దామెర వేంకటపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దామెర వేంకటపతి
జాతీయతభారతదేశం
వృత్తికవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బహుళాశ్వచరిత్రము

దామెర వేంకటపతి తన గురించి తన పద్యాలలో ...[మార్చు]

ఈకవి పద్మనాయకకులజుడైన శూద్రుడు; ఈపద్మనాయక కులమువారి నీదేశమునందు వెలమలని వాడుదురు. ఈకవి తాత సంస్థానాధిపతియై వేంకటగిరి సంస్థానాధిపతులైన వెలుగోటివారితో సంబంధబాంధవ్యములను జేసినవాడు. ఈకవి తన మేనత్తయైన వేంకటాంబను వెలుగోటి యాచమనాయనికుమారు డయిన కస్తురిరంగనాయని కిచ్చినట్టును ఆదంపతులకు యాచమనాయడు పుత్రుడైనట్టును చెప్పి యాతనిని తనబహుళాశ్వచరిత్రమునం దిట్లు వర్ణించాడు.

 సీ. ఉత్తరమల్లూరియొద్ద దావలుపాపవిభుని గొట్టిననాటివిజయకలన
   చెంగలుపట్టు వీక్షించి లగ్గలుపట్టి యాక్రమించిననాటివిక్రమంబు
   పాళెముకోటవెల్పల నాజి యతిరాజు జరగజేసిననాటిశౌర్యపటిమ
   తిరుమల జేరి ధాత్రినిమన్నెరాజుల బాఱదోలిననాటిబాహుబలము
   
   మున్నెతోపూర జగ్గరాణ్ముఖుల నొంచి
   మధురదొర జెంజిమన్నీని మద మడంచి
   తిరుచనాపల్లి దొర దోలుతేజము గల
   మేటి వెలుగోటియాచని సాటిగలరె!

కవి కాలము గురించి చెప్పిన పద్యాదారాలు[మార్చు]

కవియొక్క మేనత్తభర్తయైన కస్తురి రంగనాయడు గోలకొండ మహమ్మదీయులను కొండవీడు వినుకొండ ప్రభువులను గెలిచి, 1579 వ సంవత్సరమునందు చంద్రగిరియందున్న విజయనగరపు రాజులపక్షమున యుద్ధముచేసి వారిశత్రుల నోడించెను. కవియొక్క మేనత్తకొడుకయిన యాచనాయడు చెంగల్పట్టుమండలములోని మధురాంతకములో వాసముచేసి విజయనగరాధిపతియైన వేంకటపతిరాయలవలన పెరమాడి సీమను బహుమానమందెను; అంతేకాక యితడు 1602 వ సంవత్సరమునందు శత్రువులతో యుద్ధముచేసి వారి నోడించెను; ఆవఱకు పరులపాలైన వేంకటగిరిని మరల స్వాధీనము చేసికొనెను. కవియు [ 217 ] నీతనికాలములోనివాడే యయినందున నతడు పదునాఱవశతాబ్దాంతమునందును పదునేడవశతాబ్దాదియందును నుండినవాడు. ఈకవితాను బహుళాశ్వచరిత్రమును జేయకుమునుపు కృష్ణకథ నొకదానిని జేసి దానిని రామభద్రున కంకితము చేసినట్లు బహుళాశ్వచరిత్రములో రామభద్రుడు త న్నుద్దేశించినట్లీ క్రిందిపద్యములో జెప్పుకొన్నాను.

 ఉ. దామెరవేంకటప్రభువతంసుని వేంకటభూప మాపయిన్
   శ్రీమెఱయంగ గృష్ణకథ చెప్పితి నిప్పుడు నీదుతండ్రియున్
   మామకభక్తు డాతనికి మాకును భేధము లేదుగాన నీ
   వామహిమాడ్యుపేర బహుళాశ్వచరిత్రము చెప్పు మెప్పుగన్.

ఈ కవి కవిత్వ లక్షణములు తెలిపెడి రెండు పద్యములు[మార్చు]

ఈబహుళాశ్వచరిత్ర మయిదాశ్వాసములు కలదయి రసవంతమయి సలక్షణమయినదిగా నున్నది. అందుండి రెండుపద్యములు ఉదాహరణముగా:

 చ. తటముల జుట్టుకొన్న బిగిదన్నినక్రొన్ననపొన్నగున్నలన్
   జిటపొటమంచు మంచుజడి చిల్కెడిగొజ్జగికిన్ రసాలపున్
   జిటిపొటితేనెవానలకు జేసినకాల్వలతేటనీటిప
   ల్లటముల నిక్కు నక్కొలకులచ్చికి మెచ్చిరి వచ్చినెచ్చెలుల్. [ఆ.2]

 ఉ. రాముని జూచి కామునిశరంబుల గాసిలి చేష్టదక్కి కాం
   తామణి యుండెనోర్తు రఘునందనపాదరజంబుచేత మున్
   గోమలిరేఖ ఱాతి కొడగూడెనొ లేదొ యటంచు నెంచి లీ
   లామహితాంగ మొందగ శిలామయరూపము దాల్చెనోయనన్. [ఆ.4]

మూలాల జాబితా[మార్చు]

ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము (1949) రచించినవారు కందుకూరి వీరేశలింగం పంతులు [దామెర వేంకటపతి]