపేదలకు సంపన్నులు సహాయ పడటంలా ఉండేవి కావు కాని, ప్రజల శ్రేయస్సు కోసం జీవన నాణ్యతపై దృష్టి చూపడానికి సంబంధించేవి. తమ జీవితాలు మథెర్ పుస్తకంచే ప్రభావితమయ్యాయని తదనంతరం చెప్పిన ఇద్దరు యువ అమెరికన్లు బెంజమన్ ఫ్రాంక్లిన్ మరియు పాల్ రెవెరె.

బెంజమిన్ ఫ్రాంక్లిన్[మార్చు]

తన కాలంలో “మొట్టమొదటి మేటి అమెరికన్”గా గుర్తించబడినాడు, 18వ శతాబ్ది ఐరోపా మరియు అమెరికాలలో, ప్రత్యేకించి అమెరికాలో పునరుజ్జీవన కాలంలో అమెరికన్ విలువలకు నమూనాగా గుర్తించబడినాడు, అతడి జీవితంలో ముఖ్యభాగం సాంప్రదాయికమైన, మరియు సాంప్రదాయిక అమెరికన్ దాతృత్వంతో నిండి ఉండేది. ఇతడు స్వీయ చైతన్యంతో మరియు ఉద్దేశ్యపూరితంగా తన జీవితాన్ని స్వచ్ఛంద ప్రజా సేవతో నింపాడు. చివరకు ఫ్రాన్స్‌లో తన రాజకీయ ప్రత్యర్థి జాన్ ఆడమ్స్ సైతం ఇలా చెప్పాడు, “తనను తాను మానవజాతి మిత్రుడిగా పరిగణించని” “రైతు కాని పౌరుడు కాని ఉండేవాడు కాదు.” ఇమాన్యువల్ కాంట్, జర్మన్ పునరుజ్జీవన కాలపు ప్రముఖ తత్వవేత్త మాట్లాడుతూ, మానవజాతి ప్రయోజనం కోసం పిడుగును విద్యుత్తుగా భావించి చేసిన తన ప్రయోగాలలో, స్వర్గం నుంచి నిప్పును దొంగిలించిన కొత్త ప్రోమోథియస్‌‌గా ఫ్రాంక్లిన్‌ను పేర్కొన్నాడు. ఫ్రాంక్లిన్ స్కాటిష్ పునరుజ్జీవనంతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉండేవాడు; ఇతడు “డాక్టర్ ఫ్రాంక్లిన్” అని పిలువబడేవాడు ఎందుకంటే ఇతడు మూడు స్కాటిష్ విశ్వవిద్యాలయాల నుంచి—సెయింట్ ఆండ్రూస్, గ్లాస్గో మరియు ఎడిన్‌బరో— గౌరవ డాక్టరేట్లు పొందాడు మరియు అక్కడ పర్యటించేటప్పుడు అతడు వ్యక్తిగతంగా ప్రముఖ స్కాటిష్ పునరుజ్జీవన చింతనాపరులతో మితృత్వాన్ని కలిగి ఉండేవాడు.

బహుశా అమెరికాలో మొట్టమొదటి పౌర దాతృత్వం యొక్క వ్యక్తిగత వ్యవస్థను ఫ్రాంక్లిన్ ఫిలడెల్ఫియాలో రూపొందించాడు. 1727లో యువ వ్యాపారిగా, ఇతడు “జుంటో”ను స్థాపించాడు: ఇది వర్తమాన సమస్యలు, ఘటనలుపై చర్చించడానికి శుక్రవారపు సాయంత్రాలలో సమావేశమయ్యే 12 గురు సభ్యుల క్లబ్. ఈ క్లబ్ సభ్యత్వానికి ఉండవలసిన నాలుగు అర్హతలలో “మానవ జాతి [పట్ల] సాధారణంగా ప్రేమ కలిగి ఉండటం” ఒకటి. రెండేళ్ల తర్వాత (1729) ఇతడు ఫిలడెల్ఫియా గెజెట్ స్థాపించాడు, తర్వాత ముప్పై సంవత్సరాల వరకు అతడు దాతృత్వ భావాలను ప్రేరేపించడానికి జుంటోను ఒక ఆలోచనా కర్మాగారంగా ఉపయోగించాడు. ఈ వ్యవస్థ వీరోచితంగా ఉత్పాదకం మరియు ప్రయోజనకారిగా ఉండి, అమెరికా యొక్క మొట్టమొదటి సభ్యత్వ గ్రంథాలయాన్ని (1731), స్వచ్ఛంద ఫైర్ అసోసియేషన్‌ని, ఫైర్ ఇన్సూరెన్స్ అసోసియేషన్‌ని, అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీని (1743-4), ఒక “అకాడెమీ” (1750—ఇది పెన్సిల్వేనియా యూనివర్శిటీగా మారంది) ని, ఒక ఆసుపత్రిని (1752—సవాలు గొలిపే గ్రాంట్‌తో నిధులను సేకరించడం ద్వారా రూపొందించింది మరియు ప్రజా వీధులలో బాటలను, పెట్రోలింగ్‌ను, ఫైనాన్స్, పౌర సమావేశ గృహాన్ని, ఇలాంటి అనేక నిర్మాణాలను ఈ వ్యవస్థ రూపొందించింది.

1747లో పెన్సిల్వేనియా కాలనీ, పశ్చిమాన్నుంచి ఇండియన్లతో హింసాత్మక ఘర్షణల ద్వారా మరియు దిగువ డెలావెర్ నదిలో ఫ్రెంచ్-కెనడియన్ యుద్ధ నౌకల ద్వారా విచ్ఛిన్నం చేయబడింది. ఫిలడెల్ఫియా ప్రభుత్వం యుద్ధ వ్యతిరేకి అయినందువల్ల భయపడిపోయి ఏ చర్యలూ చేపట్టలేదు. ఈ కార్యరాహిత్యం పట్ల తీవ్ర నిస్పృహకు గురైన ఫ్రాంక్లిన్ తన జుంటోను సంప్రదించి, పచ్చి నిజం అనే కరపత్రాన్ని ప్రచురించాడు, ప్రజలు వ్యవహారాలను తమ చేతుల్లోకి తీసుకోనట్లయితే పెన్సిల్వేనియా రక్షణ లేనిదై పోతుందని అతడు ప్రకటించాడు. నిధుల సేకరణ మరియు ప్రైవేట్ మిలీషియా స్థాపన కోసం అతడు ఒక “మిలటరీ అసోసియేషన్”ను ప్రతిపాదించాడు, కొద్ది వారాలలోపే ఇది వందకు పైగా కంపెనీలను నియమించింది, వీటిలో 10,000 సాయుధులుండేవారు, పైగా పబ్లిక్ లాటరీ ద్వారా £6,500లను సేకరించారు. ఇది అమెరికన్ విప్లవానికి నమూనా.

అమెరికా విప్లవం[మార్చు]

దాతృత్వం యొక్క సాంప్రదాయ అభిప్రాయాలు, అమెరికా విప్లవానికి సిద్ధాంత పరమైన నమూనాను మరియు స్వచ్ఛంద సంస్థలు నిర్వహణా క్రమపు నమూనాని సమకూర్చాయి. మసాచుసెట్స్‌లోని కాంకర్డ్‌లో ప్రారంభమైన విప్లవం, నిస్సందేహంగా అమెరికన్ దాతృత్వం యొక్క భూకంప కేంద్రాలలో ఒకటి. "ఒకప్పుడు ఇక్కడ నిలిచి పోరాడిన రైతులు/మరియు వారు పేల్చిన తూటా ధ్వని `ప్రపంచమంతా ధ్వనించింది.” - రాల్ఫ్ వాల్డొ ఎమెర్సన్ యొక్క “కాంకర్డ్ హైమ్న్”

ఈ వాక్యంలో ఉటంకించబడిన `రైతులు’ ‘మినిట్ మెన్’కు చెందిన వారు, ఇవి తమ పొలాలను వీడేందుకు సిద్ధపడి, బ్రిటీషు వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధాలు ధరించిన, రైతుల స్వచ్ఛంద సంస్థలు. పౌల్ రెవెరె వంటి సుప్రసిద్ధ పరిశీలకులు మరియు రౌతులు, వీరిని హెచ్చరించారు. ఇతడు అనేక పౌర ఉద్యమాలలో, ఉత్సాహం గల అగ్రగామి స్వచ్ఛంద కార్యకర్త, బోస్టన్ చుట్టుప్రక్కల గల పట్టణాలలో ప్రదర్శనలు చేపట్టేందుకు, తన వంటి పరిశీలకులూ, రౌతుల సమూహాలతో స్వచ్ఛంద సంస్థలను నిర్వహించాడు.

కాంటినెంటల్ సైన్యం స్వచ్ఛంద కార్యకర్తలతో కూడి ఉండి, వ్యక్తిగత విరాళాల ఆర్థిక సాయంతో నిర్వహింపబడింది. ఈ సైన్యం కమాండింగ్ జనరల్ జార్జి వాషింగ్టన్, అతడి కుమారుడు జార్జికి తన భార్య జన్మనిచ్చే వరకూ, దాదాపు మూడు సంవత్సరాల పాటు, స్వచ్ఛందంగానే, జీతభత్యాలు లేకుండా, స్పష్టంగా ప్రొ బొనొ పబ్లికొ ప్రజాశ్రేయస్సుకై సేవ చేసాడు. అతడు తరచుగా తన లేఖలలో, “మీ పరోపకారి” అనే సంతకాలు చేసేవాడు.[ఉల్లేఖన అవసరం]

వలస రాజ్యాలన్నింటిలోనూ, స్వేచ్ఛా పుత్రుల వంటి అసంఖ్యాక స్వచ్ఛంద రాజకీయ సంస్థల చేత స్వాతంత్ర్య నిబద్ధత కొనసాగించబడింది.

ఫిలిడెల్ఫియా లోని స్వాతంత్ర్య భవన వ్యవస్థాపకులు, పరోపకార స్వచ్ఛంద సంస్థగా పనిచేసారు. స్వాతంత్ర ప్రకటన చరిత్రలో మొదటి ఉదాహరణంగా నిలిచింది. దీనిలో ఒక జాతీయ ప్రభుత్వం ఆదర్శ వాద ధార్మిక ప్రకటన ద్వారా లాంఛనంగా ఏర్పాటు చేయబడి, నడిపించబడి - స్వచ్ఛంద సంస్థలలో ఇది అలవాటుగా ఉండేది - సమస్త మానవ జాతి శ్రేయస్సు కొరకు, మానవ జాతి తరపున చెప్పబడింది. స్వాతంత్ర ప్రకటన, వ్యవస్థాపకులు, స్వతంత్ర వ్యక్తులుగా “పరస్పరం” తమ వ్యక్తిగత జీవితాలకూ, అదృష్టాలకూ, ఇంకా పవిత్ర గౌరవానికై చేసే స్వచ్ఛంద ప్రతిజ్ఞతో ముగుస్తుంది.

కొత్త జాతి కోసం ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మొదటి రూపం “సంస్థ”గా పిలవబడింది. తుది రూపమైన సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం, స్వచ్ఛంద సంస్థల చేత కొనసాగించబడి, ఇంకా విద్యుక్త ప్రకటనతో ప్రారంభించబడి, మరియు చరిత్రలో మరొక “మొదటి”దై –వ్యక్తిగత సభ్యులైన “ప్రజల”, ఓటుతో ధ్రువీకరించబడింది. రాజ్యాంగపు “ప్రవేశిక”, వ్యక్తి చైతన్యం, వ్యక్తి శ్రేయస్సు, మరియు జీవన ప్రమాణం వంటి శీర్షికలు కలిగి ఉంది:

“సంయుక్త రాష్ట్రాల ప్రజలమైన మేము, మరింత సమగ్రమైన సమాఖ్యని ఏర్పాటు చేసుకునేందుకు, న్యాయాన్ని స్థాపించేందుకు, గృహ ప్రశాంతతకు భరోసా ఇచ్చేందుకు, సామాన్య భద్రతను సమకూర్చేందుకు, సాధారణ సంక్షేమాన్ని వృద్ధి చేసేందుకు, మనకు, మన భావితరాలకీ స్వేఛ్చ యొక్క ఆశీస్సులు సమకూర్చేందుకు, అమెరికా సంయుక్త రాష్ట్రాల కోసం దీక్షపూని, ఈ రాజ్యాంగాన్ని స్థాపించుకొన్నాము.”

చివరిగా, సమాఖ్య సంబంధ శీర్షిక యొక్క మొదటి పేజీ 1, పేరాగ్రాఫ్ 1, లో అలెగ్జాండర్ హామిల్టన్, రాజ్యాంగపు ధ్రువీకరణకై వ్యవస్థాపకుల వితరణకి, ఈ కొత్త దేశం అమెరికా సృష్టి, సమస్త మానవ జాతి శ్రేయస్సు కోసం, మానవ జాతి తరుపున పనిచేసేందుకు “సాధారణ చిహ్నమే” తప్ప, ఇతరమైనది కాదని పరిచయం చేసాడు. "దీన్ని” అతడు, “దేశభక్తికి పరోపకార తత్వపు ప్రేరణలని జత కలపటం”గా రాశాడు.

1976 లో, థామస్ పెయినె అత్యంత ప్రఖ్యాతి చెందిన, స్వతంత్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసిన తన ‘కామన్ సెన్స్ ’ లో “సాధారణ చిహ్నం” గురించి వ్రాసాడు.

“అమెరికా ఘటన, సమస్త మానవజాతి ఘటనలో ఘనమైన భాగమవుతుంది. స్థానిక ప్రదేశాలకు కుదించబడని, విశ్వజనీయమైన, సమస్త మానవజాతి ప్రేమికుల (ఇక్కడ నొక్కి చెప్పబడింది.) నియమాలను ప్రభావ పరచగల, వారి అనుబంధాలతో ఆసక్తులతో ముడిపడిన సంఘటనలు గల, ఎన్నో పరిస్థితులు సంభవిస్తుంటాయి.”

అమెరికా విప్లవం గురించి బెన్ ఫ్రాంక్లెన్, ఫ్రాన్స్‌కు ఇలా చెప్పాడు: “మానవ ప్రకృతి యొక్క గౌరవం మరియు సంతోషాల కోసం మేం పోరాడుతున్నాం.”

హామిల్టన్ మాట్లాడుతున్న “దాతృత్వం” అనేది “ధనికులు పేదలకు సాయం చేయటం” కాకపోగా, ప్రజాశ్రేయస్సు కోసం, జీవన ప్రమాణం మీద చూపు సారిస్తూ తీసుకునే వ్యక్తిగత ప్రారంభ చర్యల కిందికి వస్తుంది. సాంప్రదాయ దాతృత్వం, సాంప్రదాయ అమెరికా తత్వంగా పరిణమించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు పరోపకార తత్వం చేత మాత్రమే, సృష్టింపబడలేదు, పైగా పరోపకార తత్వం కోసం, పరోపకారిక జాతిగా ఉండటం కోసం, మానవజాతికి ఒక కానుకగా, కచ్చితంగా అయితే ప్రోమెథీయన్ సాంప్రదాయంలో సృష్టింపబడింది.

19వ శతాబ్దం: విచ్ఛిన్నత[మార్చు]

అమెరికా దేశభక్తియుత స్వచ్ఛంద సంస్థలతో కూడిన సాంప్రదాయ దాతృత్వ అభిప్రాయాలకు సంబంధించి వ్యవస్థాపకులు ఊహించిన సమన్వయం దాని సాంస్కృతిక నాయకత్వాన్ని కొనసాగించలేకపోయాయి. ఐరోపాలో అమెరికా వ్యక్తీకరణల సారమైన పునరుజ్జీవనం అనేది ఫ్రెంచి విప్లవం, నెపోలియన్ మరియు కాల్పనికవాదం వలన తుడిచి పెట్టుకు పోవటమే దీన్ని స్పష్టం చేస్తోంది. అమెరికాలో గణతంత్ర రాజ్యాల తొలి చరిత్ర, వేగమైన తీవ్ర వృద్ధిని దర్శించింది; మరియు దేని నుండి వేరు చేయబడినదో అది నెరవేరింది. పారిశ్రామిక విప్లవం, వలసల వెల్లువ, పట్టణాభివృద్ది మరియు పశ్చిమదిశ విస్తరణలు ముంచెత్తటంతో, రాజకీయ ఆచరణ మరియు రాజకీయ నాయకత్వంలో ఒక కొత్త వ్యక్తిత్వ పోకడలు కలగలిసి, దాతృత్వ సంస్కృతీ, దాని వ్యవస్థాపక స్ఫూర్తి ఆ మిశ్రమంలో కరిగిపోయాయి.

ఆ విధమైన వేర్పాటు వాదం గమనించబడింది, మరియు అది విచారకరమైనది. 19వ శతాబ్దంలో, హాథొర్నె, ఎమర్సన్, థోరియో, మెల్ విల్లే మరియు ఇతరులతో, వికసించిన అమెరికా సాహిత్యం, సాంకేతిక విచ్ఛిన్న శక్తులనూ, పట్టణీకరణనూ, పారిశ్రామికీకరణనూ ప్రతిఘటించింది. అమెరికా సాంప్రదాయ విలువల నాశనాన్ని అవగతం చేసే జాగృతి, వారి సాహిత్యంలో ఉందని ఆమోదింపబడింది. మరోప్రక్క, వ్యవస్థాపకుల తోడి పరోపకారత్వ, యథార్థ వాద, ఆదర్శ వాద జ్వాల నశించలేదనేందుకు ఈ ఉద్యమం ఒక సాక్ష్యమైంది.[ఉల్లేఖన అవసరం] 1837లో, పైన ఉదహరించిన తన “కాంకర్డ్ హైమ్న్”లో, ఉద్యమం యొక్క పరోపకార స్ఫూర్తిని రాల్ఫ్ వాల్డొ ఎమెర్షన్ సంబరంగా ప్రకటించాడు మరియు 1844 లోని తన వ్యాసం “ద యంగ్ అమెరికా”లో అతడు ఇలా రాశాడు,

"కొత్తగా జన్మించినదీ, స్వతంత్రమైనదీ, ఆరోగ్యవంతమైనదీ, బలిష్టమైనదీ మరియు శ్రామికుల, ప్రజాస్వామికుల పరోపకారుల , విశ్వాసం గల, సాధు స్వభావం గల జనుల భూమియైన అమెరికాకి, స్ఫూర్తి పరచటం, విస్తరణాత్మక మరియు మానవతా స్ఫూర్తిని వ్యక్తీకరించటం సులభమే! అమెరికా మానవ జాతికై గళం విప్పాలి. అది భవిష్యత్తుకు సంబంధించిన దేశం.”

గ్యారీ విల్స్ చూపినట్లుగా, అధ్యక్షుడు అబ్రహం లింకన్ తన గెట్టిస్‌బర్గ్ ఉపన్యాసంలో “ఒక కొత్త దేశం, స్వేచ్ఛను పొంది, మనుష్యులందరూ సమానులుగా సృష్టింపబడ్డారు అనే భావానికి అంకితమైనది” అని క్రోడీకరించినట్లుగా, మన దేశ విద్యుక్త సాంప్రదాయ భావగ్రాహ్యతని ప్రతిష్ఠిస్తున్నట్లుగా, 1863 నాటికి కూడా, నాటి జ్వాల సజీవంగానే ఉంది.

అమెరికన్ జీవితంలో పరోపకార తత్వపు తోడ్పాటు[మార్చు]

స్వచ్ఛంద సంస్థలు, వాటి సహాయక భాగస్వామ్య సంస్కృతి యొక్క దాతృత్వ స్ఫూర్తి, మరియు వాస్తవ అవసరం, 19వ శతాబ్దం పొడవునా, సరిహద్దులవరకు పశ్చిమాన్ని నడిపించింది. ఆ విధంగా అమెరికన్ వ్యక్తిత్వం యొక్క “దాతృత్వ మరియు ప్రజాస్వామిక” పురోగతిని అది వ్యాప్తి చేస్తోంది.[ఉల్లేఖన అవసరం] అమెరికాలోని మొత్తం ప్రైవేట్ విద్య, ఇంకా మతం; తప్పనిసరిగా దాతృత్వశీలతతో ఉంది,[ఉల్లేఖన అవసరం] అయితే అది అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో గల ప్రతీ సంస్కరణోద్యమం వెనక దాతృత్వం ఉంది. - ఉదాహరణకి, బానిస వ్యతిరేక, స్త్రీలకు ఓటు హక్కు, పర్యావరణ పరిరక్షణ, పౌరహక్కులు, స్త్రీవాద మరియు విభిన్న శాంతి ఉద్యమాలన్నీ స్వచ్ఛంద దాతృత్వ సంస్థలు గానే ప్రారంభమయ్యాయి. అవి మొదట ప్రారంభమైనప్పుడు, వాటిల్లో ఎక్కువగా ప్రతీఘాతక-సంస్కృతిగా మరియు అవమానకరంగానూ పరిగణింపబడ్డాయి; కానీ అన్నీ కూడా "ప్రజాశ్రేయస్సుకై వ్యక్తిగతంగా ప్రారంభించబడి, జీవిత నాణ్యత మీద దృష్టి కేంద్రీకరిస్తున్నాయి."

అమెరికన్ దాతృత్వం ఎన్నో సవాళ్ళ నెదుర్కొంది. పైగా సాధారణంగా ప్రభుత్వ, వ్యాపార సంబంధితం కాని, అనుకూల అవకాశాలను పొందింది. ఇతర విభాగాలు నిర్ధిష్టంగా అమెరికా జీవిత ధర్మాన్ని ప్రభావపరుస్తుండగా, దాతృత్వం, దాని మీద దృష్టి కేంద్రీకరించింది.

లలిత కళలకు, కళా ప్రదర్శనకు, మతానికి, మానవీయ కారణాలకు, అదేవిధంగా విద్యాసంస్థలకు దాతృత్వం ఒక ప్రధాన ఆదాయవనరు (చూడండి చేయూత).

ఆధునిక దాతృత్వకారులు[మార్చు]

1982 లో, న్యూమన్ యొక్క స్వంత ఆహార వ్యాపార సంస్థకు సహ వ్యవస్థాపకుడైన పాల్ న్యూమన్, పన్ను అనంతర లాభపు సొమ్ము మొత్తాన్ని వివిధ ధార్మిక సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. 2008లో అతడి మరణానంతరం, ఆ వ్యాపార సంస్థ, 250 మిలియన్లకు పైగా అమెరికన్ డాలర్లను వేలకొద్దీ ధార్మిక సంస్థలకు విరాళమిచ్చింది. అదే విధంగా, కొలంబియన్ గాయకురాలు షకిరా, తన పైస్ డిస్కాల్సొస్ ఫౌండేషన్‌తో, మూడవ ప్రపంచ దేశాలెన్నిటికో సహాయపడింది.

గత కొద్ది సంవత్సరాలుగా, కొన్ని ఉన్నత స్వభావం గల దాతృత్వాల్లో – అభివృద్ధి చెందుతున్న దేశాల మూడవ ప్రపంచ ఋణాన్ని రద్దు చేయించేందుకు ఐరిష్ రాక్ గాయకుడు బొనొ నిర్వహిస్తున్న ప్రచార కార్యకలాపాలు, మలేరియాని, రివర్ బ్లైండ్‌నెస్ అంధత్వాన్ని నిర్మూలించేందుకు గేట్స్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ప్రచార కార్యకలాపాలతో కూడిన వారి భారీ వనరులు ఇంకా లక్ష్యాలు, పెట్టుబడిదారుడు, కోటీశ్వరుడు మరియు బార్క్ షైర్ హతవేకి ఛైర్మన్ అయిన వారెన్ బఫెట్{/5 2006లో, గేట్స్ ఫౌండేషన్‌{6/}కు ఇచ్చిన 31 మిలియన్ అమెరికన్ డాలర్ల విరాళం, న్యూయార్క్ ప్రెస్ బైటీరియన్ ఆసుపత్రి మరియు వెయిల్ కార్నెల్ మెడికల్ సెంటర్‌లో గల రోనాల్డ్ ఓ పెరెల్‌మన్ హార్ట్ సెంటర్‌కి చేసిన 50 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయంతో కలిపి ఒక్క 2008 సంవత్సరంలోనే రోనాల్డ్ పెరెల్ మన్]] యొక్క విరాళం 70 మిలియన్ డాలర్లు, వంటివి ఉన్నాయి.

వృత్తి సంబంధికులు మరియు ఫండ్‌రైజర్ల అభివృద్ధి ద్వారా, దాతృత్వం సానుకూల పరచబడుతోంది. దాతల సంబంధాలు మరియు నాయకత్వ [2] వృత్తి సంబంధికులు, లాభాపేక్షతో నడపబడని వ్యవస్థలకు, భవిష్యత్తు నిచ్చే విధంగా ప్రోత్సహించేందుకు, ఒక ప్రత్యేక పద్ధతిలో దాతలకు గుర్తింపునివ్వటం, కృతజ్ఞతలు తెల్పటం ద్వారా వృత్తి అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు కెనడాలో అసోసియేషన్ ఆఫ్ డోనార్ రిలేషన్స్ ప్రొఫెషనల్స్ (ADRP) [3], దాతల సంబంధాలు, నాయకత్వానికి సంబంధించిన మొట్టమొదటి వర్గం.

అభిప్రాయాలు[మార్చు]

తత్త్వశాస్త్రం[మార్చు]

దాతృత్వపు ఉపయోగం గురించి కూడా చర్చించబడింది. కొందరు దాతృత్వాన్ని దయార్ద్రతకూ మరియు పేదలకై ధార్మికతకూ సమానమంటారు. మరికొందరు, దాతృత్వం, సామాజిక అవసరాలని తీర్చగల ఏదైనా పరహితాత్మక చర్య వంటిదనీ, అది మార్కెట్ వంటి వాటిచేత సేవించబడని, ఇంకా సేవించవలసి ఉన్న లేదా అవగతం చేసుకోవలసి ఉన్న చర్య వంటిదనీ అంటారు.

కొందరు, కమ్యూనిటీ నిధులని పెంచటం ద్వారా మరియు వాహనాలని ఇవ్వటం ద్వారా, కమ్యూనిటీ తత్వాన్ని నిర్మించేందుకు, దాతృత్వం ఒక ఉపకరణం వంటిదని విశ్వసిస్తారు. పేదల ఆస్థులకు బదులుగా, ధనిక వనరులుగా, కమ్యూనిటీలు తమని తాము పరిగణించుకున్నప్పుడు, వర్గాల సమస్యలను పరిష్కరించుకునేందుకు కమ్యూనిటీ ఒక మెరుగైన స్థితి అవుతుంది.

అయితే, కొందరు, దాతృత్వం యొక్క ఉపయోగం, తరచు గౌరవింపదగిన చిహ్నమనీ, స్వీయ ఔన్నత్వమనీ విశ్వసిస్తారు. అది స్వంత పేర్లతో గల ఫౌండేషన్లలో, అరుదుగా అజ్ఞాత వ్యక్తుల భారీ విరాళాలలో కనబడుతుందని వారి వాదన. మరియు డయేరియా చికిత్స వంటి రుచించని కారణాలకు మద్దతు కరువైంది. (తేలికగా చికిత్స చేయగలదైనా, ప్రపంచవ్యాప్తంగా, డయేరియా, శిశుమరణాలకి రెండవ పెద్ద కారణంగా కొనసాగుతోంది.)

దాతృత్వం వర్తమాన మరియు భవిష్యత్ అవసరాలకు కూడా స్పందిస్తుంది.[4] సంభవించిన ఒక ప్రకృతి వైపరీత్యం పట్ల ధార్మిక స్పందన, దాతృత్వం యొక్క చర్యే.[4] ఇంకా దూరదృష్టి కావలసి లేకున్నా, అది దాతృత్వకారికి తక్షణ గౌరవాన్ని అందిస్తుంది. భవిష్యత్ అవసరాలకై స్పందించటం, ఏదేమైనా, దాత యొక్క దూరదృష్టి మరియు తెలివి మీద ఆధారపడుతుంది, అయితే, అరుదుగా దాతలను గుర్తిస్తుంది.[4] భవిష్యత్ అవసరాలను తరచుగా నివారించటమే, సంఘటన జరిగాక స్పందించటం కంటే మిక్కిలి కష్టతరమైనది.[4] ఉదాహరణకి, ఆఫ్రికాలో అధిక జనాభా[neutrality is disputed] కారణంగా ఆకలితో పస్తులుండటం పట్ల, ధార్మిక సంస్థల స్పందనకు సత్వర గుర్తింపు వచ్చింది.[5] ఈ లోపు, 1960లలో మరియు 1970లలో జరిగిన యూఎస్ జనాభా నియంత్రణ ఉద్యమాల వెనుక నున్న దాతృత్వకారులు ఎప్పుడూ గుర్తింపును పొందలేదు, చరిత్రలో చోటు పొందలేదు.[neutrality is disputed][4]

రాజకీయాలు[మార్చు]

దాతృత్వకారులు తరచుగా ప్రసిద్దులౌతుంటారు, ఇంకా “మంచి వారుగా”, లేదా “గొప్పవారు”గా కూడా ప్రజలకు తెలుస్తుంటారు. కొన్ని ప్రభుత్వాలు దాతృత్వ కార్యకలాపాలని, ఉపకారాల నాశించిన కార్యకలాపాలయ్యే, అవకాశం ఉన్నట్లుగా సందేహించినా, ఇప్పటికీ ప్రత్యేక ఆసక్తిగల సమూహాలు ప్రభుత్వేతర సంస్థలుగా ఏర్పాటయ్యేందుకు అనుమతిస్తున్నాయి.

సాంప్రదాయక ఉపయోగం[మార్చు]

సాంప్రదాయక ఉపయోగం[మార్చు]

దాతృత్వం యొక్క సాంప్రదాయక నిర్వచనం ప్రకారం, విరాళాలంటే సంకుచితంగా నిర్వహించబడిన కారణానికి ఉపయోగించేవి, ఇంకా విరాళం అంటే సామాజిక పరిస్థితులలో గుర్తించదగిన మార్పు తెచ్చేందుకై లక్ష్య పెట్టబడింది. ఇది తరచుగా, భారీ విరాళాలు, ఇంకా ఆర్ధిక పరమైన మద్దతు కాలంతో పాటు నిలిచి ఉండేందుకు దోహదపడుతోంది.

గొప్పదైన ఆర్ధిక నిబద్దత అవసరం, పరోపకార తత్వానికీ, ధార్మికత్వ దానానికీ మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తోంది. అంతేగాక, ఎవరో ఒకరి చేత ప్రారంభించబడిన ధార్మిక సంస్థలలో మద్దతిచ్చే పాత్రని విలక్షణంగా పోషిస్తోంది. ఆ విధంగా దాతృత్వపు సాంప్రదాయక ఉపయోగం, ముఖ్యంగా ధనికులైన వ్యక్తులకూ, కొన్నిసార్లు ధనికుడైన వ్యక్తి చేత ఒక ప్రత్యేక కారణంతో లేదా ఉద్దేశ పూర్వక లక్ష్యంతో ప్రారంభించబడిన ట్రస్టుకూ వర్తిస్తుంది.

ఎందరో సంపన్నులు కాని వ్యక్తులు - ఈ విధంగా అంకితమై - తమకు చేతనైనంతగా తమ సహాయంలో కొంత భాగాన్ని, శ్రమనీ, మరియు సంపదనీ ధార్మిక కారణాలకు దానంగా సమర్పిస్తున్నారు. కేవలం వ్యక్తిగత శ్రమ ప్రోద్బలించిన ప్రముఖ మార్పుగా అరుదుగా గుర్తించబడుతుంది కాబట్టి, ఇలాంటి వారు విలక్షణ దాతృత్వకారులుగా వర్ణింపబడరు. ఇలాంటి వారు ధార్మిక శ్రామికులుగా గుర్తింపబడరు. అయితే కొందరు ఇలాంటి వారిని, వారి శ్రమకు గౌరవ సూచకంగా, దాతృత్వకారులుగా గుర్తించాలని కోరుతున్నారు.

దాతృత్వంలో వృద్ధి చెందుతున్న ఒక వైఖరి ఏమిటంటే – దాన వలయాలు వృద్ధి చెందటం; ఎంచేతంటే వ్యక్తిగత దాతలు తరచుగా మిత్రబృందాలై ఉండి, తమ ధార్మిక విరాళాలని సమీకరించి, మరియు కలిసి, ఆ సొమ్ముని తాము తలపెట్టిన కారణాలకు మేలు కూర్చేటందుకు ఏ విధంగా ఉపయోగించాలా అన్నది నిర్ణయించుకుంటారు కాబట్టి. ఇటీవలి సంవత్సరాలలో బిల్ గేట్స్ మరియు వారెన్ బఫెట్‌ల నాయకత్వంలో పరోపకార తత్వానికి వ్యాపార మెళకువల అనువర్తనని పొందుపరచటంతో, పరోపకార తత్వపు పునరుద్భావం పరోపకార పెట్టుబడి దారీ విధానం అని పిలవబడుతోంది.`[6]

అతిపెద్ద వ్యక్తిగత ఆస్తులు[మార్చు]

 • వారెన్ బఫెట్ నుంచి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్స్‌కి $31 బిలియన్ డాలర్లు (బహుమతి యొక్క ప్రారంభ విలువ) [7]
 • చుక్ ఫీన్సీ నుంచి అట్లాంటిక్ ఫిలాంత్రపీస్‌కి £8 బిలియన్లు
 • 1901లో ఆండ్రూ కార్నెగీ నుంచి $350 మిలియన్ (ఆధునిక అర్థంలో $7 బిలియన్లు) వచ్చాయి, ఆండ్రూ మంచి పనులకోసం న్యూయార్క్ సిటీ లోని కార్నెజీ హాల్ భవంతి తోసహా తన ఆస్తిలో చాలావరకు పంపిణీ చేశారు.[8]
 • రీడర్స్ డైజెస్ట్ ఫార్ట్యూన్ మేనేజర్ల నుంచి మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కి $424 మిలియన్లు[9]
 • జాన్ బి క్రూక్ నుంచి నేషనల్ పబ్లిక్ రేడియోకి 2003లో[9]కు $200 మిలియన్లు
 • జాన్ డి రాక్‌ఫెల్లర్ నుంచి రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్‌కి, 1913-1914[10]లో $100 మిలియన్లు
 • హెన్రీ అండ్ బెట్టీ రోవన్ నుంచి గ్లాస్‌బరో స్టేట్ కాలేజీ నుంచి $100 మిలియన్లు[11]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • జకత్
 • అల్ట్రూయిజం
 • అసోసియేషన్ ఆఫ్ డోనార్ రిలేషన్స్ ప్రొఫెషనల్స్
 • చారిటబుల్ కంట్రిబ్యూషన్లు (పన్ను అంశాలు)
 • స్వచ్ఛంద సంస్థ
 • చారిటీ (ప్రాక్టీస్)
 • ఫౌండేషన్ (నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్)
 • గివింగ్ సర్కిల్స్
 • హై ఇంపాక్ట్ పిలాంత్రపీ
 • మైక్రో గివింగ్
 • మిశాంత్రొపి
 • లాభాపేక్ష లేని సంస్థ
 • వెంచర్ పిలాంత్రపీ
 • వాలంటీర్
 • వాలంటరిజం
 • యూత్ పిలాంత్రపీ

జాబితాలు[మార్చు]

 • దాతల జాబితాలు
 • సంపన్న సంస్థల జాబితా

సూచికలు[మార్చు]

 1. ది క్లాసికల్ ఎటిమాలజీ మరియు పిలాంత్రపియా చరిత్రపై పండితుల ఆసక్తి పెరుగుతోంది. మెకల్లీ జార్జ్‌ని చూడండి: పిలాంత్రపీ రీకన్సిడర్డ్ , ఎ కేటలాగ్ ఫర్ పిలాంత్రపీ పబ్లికేషన్, బోస్టన్, 2008; మరియు సులెక్, మర్తీ: నాన్ ప్రాఫిట్ అండ్ వాలంటరీ సెక్టర్ క్వార్టర్లీ ‌లో ఆన్ ది క్లాసికల్ మీనింగ్ ఆఫ్ ఫిలాంత్రపియా , ఆన్‌లైన్ ఫస్ట్, మార్చ్ 13, 2009 doi:10.1177/0899764009333050
 2. "స్టీవార్డ్‌షిప్ & డోనార్ రిలేషన్స్," Entrepreneur.com
 3. అసోసియేషన్ ఆఫ్ డోనార్ రిలేషన్స్ ప్రొఫెషనల్స్
 4. 4.0 4.1 4.2 4.3 4.4 Rohe, John F. (2002-01-01). "Chapter 6: Prophesy and Charity". Mary Lou and John Tanton: A Journey into American Conservation. FAIR Horizon Press. ISBN 978-0971007901.
 5. "Buzz (news and commentary blog)". onPhilanthrophy. Cite web requires |website= (help)
 6. ది ఎకనమిస్ట్
 7. "Implementing Warren Buffett's Gift". Bill and Melinda Gates Foundation.
 8. ఆండ్ర్యూ. ఆండ్రూ కార్నెజీ జీవిత చరిత్ర బోస్టన్: హౌటన్ మిఫ్లిన్, 1920
 9. 9.0 9.1 Steinberg, Jacques (November 7, 2003). "Billions and Billions Served, Hundreds of Millions Donated". New York Times. Retrieved 2008-07-28. National Public Radio announced yesterday that it had received a bequest worth at least $200 million from the widow of the longtime chairman of the McDonald's restaurant chain. ... Few cultural institutions have been the beneficiaries of gifts as large as that received by NPR, according to The Chronicle of Philanthropy. One of the largest, worth $424 million, was given to the Metropolitan Museum of Art by foundations built on the Reader's Digest fortune.
 10. రాక్‌ఫెల్లర ఫౌండేషన్
 11. గర్నీ, కైటలిన్. "10 ఇయర్స్ లాటర్, రోవన్ స్టిల్ రీప్స్ గిఫ్ట్స్ రివార్డ్స్ - రోవన్ మైల్‌స్టోన్స్", ది ఫిలడెల్పియా ఇన్‌క్వైరర్ , ఆగష్టు 28, 2007న పొందబడింది. పారిశ్రామిక వేత్త హెన్రీ రోవన్ నిద్రాణస్థితిలో ఉన్న గ్లాస్‌బరో స్టేట్ కాలేజీకి దశాబ్దం క్రితం $100 మిలియన్లను ఇవ్వడంతో రోవన్ యూనివర్శిటీ ఒక్కసారిగా జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇది ఒక ప్రభుత్వ సంస్థకు అందించిన అతి పెద్ద విరాళం.... రోవన్ అతడి దివంగత భార్య ఈ విరాళాన్ని 1962 జూలై 6న ఇచ్చారు కాని ప్రథమస్థాయి ఇంజనీరింగ్ స్కూల్‌ని నిర్మించాలనే ఒకే ఒక షరతు పెట్టారు. కృతజ్ఞతగా, గ్లాస్‌బరో స్టేట్ తన పేరును రోవన్ కాలేజీగా మార్చుకుంది."

బాహ్య లింకులు[మార్చు]

 • ULIB.IUPUI.edu, జోసెఫ్ మరియు మాథ్యూ పేటన్ పిలాంత్రపిక్ స్టడీస్ లైబ్రరీ
 • ULIB.IUPUI.edu, పిలాంత్రపిక్ స్టడీస్ ఇండెక్స్
 • NPtrust.org, పిలాంత్రపీ చరిత్ర, 1601-నుంచి ఇప్పటివరకు, నేషనల్ పిలాంత్రపిక్‌చే కూర్చబడి, సంకలనం చేయబడింది.
 • MCCORD-museum.qc.ca, "ఎ బూర్జువాయిస్ డ్యూటీ: పిలాంత్రపీ, 1896-1919 &mdash"; సచిత్ర చారిత్రక వ్యాసం
 • GPR.hudson.org, ది ఇండెక్స ఆఫ్ గ్లోబల్ పిలాంత్రపీ 2006 83 పుటలో హడ్సన్ ఇనిస్టిట్యూట్ నుండి PDF ఫైల్
 • EDRP.net, అసోసియేషన్ ఆఫ్ డోనార్ రిలేషన్స ప్రొఫెషనల్స్
 • Donating2save.com, పెద్ద ఎత్తున పన్ను రాయితీ పొందుతున్నపుడు మీ కమ్యూనిటీకి దాన్ని ఇవ్వండి
 • ULIB.IUPUI.edu, ఆన్‌లైన్‌లో దాతృత్వ వనరులు
 • MyGivingPoint.org

మూస:Charity

"https://te.wikipedia.org/w/index.php?title=దాతృత్వం&oldid=2502422" నుండి వెలికితీశారు